19.5 C
New York
Tuesday, September 28, 2021

Top Celebrities And Politicians Born On August 05 || Genilia || Kajol || Chakrapani | Shri Tv Wishes

ఆగస్టు 5 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 Genelia D’Souza
 ‘బొమ్మరిల్లుసినిమాలో హాసినీ గా నటించి అనేకమంది హృదయాలను దోచుకున్న జెనీలియా పుట్టిన రోజు రోజు. ‘‘ఇంకేం కావాలి? వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ’’ అంటూ సరదాగా కబుర్లు చెప్తూ, పేరు చెప్పమంటే ‘‘.. హ్హ.. హ్హా.. హాసినీ’’ అంటూ మైమరపించే ఆమెను మర్చిపోవటం కష్టమే.  ‘బొమ్మరిల్లుచిత్రంతో తెలుగువారింటి ఆడపడుచులా మారిన జెనీలియా…2003లో బాలీవుడ్‌ చిత్రంతుఝే మేరీ కసమ్‌తో వెండితెరకు పరిచయమైంది.. తర్వాత శంకర్‌ దర్శకత్వంలో వచ్చినబాయ్స్‌సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. వెంటనే సుమంత్‌కు జోడీగాసత్యంలో నటించి మరో చక్కటి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నా సరైన గుర్తింపు కోసంబొమ్మరిల్లుచిత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. మధ్యలో బాలీవుడ్‌లోమస్తీ’, తమిళ్‌లోసచిన్‌వంటి చిత్రాలతో అక్కడ కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తూనే తెలుగులో బిజీగా మారింది. ఇక ఎన్టీఆర్‌తోసాంబ’, ‘నా అల్లుడు’, వెంకటేష్‌తోసుభాష్‌ చంద్రబోస్‌’, అల్లు అర్జున్‌తో చేసినహ్యాపీచిత్రాలు  నటిగా జెన్నీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.  ఆమె కెరీర్‌లోసై’, ‘ఢీ’, ‘బొమ్మరిల్లు’, ‘రెడీవంటి చిత్రాలు మైలురాళ్లుగా నిలిచాయి. ముఖ్యంగాబొమ్మరిల్లులో హాసినిగా ఉత్తమ నటిగాఫిల్మ్‌ఫేర్‌’, ‘సంతోషంఅవార్డులతో పాటునంది స్పెషల్‌ జూరిపురస్కారాన్ని అందుకోవడం విశేషం. ఇవి కాక తెలుగులోనే చేసినకథతో రెండవ సారి నంది స్పెషల్‌ జూరిని, మలయాళంలో చేసినఉరుమికి ఉత్తమ నటిగా ఆసియావిజన్‌ ఫిల్మ్‌ అవార్డును కైవసం చేసుకుంది.  బాలీవుడ్‌ నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది.   

2 Kajol
బాలీవుడ్ ని ఏలిన స్టార్ హీరోయిన్ కాజల్ పుట్టిన రోజు రోజు. తన  17 ఏటనేబెఖుదీచిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముద్దుగుమ్మకు తొలి సినిమా ఆశించిన స్దాయిలో హిట్  అందివ్వలేకపోయింది. కానీ నటిగా కాజోల్‌ మంతి పేరు తెచ్చుకుంది. తర్వాత  షారూఖ్‌ ఖాన్‌తో కలిసి చేసినబాజీగర్‌తో మొదట హిట్ ని రుచి చూసింది. ఇక్కడి నుంచే షారుఖ్‌కాజోల్‌ల కాంబోకి మంచి గుర్తింపు రావడం ఆరంభమైంది. మొత్తానికి సినిమా హిట్‌ ఇచ్చిన గుర్తింపుతో మెల్లగా ఆఫర్స్ రావడం మొదలైంది. తెలుగు హిట్‌ చిత్రంసీతారామయ్యగారి మనవరాలును హిందీలోఉదార్‌ మే జిందగి’ (1994)గా రీమేక్‌ చేయగా అందులో జితేంద్రకు మనవరాలిగా నటించి మెప్పించింది. ఇది కమర్షియల్ గా పెద్దగా ఆడనప్పటికీ కాజోల్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. తర్వాత అక్షయ్‌ కుమార్, సైఫ్‌ అలీఖాన్‌లతోయే దిల్లగీలో నటించింది. అయితే కాజోల్‌ కెరీర్‌కు భారీ ఊపు తెచ్చిన చిత్రం మాత్రందిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే’. షారుఖ్‌కాజోల్‌ జంటగా నటించిన సినిమా 1995లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలై ఇప్పటికి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా అందులోని కాజోల్‌ ని మర్చిపోవటం కష్టమే. చిత్రం ముంబైలోని థియేటర్ లో గత 22 ఏళ్లు ఆడడం ప్రపంచ రికార్డుగా నిలిచింది.

తన కెరీర్ లో అత్యధిక ఫిల్మ్‌ఫేర్‌లు అందుకున్న కాజల్ మరో నటుడు అజయ్‌ దేవగణ్ను ప్రేమ వివాహం చేసుకుంది.  తర్వాత సినిమాలను బాగా తగ్గించేసింది కాజోల్‌. కేవలం సినిమాల్లో నటించటమే కాకుండా చిన్నారులు, వితంతువుల సంక్షేమం కోసం పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి పనిచేసి మంచి మనసున్న హీరోయిన్ అనిపించుకుంది. కార్యక్రమాల్లో భాగంగా ఆమెకి కర్మవీర్‌ పురస్కారం కూడా లభించింది. కాజోల్‌ తన రెండున్న దశాబ్దాల సినీ కెరీర్‌లో దాదాపు 40 చిత్రాల్లో నటించి.. ఆరుసార్లు అత్యధిక ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు సొంతం చేసుకున్న నటిగా అరుదైన గుర్తింపును అందుకుంది. ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’, ‘కుచ్‌ కుచ్‌ హోతాహై’, ‘కభీ ఖుషీ కభీ ఘమ్‌’, ‘ఫనా’, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా అవార్డులు లభించాయి. కేవలం హీరోయిన్ గానే కాక విలన్ పాత్రలతోనూ మెప్పించిన ముద్దుగుమ్మగుప్త్‌: ది హిడెన్‌ ట్రూత్‌’ (1997) చిత్రానికి గానూ ఉత్తమ విలన్‌గా అవార్డును అందుకోవడం విశేషం.  చిత్రసీమకు కాజోల్‌ చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.  

3  చక్రపాణి
విజయ సంస్దలో వచ్చిన మిస్సమ్మ, పాతాళభైరవి, మాయాబజార్, గుండమ్మ కథ వంటి అనేక సూపర్ హిట్స్ వెనక ఉన్న మూల స్దంబం ,విజయా రథ సారధి చక్రపాణి. ఆయన జన్మదినం రోజు. చక్రపాణి అసలుపేరు ఆలూరి వెంకట సుబ్బారావు. పిల్లలను కొన్ని తరాలు పాటు ఉర్రూతలూగించిన  బాలల పత్రికచందమామవ్యవస్థాపకుడు. చక్రపాణి బహు భాషాకోవిదుడు. మంచి అభిరుచిగల రచయిత.నిర్మాత.  ప్రఖ్యాత బెంగాలి రచయిత శరత్ చంద్ర చటర్జీ సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేసి బెంగాలి సంస్కృతిని తెలుగువారికి దగ్గర చేర్చిన సాహితీ పిపాసి.  ప్రేక్షకుల నాడిని ఖచ్చితంగా అంచానా వేయగల సినీవైద్యుడుగా పేరు తెచ్చుకున్నవాడు. ఆంధ్రజ్యోతి, కినిమా, చందమామ, యువ, విహారి వంటి పత్రికలను విజయవంతంగా నడిపినవాడు. మితభాషిగా, విజయా చక్కన్నగా పేరుతెచ్చుకున్న చక్రపాణిది ముక్కుసూటి మనస్తత్వం.  1940 లో ముంబైలోని ఫేమస్ ఫిలింస్ వారి ధర్మపత్ని కోసం ఈయన మాటలు వ్రాసాడు. బి.ఎన్.రెడ్డి రూపొందిస్తున్న స్వర్గసీమకు మాటలు వ్రాయడానికి చెన్నై వెళ్ళాడు
1949-1950 లో నాగిరెడ్డి, చక్రపాణి కలవడం, కలసి విజయా ప్రొడక్షన్స్ను స్థాపించి, సినిమాలు తీయాలని నిర్ణయించడం జరిగింది. అప్పటి నుంచి వాహినీ స్టుడియోలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 35 చలనచిత్రాలను రూపొందించారు. ఇద్దరూ కలసి షావుకారు, పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పు చేసి పప్పు కూడు లాంటి అజరామరమైన సినిమాలు తీశారు. సినిమాలే కాక చక్రపాణి నాగిరెడ్డితో కలసి పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించాడు. పాతాళభైరవిలోని  “జనం కోరేది మనం శాయడమా, మనం చేసేది జనం చూడడమాఅనే డైలాగు సారాన్నే చక్రపాణి పాటించి సక్సెస్ లు సాధించారు.  

