23.2 C
New York
Sunday, September 19, 2021

శృంగారం కంటే ఎక్కువగా అమ్మాయిల నుంచి అబ్బాయిలు కోరుకునేవి ఇవే

ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే రిలేషన్ షిప్ లో ఎన్నో విషయాలు ఉంటాయి అవే వారి బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయి. అయితే వాళ్లిద్దరి రిలేషన్ షిప్ లో శృంగారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయమే అయితే అమ్మాయి దగ్గరి నుంచి కేవలం శృంగారం మాత్రమే కాకుండా మరికొన్నిటిని కూడా అబ్బాయిలు ఎక్స్ పెక్ట్ చేస్తారని రీసెంట్ గా కోల్ కత లో జరిగిన ఒక సర్వేలో తెలిసిందట. శృంగారం కంటే ఎక్కువగా అమ్మాయిల దగ్గరి నుంచి అబ్బాయిలు అంతగా ఏం కోరుకుంటారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయిని చూడ్డం ఇష్ట పడటం, లవ్ చేయడం ఇవన్నీ చాలా కామన్ గా జరిగే విషయాలే అయితే వాళ్లిద్దరు లవ్ లో వున్నప్పుడు బాయ్స్ నార్మల్ గానే రొమాన్స్ కోరుకుంటారు నిజం చెప్పాలంటే హగ్ లు, కిస్ లు అంటూ అబ్బాయిలు చేసే హంగామా కాస్త ఎక్కువే ఉంటుంది. ఎంతసేపు మీకదే ధ్యాసనా అని వాళ్ళ మీద అమ్మాయిల కంప్లైంట్ కూడా వుంటుంది. కానీ ముంబై కి చెందిన ఒక సంస్థ లవ్ లో వున్నప్పుడు అసలు బాయ్స్ మెంటాలిటీ ఎలా వుంటుంది, గర్ల్స్ నుంచి వాళ్లేం కోరుకుంటారు అన్న విషయాల మీద చేసిన సర్వే లో శృంగారం అనేది కాకుండా అబ్బాయిలు ఏం కోరుకుంటారు అన్నవి బయట పడ్డాయట… అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

1. అండర్ స్టాండింగ్… అర్థం చేసుకోవడం

 తమని అమ్మాయిలు పూర్తిగా అర్థం చేసుకోరు అనేది అబ్బాయిల దగ్గరి నుంచి వచ్చే ఒక పెద్ద కంప్లైంట్ అంట… ప్రతిదానికీ తమని అమ్మాయిలు బ్లేమ్ చేస్తారే కానీ అసలు తమ సైడ్ స్టోరీ ఏంటో తెలుసుకోడానికి ట్రై చేయరని వాళ్ళ ఫీలింగ్. అమ్మాయి తమని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే లవ్ లో 90% అసలు ప్రాబ్లమ్స్ రావని ఆ సర్వే లో పాల్గొన్న అబ్బాయిలు తమ అభిప్రాయాలు చెప్పారట. ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పుడు లేదా అమ్మాయిల ఎక్స్ పెక్ట్ షన్స్ తాము రీచ్ అవలేనప్పుడు ఇక అంతా అయిపోయింది అన్నట్టు అమ్మాయిలు మాట్లాడకుండా ఒకసారి తమ పరిస్థితి ఏంటో కూడా ఆలోచించాలని తమకు ఒక అవకాశం ఇవ్వాలని వారు కోరుకుంటారట. అర్థం చేసుకునే పార్టనర్ దొరకడం అన్నది అబ్బాయిల కు టాప్ మోస్ట్ ప్రయారిటీ గా వుందట.2. తమని తాముగా అంగీకరించడం.


