23.2 C
New York
Sunday, September 19, 2021

ఉక్కు నరాలు, ఇనుప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి” – జనసేన సిద్ధాంతం

“ఉక్కు నరాలు, ఇనుప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి” అన్న వివేకానందుడి మాటలు అతడి  బాల్యంలో చాలా గుండె ధైర్యాన్ని నింపాయి. అదే ధైర్యం ఇంటర్మీడియెట్‌తో చదువు ఆగిపోయినా, చదవటం ఆపొద్దని నేర్పించింది.అదే ధైర్యం తనను తాను తగ్గించుకోవడాన్ని నేర్పించింది. అదే ధైర్యం నాలుగు గోడల మధ్య నుంచి బయటకు రాని ఒక కుర్రాడు బయటకు వచ్చి కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడిని చేసింది. అదే ధైర్యం 2014లో జనసేన పార్టీని పెట్టించింది. అదే ధైర్యం ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పింది. అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనిచ్చింది. అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒక కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తుంది. గెలుపోటములు అతనికి పెద్దగా తెలియదు.. అతనికి యుద్ధం చేయడం ఒక్కటే తెలుసు. అతనికి నిజంగా ముఖ్యమంత్రి పదవి మీద కోరిక లేదు. కానీ, ప్రజలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి పదవి అనేది అతనికి ఒక బాధ్యత. టీచర్ అవ్వాలంటే శిక్షణ తీసుకోవాలి, ఐఏఎస్ అవ్వాలంటే శిక్షణ తీసుకోవాలి. కానీ, డబ్బుంటే చాలు రాజకీయాల్లోకి వచ్చేయొచ్చనే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఈ నాలుగేళ్లలో అతడిని ఎన్నో సార్లు బెదిరించినా.. నీకు డబ్బుల్లేవు.. నీ వెంట అంతా కుర్రాళ్లు ఉన్నారు.. ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ కొడుకువి.. ముఖ్యమంత్రివి కాదు.. నీ దగ్గర వేల కోట్లు లేవు.. పేపర్లు లేవు.. ఛానెళ్లు లేవు.. నీ వెంట ఎవరొస్తారు? అన్నారు. కానీ అతనికి సినీరంగంలో సూపర్ స్టార్డమ్ ఉండగానే రాజకీయాల్లోకి ఎందుకొచ్చాడంటే.. ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది నాయకులు యువత భవిష్యత్తును వారి భవిష్యత్తు కోసం వాడుకుంటున్నారు. కానీ, అతడు తన  పాతికేళ్ల భవిష్యత్తును వదులుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలని వచ్చాడు. మానవత్వమే మన కులం, మతం.మానవత్వమే మనల్ని కలిపింది. అతడి దగ్గరికి చాలామంది వచ్చారు. సినిమాలు వద్దు… చంద్రబాబుని అడిగి ఒక ఇన్‌ఫ్రా ప్రాజెక్టు తీసుకుని డబ్బులు సంపాదించుకోండని చాలామంది చెప్పారు. కానీ, నాకు అలాంటి దుష్టమైన పనులు అతడు చేయడు. ఇంతింతై వటుడింతై అంటూ రాజకీయ చదరంగంలో తన మనోధార్యాన్ని ప్రదర్శిస్తూ.. జనాలకు ఏం కావాలో అది అందివ్వడమే జనసేన లక్ష్యమంటూ సినీరంగం నుండి రాజకీయ రంగంలోకి వచ్చి సంచలనం సృష్టిస్తున్న ఆ ఒకే ఒక్కడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కుల, కుటుంబ, వారసత్వ, అవినీతి పార్టీలు రాజ్యమేలుతున్న వేళ సామాన్య బడుగు, బలహీన వర్గ ప్రజలకు అండగా, ప్రశ్నించే ప్రజల గొంతుకగా జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి ఏడేళ్లు పూర్తి అయినా సందర్భంగా ‘‘కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సాంప్రదాయం.. సంస్కృతులను కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. ఇవి దేశపటిష్టతకు మూలాలు – ఇవే ‘జనసేన’ సిద్ధాంతాలు’’ అంటూ.. సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తాజాగా  జనసేన పార్టీ సిద్ధాంతాలను మరొకసారి గుర్తు చేశారు. కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం, అవినీతిపై రాజీలేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఇవే తన పార్టీ సిద్ధాంతాలు అని వివరించారు. అలాగే మహిళలకు 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు, గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు, రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 మధ్య నగదు జమ, బీసీలకు అవకాశాన్ని బట్టి రాజకీయంగా 5శాతానికి రిజర్వేషన్ల పెంపు, చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కాపులకు 9వ షెడ్యూల్‌ ద్వారా రిజర్వేషన్ల కల్పన, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కార్పోరేషన్, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల విద్యార్థులకు వసతిగృహాలు, ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు, ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు, వృద్ధుల కోసం ప్రభుత్వ ఆశ్రమాలు మొదలైన హామీలను గతంలో చెప్పినట్లుగానే  జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలకు కట్టుబడి ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక్కడిగా వచ్చాడు.. కోట్లమంది ప్రాజాల అభిమానాన్ని పొందాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎప్పుడేం జరుగుతుందో.. ప్రజల తీర్పు ఎలా ఉంటుందో ఎవ్వరికీ అర్ధం కానీ చిక్కు ప్రశ్న. ఇలాంటి సమయంలోనే తానూ అనుకున్నది సాధించాలని.. ప్రజల కోరికలను తీర్చాలని ధీటుగా ముందడుగులేస్తున్న పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. జనసేన పార్టీ 7వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జనసేన పార్టీ కార్యకర్తలకూ.. పవన్ కళ్యాణ్ గారికి మన సేన ఛానెల్ తరపున  మా ప్రత్యేక శుభాకాంక్షలు.. జై జనసేన.. జై జై జనసేన..!

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles