17.8 C
New York
Tuesday, September 21, 2021

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ కెరీర్ పై జనసేనాని సెన్సేషనల్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ కెరీర్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. నిజంగా చిరంజీవి గారు  రాజకీయాల్లో ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు మరోలా ఉండేవని.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యుండేవారన్నారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన జనసేనాని అధికారం ఒక బాధ్యత.. అలంకారం కాదు.. అజమాయిషీ చేయటానికి అధికారం అని ఇప్పుడు అనుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని.. భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. తమను గెలిపించిన ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏం చేయలేకపోతే ఒక ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం అన్నారు పవన్. ఎస్సీలపై ఎస్సీలతోనే కేసులు పెట్టిస్తున్నారని.. ఓటమి ఎదురైనా నిలబడగలమని నిరూపిస్తున్నాము అన్నారు. ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో సాధారణ ప్రక్రియ అన్నారు. సిమెంటు ఫ్యాక్టరీ కోసమో, ఇసుక అమ్ముకోవటానికో, మద్యం అమ్ముకోవటానికో తానున సీఎం అవ్వాలనుకోలేదన్నారు. ప్రజా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానని.. ‘నా పని నన్ను చేసుకోనివ్వండి’ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజలందరూ అందరూ  25 కేజీలు బియ్యం ఇవ్వాలని చూస్తున్నారని.. తాను మాత్రం 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వాలని చూస్తున్నాను అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి తనని మానశికంగా కృంగదీసింది ఇలాంటి పరిస్థితుల్లో అన్నయ్య చిరంజీవి రాజకీయాలలో ఉంది ఉంటె ప్రజలకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని కామెంట్స్ చెయ్యడంతో పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Related Articles

Stay Connected

0FansLike
2,950FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!