23.2 C
New York
Sunday, September 19, 2021

సేనాని ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక టార్గెట్ చేస్తున్నారా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కొందరు సినీతారలు తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. వీరందరికి పవన్ వ్యక్తిగతంగా  ఏ 

హానీ చేయకున్నా వారు అసత్య ఆరోపణలతో రోజు రోజుకు రెచ్చిపోతున్నారు.. తెలంగాణ జనసేన మహిళా నేతలు  కావ్య, రత్న, నిహారిక ఈ వ్యవహారం పై నాంపల్లి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. దూషణలతో ఆగక..  ఫోటోలు వికృతంగా మార్ఫింగ్ చేసి పైశాచికానందం పొందుతున్నారు. ఇలాంటివి ప్రతి రోజు జరుగుతున్నా పవన్ ఏ నాడు వారిపై వ్యక్తిగతంగా తిరగబడలేదు. అది ఆయన వ్యక్తిత్వం కూడా కాదన్నది అందరికీ తెలిసిందే. 

జనసేనానిని ప్రత్యక్షంగా ఎదురుకోలేక ప్రత్యర్థి నేతలే వీరి చేత ఇలా చేయిస్తున్నారు.. దీన్నే చీప్ పాలిటిక్స్ అంటారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగి..  

ప్రజలకి సేవ చేయడానికి వస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.. పవర్ స్టార్ పై ఎన్ని కుట్రలు చేసినా.. ఎందరిని ప్రయోగించినా అవేవి ఫలితాలు ఇవ్వవు.. ప్రస్తుతం పవన్ కి జనాల్లో ఉన్న ఆదరణ ఏ నాయకుడికి లేదనే చెప్పాలి.. పవన్ కి పెద్ద పొలిటికల్ బ్యాగ్రౌండ్ లేకున్నా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన నేతల్లో ఒకరిగా నిలబడ్డారు.. పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఎప్పుడు లేనంత కొత్త సుపరిపాలన చూస్తామని ప్రజలతో పాటు మేధావులు సైతం అంటున్నారు. 

పవన్ నేటి పాలిటిక్స్ లో ఒక వన్ మ్యాన్ ఆర్మీ.. ఒక్కడితో ఇప్పుడు ఒక సైన్యం ఏర్పడింది.. వీరంతా కులం, మతం, లేక ప్రాంతీయ తత్వంతో జనసైనికులుగా మారలేదు.. కేవలం జనాలకి సేవ చేయాలి.. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకొని, న్యాయం చేయాలని ఉదేశ్యం తోనే పవన్ వెనకాల నడుస్తున్నారు. 

పవర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీతో అవినీతిపరుల్లో కొంచం భయం ఏర్పడిందని మేధావులు సైతం విశ్లేషిస్తున్నారు.. పవన్ రాజీలేని తత్వమే దీనికి కారణమై ఉండొచ్చంటున్నారు.. రాజకీయ నాయకులకి సీఎం పదవి ఒక లైఫ్ అచీవ్మెంట్ అయితే, పవన్ కి అది ప్రజలకి అత్యుత్తమ సేవ చేసే ఒక అవకాశం.. తనకి ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక కూడా లేదని అనేక సార్లు చెప్పారు.. ఎన్నికల్లో గెలుపు నాయకుడి గెలుపు కాకూడదు, ప్రజల గెలుపు కావాలన్నదే జనసేనాని ఆశయం..

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles