19.5 C
New York
Tuesday, September 28, 2021

ఇలా చేస్తే మగాడు..బానిసలా పడుంటాడు

స్నేహం, ప్రేమ, పెళ్ళి ఎవరి లైఫ్ లో అయినా ఈ మూడు బంధాలు ఖచ్చితంగా వుంటాయి… అయితే ఈ మూడు రిలేషన్స్ లో యుగ యుగాలుగా అయినా ఎప్పుడూ ఆడవారి గురించే చర్చలు… అమ్మాయిల మనసు ఇలా గెలుచు కొండి అని లేడీస్ ను ఇలా సంతృప్తి పరచండి అని కానీ ఎప్పుడు కూడా అసలు మగాడు ఏం కోరుకుంటున్నాడు వాడి మనసులో ఏముంటుంది అన్న విషయాన్ని అంతగా పట్టించుకోలేదు… మగాడి జీవితం అంటే ఆడదాన్ని షాటిస్ ఫై చేయడమే పని అనేంతగా ఒక నమ్మకం అనేది జనాల్లో ముఖ్యంగా అబ్బాయిల్లో నాటుకు పోయింది. అటు లేడీస్ సైడ్ నుంచి చూసినా చిన్న గొడవ జరిగిన ప్రతిసారి కూడా నిందలు మగాడి మీద వేయడం అన్నది పరిపాటి… అటు సమాజం కూడా మగాడు హింస ను ప్రేరేపిస్తాడు అని మగజాతి మీద కొన్ని ఫిక్స్డ్ ఆరోపణలు చేసి పెట్టింది. 

కానీ ఇక్కడ లాజిక్ ఏంటంటే మగాడు కూడా తనతో ఆడది ఇలా ఉండాలి తనని ఇలా ప్రేమించాలి తన్ని ఇలా ట్రీట్ చేయాలి అని కొన్ని ఎక్స్ పెక్టే షన్స్ పెట్టుకున్నాడు బట్ అవేవీ ఎవరికీ అంతగా తెలియవు… అయితే మగాళ్ళ సైకాలజీ మీద రిలేషన్ షిప్స్ లో వారి పాత్ర మీద బెంగుళూర్ కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ ఒక సర్వే చేసిందట దాంట్లో నిజంగా ఒక అబ్బాయి అమ్మాయి నుంచి ఏం కోరుకుంటాడు అన్న విషయంలో చాలా షాకింగ్ రహస్యాలు బయట పడ్డాయట… వీటి గురించి తెలుసుకున్న ఏ అమ్మాయయినా ఎలాంటి మగాడి నయినా 100% శాటిస్ ఫై చేయగలదు అని ఆ సర్వే వాళ్ళు బల్ల గుద్ది మరీ చెపుతున్నారు. మరి అవేంటో ఒకసారి చూద్దాం పదండి…


1. సర్ ప్రైజ్ చేయడం.

ప్రేమలో పడ్డ ఏ అమ్మాయి అబ్బాయి అయినా అలాగే పెళ్లి చేసుకున్న ఏ జంట అయినా వాళ్ళ రిలేషన్ షిప్స్ లో చిన్న చిన్న గొడవలు, అలకలు చాలా సహజం. అయితే గొడవలు అలకలు వచ్చిన ప్రతిసారీ ఏడుపు అనే ఒక వజ్రాయుధం తో అబ్బాయి మీద అమ్మాయి పై చేయి సాధిస్తుంది. ఇక్కడే ఆ సర్వే లో మగాడి అసలు ఫీలింగ్స్ ఏంటో బయట పడ్డాయట… నిజానికి ప్రేమలో అయినా పెళ్లి తర్వతా అయినా లేడీస్ తమను పూర్తిగా అర్థం చేసుకోరు అనేది మగాళ్లలో ఉన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అంట… అమ్మాయిల లాగా తాము కూడా ఏడిస్తే దానికి కూడా ఆడదానిలా ఏడుపెంటి అంటారని అందుకే తమ ఫీలింగ్స్ అన్నీ కవర్ చేస్తున్నారట… ఎంత సేపు తామే లేడీస్ ఇష్టా లెంటో కనుక్కుని వారిని సర్ ప్రైజ్ చేయాలంటరే కానీ తన కోరికలను, ఇష్టాలను ఇక్కడ ఎవరూ పట్టించుకోరు అన్నది ఇంకో కంప్లైంట్ అంట… తమ లేడీస్ కొంచం తమ లోపల వున్న ఫీలింగ్స్ ను కూడా అర్థం చేసుకోవాలనీ ఎప్పుడూ తమ నుంచే అన్నీ ఎక్స్ పెక్ట్ చేయకుండా అప్పుడప్పుడు వాళ్ళ ప్రేమతో తమని సర్ ప్రైజ్ చేయాలని మగాళ్ళు కోరుకుంటారట…

2. కంపారిజన్ చేయడం.
ఆ సర్వేలో వెల్లడైన మరొక ముఖ్యమైన రహస్యం ఏమిటంటే మగాళ్ళు కంపారిజన్ ను అస్సలు తట్టుకోలేరట… నువ్వు కూడా జిమ్ చేయొచ్చుగా మంచి బాడీ పెంచోచ్చుగా అనడం… పక్కింటి సుబ్బారావు లా నన్ను బయటకు తీసుకువెల్లమని పోరడం… ఇంకొక అబ్బాయిల నాకు గిఫ్ట్స్ ఇవ్వమని ఫోర్స్ చేయడం ఇలా తమ రిలేషన్ షిప్ లో ప్రతి దాని గురించి ఇంకొక అబ్బాయితో కంపార్ చేయడం అన్నది మగాళ్ళు అస్సలు తట్టుకోలేరట… తమ వ్యక్తిత్వాన్ని తెలుసుకుని తాను ఎందుకిలా ఉన్నాడో అన్నది అర్థం చేసుకోవాలి కానీ మరొక అబ్బాయిలా తానెందుకు లేడు అతనిలా ఎక్కువ డబ్బు ఎందుకు సంపాదించడం లేదు… కార్ ఎందుకు కొనలేదు లాంటి పోలికలు వాళ్ళ మనసును బాధ పెడతాయట…

3. నీ గురించి నువ్వే కేర్ తీసుకోవడం.

పురాణాల్లో కానీ సినిమాల్లో కానే నిజ జీవితంలో కానీ ఎప్పుడూ అమ్మాయిని అబ్బాయే కాపాడుకోవాలో అమ్మాయి గురించి అబ్బాయే కేర్ తీసుకోవాలి అని చెప్పారు తప్పా ఒక్కసారి కూడా అమ్మాయిలు అబ్బాయిలు మీద ప్రతిసారి డిపెండ్ అవకుండా తమ కేర్ తామే తీసుకోవడం మంచిదని అబ్బాయిల ఫీలింగ్ అంట. బయట ఎక్కడికన్నా షాపింగ్ కు వెళ్ళి సడెన్ గా లేడీస్ ను ఇంటి దగ్గర వదిలేయలేక ఒక్కరినే వెళ్ళమన్నా ఆడాల్లకు కోపం వస్తుందట… తన బాయ్ ఫ్రెండ్ లేదా భర్తకి కుదరడం లేదు తనే వెళ్తాను అంటూ వాళ్ళు ఆలోచించరట పైగా నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటూ బ్లేమ్ చేస్తారట… ప్రతిసారి మీ బాయ్ ఫ్రెండ్ లేదా భర్త మీకు తోడుగా ఉండక పోవచ్చు అది అర్థం చేసుకుని మీకు మీరు ఒంటరిగా తిరగడం నేర్చుకోవాలి ప్రతిసారి మా మీదే ఆధారపడి ఉండొద్దు అన్నది అబ్బాయిలు చేసే మెయిన్ కంప్లైంట్ అట…4. తనని తాను నమ్మనప్పుడు కూడా నువ్వు నమ్మకం పెట్టుకోవడం.

ఆడ మగ సంబంధంలో ఎక్కువ బాధ్యత ఎప్పుడూ మగాడికే వుంటుంది డబ్బు పరంగా కానీ తమ ఫ్యామిలీకి రక్షణ పరంగా కానీ మగాడే అన్ని విధాల చూసుకోవాలి అయితే ఈ పోటీ ప్రపంచంలో సవాలక్ష ప్రాబ్లమ్స్ వల్ల మగాళ్ళు చాలాసార్లు తమ మీద తామే నమ్మకం కోల్పోతున్నారట… నా ఫ్యామిలీకి ఏం చేయలేకపోతున్నా ను… నా భార్యను సరిగ్గా చూసుకోలేక పోతున్నాను అన్న ఆలోచనలతో ఆర్థికంగా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ మగాళ్ళు చాలా స్ట్రెస్ కు గురవుతున్నా రట… దాంతో చాలాసార్లు వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి పోతుందట… అలాంటప్పుడే తమ లేడీస్ తమని ఇంకా ఎక్కువగా నమ్మాలనీ ఏం కాదు నువ్వు చేయగలవు నేను నిన్ను నమ్ముతున్నా ను అన్న ఒక భరోసా ను ఆడాళ్ళ నుంచి కోరుకుంటారట.

  
5. నేనేం హీరోను కాదు అద్భుతాలు చేయలేను… 

సినిమా హీరోలా తమ మగాళ్ళు ఏవో అద్భుతాలు చేస్తారన్న ఆశలు వాళ్ళ లేడీస్ తమ మీద పెట్టుకోవడం వల్ల మగాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతున్నారట… ఇది రియాలిటీ నిజ జీవితంలో రాత్రికి రాత్రే అద్భుతాలు ఏం జరగవన్న ది లేడీస్ తెలుసుకోవాలి అని మగాళ్ళు కోరుకుంటున్నారట… తన భార్య బర్త్ డే అయితే సినిమాలో చూపించినట్టు రాత్రికి రాత్రే తనని మంచి ప్లేస్ కు తీసుకెళ్ళి పెద్ద గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అన్నది జరగని పనని అనవసరంగా తమ మొగుళ్ళు ఏదో చేసేయాలని కాకుండా ఫ్యామిలీ కోసం వాళ్ళెంత కష్ట పడుతున్నారు అన్నది గమనించాలని వారి ఫీలింగ్. ప్రతిసారి అన్ని విషయాల్లో వారికి సపోర్ట్ ఇస్తూ అవసరం అయినప్పుడు తమ గురించి తాము కేర్ తీసుకోవాలి అని మగాళ్ళ మనసును కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఆ సర్వేలో తేలిందట.


సో అదండీ మగాడి మనసును గెలుచు కోవడానికి కొన్ని ముఖ్యమైన రహస్య సూత్రాలు… మీ లవర్ లేదా భర్త మనసు ఏంటో బాగా అర్థం చేసుకోండి ఆ తర్వాత తన మీద ఎక్కువ ఎక్స్ పెక్ట్ షన్స్ పెట్టుకోకండి కొంచం రియాలిటీ లోకి వచ్చి అతనికి కావల్సిన సపోర్ట్ ఇవ్వండి… ఆ తర్వాత మెల్లగా అతనే మీ దారిలోకి వస్తాడు ఎందుకంటే తనని అర్థం చేసుకుని సపోర్ట్ ఇచ్చే లేడీస్ కోసం మగాడు ఏమయినా చేస్తాడు మరి… విష్ యూ ఆల్ ది బెస్ట్.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!