15.2 C
New York
Friday, September 30, 2022

టీడీపీ నేతల అరెస్టులే… ప్రధాన ప్రతిపక్షం బలం గా ఉంది అనడానికి నిదర్శనం…

ఏపీలో ప్రస్తుతం అసలు కారణం ఏంటో తెలియకుండా అరెస్ట్ చేస్తున్నారు అధికారులు, కాదు అరెస్ట్ చేయిస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న వైసీపీ పార్టీ పెద్దలు. అంతే కాదు ఏదైనా ఆపదలో ఉన్న వారిని పరామర్శించి, వారికి తోడుగా అండగా నిలబడి ధైర్యం చెప్పాలి అనుకున్న కూడా వైసీపీ నాయకులు దాన్ని నేరంగా చూస్తున్నారు. ఎటువంటి కారణం లేకుండా ఇప్పటి వరకు చాలా మంది టీడీపీ నాయకులని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేయుంచింది.. ఇప్పుడు పరామర్శకు వెళ్లిన వారిని సైతం అక్రమంగా అరెస్ట్ చేస్తుంది. అసలు టీడీపీ పై వైసీపీ అంత కక్ష కట్టిందా.? పరామర్శించిండం కూడా తప్పా.? ఓ సారి టీడీపీ నేతలపై ఎటువంటి కేసులు బనాయించారు.! వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది తెలుగుదేశం నాయకులు జైలుపాలు అయ్యారు. కారణం ఏదైనా జైలుకు పంపాలి అని అనుకున్న వైసిపి అనేక వ్యవహారాలకు సంబంధించి సదరు తెలుగుదేశం పార్టీ నేతలపై కేసులు బనాయించి అరెస్టులు చేశారు. అంతే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంకా ఈ అరెస్టుల పరంపర సాగుతూనే ఉంది. ఇక ESI స్కాంలో టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన తర్వాత నానా హంగామా టీడీపీ సృష్టించింది. రాజకీయ కక్షతో అరెస్టు చేశారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. నిరసన తెలిపింది. అచెన్న దాదాపు నెల రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే ఆయనను అరెస్టు చేసిన ఈఎస్ఐ స్కాం కు సంబంధించి ఇప్పటికీ తగిన ఆధారాలను దర్యాప్తు సంస్థ సమర్పించ లేకపోవడం, వందల కోట్ల అవినీతి జరిగిందనే దానికి సరైన ఆధారాలు లేకపోవడం వంటి కారణాల తో ఈ వ్యవహారంలో వైసిపి ప్రభుత్వం అభాసుపాలు కావాల్సి వచ్చింది.ఇక అమరావతి వ్యవహారంలోనూ ఇదే చోటుచేసుకుంది.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అమరావతి పై అనేక విమర్శలు చేసింది. పెద్దఎత్తున టిడిపి నాయకులు అమరావతి రాజధాని నిర్మాణంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఇక వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై దర్యాప్తుకు ఆదేశించడం, దళితులకు చెందిన అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేశారన్న ఆరోపణలను రుజువు చేయలేకపోవడం, తదితర వ్యవహారాలు కోర్టు వరకు వెళ్లినా , పెద్దగా టీడీపీకి జరిగిన నష్టం ఏమీలేదు. ప్రజల్లో వైసిపి వాళ్ళు టీడీపీ పై కక్ష సాధిస్తున్నారు అనే ఆలోచన తప్ప..సంగం డైరీ విషయంలోనూ టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ పరంపర బాగా అగ్గి రాజేసింది.. ఆ తరువాత ఆయన బెయిల్ పై విడుదల అయ్యారు. అయిన కానీ ఇప్పటి వరకు సంగం డైరీ లో అక్రమాలకు సంబంధించి సరైన ఆధారాలు లభించలేదు..  అయితే అరెస్ట్ ల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది..నారాయణ విద్య సంస్థలకు నిధులు మళ్లించారంటూ.. నారాయణ విద్య సంస్థలు అక్రమాలకు పడపడుతున్నాయంటూ.. పేదలను మభ్యపెట్టి భూములు కాజేశారంటూ వివిధ కారణాలతో మాజీ మంత్రి నారాయణని అరెస్ట్ చేశారు.. ఇక అంతే కాదు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మంచి మాస్ లీడర్.. ట్రావెల్స్ కి ఆయన పెట్టింది పేరు.. ఎలాగైనా తనని దెబ్బ కొట్టాలని అనుకున్న వైసిపి జేసీ ట్రావెల్స్ పై పడింది.. అనుమతి లేని బస్సులు ఉన్నాయని.. ఫిట్ నెస్ లేదని.. ఒకే నుంబర్ తో చాలా బస్సులు నడుపుతున్నారని జేసీకి సంబంధించిన కొన్ని బస్సులు సీజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. ఇక కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలకు సంబంధించి మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు.  శాంతి భద్రతలకు విఘాతం కల్గించారని దేవినేని ఉమాపై వచ్చిన కంప్లైంట్ ఆధారంగా.. అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు.దేవినేని ఉమా ఉద్దేశ పూర్వకంగా జి.కొండూరులో వివాదం సృష్టించారని.. ముందస్తుగా అనుకున్నట్లే ఉమా తన అనుచరులతో అక్కడకు వెళ్లారని పోలీసులు అంటున్నారు. కాగా.. తనపై దాడి జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు రాలేదని దేవినేని ఉమా ఆరోపించారు. పెద్దసంఖ్యలో వైసీపీ కార్యకర్తలు వచ్చి రాళ్లు విసిరారని చెప్పారు. సీఎం జగన్, సజ్జల నాయకత్వంలోనే తనపై దాడి జరిగిందన్నారు. కొండపల్లి రిజర్వు అడవిలో లక్షల విలువైన గ్రావెల్  దోపిడీ జరిగిందని ఉమా ఆరోపించారు. దీంతో కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణలు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లక్ష్యంగా రాళ్ల దాడి చేసేవరకూ వెళ్లాయి. దాడిలో ఉమా కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు మండలంలో గత మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశం దేవినేని ఉమా అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం నాయకులంతా కొండపల్లి రిజర్వు అడవిలోకి వెళ్లారు. అక్కడ గతంలో అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్రమాలపై ఇంతవరకూ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇది రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతుంది.ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చేసారని టీడీపీపై వైసీపీ.. వైసీపీ పై టీడీపీ ఆరోపణలు చేస్తున్నాయి. అంతే కాదు మైనింగ్ వ్యవహారం.. పోలవరం డ్యామ్.. రాజధాని నిర్మాణం.. వివిధ పథకాల్లో అక్రమాలు చేస్తుందని టీడీపీ ఆరోపిస్తే.. మీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కాకుండా మీకు మీరే లాభం పొందారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక తాజాగా గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్యను పట్టపగలే ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేసి చంపిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. పలువురిని బలవంతంగా స్టేషన్‌కు తీసుకెళ్లారు.అక్రమ అరెస్ట్ వ్యవహారం పై, గుంటూరు పోలీసుల తీరుపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కన్నెర్ర చేశారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలపై ఇంత దౌర్జన్యం చేస్తారా అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. టీడీపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టారు. పోలీసుల దౌర్జన్యం ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేలా ఉందన్నారు. దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హత్యకు గురైన విద్యార్థిని రమ్య కుటుంబానికి కోటి రూపాయిల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఇక, విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను రాజకీయ నేతలు పరామర్శల్లో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పరామర్శకు వెళ్లిన నారా లోకేష్‌ను, టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. లోకేష్‌ను ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. మరికొందరు టీడీపీ నేతలను నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో గుంటూరు నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఏపీలో టీడీపీ నాయకులను వైసీపీ టార్గెట్ చేసింది. ఎలాగైనా టీడీపీ నేతలను దెబ్బ కొట్టాలని కేసులు పెట్టి, కోర్ట్ లో సాక్షాలు కూడా చూపించ లేకపోతుంది. రాష్ట్ర నేతలు అన్న తరువాత ప్రజలు ఆపదలో ఉంటే పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడం సహజం కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏపీలో టీడీపీ నేతలు పరమర్శలకు వెళ్తే దాన్ని నేరంగా చూస్తుంది ఏపీ ప్రభుత్వం. ఎక్కడ తమ లోటు పాట్లు బయట పడుతాయో.! ఎక్కడ తమ అధికార యంత్రాంగం తీరు బయట పడుతుందో.! ఎక్కడ తమ లోపాలను ప్రజలకు తెలిసేలా చేస్తారో అని బయపడి వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కేసులు అరెస్ట్ లు చేస్తుంది అనేది వాస్తవం.

Related Articles

Stay Connected

0FansLike
3,507FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!