19 C
New York
Thursday, October 21, 2021

బుల్లితెరపై స్రుతి మించనున్న శృతిహాసన్

లోక నాయకుడు కమల్‌హసన్‌ కుమార్తెగా వెండితెరకు పరిచయమైన శృతికుహాసన్‌ నటనలో, డ్యాన్సుల్లో తండ్రికి తగ్గ తనయురాలిగా మంచి పేరే తెచ్చుకుంది. సినిమాల్లో ముద్దులతో తండ్రి రెచ్చిపోతే అందాల ఆరబోతలో తనేంటో నిరూపించుకుంది శృతి హాసన్‌. బాలీవుడ్‌ భామలకు ఏ మాత్రం తగ్గకుండా సినిమాల్లో అందాల ప్రదర్శన చేసే శృతి ఇప్పుడు బుల్లితెరపై కూడా సంచలనం సృష్టించడానికి రెడీ అవుతోందట. వివరాల్లోకి వెళితే.. లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు బాగానే క్రేజ్ పెరిగింది. థియేటర్లు రీ ఓపెన్ అయినప్పటికీ కొన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఇంట్లో కూర్చుని ఓటీటీలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో స్టార్ నటీనటుల నుంచి చిన్నపాటి దర్శకుల వరకు అందరూ ఓటీటీ లపై కన్నేశారు. ఇప్పటికే పలు స్టార్ నటులు వెబ్ సిరీస్ చేయడానికి ముందుకు వచ్చారు. హీరోయిన్లు సైతం సిరీస్ పైనే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే వెబ్ సిరీస్ చేస్తున్న స్టార్ హీరోయిన్ల జాబితాలో సమంత కాజల్ వంటి హీరోయిన్ లతో శృతిహాసన్ పేరు కూడా చేరిపోయింది. ఇప్పటికే “పిట్టకథలు” అని అంథాలజీ తో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో అడుగుపెట్టిన శృతిహాసన్ తాజాగా ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ చేసేందుకు సైన్ చేసిందట. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది శృతిహాసన్. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఆమె ఒక వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నట్లు చెప్పుకొచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం స ష్టించిన వెబ్‌ సిరీస్‌ లస్ట్‌ స్టోరీస్‌. నెట్‌ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అయిన ఈ రొమాంటిక్‌ వెబ్‌ డ్రామాతో కియారా అద్వానీ హాట్‌ టాపిక్‌ గా మారిన విషయం తెలిసిందే. ఇదే వెబ్‌ సిరీస్‌ని నెట్‌ ఫ్లిక్స్‌ తెలుగులో రీమేక్‌ చేస్తోంది. ఇందుకోసం నలుగురు దర్శ కుల్ని ఎంచుకుంది. సంకల్ప్‌ రెడ్డి.. తరుణ్‌ భాస్కర్‌ ..నందినిరెడ్డి సిరీస్‌ లో పలు భాగాలకు దర్శకత్వం వహిస్తుండగా. ఇక కియరా ఎపిసోడ్‌ కోసం నాగ్‌ అశ్విన్‌ ని తీసుకున్నారు. ఇందులో శృతిహాసన్‌… ఒరిజినల్‌ లో కియారా పోషించిన పాత్రలో కనిపించబోతోందని తెలిసింది. ఇటీవలే సారథి స్టూడియోస్‌లో దీనికి సంబంధించిన ఎసిసోడ్‌ని షూట్‌ చేశారట. ఈ వెబ్‌ సిరీస్‌తో శృతిహాసన్‌ ఓ రేంజ్లో రచ్చ చేయడం గ్యారంటీ అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. తాజాగా నాగ్‌ అశ్విన్‌ని వేరొక ఎపిసోడ్‌ కోసం దర్శకుడిగా ఖరారు చేసుకున్నారని తెలిసింది. . ఇప్పటికి 3 ఎపిసోడ్లకు సంబంధించిన పనిని నందిని రెడ్డి – తరుణ్‌ భాస్కర్‌ – సంకల్ప్‌ రెడ్డి పూర్తి చేశారు. మరోవైపు “క్రాక్” సినిమాతో హిట్ అందుకున్న శ్రుతి హాసన్ ప్రభాస్ “సలార్” సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది.

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!