20.1 C
New York
Thursday, October 21, 2021

సుశాంత్ కొత్త సినిమా ఆహా OTTలో ఎప్పుడంటే.?

తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్.. సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆహాలో విడుదలైన చిత్రాలు, వెబ్ సిరీస్‏లు పాజిటివ్ టాక్‏తో దూసుకెళ్తున్నాయి. కేవలం తెలుగు సినిమాలనే కాకుండా.. ఇతర భాషల సినిమాలను సైతం డబ్ చేస్తూ.. ఇతర ఓటీటీ సంస్థలకు గట్టి పోటినిస్తుంది ఆహా. రెగ్యూలర్ కంటెంట్‏తో విసిగిపోయిన ప్రేక్షకులకు అనుక్షణం ఊత్కంఠంగా సాగే సస్పెస్స్ థ్రిల్రర్ సిరీస్‏లను.. భారీ బడ్జెట్ సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ ఆడియెన్స్‏ను అలరిస్తూ.. సక్సెెస్ దిశలో టాప్ ప్లేసులో దూసుకెళ్తుంది ఆహా. తాజాగా మరో సూపర్ హిట్ మూవీని విడుదల చేయబోతుంది తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా. టాలీవుడ్‌ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్‌ హీరో సుశాంత్‌ నటించిన తాజా చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఎస్‌. దర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. జెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. ఈ సినిమాను సెప్టెంబర్ 17న ఆహాలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

Related Articles

Stay Connected

0FansLike
2,990FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!