14.6 C
New York
Saturday, September 25, 2021

ఇటువంటి వ్యక్తులా ? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడేది

మనకి మన మీద కంటే పక్క వాడి మీద దృష్టి ఎక్కువ. వాడేం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏ సందులో దురాడు ఇదే కావాలి మనకు. ఇక రాజకీయ నాయకుల విషయంలోను ఇదే పరిస్థితి. నాయకుడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా.? లేదా.? అనేది మనం ఆలోచించం. వాటి మీద ప్రశ్నించం. కానీ ఆ వ్యక్తి జీవితంలోని తన వ్యక్తిగత విషయాలు మాత్రం మనకు కావాలి, ఓ పుకారు నిజమని తెలిలోపే దాన్ని గాలి కంటే వేగంగా వ్యాప్తి చేస్తాం.. ప్రస్తుతం రాజకీయాలు అంతా కూడా కులం మతం వర్గం మీద నడుస్తున్నాయి, నడిచేలా చేస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే కాపు, రెడ్డి సామాజిక వర్గాల మధ్యనే నడుస్తున్నాయి.. రెడ్డిలను వైసీపీ, కాపులకు టీడీపీ. అయితే రెండు పార్టీలోనూ రెడ్లు, కాపులు ఉన్నారు. సరిగ్గా ఇప్పుడు ఏపీలో నాయకులపై కూడా పైన చెప్పిన విధంగా అదే జరిగింది.. ఇంకా జరుగుతాయేమో అనే అనుమానం ఉంది. అయితే వాస్తవానికి అవి నిజమే అయిన కానీ అది వారి వ్యక్తిగత జీవితం, వారి వ్యక్తిగత జీవితం వారి ఇష్టం.. కాకపోతే వారు నాయకులని వారిని ట్రోల్స్ చేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు.. సొంత పార్టీలొనే వారితో విబేధాలు ఉన్న నాయకులు. అయితే మనం ఎక్కడ నాయకులు వారు సరిగ్గా పని చేస్తున్నారా లేదా, తమ పదవీ లో ప్రజలకి మంచి చేస్తున్నారా, ప్రజల బాధలను తెలుసుకుంటున్నారు లేదా అనే విషయం ఆలోచించకుండా వెంటనే ఆ నాయకుడు అట్లా ఇట్లా అని నోటికి వచ్చింది అంటూంటాం. ఇదే తీరులో ఏపీలోని వైసీపీ నేతల పై ఆరోపణలు వచ్చాయి. SVBC చైర్మన్ గా పదవీ చేపట్టిన కొన్ని రోజుల్లోనే ప్రముఖ నటుడు, వైసీపీ నేత పృద్వి పై ఓ మహిళ విషయంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు, ఆ తరువాత అంబటి రాంబాబు పై కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఇక తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ పై కూడా ఓ ఆడియో లీక్ కలకలం రేపుతోంది. దీంతో అవంతి పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ అడియో కలకలం వ్యవహారంపై పెదవి విప్పిన అవంతి శ్రీనివాస్, కలకలం రేపుతున్న అడియో తనది కాదని, ఈ వ్యవహారం తనని కలచి వేసిందని, తనపై ఎవ్వరో కక్ష కట్టి ఇదంతా చేస్తున్నారని అవంతి అన్నారు. అయితే ఎవ్వరు చేసారన్నది పక్కన పెడితే, పృద్వి, అంబటి నుంచి మొదలు పెడితే అవంతి శ్రీనివాస్ వరకు.. వరుసగా ఇటువంటి ఆరోపణలు ఎదురుకుంటున్న నేతలు రెడ్డి సామాజిక వర్గం కాదు. ఇక వీరివీరి నియోజకవర్గాల్లో రెడ్డి నేతలు కీలక నేతలుగా, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశించేవారే ఉన్నారు. జగన్ తన దేవుడంటూ, పార్టీలో పని చేసిన పృద్వికి SVBC చైర్మెన్ పదవి ఇచ్చాడు జగన్, వచ్చింది అనుకునేలోపే పదవి పోగొట్టుకుకునే పరిస్థితి వచ్చింది, దీనిపై పృద్వి ఎదగడం, రెడ్డి సామాజిక వర్గం కాకపోవడంతో పాటు రెడ్డి నాయకులని ముందుకు చూపించాలనే వైసీపీ వర్గాలే ఇది చేసాయేమో అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అంతే