21.9 C
New York
Tuesday, September 28, 2021

పోలవరం ప్రజలకు వరం అవ్వాలి కానీ శాపం అవ్వకూడదు

ఒక మంచి పని జరుగుతుంది అంటే సంతోషం.. కానీ మంచి జరుగుతుంది అని అనుకునే అందరి సంతోషం వెనుక బయటకి కనిపించని కొందరి విషాదాలు.. మరెన్నో గుండె పగిలే రోదనలు.. వర్ణించడానికి రాని ఆత్మవ్యధలు ఉంటాయి. ఆ అధ్బుతం తామే చేసామని కొందరు తమ ఖాతాలో వేసుకుంటారు..! కనీసం అధ్బుతం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారిని గుర్తించరు. కనీసం వారి వంక చూడరు. పైగా అధ్బుతాన్ని తామే తమ సొంత సొమ్ముతో.. తమ జీవితాల్ని త్యాగం చేసి సృస్టిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటారు.. ఇంతకి నేనెవరి గురించి.. దేని గురించి చెప్తునాన్నో మీకు అర్ధం అయ్యింది అనుకుంటా.! అవును మీరు అనుకుంటుంది నిజమే.! దాని గురించే మాట్లాడుతున్న.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.. గొప్పగా కడుతున్నాం అని చెప్పుకుంటుంది చుడండి ఆ పోలవరం ప్రాజెక్ట్ గురించే మాట్లాడుతున్న. నిజానికి పోలవరం ఒక మంచి ప్రాజెక్టే కాని ఆ ప్రాజెక్ట్ వెనుక ఎన్నో విషాదాలు, ప్రాజెక్ట్ పునాదుల కింద ఎంతో మంది కన్నీళ్ళు ఉన్నాయి. అవును ఇది అక్షరాల నిజమే.. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎన్నో వందల గ్రామాలు కుల్చివేయబడ్డాయి. ఎన్నో వేల కుటుంబాలు రోడున్న పడ్డాయి. అందరు పొట్టకుటి కోసం పని చేస్తూ బ్రతికేవారే.! 

చెమటోడ్చి కష్టించి.. కూలి నాలి చేస్కుని.. ఉన్న భూమిలోనే సాగు చేస్కుంటూ, ఉండటానికి ఓ ఇంటిని, తమ పిల్లలు తమలా ఉండొద్దని ఓ నీడని ఏర్పాటు చేస్కున్న కుటుంబాలెన్నో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నేల మట్టం చేయబడ్డాయి. పాలకులు ఏదో మాయమాటలు చెప్పి.. వినకపోతే బెదిరించి ఊర్లకు ఊర్లను ఖాళి చేయించి పుట్టి పెరిగిన తమ ముందే దేవాలయాలుగా బావించే తమ గ్రామాలను నేలమట్టం చేసారు. ఇది చూసి ఆగిన గుండెలు కొన్నయితే, భాదను తట్టుకోలేక రోదించిన గుండెలు మరెన్నో.! పేద వాడు, ఒక రైతు, కూలి పని చేస్కుని జీవించే ఒక వ్యక్తి పక్క వారికి లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అంటే తన సంతోషాన్ని సైతం వదులుకుంటాడు అనేదానికి ఇదే నిదర్శనం. 

