6.7 C
New York
Thursday, December 2, 2021

వీడియోస్ కు బానిసగా మారా,ఆ పిల్ల జీవితం నాశనం చేసా | Ruined Life Because of P*RN Videos

వీడియోస్ కు బానిసగా మారా,ఆ పిల్ల జీవితం నాశనం చేసా | Ruined Life Because of P*RN Videos


పోర్న్ వీడియోస్ అనేది యువతను ఎంతగా చెడగొడుతుంది అనే విషయం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు… టీనేజ్లోకి రాకముందే అందరి పిల్లలు చేతుల్లోకి సెల్ఫోన్లు వచ్చేస్తున్నాయి సో ఆ తర్వాత ఒకసారి వాళ్ళకి పోర్న్ వీడియోలు గురించి తెలిసిన తరువాత దాదాపు స్కూల్ చదువులు చదివే టప్పుడే వాళ్లు అందరూ పోర్న్ వీడియోలు చూడడానికి అలవాటు పడుతున్నారు… అలా చాలా ఎర్లీ స్టేజ్ లోనే వాటి గురించి తెలుసుకున్న తర్వాత ఇక వాటిని ఎక్కువసేపు చూడటం పోర్న్ వీడియోస్ కి అడిక్ట్ అయిపోవటం లాంటివి జరుగుతుంది… ఇలాంటి అలవాట్లు తో చాలామంది యూత్ తమ కెరీర్ను జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు… అయితే వాళ్లలో కొంతమంది తొందరగానే ఇలాంటి అలవాట్లు మానుకొని మళ్ళీ మంచి జీవితాన్ని గడపడం కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొందరు మాత్రం పోర్న్ వీడియోస్ చూడటం అనే అలవాటు అస్సలు మానడం లేదు… అయితే అలా దానికి అడిక్ట్ అయిపోయిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం… నితిన్ పవర్ ముంబైకి చెందిన ఒక సైకాలజీ ఎక్స్పర్ట్… అయితే ఆయనకు ఒక రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర్నుంచి ఈమెయిల్ వచ్చింది… ఈ మెయిల్ పంపిన అతని పేరు రాజేష్… వయసు కేవలం 19 సంవత్సరాలు… అతము టీనేజ్ లోకి వచ్చి రావడం తోటే పోర్న్ వీడియోస్ గురించి తెలుసుకొని వాటిని చూడడం మొదలు పెట్టాడు… అలా అలా చాలా తొందరగానే ఆ వీడియోల కి బాగా బానిసగా మారిపోయాడు… ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అతను ఏం కోల్పోయాడు అన్న విషయాల గురించి నితిన్ పవర్ కు ఒక పెద్ద ఈమెయిల్ రాశాడు… దాన్ని చూసి బాగా ఫీల్ అయిన నితిన్ ఆ విషయాలన్నీ తన పర్సనల్ బ్లాగ్ లో షేర్ చేసుకున్నాడు… ఇప్పుడు మనం కూడా అతని స్టోరీ ఏంటో ఒకసారి తెలుసుకుందాం పదండి…

రాజేష్ ఉత్తర ప్రదేశ్ లోని ఒక చిన్న మారుమూల గ్రామానికి చెందిన వాడు… అయితే ఈ టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ప్రతి చిన్న గ్రామానికి కూడా విస్తరించడంతో అతను స్కూల్ చదువుతున్నప్పుడే తన చేతుల్లోకి సెల్ ఫోన్ వచ్చింది… దాంతో ఒక చిన్న పల్లెటూరు లో ఉన్న రాజేష్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది అన్న విషయాలు తెలుసుకోగలిగాడు… అదే సమయంలో అతనికి మెల్లగా పోర్న్ వీడియోల గురించి కూడా తెలిసింది… దాంతో వయసులో ఉన్న రాజేష్ మెల్లిగా వాటిని చూడటం మొదలుపెట్టాడు… ఇంట్లో తన తండ్రి వాడే సెల్ఫోన్ బయటకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు తెలియకుండా మొదట మొదట వీడియోలు చూడటం స్టార్ట్ చేసిన అతను ఆ తర్వాత తండ్రిని బలవంత పెట్టి సొంత సెల్ ఫోన్ కొనుక్కున్నాడు.

తన చేతిలోకి సొంత సెల్ ఫోన్ రావడంతో రాజేష్ మరింతగా రెచ్చిపోయాడు… రాత్రి పగలు పొద్దున అనే తేడా లేకుండా ఇప్పుడు పడితే అప్పుడు తన సెల్ ఫోన్ లో వీడియోస్ చూడటం మొదలుపెట్టాడు… దాంతో కొన్ని రోజులకే అతని చదువు బాగా దెబ్బతింది… స్కూల్లో లో టీచర్స్ సరిగ్గా చదవడం లేదని రాజేష్ను బాగా కొట్టేవారు… అతని చదువు గురించి తల్లిదండ్రులకు తెలిసికూడా రాజేష్ ని గట్టిగా మందలించారు… అయినా కూడా రాజేష్ కు ఎలాంటి మార్పు రాలేదు పైగా తన ఫ్రెండ్స్ తో కలిసి పోర్న్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడం రాత్రిపూట వాటిని చూస్తూ హస్త ప్రయోగం చేసుకునేవాడు… అలా కొన్ని రోజుల్లోనే అమాయకంగా మంచి క్యారెక్టర్ తో ఉండే రాజేష్ పూర్తిగా మారిపోయాడు.

పోర్న్ వీడియోస్ ప్రభావంతో రాజేష్ తాను కూడా దాంట్లో చూపించినట్టుగా చేయాలి అన్న ఆలోచన వచ్చి తనతో పాటు స్కూల్లో పదో తరగతి చదువుతున్న రేఖ అనే అమ్మాయి తో క్లోజ్ గా ఉండడం స్టార్ట్ చేశాడు… ఆ అమ్మాయి కి మెల్లిగా మాయ మాటలు చెబుతూ తనకి కూడా పోర్న్ వీడియోస్ చూపించడం అలవాటు చేశాడు… మొదట వద్దు వద్దు అన్న రేఖ కూడా తనలో కోరికలు కలగడంతో రాజేష్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళుతూ ఆ వీడియోస్ చూస్తూ ఉండేది… అయితే అనుకోకుండా ఒకరోజు వాళ్ళిద్దరూ తమ స్కూల్ టీచర్ అయిన ప్రకాష్ కు ఆ వీడియోలు చూస్తూ దొరికిపోయారు… సరిగ్గా చదువుకోకుండా ఇలాంటి పనులు చేస్తూ తన కంట పడ్డ పిల్లల్ని చూసిన ప్రకాష్ ముందుగా గట్టిగా మందలించి ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయొద్దు అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ నెక్స్ట్ డే భయం భయం గానే స్కూల్ కి వెళ్ళిన రాజేష్ ధరణి ప్రకాష్ సార్ మళ్లీ ఏమైనా అంటాడేమో అని చాలా భయపడ్డాడు… అసలు తాము ఇద్దరం అలా వీడియోస్ చూస్తూ ఉన్న సంగతి కూడా అందరికీ చెప్పి ఉంటాడు అని అనుకున్నాడు… కానీ రాజేష్ భయపడ్డట్టుగా ఏమీ జరగలేదు… ప్రకాష్ కూడా రాజేష్ ని దగ్గరికి పిలిచి జరిగిందంతా తను మర్చిపోయానని నువ్వు కూడా అన్నీ మర్చిపోయి బుద్దిగా చదువుకో అని చెప్పాడు… రాజేష్ హ్యాపీ ఫీల్ అయి థాంక్యూ సార్ అని చెప్పి తన క్లాసు లోకి వెళ్ళిపోయాడు. కానీ క్లాసులో తనకి రేఖ కనిపించలేదు… తను స్కూల్ కి ఎందుకు రాలేదు అనుకుంటూ రాజేష్ అలానే కూర్చుండిపోయాడు.

