23.2 C
New York
Monday, September 20, 2021

పెద్ద కొడుకు నీవై… తోడుంటే చాలు జరుగుతుంది అభివృద్ధి…చంద్రుడా మళ్ళీ నువ్వే రావాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనతో రెండు తెలుగు రాష్ట్రాలు  వేరయ్యాయి. దీంతో పరిశ్రమలు సైతం ఏప్రాంతంలో ఉన్నవి అక్కడే ఉన్నాయి.. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో పరిశ్రమలు ఉన్నాయి. ఏపీలో ఉన్న కూడా ఇతర మ్యానిఫ్యాచరింగ్ సంస్థలు, తయారి సంస్థలు కొంత మేర ఉన్నాయి. టెక్నాలజీకి సంబంధించిన సంస్థలు లేవు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కూడా టెక్ సంస్థలు రావడానికి కృషి చేసింది చంద్రబాబు. ఇక రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ లో ఎక్కువగా పరిశ్రమలు, టెక్ సంస్థలు కరువయ్యాయి, కానీ నైపుణ్యం గల యువత.. ఉద్యోగావకాశాలు లేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది. రాష్ట్ర విభజన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు నాయుడు.. పరిశ్రమల స్థాపన, టెక్ సంస్థలను రాష్ట్రానికి తీసుకువచ్చి లక్షల మందికి ఉపాధి కల్పించారు. తరువాత జరిగిన పరిణామాల కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత.. తామే పరిశ్రమలు తెచ్చామని చెప్పుకుంటుంది, జగన్ కి అనుకూలంగా లేని సంస్థలను రాష్ట్రం నుంచి వెళ్లేలా చేస్తుంది. న‌వ్యాంధ్ర ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు దేశ‌విదేశాలు తిరిగి, ప్ర‌ఖ్యాత సంస్థలను ఒప్పించి తెప్పించిన ప‌రిశ్ర‌మ‌ల్ని జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌లో వ‌చ్చాయ‌ని డ‌ప్పు కొట్టుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. ఇది సొమ్మొక‌డిది సోకొక‌డిది అన్నట్టు వ్యవహరిస్తోంది.  నానా క‌ష్టాలు ప‌డి రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేయించింది చంద్ర‌బాబు అయితే నిస్సిగ్గుగా తామే తెచ్చామ‌ని చెప్పుకుంటున్నారు వైసిపి నాయకులు.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. చంద్ర‌బాబు ముఖ్యమంత్రిగా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీలైన కియా, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, ఇసుజు, అపోలో టైర్స్, మోహన్ స్పిన్ టెక్స్, టోర్పీ, టిసిఎల్ తో పాటు మొత్తం 16 కంపెనీలు, సంస్థ‌లు తామే తెచ్చామ‌ని ప్రకటించుకుంది, దీంతో జగన్ ప్రభుత్వం విమర్శలపాలయ్యింది. తెలుగుదేశం  ప్రభుత్వ హయాంలో మూడు సార్లు పారిశ్రామిక సదస్సులు నిర్వహించి 15.45 లక్షల కోట్లరూపాయల పెట్టుబడులు, 32లక్షల  ఉద్యోగాలు కల్పించేవిధంగా ప్రణాళికలు రూపొందించింది చంద్రబాబు టీడీపీ ప్రభుత్వం. ఐదేళ్ల టిడిపి ప్ర‌భుత్వం కృషితో 5 ల‌క్ష‌ల 13 వేల ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారే శాస‌న‌మండ‌లి సాక్షిగా ఓ సారి వెల్లడించింది. ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు ఎన్నో క‌ష్టన‌ష్టాల‌ భరించి, పరిశ్రమ యాజమాన్యాలను ఒప్పించి తెచ్చిన పెట్టుబ‌డుల్ని జ‌గ‌న్‌ మోహన్ రెడ్డి పాల‌న‌తో  17లక్షల కోట్లరూపాయల విలువైన భారీ పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద లాస్. వైసీపీ నేత‌ల బెదిరింపుల కారణంగా 2వేల కోట్ల పెట్టుబడులతో పెట్టుబడి పెట్టడానికి వచ్చే 17 కియా అనుబంధ సంస్థలను ఇత‌ర రాష్ట్రాల‌లో ఏర్పాటు చేస్తున్నాయి యాజమాన్యాలు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కడపలోని జువారి సిమెంట్స్, చిత్తూరు జిల్లాలో అమర్ రాజా బ్యాటరీస్ వంటి ప్రతిష్టాత్మక పారిశ్రామిక సంస్థలను పిసిబి నోటీసులతో మూసివేసే ప్రయత్నాలు చేస్తుంది జగన్ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం నేతల క్వారీలపై దాడులు చేసి భారీగా పెనాల్టీ వేసి గ్రానైట్ పరిశ్రమల సంక్షోభానికి కార‌ణ‌మ‌య్యార‌ని ఆరోపించారు. కంపెనీల‌కు రాయితీలు ఇవ్వాల్సిన ప్ర‌భుత్వ పెద్ద‌లే క‌మీష‌న్ల కోసం వేధించ‌డంతో రేణిగుంటలో రిలయన్స్‌ జియో రూ.15వేల కోట్ల పెట్టుబ‌డి, ఒంగోలులో రూ.24 వేల కోట్లతో ఏర్పాటు కావాల్సిన పేపర్‌ కంపెనీ, విశాఖలో రూ.70వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమైన అదానీలు వెన‌క్కి తగ్గాయి.  50వేల కోట్ల పెట్టుబడులు వచ్చే సింగపూర్‌ స్టార్టప్‌ కంపెనీలు ఒప్పందాలను రద్దు చేసుకోవ‌డంతో విదేశాలలోనూ ఏపీ అప‌కీర్తి పాలయ్యింది. ఇలా చెప్పిన మాట వినకపోవడం,షేర్స్ అడగడంతో.. కంపెనీలు వాటికి ఒప్పుకోకపోతే సంస్థలకు అనుమతుల నిరాకరణ వటింటివి చేస్తూ ఉన్న కంపెనీలలను బయటకి పంపిస్తూ వచ్చే కంపెనీలను రాకుండా చేస్తున్నారు. దీంతో పెట్టుబ‌డులు పెట్టాలంటేనే భ‌య‌ప‌డిపోయే ప‌రిస్థితి ఆంద్రప్రదేశ్ లో ఉంది. ఏపితో ఒప్పందం చేసుకుని కూడా హోలీ టెక్ కంపెనీని ఉత్తర్ ప్రదేశ్ వెళ్ళిపోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం జే ట్యాక్స్ వేధింపులే అనేది ఆఫ్ ధ రికార్డ్ వాస్తవం. ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్, హెచ్ ఎస్ బిసిల‌ను బెదిరించి మ‌రీ పంపేశార‌ని ఏపీ పారిశ్రామిక, రాజకీయవర్గాల్లో చర్చ.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వాకం కారణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి రేటు  -2.58కి, జిఎస్డిపి -3.26కి పడిపోయింద‌ని, దేశం మొత్తంమీద సగటు నిరుద్యోగిత రేటు 11.9 ఉంటే ఆంధ్రప్రదేశ్ లో 13.5కి చేరింది.  ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగ అభివృద్ధి ద్వారా దేశవిదేశాల్లో తెలుగుయువత ప్రతిభకు స్థానం లభించేలా చేశారు చంద్రబాబు. నవ్యాంధ్రలో ఐదేళ్ల‌లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులతో 30లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశారు టీడీపీ అధినేత. ఆ కష్ట ఫలితంగా దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి..  10లక్షల ఉద్యోగాలు కల్పించింది టీడీపీ ప్రభుత్వం. అలాంటిది గత రెండు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకమైంది. తెలుగుదేశం తెచ్చిన పెట్టుబడులు, కంపెనీలు అన్నింటినీ తరిమేశారు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేశారు. యువత స్వయం ఉపాధి అవకాశాలకు గండికొట్టారు. వేలాది యువతీయువకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపింది వైసీపీ ప్రభుత్వం.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles