22 C
New York
Wednesday, September 22, 2021

మోడీ సంచలన నిర్ణయం

భారత దేశ సంస్కృతిని, భాషను కాపాడడానికి ప్రధాని మోడీ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే సంవత్సరం ఇంజనీరింగ్ కోర్సులని ప్రాంతీయ భాషల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేశారు.. ఇప్పడివరకు కేవలం ఇంగ్లీష్ లోనే అందుబాటులో ఉన్న ఇంజినీరింగ్.. వచ్చే సంవత్సరం నుంచి హిందీతో పాటు మరాఠీ, బెంగాలీ, తెలుగు, గుజరాతి, కన్నడ, మలయాళం భాషల్లో విద్యార్థులకు అందుబాటులోకి రానుంది.. ప్రాంతీయ భాష అంటే మాతృ భాష.. మాతృభాషలో సాంకేతిక విద్యని మరింత సులభంగా అర్థం చేసుకొనే వీలుంటుంది.. ప్రపంచానికి సంస్కృత భాషలో ఎంతో విజ్ఞానాన్ని భరత్ అందించింది. ప్రస్తుతం ఉన్న టెక్నికల్ కోర్సులు ప్రాంతీయ భాషలో రానుండడంతో భవిష్యత్తులో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అయిందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.. 

అభివృద్ధి చెందిన దేశాలు టెక్నాలజీలో ముందుండడానికి కారణం భాష కూడా ఒకటి కారణం కావొచ్చు .. చైనాలో విద్యా బోధనా అంతా అక్కడి మాండరిన్ భాషలోనే ఉంటుంది. సాంకేతికతని మొత్తం మాతృ భాషలోనే అక్కడి వారికి బోధిస్తారు.. ఇంగ్లిష్ కు అక్కడ ఎక్కువ ప్రాధాన్యం ఉండదు.. త్వరగా ఆవిష్కరణలు జరగడానికి కూడా భాష ఒక కారణమై ఉండొచ్చు.. 

స్వాతంత్రానంతరం మోధీ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో ఇదొకటి.. భాషతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరికి విద్య, అవకాశం దొరకాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.. స్వాతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ పాలకుల విధానాలు ఇంకా కొనసాగుతున్నాయి.. వాటన్నింటినుంచి భారత్ ను విముక్తం చేసి మరింత శక్తివంతంగా తయారు చేస్తున్నారు ప్రధాని మోదీ.. కాంగ్రెస్, గాంధీ కుటుంబం ఎన్ని కుట్రలు పన్నినా భారత్ ను విశ్వా గురువుగా ఎదగాడాన్ని ఎవరూ ఆపలేరు..

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!