ఆ తర్వాత కాసేపటికి స్కూల్ ప్రిన్సిపాల్ రాజేష్ ఉన్న క్లాస్ లోకి వచ్చి మన స్కూల్లో చదివే రేఖ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అందుకే ఈ రోజు స్కూలుకు సెలవు ఇస్తున్నాం అందరూ మీ ఇంటికి వెళ్లిపోండి అని చెప్పాడు… దాంతో ఆ మాటలు విన్న రాజేష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు… అతనికి ఏమీ అర్థం కాలేదు… తన బ్యాగ్ తీసుకుని స్కూల్ నుంచి బయటకు పరిగెత్తాడు.

తన ఇంట్లో స్కూల్ బ్యాగ్ పడేసి రేఖ ఇంటి వైపు పరిగెత్తిన రాజేష్ అక్కడికి వెళ్లి రేఖ శవాన్ని చూసి చాలా ఏడ్చాడు… అలా బాధ పడుతున్న రాజేష్ దగ్గరికి అతని ఫ్రెండ్ రాజు వచ్చి రాజేష్ ని ఓదారుస్తూ పక్కకు తీసుకు వెళ్ళాడు. రేఖ ఇలా చేస్తుంది అనుకోలేదు అని రాజేష్ ఏడుస్తూ ఉంటే రాజు మీరిద్దరూ పోర్న్ వీడియోస్ చూస్తూ ప్రకాష్ సార్ కు దొరికిపోయారు కదా సార్ మీ గురించి అందరికీ చెబుతారేమో అన్న భయంతో అలా చనిపోయింది అని చెప్పాడు… దాంతో రాజు అలా చెప్పగానే రాజేష్ షాక్ అయ్యి చూసాడు… రాజు నిన్న మీరిద్దరూ ఆ వీడియోస్ చూస్తూ ప్రకాష్ సార్ కి దొరికినప్పుడు నేను మీ వెనకాలే ఉన్నాను కానీ మీరు నన్ను చూడలేదు ప్రకాష్ సార్ వెళ్లిపోయిన తర్వాత నువ్వు కూడా మీ ఇంటికి వెళ్లి పోయావు కానీ రేఖ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా బయట కూర్చుని ఏడవసాగింది అప్పుడు నేను వెళ్లి రేఖను ఓదార్చాను.

ప్రకాష్ సార్ కచ్చితంగా మా గురించి స్కూల్లో అందరికీ చెప్తాడు మా తల్లిదండ్రులు కూడా తెలుస్తుందని రేఖ చాలా బాధపడింది నేను అలా ఏం జరగదు సార్ చాలా మంచి వాడు ఎవరికీ చెప్పొద్దు అని ఎంత చెప్పినా కూడా వినలేదు.. అప్పుడు నేను అలా అయితే కొన్ని రోజులు స్కూల్ కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు అని చెప్పి వెళ్ళిపోయాను… కానీ మార్నింగ్ నాకు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాను… రేఖ అమ్మాయి కావడంతో తన ఎక్కువగా భయపడి అలా చేసింది అని చెప్పాడు… అతని మాటలు విన్న రాజేష్ రేఖ చావుకు తానే కారణమని తెలిసి చాలా బాధ పడి వాళ్ళ ఇంట్లో నుంచి ఆ ఊరు నుంచి దూరంగా వెళ్లి పోయి ఒక కంపెనీలో చిన్న జాబ్ చేస్తూ బతుకు తున్నాడు. అనవసరంగా పోర్న్ వీడియోస్ కి బానిస కావడం ద్వారా ఇంత ఘోరం జరిగింది అని తన వల్లే రేఖ చనిపోయింది అని తనని ఎవరు క్షమించ వద్దు అని నితిన్ పవర్ కు రాసిన ఈమెయిల్లో రాజేష్ చెప్పుకున్నాడు.

సో ఫ్రెండ్స్… పోర్న్ వీడియోస్ చూసి దానికి బానిసగా మారిన రాజేష్ జీవితం లో ఏం జరిగింది అనేది తెలుసుకున్నారు కదా… అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు మీ జీవితంలో మీరు కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటేనే మంచిదని తెలుసుకోండి.

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!