14.6 C
New York
Saturday, September 25, 2021

ఉన్నోడు లేనోడు అనే బేధం లేకుండా ప్రతి ఒక్కరు చదువు లో సమానమే అనే కార్యక్రమమే… నాడు-నేడు…. ఇదే జగన్ మామా అక్క చెల్లెమ్మా , పిల్లలకి ఇచ్చే వరం

ప్రభుత్వ పాఠశాల అంటే ఎలా ఉంటుంది, ఇది ఎవరికి అడిగిన వెంటనే చెప్తారు, కూలిపోయిన గదులు.. సమయానికి స్కూల్కిరాని టీచర్లు.. ఇంకా ఎన్నో మాటలు వినపడేవి. కానీ ప్రస్తుతం సీన్ మారింది ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు అంటే కార్పొరేట్ తరహా స్కూల్స్ లాగా తయారయ్యాయి. నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ రూపురేఖలు మార్చింది ప్రభుత్వం. అయితే అసలు ఈ నాడు నేడు ద్వారా ఎవరికి లాభం.? ఈ పథకంతో విద్యార్థుల భవిష్యత్ మారబోతుందా.? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికై, బాధ్యతలు చేపట్టిన తరువాత నూతన విధానాలను, వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థ పై దృష్టి సారించారు జగన్. పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే సంకల్పంతో నాడు నేడు, జగన్నన విద్యా కానుక పథకాలను ప్రవేశపెట్టాడు. ‘జగనన్న విద్యా కానుక, తో పిల్లలకు అవసరమైన విద్యా సామాగ్రి అందిస్తున్నారు, దానికి తోడుగా ‘నాడు- నేడు’ పేరుతో పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల మీద దాని ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే కొత్త పథకాల కారణంగా కొందరు విద్యార్థులు ప్రభుత్వ బడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు నిధులతో ఆధునిక హంగులు సమకూరితే మరింత మంది అటు వైపు మళ్లుతారనే అంచనాలు పెరుగుతున్నాయి.ఎన్నికల హామీలో భాగంగా జగన్ ప్రభుత్వం గత విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఒడి పథకం అమలు చేస్తోంది. ఈ పథకంలో తమ పిల్లలను బడికి పంపించే ప్రతీ తల్లి ఖాతాలో రూ. 15 వేల చొప్పున జమ చేశారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న వారందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే కాకుండా ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న వారందరికీ లబ్ది చేకూర్చారు.2019-20 విద్యాసంవత్సరంలో అమ్మ ఒడి పథకాన్ని కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే అమలు చేస్తామని తొలుత ప్రకటించడంతో కొందరు తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల నుంచి ప్రభుత్వ బడులకు మార్పించారు. దాంతో, గత ఏడాది ప్రభుత్వ పాఠశాల్లో కొత్త విద్యార్థుల చేరిక పెరిగింది. 2018-19 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలోని పాఠశాలల్లో 70,41,988 విద్యార్థులుండగా 2019-20లో ఆ సంఖ్య భారీగా పెరిగింది. 2,47,151 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు వచ్చి చేరడం విశేషం. దాంతో మొత్తం పాఠశాల విద్యార్థుల సంఖ్య 72,30,293కి చేరింది.జగనన్న విద్యా కానుకతో మరో అడుగు .. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం మరింత పగడ్బందీగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ‘జగనన్న గోరుముద్ద’ పథకానికి శ్రీకారం చుట్టింది. మధ్యాహ్న భోజనం పథకం ఆయాల వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.అదనంగా రూ. 465 కోట్లను వెచ్చించి 36,34,861 మంది విద్యార్థులకు లబ్ది చేకూరేలా మెనూ రూపొందించారు. అందులో బలవర్థకమైన ఆహారం పిల్లలకు అందించే ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది.’జగనన్న విద్యాకానుక’ పేరుతో ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమం చేపడుతోంది. గతం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం వంటివి ఉచితంగా అందిస్తుండగా ఈసారి వాటిని సకాలంలో అందించడంతో పాటుగా అదనంగా మరిన్ని సామాగ్రిని జోడించారు. స్కూల్ బ్యాగు, మూడు జతల యూనిఫాం క్లాత్, బెల్టు, బూట్లు, సాక్సులు, పుస్తకాలు, నోట్‌బుక్‌లు కలిపి ఒకే కిట్‌గా అందిస్తున్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 655 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ పథకం ద్వారా 39.70 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుంది.పాఠశాల వాతావరణాన్ని పూర్తిగా మార్చేసేందుకు ప్రణాళికలు రూపొందించిన ప్రభుత్వం కొన్ని చోట్ల పనులు పూర్తి చేసింది. అందుకు అనుగుణంగా పలుమార్పులు చేస్తున్నారు. తరగతి గదుల నిర్మాణం, పాఠశాలలకు గోడలు నిర్మించడం, నల్లబల్లలు, బెంచీలు సహా మౌలిక వసతులన్నీ ఆధునీకరిస్తున్నారు. అరకొర వసతులు, కూలిపోయే భవనాలు, నల్ల బల్లలు, ఫ్యాన్లు, లైట్లు కూడా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు దూరమయ్యారు కానీ ప్రస్తుతం సీన్ మారింది.. ప్రభుత్వ స్కూల్స్ కార్పొరేట్ స్థాయిలో తయారయ్యాయి దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ పెరిగాయి. అంతే కాదు కాంట్రాక్టర్ల ద్వారా చేపట్టిన పనులు కొంత నాసిరకంగా ఉంటాయనే అభిప్రాయం నేపథ్యంలో ఈ పనులను కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా తల్లిదండ్రుల ద్వారానే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పేరిట దళారులు లేకుండా నేరుగా తల్లిదండ్రులే ఇలా పాఠశాల పనులు చేపట్టడం అనేది దేశంలోనే ఇది మొదటిసారి. దేశ చరిత్రలో తొలిసారిగా ఏం చేస్తే విద్యార్థులు బాగుపడుతారు.. ఎటువంటి వసతులు కావాలి అని ఆలోచించే జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ దేశంలోనే లేరు అనేది వాస్తవం. మొత్తం మీద నాడు నేడు పథకం.. విద్యార్థుల దశ దిశ మార్చి బంగారు భవిష్యత్తుకు బాటలు  వేస్తుంది అనేది వాస్తవం.

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!