14.6 C
New York
Saturday, September 25, 2021

జనసేన పార్టీ కోసం రంగంలోకి దిగిన హీరో రామ్‌ చరణ్

రామ్ చరణ్ రాజకీయాలకు వస్తున్నాడా.. ఈయన ఫ్యూచర్ జనసేన కాబోతుందా.. బాబాయ్ కి సపోర్ట్ గా చరణ్ నిలబడుతున్నాడా.. ఏమో ఇప్పుడు చూస్తుంటే అదే అనిపిస్తుంది రామ్ చ‌ర‌ణ్ పూర్తిగా మారిపోయాడు. ఒకప్పుడు రాజకీయాలు అంటే నాకు తెలియదు అని తప్పించుకుని తిరిగే మెగా వారసుడు.. ఇప్పుడు కావాలనే రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. సందర్భం వచ్చిన ప్రతిసారి బాబాయ్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తున్నాడు. ఆ మధ్య కేటీఆర్ కూడా చరణ్ ను కాబోయే రాజకీయ నాయకుడు అంటూ సంభోదించాడు. కానీ వెంటనే మళ్ళీ కాదులే ఇంకా నీకు టైం ఉంది అంటూ సర్ది చెప్పాడు. కేటీఆర్ అన్నాడని కాదుగానీ చరణ్ నిజంగానే ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలోనే అవసరం అనుకుంటే ఈయ‌న జనసేనకు ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఏపీలో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఒంటరిగానే దిగుతున్నాడు ప‌వ‌న్. ఇప్పుడు ఆయనకు సపోర్ట్ గా మెగా హీరోలు నిలబడుతున్నారు. అందులో ముఖ్యంగా చరణ్ జై పవన్ జై పవన్ అంటూ ప్రతి వేడుకలో బాబాయ్ కి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. 

ఇక అసలు విషయానికొస్తే.. మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు నిర్మాతగానూ కొనసాగుతున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీని స్థాపించి ఆయన సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హీరో రామ్‌చరణ్ మీడియా రంగంలోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ఓ ప్రముఖ మీడియా ఛానల్‌ ను కొనుగోలు చేసినట్లు ఫిలింనగర్‌ లో టాక్ వినపడుతోంది. ఈ న్యూస్ విన్న మెగా అభిమానులు ఎంతో ఖుష్ అవుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీకైనా మీడియా అండదండలు అవసరం. ఎందుకంటే తమ పార్టీ కార్యక్రమాలను, ప్రణాళికలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోతే ఆ పార్టీ మనుగడ కొనసాగించడం కష్టం అవుతుంది. ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే అధికార TRS పార్టీకి నమస్తే తెలంగాణ, T న్యూస్ వంటి సొంత మీడియా అండగా ఉండగా.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీకి సాక్షి లాంటి సొంత మీడియా ఎంతో వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. ఇక TDP కి మద్దతిచ్చే ఛానళ్లు  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీ లాంటి 3, 4 ఉండనే ఉన్నాయి. ఆ విధంగా మీడియా సపోర్ట్ ఉంది కాబట్టే TDP నెట్టుకువస్తోంది. అయితే మెగా అభిమానులకు సొంత మీడియా లేకపోవడం వల్లే 2009 ఎన్నికల్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అనుకున్న విధంగా ఫలితాలను సాధించలేక పోయాయి. మెగా అభిమానులకు ఫ్యాన్ ఫాలోయింగ్‌ తక్కువేమీ ఉండదు. కానీ ఆ ఫాలోయింగ్‌ ను ఓట్ల రూపంలోకి మార్చులేకపోవడానికి మీడియా లేకపోవడమే కారణమని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. అదే సొంత మీడియా ఉండి ఉంటే ప్రజా రాజ్యం, జనసేన పార్టీల రేంజ్ మరోలా ఉండేదని ఆ పార్టీల అభిమానులే చెప్తుంటారు. కట్ చేస్తే… ఇప్పుడు హీరో రామ్‌ చరణ్ ప్రముఖ న్యూస్ ‘మహాTV’ని కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే రామ్‌ చరణ్ ఉన్నట్టుండి న్యూస్ ఛానల్‌ను ఎందుకు కొనుగోలు చేశాడా.?  అని ఆలోచించకండి. ఎందుకంటే బాబాయ్‌ కు చెందిన జనసేన పార్టీకి సపోర్ట్ చేయడానికి రామ్‌ చరణ్ మహాTVని కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయనున్నట్లు ఇప్పటికే రామ్‌ చరణ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడట. దీంతో 2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి తిరుగుండదని తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు త్వరలో పాదయాత్ర చేయనున్నారు. దీంతో పవన్ పాదయాత్ర కవరేజీని మీడియా ఛానల్స్ అన్నింట్లో వచ్చేలా రామ్‌ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం మహాTvని సొంతం చేసుకుని మిగతా ఛానళ్లలో కూడా జనసేన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి రామ్‌ చరణ్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇలా బాబాయ్ కోసం అబ్బాయి తన వంతు మద్దతు అందించడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో అటు మెగా అభిమానులు, ఇటు  జన సైనికులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!