14.6 C
New York
Saturday, September 25, 2021

Top Celebrities And Politicians Born On August 06 | HBD Prudhvi Raj | Prof Jaya Shankar | Shri Tv

ఆగస్టు 6 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 Prudhvi Raj
30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న డైలాగ్ తో కమెడియన్ పృథ్వి ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు.  ఆయన పుట్టిన రోజు రోజు.  వరుసపెట్టి సినిమాలో అవకాశాలు రావడంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన పృథ్వి ఒక టైమ్ లో ఇండస్ట్రీలో వెలుగు వెలిగాడు.ప్రారంభ రోజుల్లో..సినిమావాళ్లతో పరిచయాలు కోసం కేబుల్ టీవీలో పనిచేస్తూ..ఇంటర్వూలు చేసేవారు. అయితే ఒకరోజు . వి. వి సత్యనారాయణ తన సినిమాకు నటులకోసం అన్వేషిస్తున్నారని తెలుసుకుని ఆయన్ను కలుసుకున్నాడు. అందులో ఒక బ్యాంకు మేనేజరు పాత్రకు అతను సరిపోతాడని భావించి దానికి ఎంపిక చేశాడు. అలా ఒక్కటీ అడక్కు చిత్రంలో రావు గోపాలరావు మేనల్లుడిగా సినీరంగ ప్రవేశం చేశాడు. సినిమా షూటింగ్ సమయంలో రావుగోపాలరావు తో కలిసి నలభై రోజుల పాటు ఉన్నాడు.   ఒక్కటీ అడక్కు సినిమా తర్వాత వెంటనే ఏమీ అవకాశాలు రాలేదు. చిన్న చిన్న పాత్రలు వచ్చినా అవి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు. కొన్ని రోజులు సినిమాలకు తనకి సరిపడవని ఇంటికి వెళ్ళి ఆశ చావక మళ్ళీ చెన్నైకి వచ్చేసేవాడు. అప్పుడే కృష్ణవంశీ సింధూరం అనే సినిమా చేస్తున్నాడని తెలిసి అందులో నక్సలైటు పాత్ర సంపాదించాడు. తర్వాత చంద్రలేఖ, ఇడియట్, సముద్రం లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు లభించాయి. ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ సృష్టించిన థర్టీ ఇయర్స్.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగుతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడంతో ఇతడికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఏర్పడింది. తర్వాత వచ్చిన పోకిరి, ఢీ, రెడీ, కిక్, దూకుడు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో మంచి పేరున్న పాత్రలు లభించడంతో అతనికి స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు లభించింది. లౌక్యం సినిమాలో ఆయన పోషించిన బాయిలింగ్ స్టార్ బబ్లూ పాత్ర కూడా అతనికి మంచి పేరు తెచ్చింది. మధ్యలో మూడేళ్ళు సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నపుడు బాపు దర్శకత్వంలో ఈటీవీలో ప్రసారమైన సీరియల్లో ఏడేళ్ళపాటు ఇంద్రుడు, దుర్యోధనుడు లాంటి అనేక పాత్రల్లో నటించాడు. అలాగే రాజకీయాల్లో సైతం పృధ్వీ ప్రవేసించారు.

2.మనోజ్ నైట్ శ్యామలన్..

 హాలీవుడ్ హార్రర్ థ్రిల్లర్స్ చూసే వాళ్లకి  పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు.ఆయన పుట్టిన రోజు రోజు.  ది సిక్స్త్ సెన్స్అన్ బ్రేకబుల్సైన్స్విలేజ్ లాంటి సినిమాలతో హాలీవుడ్ లో ప్రకంపనలు రేపిన మనోజ్.. భారత సంతతికి చెందిన వాడన్న సంగతి చాలామందికి తెలియదు. అతను కేరళవాడు. ఐతే చిన్నప్పుడే అతడి కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. ‘ది సిక్స్త్ సెన్స్సినిమాతో హాలీవుడ్ లో అతడి పేరు మార్మోగిపోయింది. తర్వాత స్థాయిలో సినిమాలు తీయలేకపోయాడు మనోజ్. ఆయన సినిమాది విజిట్హాలీవుడ్ ను వణికించేసింది. ఆయన సినిమాలకు వరల్డ్ వైడ్ గా మంచి మార్కెట్ ఉంది.  స్పీల్‌బర్గ్ వీరాభిమాని అయిన మనోజ్ శ్యామలన్ తీసే సినిమాల్లో కథ కన్నా కథనం కొత్తగా ఉంటుంది. అంతకుమించి వింతగా ఉంటుంది. ఆత్మలు, అతీంద్రియ శక్తులు లాంటి కథాంశాలకు ఏదో విధంగా మానవీయ స్పర్శను ఆపాదించడం శ్యామలన్ శైలి.

