24.5 C
New York
Monday, June 27, 2022

జీవితంలో ఆ పని కన్నా ఎక్కువ కిక్ ఇచ్చేవి ఉంటాయి. అవి ఏమిటో చూద్దామా? | SARAYU

జీవితంలో ఆ పని కన్నా ఎక్కువ కిక్ ఇచ్చేవి ఉంటాయి. అవి ఏమిటో చూద్దామా?

వయసులో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఆ పనిని ఎంజాయ్ చేయాలి అనుకోవడం చాలా కామన్ విషయమే… తమకు సరిపోయే పార్టనర్ ను వెతుక్కుని వాళ్లతో ఒక రిలేషన్ షిప్ లోకి ఎంటర్ అయినపుడు ఆ పార్టనర్ తో కలిసి ఆ పనిని ఎంజాయ్ చేస్తారు… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ విషయంలో ఇప్పుడు ఉన్న యూత్ సరైన అవగాహన లేకపోవడం వల్ల దాంట్లో అంతగా సంతృప్తి చెందలేక ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకుంటూ తమ రిలేషన్ షిప్ బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. అయితే చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలకు ఆ పని కంటే కూడా ఎక్కువగా కిక్ ఇచ్చేవి కూడా కొన్ని లైఫ్ లో ఉన్నాయని విషయం తెలియదు కాబట్టి వాళ్ళు తమ శారీరక మానసిక సుఖాల కోసం ఎక్కువగా ఆ పని మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. అలాంటి వారి కోసం జీవితంలో ఆ పని కంటే ఎక్కువగా కిక్ ఇచ్చే వాటి గురించి ఢిల్లీకి చెందిన కొంత మంది రిలేషన్ షిప్ ఎక్స్పర్ట్స్ కొన్ని ముఖ్యమైన విషయాలు తమ వెబ్ సైట్ లో షేర్ చేసుకున్నారు… మరి ఇప్పుడు మనం కూడా ఒకసారి అవేంటో తెలుసుకుందాం పదండి…

  1. మీకు ఇష్టమైన వారితో మంచి సంభాషణలు = ఎవరైనా సరే తమకు ఎక్కువగా ఇష్టమైన వారితో మాట్లాడడం అన్నది చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు… తను ప్రేమించిన లేదా తమను ప్రేమించిన మనుషులని కలుసుకున్నప్పుడు వాళ్లతో కలిసి టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పడం అన్నది ఈ ప్రపంచంలోనే అన్నిటికంటే ఒక గొప్ప అనుభవంగా మిగిలిపోతుంది అని చెబుతున్నారు. ఆ పని కంటే కూడా తమ అనుకునేవారితో జరిపే సంభాషణలో వాళ్ల మనసుకి ఎంతో ఆనందం కలగడమే కాకుండా లోపల ఏవైనా బాధలు నిరాశ లాంటివి ఉన్నా కూడా అవి ఇట్టే మాయమవుతాయి. ఎందుకంటే ఎలాంటి మనిషి అయినా సరే ఏదైనా సమస్యలతో బాధపడుతున్నప్పుడు లేదా అతని మనసు బాగా లేనప్పుడు తను ఇష్టపడే వారితో కొద్దిసేపు మాట్లాడినా కూడా అది అతనికి చాలా పెద్ద ధైర్యాన్ని ఇస్తుంది జీవితం మీద ఒక నమ్మకం ఏర్పడేలా చేస్తుంది. ఇక మామూలు సమయంలో మన అనుకున్న వాళ్ళతో మాట్లాడడం అన్నది అందరి జీవితంలో ఒక మామూలు విషయం అయిపోయింది అలా మాట్లాడటం ఒక మంచి ఫీల్ కలిగించడమే కాకుండా మనకంటూ కొంత మంది ఉన్నారు అన్న పాజిటివ్ ఫీలింగ్ ని నమ్మకాన్ని కూడా ఇస్తుంది.
  1. మిమ్మల్ని అందరూ ఇష్టపడడం = మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ తమ లోపల మీ మీద ఎలాంటి కోపాలు, ద్వేషాలు, పగ అధికారులు లాంటివి లేకుండా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డ అన్నది నిజంగా మీకు ఒక అద్భుతమైన సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు అందరి మనసులో ఉన్నారని వాళ్ల సంతోషానికి మీరే కారణం అని తెలుసుకున్నప్పుడు మీకు మీ జీవితం గురించి ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది… అలాంటి అనుభూతి సంతోషం నిజంగా మీరు ఆ పనిలో పాల్గొన్నప్పుడు కూడా మీకు దొరకదు అంటే అతిశయోక్తి కాదు. ఎవరి జీవితంలో అయినా వాళ్లకి కొంత మంది శత్రువులు ఉండడం కచ్చితంగా జరుగుతుంది అలాంటప్పుడు వాళ్ళ జీవితంలో డిసప్పాయింట్ మెంట్ ఏదో తెలియని భయం కూడా ఉంటాయి కానీ అలా ఏమీ లేకుండా మిమ్మల్ని అందరూ ఇష్టపడుతున్నారు అన్నప్పుడు మీలో ఎక్కువగా సంతోషం, ఉత్సాహం ఉంటాయి. అలా మిమ్మల్ని ఇష్టపడుతున్న వారి కోసం మీరు మీ జీవితంలో ఏమైనా చేయాలని అనుకుంటారు… అలా మీరు వాళ్ళ కోసం చేసినప్పుడు వారు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఇష్టపడటం జరుగుతుంది అందుకే చాలా మంది గొప్ప వాళ్ళు చెప్పినట్టు మీరు గనక మీ చుట్టూ ఉన్న వాళ్లకి ప్రేమను పంచినట్లయితే అది రెట్టింపు అయి మళ్లీ మీ దగ్గరికి తిరిగి వస్తుంది.
  1. బాగా అలసిపోయిన తర్వాత ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడం = నిజంగా మన లైఫ్ లో కొన్ని అనుభవాలు అవి అనుభవిస్తేగానీ చాలా మందికి దాంట్లో ఉన్న సుఖం అంటే ఏమిటో తెలియదు… అలాంటి వాటిలో మీరు ఒక రోజంతా బయట ఎంతో కష్టపడి పని చేసి ఇంటికి వచ్చి మీరు వేసుకున్న బట్టలు కూడా విప్పకుండా నే అలానే బెడ్ మీద పడి పోయి ఒళ్లు తెలియకుండా నిద్ర పోవడం అన్నది మీకు ఎంతో సుఖాన్ని ఇస్తుంది ఎందుకంటే అప్పటి వరకు మీరు పడ్డ కష్టాన్ని అది మీ నుంచి దూరం చేస్తుంది… మంచి నిద్ర అన్నది ఎవరికైనా చాలా సుఖాన్ని ఇస్తుంది అలాంటిది మీరు బాగా పని చేసిన తర్వాత నిద్ర పోయినప్పుడు మీరు స్వర్గంలోకి వెళ్లి వచ్చినట్లుగా ఫీల్ అవుతారు… నిజంగా మీ జీవితాల్లో దొరికే ఇలాంటి కొన్ని అందమైన అనుభూతుల వల్ల మీరు ఆ పని కంటే కూడా ఎక్కువగా సుఖాన్ని పొందడమే కాకుండా వాటిని ఎక్కువగా ఎంజాయ్ చేయగలరు అలా ఎంజాయ్ చేయడానికి మీకు ఇంకొక మనిషి అవసరం కూడా కొన్నిసార్లు ఉండకపోవచ్చు.
  1. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు సొల్యూషన్స్ దొరకడం = లైఫ్ అన్నాక దాంట్లో ఎన్నో సమస్యలు ఇబ్బందులు కష్టాలు చాలా మందికి కచ్చితంగా ఉంటాయి… వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడుతూ జీవితంలో ముందుకు వెళ్ళడమే ఎవరైనా చేయాల్సిన పని… అయితే మీ జీవితంలో మీకు ఎక్కువగా సమస్యలు వచ్చినప్పుడు అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక అంతా

అయిపోయింది మీ జీవితం బాగా కష్టాల్లో కూరుకుపోయింది అని నిరాశ లో ఉన్నప్పుడు మీకు గనక ఆ సమస్యలకు సొల్యూషన్స్ దొరికినప్పుడు మీకు మళ్ళీ మీ జీవితంలో ఇంకొకసారి బౌన్స్ బ్యాక్ అవకాశం దొరుకుతుంది అని తెలిసినప్పుడు అది కచ్చితంగా మీకు చాలా గొప్ప సంతోషాన్ని, కిక్ ను కూడా ఇస్తుంది…. ఎందుకంటే జీతం మీద ఎవరైనా చాలా ఆశలు పెట్టుకుంటారు తాము ఏదో సాధించాలని ఎన్నో అనుభవాలు పొందాలని చాలా కోరికలతో కూడా ఉంటారు అలాంటప్పుడు సమస్యలు చుట్టుముట్టే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు బాధలో ఉంటే వాటికి సమాధానం దొరకడం అన్నది కచ్చితంగా మీకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవుతుంది అది మీద ఎప్పటికీ గుర్తుండిపోతుంది కూడా. సో ఫ్రెండ్స్ అవ్వండి మీకు ఆ పని కంటే కూడా ఎక్కువగా కిక్ ఇచ్చే విషయాలు… నిజం చెప్పాలంటే మీ జీవితంలో మీరు చేసే రొమాన్స్ కానీ లేదా ఆ పని కానీ మీకు ఎక్కువగా శారీరక సుఖాన్ని మాత్రమే అందిస్తాయి. అలా కాకుండా మీకు జీవితంలో దొరికే కొన్ని సంతోషాలు అనుభవాలు మీకు అంత కంటే ఎక్కువ సుఖాన్ని ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా అవి మీ జీవితంలో గొప్ప జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.

Related Articles

Stay Connected

0FansLike
3,371FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!