ఏ అబ్బాయికయినా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వుంటాయి… అమ్మాయిలను లవ్ చేసినప్పుడు ఆ తర్వాత వాళ్ళ దృష్టిలో మంచి వాడు అనిపించుకోవాలనీ కొన్ని విషయాలు దాచి పెట్టిన వుండొచ్చు అయితే అవి తెలిసినప్పుడు అమ్మాయిలు కొంచెం పెద్ద మనసు చేసుకుని క్షమించేయాలని అబ్బాయిలు కోరుకుంటారట… తన బిడ్డలో లోపాలున్నా తల్లి ఎలా ఆ బిడ్డని ప్రేమిస్తుందొ అలాగే  తమని తాము ఎలా వున్నామో అలా వాళ్ళని అమ్మాయిలు గనక అక్సెప్ట్ చేస్తే అది బాయ్స్ కు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని ఆ సర్వేలో తేలింది. అంటే మీరు ప్రేమించే అబ్బాయిల్లో లోపాలుంటే వాటిని అమ్మాయిలు భరించాలన్నమాట.


3. నిజాయితీ


ఏ అబ్బాయి అయినా తను ప్రేమించే అమ్మాయి తనతో చాలా నిజాయితీగా వుండాలని కోరుకుంటాడు తను కూడా అలాగే వుండడానికి ట్రై చేస్తాడు… ఆమెకు ఏమైనా పాస్ట్ లవ్ స్టోరీ లు ఉన్నా లేదా ఎవరితోనైనా ఎఫైర్స్ ఉన్నా అలాంటివి అమ్మాయి నోటి నుంచి వినడం అనేది అబ్బాయిలకు కొంచెం కష్టంగా ఉన్నా కూడా అమ్మాయిలు తన గురించి నిజాయితీగా అన్నీ షేర్ చేసుకుంటే అబ్బాయి అలాంటి అమ్మాయిని గుండెల్లో గుడి కట్టి ఒక దేవతగా పూజిస్తాడట… తన గురించి  కూడా అమ్మాయికి దాదాపు అన్ని విషయాలు తన రహస్యాలు కూడా చెప్పేస్తారట.. కాకపోతే అమ్మాయి తనతో నిజాయితీగా లేదు మోసం చేస్తుంది అన్న విషయం తెలిస్తే మాత్రం అబ్బాయిల మనసు తట్టుకోలేదట… ఆ విషయంలో తమ నమ్మకాన్ని వమ్ము చేసిన అమ్మాయి మీద పట్టరాని కోపం వస్తుందట ఆ టైంలో అమ్మాయిని వదిలేయడం లేదంటే  అమ్మాయిని ఇంకేమైనా చేయాలనుకోవడం లాంటి ఆలోచనలు కలుగుతాయట.

సో గర్ల్స్ అవి అబ్బాయిలు మీ నుండి కేవలం శృంగారం మాత్రమే కాకుండా దానికంటే ఎక్కువగా కోరుకునే మూడు ముఖ్యమైన విషయాలు మీరు ప్రేమించే అబ్బాయి ఎలాంటి వాడైనా తనని మీరు అన్ని విధాల అర్థం చేసుకోవడం, అతన్ని వేరే అబ్బాయిలతో కంపేర్ చేయకుండా తను ఎలా ఉన్నాడో అలా అక్సెప్టు చేసి మీ లవ్ స్టోరీ లో మంచి నిజాయితీ తో గనక మీరు అబ్బాయితో ఉండగలిగితే ఇక అతన్ని మీరు మీ కొంగుకు కట్టేసుకున్నట్టే తన మనసు గెలుచుకున్న అమ్మాయి అంటే చెట్టంత మొగడయినా చిన్నపిల్లాడిలా తను చెప్పినట్లే చేస్తాడు… ఆమె ఏం చెపితే అది వింటాడు.. సో ఇంకా లేట్ ఎందుకు మరి వాళ్ళకు నచ్చినట్లుగా మిమ్మల్నీ మీరు మార్చుకోండి మీ బాయ్ ఫ్రెండ్ మనసును గెలుచుకొండి… విష్ యూ ఆల్ ది బెస్ట్

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles