24.5 C
New York
Monday, June 27, 2022

ఆడవాళ్ళ మధ్య శృంగారం..ఆ సీన్స్ బంగారం | The Handmaiden Movie Explained Telugu | Shri Tv Cinemas

ఆడవాళ్ళ మధ్య శృంగారం..ఆ సీన్స్ బంగారం | The Handmaiden Movie Explained Telugu | Shri Tv Cinemas

ఈ రోజు మనం చెప్పుకోబోయే సినిమా ద హ్యాండ్ మైడన్ ఇదొక సౌత్ కొరియన్ ఎరోటిక్ సైకలాజికల్ థ్రిల్లర్… ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే 1930 జపాన్ వాళ్ళ ఆక్రమణలో ఉన్న కొరియన్ దేశం లో ఈ సినిమా కథ జరుగుతూ ఉంటుంది.ఒక రిచ్ కొరియన్ ఫ్యామిలీ లో ఉండే హిడేకో అనే రాజ్య వంశానికి చెందిన అమ్మాయికి ఒక పని మనిషి అవసరం ఉంటుంది అయితే ఆమె దగ్గర పని మనిషిగా చేయడానికి మరొక అమ్మాయి అయిన సూక్ హీ అక్కడకు వెళుతుంది.

అయితే ఇక్కడ మీకు సినిమా కథ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పష్టంగా అర్థం కావాలి అంటే సినిమాలో చూపించిన విధంగా కాకుండా కొంచెం క్లియర్ గా చెపుతూ పోతే మీరు సినిమాను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. ఇక్కడ సూక్ హీ అనే అమ్మాయిని ఆ రాజ్య వంశంలో ఉన్న హిడేకో అనే అమ్మాయి దగ్గర పని చేయడానికి తీసుకువెళ్ళింది మాత్రం కౌంట్ అనే ఒక మోసాలు చేస్తూ డబ్బులు సంపాదించే కాన్ మ్యాన్ అంటే తెలుగులో చెప్పుకోవాలంటే ఇతరులను కొన్ని విధాలుగా మోసం చేసి వాళ్ల దగ్గర నుంచి డబ్బులు కొట్టేస్తూ ఉండే వాడు అని అర్థం. అయితే ఇక్కడ హిడేకో కు సంబంధించి అతనికి కొన్ని విషయాలు తెలుస్తాయి అవేంటంటే ఆమెను తన మామయ్య పెంచుతున్నాడు అని అతను ఆమెకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాడు అని ఆమె పేరు మీద బాగా ఆస్థి ఉంది అని తెలుస్తుంది.

ఇక డబ్బు కోసం ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధపడే కౌంట్ హిడేకో దగ్గర్నుంచి ఆస్థి మొత్తం కొట్టేయడానికి ఒక అద్భుతమైన ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగానే అతను అక్కడ అంతకు ముందు పని చేస్తున్న ఒక పని మనిషిని తన తెలివితో పనిలో నుంచి తీసి వేయించి సూక్ హీ ను అక్కడికి పనిమనిషిగా తీసుకువెళతాడు.అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే సూక్ హీ వాళ్లది ఒక దొంగల కుటుంబం అంతా ఎప్పటినుంచో దొంగతనాలు చేస్తూ బతుకుతూ ఉంటారు. అయితే కౌంట్ వాళ్ల దగ్గరికి వెళ్లి నేను చెప్పినట్లు మీ అమ్మాయి చేస్తే మీకు చాలా డబ్బు ఇస్తాను అని దాంతో మీ ఫ్యామిలీ కష్టాలు మొత్తం తీరిపోతాయి అని వాళ్లకు చెపుతాడు. అప్పుడు సూక్ హీ కౌంట్ తో కలిసి హిడేకో దగ్గర పనిమనిషిగా చేయడానికి వస్తుంది.

ఇక సినిమా ఎక్కడ వరకు ఒక విధంగా సాగితే ఎప్పుడైతే సూక్ హీ హిడేకో ఇంట్లోకి అడుగు పెట్టిందో ఇక అక్కడి నుంచి సినిమా మిమ్మల్ని కట్టిపడేసే విధంగా సూపర్ ఎమోషన్స్ తో సినిమా పరుగులు పెడుతుంది. అలాగే కథలో భాగంగా వచ్చే ట్విస్ట్ లు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇక సూక్ హీ అక్కడ పని మనిషిగా చేయడానికి వచ్చిన తర్వాత కౌంట్ వేసిన ప్లాన్ ప్రకారం ఆమె ముందుగా హిడేకో కు అన్ని విధాలుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసి పెడుతూ ఆమె నమ్మకాన్ని సంపాదించగలగాలి. ఆమె దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బయటకు లాగిగలగాలి. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అన్న విషయాలు ఎప్పటికప్పుడు తనకు చెపుతూ ఉండాలి అని ఆమెకు చెప్పి అతను వెళ్ళి పోతాడు. అయితే ఇక్కడి నుంచి కథ అనుకోని మలుపు తిరుగుతుంది. హిడేకో సూక్ హీ ను బాగా ఇష్టపడుతుంది వాళ్ళిద్దరూ మెల్లమెల్లగా ఒకరికి ఒకరు బాగా కనెక్ట్ అవుతారు. ఇక ఇక్కడ మనం హిడేకో గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఆమె వయసులోకి వచ్చినప్పటికీ కూడా చాలా అమాయకురాలు, చిన్న పిల్లల మనస్తత్వం, ఏ విషయాలు కూడా ఆమెకు పెద్దగా తెలియవు.

ఇక అక్కడికి కౌంట్ ఒక బాగా డబ్బు ఉన్న వ్యక్తి లాగా వస్తూ హిడేకో మామయ్యతో అన్ని విధాలుగా పరిచయం పెంచుకుంటూ అతను హిడేకో కు పెయింటింగ్ వేయడం నేర్పించడానికి అపాయింట్ అవుతాడు. అలా మెల్లిగా హిడేకో కు పెయింటింగ్ నేర్పిస్తున్నట్టు నటిస్తూ ఆమెకు దగ్గరవడానికి, ఆమె అతన్ని ప్రేమించేలా చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.దానికి సూక్ హీ కూడా కౌంట్ కు హెల్ప్ చేయాల్సి ఉంటుంది.అయితే కేవలం డబ్బు కోసం తన ఫ్యామిలీ కోసం అక్కడకు వచ్చిన సూక్ హీ హిడేకో మంచితనం, అమాయకత్వం చూసి ఆమెను మోసం చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇక కౌంట్ వేసిన ప్లాన్ ప్రకారం ముందుగా కౌంట్ తో హిడేకో లవ్ లో పడేలా చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆ తర్వాత హిడేకో ను ఒక మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ఆమె ఆస్థి మొత్తం కొట్టేయాలి అనేది వాళ్ళ ప్లాన్ గా ఉంటుంది.అయితే ఒక సమయంలో హిడేకో కు రొమాన్స్ గురించి కిస్ గురించి సూక్ హీ చెపుతూ అనుకోకుండా ఇద్దరూ కిస్ చేసుకుని సెక్స్ లో పాల్గొంటారు.

ఇక ఇక్కడి నుంచి సూక్ హీ హిడేకోను లవ్ చేస్తూ ఉంటుంది.అటు హిడేకో కూడా ఆమెను లవ్ చేస్తుంది.అయితే ఈ విషయాలు ఏమీ తెలియని కౌంట్ మాత్రం తన ప్లాన్ ప్రకారం హిడేకోను లవ్ చేసి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ట్రై చేస్తాడు.అయితే మధ్యలో తాను లవ్ చేస్తున్న హిడేకో ను మోసం చేయలేక సూక్ హీ ఎంతగానో బాధ పడుతుంది.కానీ చివరకు ఆమె కౌంట్ కు హెల్ప్ చేయాల్సి వస్తుంది. దాంతో వాళ్లు ముందునుంచి అనుకున్నట్లుగానే కౌంట్ హిడేకో ను పెళ్లి చేసుకుని బయటకు తీసుకు వస్తాడు. అయితే ఆ తర్వాత కౌంట్ అలాగే సూక్ హీ లు హిడేకో ను మెంటల్ హాస్పిటల్ కు తీసుకు వెళ్ళిన తర్వాత ఇక్కడే మనకు సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్ వస్తుంది, అదేంటంటే అప్పటివరకు కౌంట్ అలాగే సూక్ హీ లు
హిడేకో ను మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్లిపోవాలి అనుకుంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కౌంట్ అలాగే హిడేకో లు కలిసి సూక్ హీ ను మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేసి వెళ్ళిపోతారు దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అయితే ఇక్కడితో సినిమా అయిపోయింది అని మనం అనుకుంటున్న సమయంలో సినిమాలో మళ్ళీ ఇంకొక అదిరిపోయే ట్విస్ట్ వస్తుంది అదేంటంటే ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి సూక్ హీ తప్పించుకుని వెళుతుంది.
అటు హిడేకో కూడా కౌంట్ దగ్గర్నుంచి తప్పించుకుంటుంది ఆ తర్వాత ఇద్దరూ కలిసి చైనాకు పారిపోతుంటారు. అదేంటి వీళ్లిద్దరు కలిసి పారిపోతున్నారు అసలు సినిమా లో ఏం జరిగింది అని మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజానికి కౌంట్ సూక్ హీ హెల్ప్ తో హిడేకో ను మోసం చేసి ఆమె ఆస్థి కొట్టేయాలి అనుకున్నాడు కదా కానీ అక్కడ ఆమెకు కనెక్ట్ అయిపోయిన సూక్ హీ హిడేకో తో ఒక అద్భుతమైన ప్లాన్ వేసి అన్నీ కౌంట్ అనుకున్నట్లుగానే జరుగుతున్నాయి అని అతన్ని చివరి వరకు నమ్మించి మరొక వైపు హిడేకో కూడా కౌంట్ తో కలిసి సూక్ హీ ను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడానికి హెల్ప్ చేసినట్లు నటించి చివరికి అతన్ని మోసం చేసి వాళ్ళిద్దరు ఎప్పటికీ ఒకటిగా కలిసి ఉండడానికి పారిపోతుంటారు.

ఇక ఈ సినిమా విజువల్స్, అలాగే ఆర్టిస్ట్ ల నటన, మ్యూజిక్ సినిమాలో వచ్చే ట్విస్ట్ లు ఇవన్నీ కూడా కలిసి ఈ సినిమాను ఒక క్లాసిక్ సినిమా అని చెప్పుకునే విధంగా చేశాయి.

#TheHandmaidenmovie #TheHandmaidenmovieintelugu #The Handmaiden #TheHandmaidenfullmovie #TheHandmaidenintelugu #explainedintelugu #TheHandmaidenmovieexplainedintelugu

Directed by Park Chan-wook
Written by
Park Chan-wook
Jeong Seo-kyeong
Based on Fingersmith
by Sarah Waters
Produced by
Park Chan-wook
Syd Lim
Starring
Kim Min-hee
Kim Tae-ri
Ha Jung-woo
Cho Jin-woong
Cinematography Chung Chung-hoon
Edited by
Kim Jae-bum
Kim Sang-bum
Music by Jo Yeong-wook

The Handmaiden Movie Story Explained in Telugu,
The Handmaiden Full Movie Story in Telugu,
movie explained in telugu,
movies explained telugu,
4k videos,
4k uhd videos,
hollywood movies explained in telugu,
The Handmaiden movie,
hollywood movies explained in telugu,
movie explained in telugu,
The Handmaiden movie story explained in telugu,
movies explained in telugu,
The Handmaiden movie explained in telugu,
The Handmaiden story explained in telugu,
The Handmaiden full movie story explained in telugu,
The Handmaiden full movie story in telugu,
The Handmaiden movie story in telugu,
The Handmaiden movie explained in telugu,
The Handmaiden ,
The Handmaiden movie explained,
The Handmaiden full movie,
The Handmaiden movie explain,
movies explained telugu,
movies telugu explanation.

Related Articles

Stay Connected

0FansLike
3,371FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!