23.2 C
New York
Monday, September 20, 2021

చంద్రబాబు మళ్ళీ అధికారం లోకి రావాలి అంటే ? ఇవి పాటించాలి ..!

టీపీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి ఉన్న రాజకీయ అనుభవం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాయజకీ పదవుల్లో ఉన్న నాయకులకు లేదనేది వాస్తవం. విధాన నిర్ణయాలు.. వినూత్న ఆలోచనలు చేస్తూ సరికొత్తగా ముందుకు సాగుతాడు చంద్రబాబు నాయుడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన వ్యూహాలు ఎవరికి అర్థం కావు. పలు సందర్భాల్లో దేశ రాజకీయాల్లో సైతం కీలకంగా వ్యవహరించి, చక్రం తిప్పాడు చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా పని చేసాడు చంద్రబాబు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎన్నో నూతన అవిష్కరణలకు దారి తీసాడు. అంతే కాదు అసలే కొత్త రాష్ట్రం అధికారుల విభజన.. సచివాలయ భవనాలు, నిధుల సమకూర్చుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా పాలన యంత్రాంగాన్ని చక్క బెట్టడం వంటి పనులను కేవలం నెలల వ్యవధిలో చేశారు చంద్రబాబు. ప్రజలకు అవసరమైన పనులను, యువత కోసం భవిష్యత్ కోసం ఉపయోగపడే ఎన్నో నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నారు. కానీ కొందరి వల్ల చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసారు. చంద్రబాబు అమరావతిలో చేసిందేమీ లేదని, అమరావతి పేరుతో చంద్రబాబు ప్రజల సొమ్ముని దోచుకున్నాడని, సచివాలయంలో పేరుతో భారీగా నిధులు విడుదల చేసుకున్న చంద్రబాబు ప్రభుత్వం సచివాలయంలో ఒక్క భవనం కూడా కట్టలేదని.. సచివాలయం పేరుతో పేద ప్రజల భూములను మింగిందని జగన్ విమర్శించారు. అయితే అమరావతి సచివాలయం విషయంలో చంద్రబాబు నాయుడు తను చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలిసేలా చేయడంలో విఫలం అయ్యారు ముఖ్యంగా ఇదే ఆయనకు మైనస్ అయ్యింది..అనేదు వాస్తవం. నూతన రాష్ట్రంలో.. తొలిసారి అన్నిటిని కలుపుకుని పోయి పరిపాలన చేయడం అంత సులభం కాదు అందులోను సరైన నిధులు లేవు. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల వ్యవధిలోనే సచివాలయ నిర్మాణం, హై కోర్ట్ నిర్మాణం.. ఇతర పరిపాలన భవనాలను చంద్రబాబు నాయుడు తొందరగా నిర్మించారు. కానీ దీనిని ప్రజలకు తెలియజేయడంలో విఫలమయ్యారు.  సచివాలయం నిర్మాణం.. హై కోర్ట్ వంటి నిర్మాణాలను చంద్రబాబు డిజిటలైజేషన్ చేసి ప్రజలకు పరిచయం లేకపోయాడు.అయితే బాబు ఏం చేశాడు.. చేయలేదు అనేవి పక్కన పెడితే..  వచ్చే ఎన్నికల్లో సీబీఎన్ ఎలా గెలవాలి అనేది ప్రశ్న.! ప్రస్తుతం జగన్ కేవలం ప్రజలకు వివిధ పథకాల పేరుతో డబ్బును ఇస్తున్నాడు తప్పా భవిష్యత్కి ఉపయోగ పడేలా ఎటువంటి పనులు చేయడం లేదు.. దానికి తోడు కొందరు మంత్రులు అసలు ఎందుకు మంత్రులు అయ్యమో తెలియక, అసలు కనీసం వారు నిర్వహిస్తున్న శాఖ మీద అవగాహన లేకుండా, నోటికి వచ్చింది మాట్లాడుతూ ఎందుకు మంత్రి పదవుల్లో ఉన్నారో తెలియని వారి గురించి ప్రజలకి తెలియజేసెల చేయాలి. తను చేసిన అభివృద్ధిని వివరించాలి, జగన్ చేస్తున్న పొరపాట్లను ఎత్తి చూపించాలి.. రాజధానికి జగన్ ఏం చేశాడు.. తాను ఏం చేశాడు చెప్పాలి.. జగన్ అమలు చేస్తున్న పథకాలోని లోపాలు, పోలవరం ముంపు బాధితుల గురించి బలంగా వినిపించాలి.. ప్రత్యేక హోదా వంటి అంశాలను ప్రజలకు చేరేలా చేయాలి. మొత్తం మీద.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది అని చూడకుండా ఇప్పటి నుంచే ప్రచారం సాగించాలి. టిడిపిలో కీలక నాయకులు ఉన్నారు.. బలమైన క్యాడర్ సైతం ఉంది.. కాబట్టి టిడిపి ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెట్టి ప్రచారం సాగిస్తే జగన్ గుండెల్లో దడ పుట్టడం ఖాయం.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles