24.5 C
New York
Monday, June 27, 2022

తమ పార్టనర్ ను చిట్ చేస్తూ ఇంకొకరితో ఎంజాయ్ చేస్తే ఏం జరిగిందో చూడండి | Sarayu Stories

తమ పార్టనర్ ను చిట్ చేస్తూ ఇంకొకరితో ఎంజాయ్ చేస్తే ఏం జరిగిందో చూడండి | Sarayu Stories

ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎదుటి వ్యక్తిని నమ్మి వాళ్లతో కలిసి ఒక రిలేషన్ షిప్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా తాము నిజాయితీగా ఉండడమే కాకుండా ఎదుటి వాళ్ళు కూడా తమతో నిజాయితీగా ఉండాలి అని కోరుకుంటారు… అయితే ఇప్పుడు ఉన్న యూత్ చాలామంది నీతి నిజాయితీ అన్న విషయాన్ని పక్కన పెట్టి వాళ్ళ జీవితంలో ఎక్కువగా థ్రిల్ కోరుకుంటున్నారు… ఆ ప్రాసెస్ లో భాగంగానే వాళ్లు తమ పార్టనర్ ను చీట్ చేస్తూ మరొక వ్యక్తితో ఎంజాయ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు… అయితే అలా ఒక మనిషిని మోసం చేయడం అన్నది కూడా చాలా సరదాగా తీసుకుంటూ తమకు ఎంజాయ్మెంట్ దొరికిందా లేదా అన్న విషయాన్ని ఎక్కువగా పట్టించుకుంటున్నారు… కాలం మారుతున్న కొద్ది యూత్ పోకడలు ఆలోచనలు ఎక్కువగా మారుతూ వస్తున్నాయి… వాళ్లు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ లేదా మార్చాలి అనుకుంటున్నా తమ జీవిత భాగస్వాములు కానీ చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి… పాయల్ కూడా కోల్ కత్తా కు చెందిన అలాంటి అమ్మాయి… ఆమెకు రంజిత్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ కూడా అతన్ని మోసం చేస్తూ మరొక వ్యక్తి తో ఆ పని చేసే ఎంజాయ్ చెయ్యాలి అనుకుంది అది కూడా నిజంగా తన లోపల ఎలాంటి చెడు భావాలు లేకుండా జరిగింది… ఎందుకంటే పాలెం కేవలం శారీరక సుఖం కోసం అది కూడా ఒక రోజు కోసం మాత్రమే తన బాయ్ ఫ్రెండ్ రంజిత్ ను చీట్ చేసి వేరే వ్యక్తితో ఎంజాయ్ చెయ్యాలి అనుకుంది… అయితే ఆ తర్వాత ఆమె జీవితం లో ఏం జరిగింది అన్న విషయాల గురించి తన పర్సనల్ బ్లాగ్ లో షేర్ చేసుకుంది… మరి ఆ వివరాలు ఏంటో మనం కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి…

  1. ఒక తెలియని స్పార్క్ కనిపించింది = పాయల్ అండ్ రంజిత్ దాదాపు 5సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు వాళ్ళ ఇద్దరికీ పెళ్లి మీద అంతగా నమ్మకం లేకపోవడంతో ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉన్నా కూడా అలా కాకుండా తాము ఇద్దరం పెళ్లి చేసుకోకుండా కలిసి ఉంటామని చెబుతూ వచ్చారు… ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఇష్టం చాలా ఎక్కువగానే ఉన్నాయి… అయితే పాయల్ కొంచెం అల్లరి పిల్ల కావడంతో ఆమె ఆలోచనలు నిర్ణయాలు అన్నీ రంజిత్ కు ఒక్కోసారి పెద్ద తలనొప్పిగా మారుతూ ఉండేవి… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పాయల్ తనని ఇబ్బంది పెడుతూ ఎన్ని పనులు చేసినా కూడా రంజిత్ ఆమెను అసలు ఏమీ అనేవాడు కాదు ఆమె ఏం చేసినా కూడా అన్ని మౌనంగానే భరిస్తూ వచ్చేవాడు.అయితే అలా రంజిత్ ఆమెకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడమే వారి ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ షిప్ కు చాలా పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చి పెట్టింది…. తను ఎంతగానో ప్రేమించే అమ్మాయి అను ఒక వ్యక్తి తో ఆ పని చేస్తుంది అని అది చివరికి తమ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని తెంచేస్తుంది అని కలలో కూడా ఊహించలేదు.
  1. రంజిత్, పాయల్ చాలా రెగ్యులర్గా పబ్లు పార్టీలు అని తిరుగుతూ ఉంటారు… ఆ ప్రాసెస్ లో భాగంగానే ఒక రోజు ఒక పార్టీ కి వెళ్ళినప్పుడు అక్కడ పాయల్ కు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు అతనితో కలిసి ఎంతగానో డాన్స్ చేసే మందు తాగిన పాయల్ రంజిత్ ను పూర్తిగా పక్కన పెట్టి పార్టీ అంతా అతనితోనే టైం స్పెండ్ చేసింది… అయితే ఆమె గురించి అన్ని వివరాలు తెలిసిన రంజిత్ అసలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా తన మానాన తను ఒక పక్కన కూర్చొని మందు తాగుతూ ఉన్నాడు… పార్టీ అయిపోయిన తర్వాత అతను పాయల్ కోసం చూస్తే ఆమె ఎక్కడా కనిపించలేదు అయితే ఇవన్నీ తనకు కామన్ అనుకుని మళ్లీ పాయల్ ఎవరో ఒకరి ఫ్రెండ్స్ సహాయంతో ఇంటికి వచ్చేస్తుంది అని వెళ్ళిపోయాడు.
  1. నిజానికి పాయల్ ఆరోజు తనతో పార్టీలో ఎంజాయ్ చేసిన వ్యక్తి తో కలిసి అతని రూం కు వెళ్ళింది… పార్టీలో డాన్స్ చేస్తున్నప్పుడు అతను రంజిత్ ను చూపిస్తూ నీ బాయ్ ఫ్రెండ్ అని అడిగాడు… అవును అని పాయల్ చెప్పడంతో ఎప్పుడూ అలా నీతోనే ఆ పని ఎంజాయ్ చేస్తావా ఈరోజు నాతో ఆ పనిలో ఎంజాయ్ చేయి అని అడిగాడు… అయితే చాలెంజ్లో కి కొత్త విషయాలు కి ఎప్పుడూ ఎగ్జిట్ అయ్యే పాయల్ అతను అడిగిన వెంటనే ఒప్పుకొని అతనితో పాటు అతని రూం కి వెళ్ళింది.
  1. రూమ్ లో పాయల్ ఆ కొత్త వ్యక్తి కలిసి చాలా సేపు ఆ పనిలో పాల్గొన్నారు… ఎందుకో తెలియదు కానీ పాయల్ కి ఆ కొత్త వ్యక్తి తో ఆ పనిలో పాల్గొంటున్న చాలా సేపు అది ఒక కొత్త అనుభవంలా ఒక కొత్త స్పార్క్ లా అనిపించింది… దాంతో వాళ్ళిద్దరూ ఆ రాత్రంతా ఆ పని చేస్తూనే ఉన్నారు… రంజిత్ ఇంట్లో ఆమె కోసం ఎదురు చూసి చూసి చివరికి అలసిపోయి పడుకుండి పోయాడు… ఆ కొత్త వ్యక్తి తో కలిసి ఆ పనిలో పాల్గొన్న పాయల్ చివరికి అలిసిపోయి పడుకుంటూ తన ఫోన్లో అప్పటికే రంజిత్ దగ్గర నుంచి 20 మిస్స్డ్ కాల్ చూసి చిన్నగా గిల్టీగా ఫీల్ అయింది.
  1. ఆ నెక్స్ట్ డే ఇంటికి వెళ్లిన పాయల్ రంజిత్ ముఖం చూడలేక అతన్నుంచి తప్పించుకుని తిరిగి సాగింది… అయితే రంజిత్ ఆమెను విడిచి పెట్టకుండా ఎక్కడికి వెళ్లావు చెప్పు ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు ఎక్కడికి వెళ్లి వచ్చావు అన్న విషయాన్ని చెప్పే దానివి కానీ ఇప్పుడు ఎందుకు చెప్పకుండా అంటూ ఆమెను పదేపదే సాగాడు…. అయితే దాదాపు వారం రోజుల పాటు అతనికి అసలు విషయాన్ని చెప్పకుండా దాచి పెట్టిన పాయల్ ఒక రోజు తను ఫీల్ అవుతున్న ఆ గిల్టీ నేన్ అన్నది పోగొట్టుకోవడానికి అసలు విషయం రంజిత్ కు చెప్పేసింది… తను ఎంతగానో ప్రేమిస్తున్న పాయల్ అలాంటి పని చేస్తుంది అని కలలో కూడా ఊహించని రంజిత్ ఆమె మాటలు విని ఒక్కసారిగా షాక్ అయ్యాడు… ఆ రోజు నుంచి అతను ఆమెతో మాట్లాడకుండా దూరంగా ఉండేవాడు… తను చేసింది తప్పే అని ఎప్పుడూ అలా చేయను అని పాయల్ ఎంత మొత్తుకున్నా కూడా అతను వినిపించుకోలేదు…
  1. అలా దాదాపు నెల రోజుల పాటు ఉపాయంతో రంజిత్ మాట్లాడకుండా ఉన్నాడు… ఇక అతని నుంచి దూరంగా ఉండటం తట్టుకోలేని పాయల్ ఒకరోజు బలవంతంగా అతని ఒక రూమ్ లో పెట్టి తాళం వేసి తను చేసింది తప్పే అని ఒక్కసారి తనని క్షమించి మళ్ళి ఇంకొక అవకాశం ఇవ్వమని రంజిత్ కాళ్ళు పట్టుకుని అడిగింది… కానీ రంజిత్ ఎట్టి పరిస్థితిలో తాను ఆమెను క్షమించనని ఒకసారి చేసిన వంద సార్లు చేసినా తప్పు తప్పే అని అసలు ఆమెకు అలాంటి ఆలోచన రావడం అన్నది తను తట్టుకోలేక పోతున్నానని చెప్పి ఇంకెప్పటికీ తన జీవితంలో కనిపించ వద్దు అని ఆమెకు చెప్పి వెళ్ళిపోయాడు… రంజిత్ మాటలకు ఒక్కసారిగా షాక్ అయిన పాయల్ తను ఎంతగానో ప్రేమిస్తున్న రంజిత్ ఇక జీవితంలో తనతో ఉండడు అని తెలుసుకుని చాలా బాధపడింది… ఏదో క్షణికావేశంలో తాను చేసిన తప్పు తమ ఇద్దరి మధ్య చిచ్చు పెడుతుందని తనకు బంగారం లాంటి రంజిత్ ను దూరం చేస్తుంది అని ఆమె కలలో కూడా ఊహించలేదు. సో ఫ్రెండ్స్ అదండీ మన పాయల్ రంజిత్ జీవితంలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన… నిజంగా ఇప్పుడు ఉన్న యూత్ అందరూ చాలా మంది కేవలం క్షణికావేశం కోరుకుంటూ తమకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ జీవితాలను అనవసరంగా నాశనం చేసుకుంటున్నారు… ఎంతో విలువైన జీవితం కోసం కొన్ని క్షణాలలో చాలా పెద్ద తప్పులు చేసి మీతో పాటు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని కూడా బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం ఒకసారి ఆలోచించండి.

Related Articles

Stay Connected

0FansLike
3,371FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!