 ఇద్దరు సాధారణ వ్యక్తులను తీసుకెళ్లి అసాధారణ సందర్భంలో పారేయడం శ్యామలన్ సక్సెస్ ఫార్ములా. మనలో ఒకడు అనుకునే కేరెక్టర్‌ని ఎవ్వరూ ఊహించని సందర్భంలో పడేసి, ‘అరె! మనక్కూడా ఇలా జరగొచ్చుఅని సినిమా చూసేంతసేపూ అదే ఆలోచనలో ఉండేలా చేస్తాయి శ్యామలన్ సినిమాలు. ‘అన్‌బ్రేకబుల్’, ‘సైన్స్’, ‘ది విలేజ్ఇవన్నీ కోవకు చెందినవే! పుట్టి పెరిగింది అమెరికాలోనే అయినా శ్యామలన్ మూలాలతో పాటు ఆలోచనలు కూడా భారతీయతతో నిండి ఉంటాయి. ప్రతి చిత్రంలోనూ భారతీయ ఆధ్యాత్మికత, తాత్విక విషయాలను మిస్టరీలో జొప్పించి, థ్రిల్లర్‌లను తెరకెక్కించడం ఆయన స్పెషాలిటీ.

 ‘సిక్త్స్ సెన్స్కథను కాస్త నిశితంగా పరిశీలిస్తేఆత్మ శాంతిఅనే భారతీయ అంశాన్ని తెరకెక్కించాడని మనకే అర్థమౌతుంది. అలాగే – ‘ది లాస్ట్ ఎయిర్‌బెండర్అనే సినిమాలో దేవుడి అవతారాల గురించి చెబుతాడు. ఇలా అతని కథలు ఒక ఎత్తయితే, వాటి స్క్రీన్‌ప్లే ఇంకొక ఎత్తు. ఎంతో సాధారణమైన కథతో సినిమా తీసినా, క్లైమాక్స్‌ను మాత్రం ప్రేక్షకులు అస్సలు ఊహించని విధంగా తీస్తాడు. సినిమా ఆఖరి టైటిల్స్ పడేంత వరకూ కథ నడుస్తూనే ఉంటుంది. అంతేకాదు, అతని ప్రతి చిత్రంలోనూ చివర్లో ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంటుంది. ఇదే అతని సినిమాల ప్రత్యేకత. ఇప్పటికీ హాలీవుడ్‌లో వన్ ఆఫ్ హయ్యెస్ట్ పెయిడ్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా చెలామణి అవుతున్నాడు మనోజ్. సాధారణ జీవితం, అసాధారణ సంఘటనలు, ఊహకందని మలుపులుఇదే శ్యామలన్ ట్రేడ్ మార్క్

3 Lucille Ball
తనే కథ రాసుకుని, పాత్రలను క్రియేట్ చేసుకుని, అందులో నటిస్తూ, తానే నిర్మిస్తూ, తీస్తూ ఇలా అష్టావదానం చేయటం అంటే మాటలు కాదు. కానీ అలా చేయటంలో ఆరితేరి సినీ ప్రపంచంలో తనకంటూ స్దానం క్రియేట్ చేసుకున్న నటి లూసిల్లే బాల్‌. ఆమె పుట్టిన రోజు రోజు. నటిగా, మోడల్‌గా, స్టూడియో నిర్వాహకురాలిగా, నిర్మాతగా పేరొందిన ఈమె బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా అందాల తారగా పేరొందింది. టీవీల్లోఐలవ్‌ లూసీ’, ‘ లూసీ షో’, ‘హియర్‌ ఈజ్‌ లూసీ’, ‘లైఫ్‌ విత్‌ లూసీ’, ‘ లూసీ దేశీ కామెడీ అవర్‌లాంటి ధారావాహికలు, కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల్లో విపరీతైన క్రేజ్‌ సంపాదించుకుంది. వెండితెరపై రెండు దశాబ్దాల పాటు ఎన్నో పాత్రల ద్వారా అభిమానులను అలరించింది.  సవతి తండ్రి ప్రోత్సాహంతో 12 ఏళ్ల వయసులో నాటకాల్లో ఆడిషన్స్‌కి వెళ్లి ఎంపికైంది. దాంతో ఆమె జీవితం మలుపు తిరగింది. ఆపై నాటకాలు, మోడలింగ్, టీవీలతో అంచెలంచలుగా ఎదిగింది. వెండితెరపైరోమన్‌ స్కాండల్స్‌’, ‘రూమ్‌ సర్వీస్‌’, ‘రోబెర్టా’, ‘స్టేజ్‌డోర్‌లాంటి సినిమాలతో పేరు సంపాదించింది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రెండు స్టార్స్‌ గౌరవాన్ని పొందింది. ప్రెసిడెన్షియల్‌ అవార్డు, అంతర్జాతీయ లివింగ్‌ లెగసీ అవార్డు, టైమ్‌ పత్రిక వెలువరించే అత్యంత ప్రభావశీలుర గుర్తింపు పొందింది. ప్రభుత్వం ఆమె గౌరవార్థం స్టాంపును విడుదల చేసింది. అందం, సృజనాత్మకతలతో తనదైన ముద్ర వేసింది లూసీ.

4  డా.రాజేంద్ర సింగ్
వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా , రామన్ మెగసెసే అవార్డు గ్రహీత డా.రాజేంద్ర సింగ్ పుట్టిన రోజు రోజు.  ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, 1000 గ్రామాలకు నీరందించిన ఘనమైన చరిత్ర ఆయనది. వందల అడుగులు తవ్వితేగానీ జల పడనిచోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంతగా భూగర్భజలాలు చార్జ్‌ అయ్యాయక్కడ. అతను వర్షపు నీటిని నిల్వచేసేట్యాంకులు, చెక్ డ్యాం లను ఉపయోగించి నీటిని సంరక్షించే విధానాలను అవలంబిస్తాడు. 1985లో ఒక గ్రామం నుండి ప్రారంభించి సంస్థ 8600 జోహాద్‌లు, ఇతర నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వచేసింది. అతను చేసిన విధానాల వల్ల రాజస్థాన్ లో అర్వారి, రూపారెల్, సర్సా, భగాని, జగజ్వాలి అనే ఐదు నదులు పునరుజ్జీవనం పొంది 1000 గ్రామాలకు నీటిని అందించాయి.  రాజస్థాన్‌ లో మంచి నీటి నిర్వహణలో విశేష కృషి చేసినందుకు గాను 2001 లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నాడు. 2009లో భారత ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 కు అనుగుణంగా గంగా నది కోసం ఏర్పడిన అధికార ప్రణాళిక, ఫైనాన్సింగ్, పర్యవేక్షణ, సమన్వయ అధికారం గల సంస్థనేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీసభ్యులలో రాజేంద్ర సింగ్ ఒకడు.   యునైటెడ్ కింగ్‌డం లో అతను ఇది నేలకోత, వరదలు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే లక్ష్యంతో ఫ్లో పార్టనర్‌షిప్ అనే సంస్థను స్థాపించాడు. గ్రామీణాభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయొగిస్తున్నందుకు 2005 లో జమ్నాలాల్ బజాబ్ పురస్కారం దక్కింది. అలాగేగ్రహాన్ని రక్షిస్తున్న 50 మంది ప్రజలుజాబితాలో గార్డియన్ పత్రిక స్థానం కల్పించింది. 2015లోస్టాక్‌హోల్ం వాటర్ ప్రైజ్” . ఇదినోబెల్ ప్రైజ్ ఆఫ్ వాటర్గా ఆయనకు గుర్తింపు ఉంది.

5. జయశంకర్ సార్

తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ జయంతి రోజు.  వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో జన్మించిన ఆయనతెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది.  జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పేవారు జయశంకర్ . అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన మాట, రాత అంతా తెలంగాణ చుట్టూనే తిరిగాయని జయశంకర్ సన్నిహితులు చెబుతుంటారు.మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో జయశంకర్‌కు మంచి పరిచయాలు ఉండేవి. మన్మోహన్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్నసమయంలో జయశంకర్ ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా ఉండేవారు. 1985 నుంచి మన్మోహన్ సింగ్‌తో తనకు పరిచయం ఉండేదని, తర్వాత కాలంలో ఆయన ప్రధాని అయినప్పుడు కూడా తనను మరిచిపోలేదని జయశంకర్ గుర్తు చేసుకునేవారు. ”నేను ఏది విడిచిపెట్టినా రెండు విడిచి పెట్టను. ఒకటి శనివారం ఉపవాసం, రెండవది తెలంగాణవాదంఅని జయశంకర్ తరచూ అనేవారు.

6 .పార్ధో ఘోష్
హిందీలో 100 days, Dalal, Agnisakshi వంటి సూపర్ హిట్ సినిమాలు డైరక్టర్ చేసిన పార్ధో ఘోష్ పుట్టిన రోజు రోజు. బెంగాళికు చెందిన దర్శకుడు తన మాతృభాషలోనూ సినిమాలు చేసారు. మిధున్ చక్రవర్తి, జాకీ షరాఫ్, మిధున్ చక్రవర్తి వంటి స్టార్స్ ని తన కెరీర్ మొదట్లోనే డైరక్ట్ చేసారు. నానా పటేకర్ తో చేసిన అగ్నిసాక్షి సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. హిందీ పరిశ్రమలోకి అసెస్టెంట్ గా చాలా చిన్న సినిమాలకు పనిచేసిన ఆయన తన కెరీర్ లో మాత్రం పెద్ద సినిమాలు డైరక్ట్ చేసారు. 100 డేస్ చిత్రం తమిళంలో వచ్చిన విజయ్ కాంత్ చిత్రం నూరవరోజు కు రీమేక్. తతర్వాత దలాల్ చిత్రం 1993లో వచ్చిన సినిమాలో హైయిస్ట్ గ్రాసింగ్ సినిమాగా నిలిచింది. తర్వాత  తన కెరీర్ లో 15 సినిమాలు దాకా డైరక్ట్ చేసిన దర్శకుడుకు హిట్ అనేది రాలేదు. తర్వాత మళయాళ చిత్రం నెంబర్ 20.మద్రాస్ మెయిల్ చిత్రం రీమేక్ తీసరా కౌన్ సినిమా మళ్లీ హిట్టై ఆయన్ని ఫామ్ లోకి తెచ్చింది.  నిర్మాతగా ఏడు బెంగాళి సినిమాలను, అనేక టీవి సీరియల్స్ ని ప్రొడ్యూస్ చేసారు.

ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!