4  ఉదయభాను

తెలుగు లో  ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఉదయభాను. బుల్లితెరకు గ్లామర్ నేర్పిన ముద్దుగుమ్మ ఈమె. ఇప్పుడంటే అన‌సూయ‌, ర‌ష్మి గ్లామ‌ర్ ఒల‌క‌బోస్తున్నారు కానీ బుల్లితెర‌కు ఆనాడే సెగ‌లు పుట్టించింది ఉద‌య‌భాను వెలుగు వెలిగింది. సమయంలో ఈమెను మించిన యాంకర్ తెలుగులో లేదనుకునే స్థాయిలో రాణించింది. ఆమె పుట్టిన రోజు రోజు. తన వాక్ చాతుర్యం, చురుకుదనంతో బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామసినిమాల్లోనూ తన మార్కను చాటింది. మధ్య వచ్చిన  పలు చిత్రాల్లో ఐటం సాంగులు చేస్తూ, హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ దర్శనం ఇచ్చింది. ఉదయభానుకు ఒకప్పుడు బోలెడంత ఫాలోయింగ్. ఆమె కోసం కుర్రాళ్లు పడిచచ్చిపోయేవారు. ‘వన్స్ మోర్ ప్లీజ్’, ‘సాహసం చేయరా డింభకా’, ‘డాన్స్ బేబీ డాన్స్’, ‘పిల్లలు పిడుగులులాంటి ఎన్నో టీవీ కార్యక్రమాలతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. సినిమాల్లో కూడా మెరిశారు. కెరీర్ మంచి పీక్‌లో ఉన్న సమయంలో అంటే 2004లో విజయ్ కుమార్‌ను
ఉదయభాను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరవాత కూడా తన ప్రొఫెషన్‌ను కొనసాగించారు. సుధీర్ఘ విరామం తరవాత ఇటీవల మళ్లీ బుల్లితెరపై ఆమె రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఉదయభాను ఫుల్ బిజీగా ఉన్నారు. రియాలిటీ గేమ్ షోకళ్యాణ లక్ష్మికి వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు. అలాగే, శ్రీముఖి హోస్ట్ చేస్తున్న కామెడీ షోజూలకటకకు జడ్జిగానూ కొనసాగుతున్నారు. అలాగే, మూవీ ఈవెంట్‌లు కూడా చేయడానికి ఆమె చేస్తూ బిజీగా ఉన్నారు.

5  నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
జులై 20, 1969 మానవ జాతి చరిత్రలో అద్భుతం ఆవిష్కృతమైంది. అప్పటివరకు భూగోళానికే పరిమితమైన మనిషి తన ప్రస్థానాన్ని మరో ప్రపంచంలో ప్రారంభించాడు. తొలిసారిగా చందమామను అందుకున్నాడు. లక్షల మంది శ్రమ, కోట్లాది మంది ఆశలు, ఆకాంక్షలు నెరవేరిన శుభదినం. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన అపోలో-11 వ్యోమనౌక ద్వారా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. ఆయన పుట్టిన రోజు రోజు. ఆయన అప్పట్లో చంద్రుడిపై అడుగుపెట్టి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశారు. ఆర్మ్‌ స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టి, మానవ చరిత్రలో చంద్రుడిపై నడిచిన మొదటి మనిషిగా నిలిచిపోయారు. దాదాపు 21 గంటలు చంద్ర మండలంపై గడిపారు. ‘ఇది మనిషిగా ఒక చిన్న అడుగు.. మానవాళికి మాత్రం భారీ గెంతుఅని సందర్భంగా ఆర్మ్‌స్ట్రాంగ్ గట్టిగా అరిచారు.   అక్కడ అమెరికా జెండాను నాటారు. చంద్ర శిలలు, మట్టి నమూనాలను సేకరించి, ఫొటోలు తీసుకొని, ప్రయోగ పరికరాలను అక్కడ వదిలేసి తిరుగు ప్రయాణమయ్యారు. అక్కడ నుంచి బయలుదేరిన నాలుగు రోజుల తర్వాత జులై 24 పసిఫిక్ మహాసముద్రంలోకి అపోలో-11 సురక్షితంగా దిగింది. వ్యోమగాములు చంద్రుడి ఉపరితలం నుంచి సేకరించిన దాదాపు 21.5 కిలోల రాళ్లు, మట్టి నమూనాలను పరిశోధనల కోసం వివిధదేశాలకు నాసా పంపిణీ చేసింది. ఆస్ట్రోనాట్లు చంద్రుడిపై దిగడాన్ని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయగా, ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది దీన్ని వీక్షించినట్లు అంచనా

6  గైడీ మొపాసా
ఆధునిక సాహిత్యంలో ఆబాలగోపాలాన్ని అమితంగా ఆకర్షిస్తున్న ప్రక్రియకథానిక‘. కథానిక పక్రియలో అందె వేసిన చేయి, అజరామరంగా నిలచిపోయిన కీర్తి గైడీ మొపాసాదే.  ఫ్రెంచి కథారచయిత గైడీ మొపాసాకు కథలోనీరవ మానవ జీవన అగాథల్లోకి దూకి అక్కడ జరిగే యుద్ధాలను ఉత్కంఠభరితంగా చిత్రించడం అంటే ఇష్టం. మొపాసా దృష్తిలో కథానిక అంటే సమాజమనే అంశంమీద రాసుకున్న షార్తుహ్యాండ్ నోట్సు అని చెప్తారు. సత్యాన్ని సూటిగా చెప్పడం మించిన మంచికథావిధానం మరొకటి లేదంటాడు ఆయన. అనుభవానికి రాని సంఘటనలకు దూరం పాటించడం మొపాసా నిజాయితీకి నిదర్శనం. తీవ్ర ఆవేశం, గాఢపరిశీలనాసక్తితో ఆయన సాహిత్యరంగ ప్రవేశం చేసి కథానికల ద్వారా పేరు తెచ్చుకున్నారు.  సులభంగా అర్థమవుతూ, సత్వర మనసిక ఆనందానుభూతులకు దోహదం చేసే సాహిత్యానికే కథల్లో ప్రయారిటీ ఇస్తూంటారు. మొపాసా 19 శతాబ్దపు ఫ్రెంచ్ దేశస్తుడు. 1870 నాటి ఫ్రాంకోప్రష్యన్ యుధ్ధకాలంలో జీవించాడు. నాటికి మొపాసా ఇరవై యేళ్ల యువకుడు. యుధ్ధాన్నీ, విప్లవ ప్రభుత్వాన్నీ స్వయంగా చూశాడు. ఇంగ్లండ్ లో పారిశ్రామిక విప్లవం, ఫ్రాన్సులో రైతాంగ విప్లవాల నేపథ్యంలో ఛార్లెస్ డికెన్స్ రచనలు సాగినట్టు, ఫ్రాంకోప్రష్యన్ యుధ్ధం, పారీస్ కమ్యూన్ నేపథ్యంలో గై డి మపాసా  కథలు సాగాయి.   నేపథ్యాన్ని కూడా అర్ధం చేసుకుంటే మొపాసా రచనలి మరింత గొప్పగా ఆస్వాదించవచ్చు. మనిషి బుధ్ధి విందులో మాంసం ముక్క దగ్గర బయటపడుతుందని మనకు  ఒక సామెత వుంది. ప్రశాంత కాలంలో మర్యాదస్తుల్లా ప్రవర్తించే మనుషులు ప్రళయ కాలంలో నైతికంగా దిగజారి ప్రవర్తిస్తారని మొపాసా కథలన్నీ  వందలసార్లు నిరూపిస్తాయి.    

ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!