17.8 C
New York
Tuesday, September 21, 2021

భార్య చెల్లితో సీక్రెట్ డేటింగ్…తర్వాత ఏం ఏం జరిగిందంటే???

బావా మరదళ్ల సరసాలు అందరికీ తెలిసినవే… అసలు ఆ రిలేషన్ లోనే ఒక అల్లరి, చిలిపితనం, కాస్తంత శృంగారం కలిసి వుంటాయి. బావా మరదళ్ల మధ్య జరిగే ప్రేమతో ఎన్నో సూపర్ హిట్ సినిమా లు కూడా వచ్చాయి. బావా బావా పన్నీరు అంటూ మరదలు పిల్ల ఆట పట్టించడం, మరదలిని బావా ఏడిపించడం మన తెలుగు లోగిళ్ళలో చాలా కామన్ గా జరిగేవే… ఇంకొంచెం పచ్చిగా చెప్పుకొంటే ఒకమ్మాయిని పెళ్లి చేసుకుని వరసయినదానివే అంటూ ఆ తర్వాత ఆమె చెల్లిలితో రొమాన్స్ చేసే కొంటె బావలు కోకొల్లలుగా ఉంటారు. అయితే అవి శృతి మించనంత వరకూ బాగానే ఉంటాయి. రిలేషన్ షిప్ లో ,జీవితంలో  ఏ సమస్యలూ రావు. కానీ అందరూ ఒకలా ఉండరు కదా. భార్య చెల్లితో సీక్రెట్ డేటింగ్ మొదలెడదామనుకున్న ఓ భర్త కథ ఏమైందో చూద్దాం.  

కేరళకు చెందిన  జీవన్ పెళ్లి చేసుకుని తన భార్యతో కలిసి తమ ఫేవరెట్ దేశాలకు హనీ మూన్ ట్రిప్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడ దాదాపు ఐదు వారాల పాటు కొత్త దంపతులు తమ హనీ మూన్ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తన వైఫ్ కు ఇంకా పాస్ పోర్ట్ రాకపోవడం, మరికొన్ని రోజులు ఆగితే సౌత్ ఆఫ్రికాలో మంచి వెదర్ వుంటుందని ట్రిప్ కోసం జీవన్ తన వైఫ్ తో కలిసి వెయిట్ చేస్తున్నాడు. అయితే కొత్తగా పెళ్లి చేసుకున్న జంటంటే ఎలా ఉండాలి ఆ ముచ్చట్లు ఆ ముద్దులాటలు అబ్బో వాళ్ళను చూసేవారు కుళ్ళుకుని చావాలి కదా… కానీ చిత్రంగా జీవన్ ..మారేజ్ లైఫ్ అలా లేదు… తను ఎందుకో తన భార్యకు కనెక్ట్ అవలేకపోయాడట. అందుకు కారణం ఆమె ప్రవర్తన. నిజానికి జీవన్.. వైఫ్ కంటే చెల్లెలు చాలా అందంగా స్లిమ్ గా వుంటుందట.

ఆ విషయాన్ని ఆమే పదే పదే గుర్తు చేస్తూ ఉండేదట.  తన వైఫ్ మొదటి నుంచి కూడా తన చెల్లే తనకంటే బెటర్ అంటూ అంటూండటం, తన బ్రెస్ట్ సైజ్, ఫిగర్ కంటే చెల్లెలి బ్రెస్ట్ సైజ్, ఫిగర్ బాగుంటాయని ఇలా ఎప్పుడూ తన చెల్లెలితో ఆవిడ కంపేర్ చేసుకోవడం మొదట్లో ఆశ్చర్యం అనిపించినా..ఆ తర్వాత ఆ మాటలు వినీ వినీ ఆమె చెల్లిని స్పెషల్ గా చూసేలా చేయటం మొదలెట్టాడట. దానికి తగ్గట్లు ఆ చెల్లి కూడా కాస్త ఫాస్ట్ గానే ఉండేది. 

దాంతో ఆమె చెల్లిని తెలియకుండానే తన మనసంతా నింపుకుని…తన భార్య కళ్ళలోకి సూటిగా చూసే వాడు కాదట… ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకొని ఉన్నా ఆమెను కనీసం తాకే వాడు కూడా కాదట… పెళ్లికి ముందు తనకు బాగా పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న అని అనుకున్నా పెళ్లి తర్వాత తన భార్య తనకొక కొత్త మనిషిలా కనిపించిందట… అంతే ఒక అక్కడి నుంచి ఆయన తన భార్యను ద్వేషించడం స్టార్ట్ చేసాడట…

ఈ లోపు వాళ్ళు హనీమూన్ కు వెళ్లే రోజు రానే వచ్చిందట… తనకు ఏమాత్రం ఇష్టం లేకుండా అయిష్టంగానే తన భార్యతో కలిసి హనీమూన్ ట్రిప్ కు జీవన్ వెళ్ళాడట. వాళ్ల ట్రిప్ లో భాగంగా ఎన్నో దేశాలు తిరిగినా… ఎన్నో వింతలు విశేషాలు చూసినా… అవేవీ తనకి సంతోషం కలిగించలేదట… కారణం ఒక్కటే తను అప్పటికే తన కొత్త భార్య ని హేట్ చేస్తున్నాడు…  మరో ప్రక్క భార్య చెల్లిపై ప్రేమ పెంచేసుకుంటున్నాడు. ఇంటికి వచ్చాక ఓ రోజు ఆమెను కలిసి..మీ అక్కకు డైవర్స్ ఇచ్చి..నీతో ఉందామనుకుంటున్నా అని మనస్సు విప్పి చెప్పేసాడట. ఆమె ఏం మాట్లాడలేకుండా చూసే సరికి..పోనీ నీతో కొద్ది రోజులు డేటింగ్ అయినా చేస్తా అన్నాడట. అయితే ఆ చెల్లి తెలివైంది. అసలు ఏమైంది..అంటూ అక్కా, బావ ని అబ్జర్వ్ చేసి..వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు వాళ్లను చేసిందిట. అయితే అందరు మరదళ్లు అంత తెలివైన వాళ్ళు ఉండరు. అలాగే భార్యలే తెలియకుండా తన చెల్లి వైపు దృష్టి మరల్చేలా చేస్తారు. 

ఆడవాళ్ళలో చాలా సహజంగా పక్క వారితో కంపేర్ చేసుకోవడం అనే అలవాటు ఎప్పుడూ చాలామందికి ఉంటుంది…అదే జీవన్ భార్య కొంప ముంచింది. సో ఫ్రెండ్స్ ఒక్కటి గుర్తు పెట్టుకోండి…మీరే మీ భర్తల మనస్సలు చెడ కొట్టకండి..వాళ్లను వేరే ఆడవాళ్ల వైపు దృష్టి మరిలేలా చెయ్యకండి. !!!!

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!