14.6 C
New York
Saturday, September 25, 2021

తెలుగు సినీ ప్రేక్షకులకు చేగువేరా అంటే మొదటగా గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

తెలుగు సినీ ప్రేక్షకులకు చేగువేరా అంటే మొదటగా గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్యూబా రెవల్యూషనరీ ‘చే’ అంటే పవన్ కి పిచ్చి, అభిమానం.. అయితే ఇటీవల రిలీజ్ అయిన వకీల్సాబ్ సినిమాలో పవన్ ఎంట్రీ సీన్ లో స్వామీ వివేకానంద ఫోటోని ప్రత్యేకంగా చూపిస్తారు.. నాస్తికుడు-కమ్యూనిస్ట్ అయిన చేగువేరాని అభిమానించే పవన్ గుళ్ళకి వెల్లడమేమిటి..? వివేకానందుని ఆరాధించడమేమిటి అని చాలామందికి అనుమానం వచ్చింది..  కొందరైతే పవన్ కి దేని పైన క్లారిటీ ఉండదని.. స్థిరంగా ఉండడని కొందరు క్రిటిసైజ్ చేశారు.. పవర్ స్టార్ నిజంగా కన్ఫ్యూషన్ లో ఉన్నారా.. తాను నమ్మే సిద్ధాంతం ఏంటి..? చెగువేరాని ఆరాధించడం ఆపేసారా..? పవన్ దేవుడిని నమ్ముతారా..? పవన్ ది పొలిటికల్ గా ఏ వెర్షన్? లెఫ్ట్ వింగా లేక రైట్ వింగా..? ఇలాంటి ఆసక్తికార విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.. 

పవన్ కళ్యాణ్ బాల్యం, కాలేజీ జీవితం గురుంచి దాదాపు అందరికి తెలిసిందే.. ఇంటర్ ఫెయిల్ అయ్యాడని, బుక్స్ బాగా చదివేవాడిని.. కరాటే కుంఫు లాంటివి చాలా కష్టపడి నేర్చుకున్నాడని చెబుతారు. పవన్ ని పవర్ స్టార్ గా.. చిరు తమ్ముడిగా కాకుండా ఒక సామాన్య మనిషిగా చూస్తే.. అతనొక నిత్య సత్యాన్వేషి.. ఒక విషయాన్ని లేదా ఒక సిద్ధాంతాన్ని గుడ్డిగా నమ్మేతత్వం కాదు.. వాస్తవం ఏమిటనేది తెలుసుకోవడానికి ఎంత వరకైనా వెళ్తారు.. ఎన్ని పుస్తాకాలైన చదువుతారు.. ఎన్ని త్యాగాలైనా చేస్తారు.. ఎన్ని ప్రయోగాలాకైనా సిద్ధంగా ఉంటారు.. అయితే ఈ ప్రయోగాలు కూడా తన పై తానే చేసుకుంటున్నాడా అని అనిపిస్తుంది.. ”తమ్ముడు” సినిమాలో చేతి వేళ్ళ పై నుంచి కార్ టైర్లు నిజంగా ఎక్కించుకున్నట్లుగా..పవన్ తాను ఫిలసాఫికల్ గా సైద్ధాంతికంగా చేస్తున్న ప్రయోగాల్లో తనని తానే instrument గా చేసుకుంటుండవచ్చు.. 

జనసేన పార్టీని మార్చ్ 14వ తేదీన స్థాపించారు పవస్టార్.. ఈ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది.. 1888వ సంవత్సరం అదే రోజున కమ్యూనిజం పితామహుడు karlmarx మరణిస్తారు.. ఇలా కొన్ని ఉదాహరణలు బట్టి పవన్ లెఫ్ట్ వింగ్ అని అంచనా వేశారు. పార్టీ ఆవిర్భావ ప్రసంగంలో కూడా పవన్ తన ప్రస్తానం గురుంచి చెబుతాడు.. తాను 20 ఏళ్లుగా పడుతున్న సంఘర్షణ ఆవేదన లోంచే ‘ఇజం పుస్తకం’, ‘జనసేన’ పుట్టిందంటారు.. పవర్ స్టార్ స్ట్రెయిట్ గా మాట్లాడే వ్యక్తి అని చాలామందికి తెలుసు.. దేనికి భయపడే వాడిని కాదని అనేక సార్లు చెప్పుకున్నారు.. ఒక సినీ రంగంలో ఉంటూ.. సమాజం ,సిద్ధాంతం ,సత్యాన్వేషణ,సంఘర్షణ, త్యాగం, ఎదురు దాడులు ఎదుర్కుంటున్న వ్యక్తి ఇంకొకరు లేరని చెప్పుకోవచ్చు.. 

పవన్ కి క్యూబన్ రెవల్యూషనరీ చేగువేరా గురుంచి.. కమ్యూనిజం, సమసమాజం సిద్ధాంతం గురుంచి కాలేజీ రోజుల్లోనే పరిచయం కాలేదు. పవన్ గారి తండ్రి పోలీస్ ఉద్యోగంలో చేరక ముందు అప్పటి కమ్యూనిస్ట్ పార్టీలో పని చేసేవారు..  ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయం తెలిసిందే.. అయితే కమ్యూనిస్టుగా  ఉన్న తన తండ్రి అనంతరం ఆస్తికుడిగా.. దైవ భక్తుడిగా మారారు.. కాబట్టి పవన్ చిన్న తనం నుంచే వీటికి లోనయి ఉండవచ్చు..

ఇక పవన్ పై ‘చేగువేరా’, ‘స్వామి వివేకానంద’ కాంట్రవర్సి, ట్రోల్ల్స్, సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నాయి.. ఒక వైపు  చేగువేరా నాస్తికుడు విప్లవకారుడైతే మరో వైపు ఆస్థికుడు సన్యాసి హిందుత్వ వాది అయిన వివేకానందుడు.. ఈ భిన్న దృవాలని పవన్ ఎలా ఫాలో అవుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.. వాస్తవమేమిటంటే వివేకానందుడు సైతం సమ సమాజాన్ని కోరుకున్నవాడే.. సోషలిజం.. పేదరిక నిర్మూలన.. శాస్త్రీయత పై ఆయన ఎన్నో ప్రసంగాలని ఇచ్చారు.. వివేకానందుడు మరణించిన తరువాత అతని తమ్ముడు భూపేంద్రనాథ్ దత్త భారత దేశంలో సోషలిజం స్థాపనకై అప్పటి రష్యన్ రెవల్యూషనరీ లెనిన్ ని కలిసారని వార్తలు వెలువడ్డాయి.. ప్రపంచంలోని రివొల్యూషనరీస్ అందరిని ఆదర్శంగా తీసుకోవాలని పవన్ అభిప్రాయం కావొచ్చు.. సిద్ధాంతాలు వేరైనా గమ్యం ఒక్కటైతే కలిసి నడవాలి.. ప్రస్తుతం జనసేనాని చేస్తుంది అదే.. రాముడు జీసస్ అంత గొప్ప వాళ్ళము కాకున్నా వారిని మనమందరము ఆరాధిస్తాం.. అలాగే పవర్ స్టార్ చెగువేరాని వివేకానందుడిని ఆరాధించడంలో తప్పేముంది..  So జనసేనాని తన సిధాంతం పై confusion లో లేరు.. ఆయనని అర్ధం చేసుకోవడంలోనే కొందరు వెనక పడ్డారు అంతే..

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!