కాదు సీనియర్ నాయకుడు, ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ జీవితం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన జిల్లాలో బొత్స మాటే శాసనం, అయితే బొత్స స్థానంలో జిల్లాలో మరో రెడ్డి వ్యక్తి ఉన్నారు.. ఇక ఆయన కోసం బొత్స ను రాజ్యసభకి పంపాలని చూస్తున్నారు వైసీపీ నేతలు. ఇక వైసీపీ పార్టీలోకి టీడీపీ నేత గంట శ్రీనివాస్ రావాలని చూస్తున్నారు అనే విషయాన్ని అవంతి విమర్శించారు, అయితే గంట కూడా చాలా పలుకుబడి ఉన్న సీనియర్ నాయకుడు, దీంతో తనకు స్థానం దక్కదేమో అని గంట వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి అవంతి వ్యతిరేకించారు. దీంతో అవంతిని ఇరకాటంలో పెట్టడానికి అడియో వ్యవహారం బయట పెట్టారా.? ఇది చేసింది సొంత పార్టీ నాయకులా.? ఇతర పార్టీ నేతలా.? అనేది అవంతి శ్రీనివాస్ తెలుసుకోవాల్సిన ప్రశ్న. ఇదిలావుండని, దేశ రాజకీయాల్లో కూడా చాలా మంది నేతలపై ఇలాంటి ఆలోపణలు ఉన్నాయి. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై కూడా ఆరోపణలు ఉన్నాయి, నెహ్రు అమ్మాయిలతో ఎంజాయ్ చేసేవాడిని చాలా మంది అంటుంటారు.. నెహ్రు వ్యక్తిగత జీవితాన్ని చూస్తున్నారు కానీ నెహ్రు చేసిన మంచిని మర్చిపోయారు. డ్యాంలు కట్టడం, రైల్వే లైన్ లు అభివృద్ధి చేయడం వల్ల ఈరోజు సాగు నీరు , రైల్వేలు మెరుగుగా నడుస్తున్నాయి. ఈ విషయాన్ని చర్చించాల్సిన మనం ఆయన వ్యక్తి గత జీవితాన్ని చర్చించి విమర్శలు చేస్తున్నాం. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోను ఇదే చేస్తున్నారు. మాట్లాడటానికి వేరే ఏది లేదు అన్నట్టుగా పవన్ మూడు పెళ్ళిలు చేసుకున్నాడు, పవన్ రెండు పెళ్ళిలు చేసుకున్నాడు అంటారు. కానీ ఆయన చేస్తున్న మంచి పని ఎవ్వరూ చూడరు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిన పవన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వచ్చాడు, ఓటమి ఎదురైన వెనుదిరిగకుండా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. యువతను రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహిస్తున్నాడు, అవినీతి లేని సమాజం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎన్నికలు అంటే చుక్క ముక్క అనుకునే వారిలో మార్పు తెస్తున్నాడు. కులం మతం వర్గం అనే బేధాలు లేకుండా అందరిని కలుపుకుపోయి, తప్పును తప్పని, ఒప్పుని ఒప్పని చెప్తున్నాడు. కులం లేకుండా సామాజిక స్పృహ, మత వివక్ష లేని రాజకీయాలు, భాషా వైవిధ్యానికి గౌరవం, మన సంప్రదాయాలు మరియు సంస్కృతికి రక్షణ, ప్రాంతీయ ఆకాంక్షలను నిర్లక్ష్యం చేయకుండా జాతీయత, అవినీతికి వ్యతిరేకంగా నిర్విరామ పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే పురోగతి కోసం పోరాడుతున్నారు. అలాంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోకుండా, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడం ముమ్మాటికీ తప్పు. మన జీవితంలో వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయో.. ఆయన జీవితంలో కూడా అంతే ఉంటాయి. విమర్శించే ముందు సమాజం కోసం వారు చేసిన మంచిని చూసి మాట్లాడండి.!

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!