19.5 C
New York
Tuesday, September 28, 2021

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జూన్ 2.. మనందరికీ పండుగ రోజన్న ఆయన.. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజన్నారు. అనేక మంది యోధుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతం అంటే తనకెంతో ఇష్టమని చెప్పే పవన్.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ తన పార్టీ తరఫున తెలంగాణలో అభ్యర్థులను బరిలో నిలిపారు. ‘‘జూన్‌ 2.. మనందరికీ పండుగ రోజు. తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. అనేకమంది యోధుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన రోజు. ఇటువంటి పర్వదినాన తెలంగాణ బిడ్డలందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన అమరులకు ఈ సందర్బంగా అంజలి ఘటిస్తున్నాను. అభివృద్ధి ఫలాలు అందరికీ అందిననాడే వారికి నిజమైన నివాళి. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల మాటలు మరో మారు నిజం కావాలని కోరుకుంటున్నాన’’న్న పవన్ కళ్యాణ్ సందేశాన్ని జనసేన ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… “తెలంగాణ సిరిసంపదల నేల. న్యాయం కోసం గళమెత్తే నేల. అన్యాయంపై చిందుతొక్కే నేల. ఈ నేల అంటే నాకు చాలా ఇష్టం. నాలో రాజకీయ చైతన్యం నింపి, ధైర్యాన్ని ఇచ్చిన నేల. 2009 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ ఇలా రాష్ట్రంలోని నలుమూలలు తిరిగాను. ఆ అనుభవాలు చాలా గాఢమైనవి. జనసేన పార్టీ పురుడు పోసుకుంది తెలంగాణ గడ్డ మీదే. తెలంగాణలో నా బలమేంటో నాకు బాగా తెలుసు కాబట్టే బాధ్యతగా ఉంటాను. తెలంగాణ యువత, ఆడపడుచుల్లో చాలా బలమైన భావోద్వేగం ఉంటుంది. పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చాలా మంది బలిదానాలు చేశారు. వారి బలిదానాలను గౌరవించి , అప్పటి ప్రత్యేక రాజకీయ పరిస్థితుల వల్ల పార్టీ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయాను తప్ప బాధ్యత తీసుకోలేకకాదు. రాజకీయ పార్టీ పెట్టి 420గాళ్ల చేత, పచ్చి బూతులు మాట్లాడే నీతిలేనివాళ్ళతో తిట్టించుకోవాల్సిన అవసరం లేదు.  భావి తరాల భవిష్యత్తు కోసం సామాజిక బాధ్యతతో జనసేన పార్టీ పెట్టాను. జనసేన పార్టీ అంకురార్పణకు తెలంగాణలోనే బీజం పడింది. తమ్ముడు సినిమా 100 రోజుల ఫంక్షన్ వద్దు. ఆ డబ్బుతో ఫ్లోరోసిస్ వ్యాధితో బాధ పడుతున్న నల్గొండ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవాలనుకున్నాను. అయితే అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుపడ్డారు. ఒక మంచి పని చేయడానికి కూడా ఇన్ని అడ్డంకులా అనిపించింది. ప్రజలకు మంచి చేయాలంటే ఎన్జీవో సరిపోదు.  కచ్చితంగా రాజకీయ పార్టీ అవసరం ఉందని  ఆ రోజే అనిపించింది. ఓట్లు పడినా పడకపోయినా ప్రజలకు మంచి జరిగే ఒక బలమైన రాజకీయ పార్టీ ఉంటే తప్ప ఈ సమస్యను ఎదుర్కోలేమని అనిపించింది. రౌడీయిజం, దౌర్జన్యం చేసేవాళ్లే తప్ప .. మధ్య తరగతి మనుషులు, చదువుకొని స్వశక్తితో పైకెదిగిన వ్యక్తులను రాజకీయాల్లోకి రానివ్వకుండా చేశారు. దానివల్ల ఈ రోజున డబ్బిస్తేగానీ ఓటు పడని పరిస్థితికి దేశం వచ్చేసింది.  ఇలాంటి పరిస్థితులు సమాజానికి మంచిది కాదు. రాజకీయాల్లోకి రావాలంటే వేలకోట్లు, వారసత్వం అవసరం లేదు. రబ్బరు చెప్పులు వేసుకునే వ్యక్తులు కూడా రాజకీయాలు చేయాలనే దృఢ సంకల్పంతో నా వంతు కృషి నేను చేయాలనే  కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ను 2008లో ఏర్పాటు చేశాను. అదే ఇవాళ ఎన్నో ఎదురుదెబ్బలు ఎదుర్కొని జనసేనగా రూపాంతరం చెందింది. ఒక రబ్బరు చెప్పులు వేసుకునే వ్యక్తి, ఒక నిండు గర్భిణి, గుడిసెల్లో బతికే వ్యక్తులు ఇవాళ సర్పంచులుగా గెలవడానికి కారణం అదే. రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం కావాలి. ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మన పార్టీకి ఇంత మంచి ఫలితాలు వచ్చాయంటే కారణం జనసైనికులు, వీర మహిళలు, ఆడపడుచులే.  ఎన్నికల పోరులో వాళ్లు బలంగా నిలబడి ధైర్యంగా పోరాడి గెలిచారు. ఆటవికంగా, పాశవికంగా వాళ్లపై దాడులు జరిగాయి. ఒత్తిళ్లు తీసుకున్నారు. దెబ్బలు తిన్నారు. వాటన్నింటిని తట్టుకొని నిలబడి గెలిచారు. ఎవరి దగ్గరైతే గుండె ధైర్యం ఉంటుందో వాళ్లకు విజయం తప్పక వరిస్తుంది. ఒకసారి హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయానికి 16 ఏళ్ల కుర్రాడు నన్ను కలవడానికి వచ్చాడు. లోపలికి పిలిపించి మాట్లాడాను. శ్రీశైలం ప్రాంతంలో ఉండే చెంచులం మేము.. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వేస్తున్నారు. మా జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. గ్రీన్ ట్రిబ్యూనల్ కు ఫిర్యాదు చేయడానికి నాకు ఇంగ్లీషు రాదు. నీ దగ్గర సమస్య చెప్పుకొంటే పరిష్కారమవుతుందనే నమ్మకం ఉందని ఆ కుర్రాడు చెప్పిన మాటలు నన్ను కదిలించాయి. ఆ రోజు నేను ఒకరిద్దరితో మాట్లాడితే అఖిలపక్షం మీటింగ్ జరిగింది. జనసేన పార్టీ అంటే అంత నమ్మకం. పదిమందికి సాయం చేయడానికే ఉన్నాం. తద్వారా అసెంబ్లీకి వెళ్లగలిగితే సంతోషమే. లేకపోయినా పోరాటం మాత్రం ఆగకూడదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తుల కోసం వేచి చూడబట్టే పార్టీ నిర్మాణం ఆలస్యమవుతుంది. అందుకే నేను 25 ఏళ్ల ప్రస్థానం అంటాను. అధికారం ఎవరో ఇచ్చేది కాదు. కింద మీద పడి మనమే ఎదగాలి. జనసేన పురుడు పోసుకుంది తెలంగాణలోనే.. ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చింది. ఏ ఆశయాల కోసమైతే ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందో… ఆ ఆశయాల కోసం జనసేన పార్టీ తనవంతు కృషి చేస్తోందని ఇలాంటి ప్రాంతంలో ఎలాంటి సామాజిక చైతన్యం ఉండాలో ఆ దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా పవన్ చెప్పడం విశేషం. అంతేకాకుండా తొలి ఎంపీటీసీని జనసేన గెలుచుకుంది తెలంగాణలోనే అని గుర్తు చేశారు. పవన్ కి తెలంగాణలో వ్యక్తి గతంగా అభిమానులున్నారు.. వారి ఆలోచనలు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు పవన్ చెప్పారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు జనసేనాని పవన్ కళ్యాణ్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొత్తంగా.. వైఎస్ షర్మిల కొత్త పార్టీతో పాటు… పవన్ కల్యాణ్ తాజాగా చేసిన కామెంట్లు పొలిటికల్‌ సర్కిల్‌లో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి. మరి ఇలాంటి పరిస్థితులను తట్టుకుని పవన్ తెలంగాణలో ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!