ఓ ఊరు ఎన్నో జ్ఞాపకాలకు నిదర్శనం, ఓ ఇల్లు కుటుంబ సంతోషానికి చిహ్నం.ఊర్లో ఒకరికొకరు అన్న.. తమ్ముడు.. చెల్లి.. బాబాయ్.. చిన్నాన్న.. పెదమ్మ.. చిన్నమ్మ.. తాతా.. అమ్మ.. మామ.. అత్తా అని పలకరిస్తు, మంచి చెడులను పంచుకునే అప్యాయతలు అని ప్రాజెక్ట్ నిర్మాణంలో మట్టి కొట్టుకుపోయాయి. గుడిసెల్లో బ్రతికి.. కూలి నాలి చేస్తూ శాశ్వతంగా ఓ సొంత ఇంటిని నిర్మించుకుని తమ పిల్లలను అందులో ఆనందంగా ఉంచాలని అనుకున్న ఎంతో మంది ఆశలు, చిన్ననాటి నుంచి చదువుకున్న బడులు, అడిపాడిన గుడులు అన్ని నీటిలో కలిసిపోయాయి.. లేదు పోయేలా చేసారు. చేసిన కూడా వారికి సరైన న్యాయం చేయలేదు. నీటిలో మునిగిన ఈ ఊర్లను చూస్తే గుండె తరుక్కు పోతుంది. తమని ఆదుకుంటారు అని వారి కళ్ళు ఎదురుచూస్తున్నాయి. కాని ఇంకా మోసపోతున్నాం అని వారికి తెలియడం లేదు. ఇదిలా ఉంటె అడవి.. చెట్టు.. చేమా తప్పా ఇంకేం తెలియని అడవి బిడ్డలా పరిస్థితి చూస్తే కటిన శిల సైతం కన్నీరు పెడుతుంది. ప్రభుత్వం చెప్పే మాటలు, రాజకియా నాయకులు ఇచ్చే హామీల మధ్యలో తమని ఆదుకుంటారేమో అని వారి కళ్ళు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నాయి. కనీసం ఆర్అండ్ఆర్ లో భాగంగా ఇచ్చే పది లక్షలను కూడా ఇవ్వడం మరిచిపోయింది ప్రభుత్వం.. అంతే కాదు నిధులు నాయకులే నిధులు విడుదల అయ్యేలా చేస్కుని పేద ప్రజల పేరు చెప్పి వారి ఖాతాల్లోకి మళ్ళించుకుంటున్నారు. ఇక కేవలం రాజకీయం కోసం ఏర్పడిన రాజకీయ పార్టీలు ఉంటాయి కదా.. వారు మాత్రం లోనలొటారం పైన పెటారం అనట్టు.. కేవలం వారి కోసం.. అరే మనకోసం వీరు కూడా పోరాడుతున్నారు అనుకునేలా సెట్టింగులు వేస్కుని దీక్షలు చేస్తునట్టు ఫోజులు ఇస్తున్నారు. నాయకుడు అంటే రాజకీయం చేసే వాడు కాదు.. నాయకుడు అంటే కేవలం ఏపని చేసిన ఓట్లు రాబట్టాలని అలోచించి చేసే వాడు కాదు.. నాయకుడు అంటే ఆశ తో కాకుండా ఆశయంతో ఉండాలి.. ముందుకు నడవాలి.. ప్రజల్లోకి వెళ్ళాలి.. వారికి అండగా నిలబడాలి.. ఉన్నాను అనే నమ్మకం కల్గించాలి.. అవును నిజమే ఇలాంటి నాయకుడు ఇంకా ఉన్నడా అని అనుకుంటున్నారు కదా.!అవును ఉన్నాడు.! ఆశతో కాకుండా ఆశయంతో ముందుకు సాగుతున్న వాడు ఉన్నాడు. అతనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. గుండె నిబ్బరాన్ని కోల్పోయిన వారి గుండెల్లో దైర్యాన్ని, కన్నిలతో నిండిన వారి కళ్ళలో ఆనంద బాష్పాలను.. మీకోసం నేనున్నాను అనే నమ్మకాన్ని నింపి బ్రతుకుని  కోల్పోయిన వారిలో భరోసా నింపాడు. అంతే కాదు జనసేనాని అడుగుజాడల్లో నడిచే జనసైనికులు సైతం ఇందుకు కృషి చేసారు. తప్పని సరైతే పోలవరం పై నిరసన యాత్ర చేస్తానని.. నిర్వాసితులను తక్షణం ఆదుకోవాలని. గిరిజనుల త్యాగాలు వెలకట్టలేనివని.. మీకు ప్రజా మీద ఏమాత్రం కనికరం ఉన్న, ప్రజల కోసం మీరు పాలన అందించాలని అనుకున్న వారిని ఆదుకోవాలని ప్రభుత్వం పై ప్రశ్నలు గుప్పించి.. విమర్శలు సంధించి.. ప్రభుత్వాన్ని దిగివచ్చేల చేసాడు జనసేనాని. వందల గ్రామాలు, వేల కుటుంబాలు.. ఎన్నో సంస్కృతులకు.. మరెన్నో చరిత్రలకు నిదర్శనంగా ఉన్న ప్రాంతాలు ఇప్పుడు బోసిపోయాయి. నిజానికి మేమే కడుతున్నాం అని చెప్పుకుంటున్న నాయకులు ఇదే స్థానంలో మీరుంటే మీ భూములను.. మీ ఊర్లను ఇలా ఇచ్చేసేవారా.? ఒక్కసారి ఆలోచించండి.. వారికి మీలాగే అధికారం ఉంటె, మీలాహే దౌర్జన్యం చేయడం వస్తే మిరేక్కడుంటారు చెప్పండి.? పోలవరం ప్రాజెక్ట్ మేమే కడుతున్నాం అని చంకలు గుద్దుకుంటూ చెప్పడం కాదు.! దాని వెనుకున్న వేల మంది త్యాగాలను గుర్తించండి.. వారిని ఆదుకోండి..

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!