19.5 C
New York
Tuesday, September 28, 2021

Top Celebrities And Politicians Born On August 09 || HBD Super Star Mahesh Babu || Shri Tv Wihes

ఆగస్టు 9 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

1 Mahesh babu

ప్రిన్స్ మహేష్ బాబు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు.   తండ్రికి తగ్గ తనయుడుగా మహేష్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే తెలుగు తెరకు పరిచయం అయినబాలచంద్రుడు‘…. తర్వాత రాజకుమారుడుగా ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు. గుణశేఖర్ దర్శకత్వం వహించినఒక్కడుచిత్రంతో స్టార్ ఇమేజ్ అందుకున్న మహేష్ బాబు తర్వాతపోకిరి‘….దూకుడుబిజినెస్మస్లతో విజయవంతంగా దూసుకుపోతున్నాడు. మధ్యన విడుదలైనసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుసక్సెస్ తో ఫ్యామిలీల ఆదరణను పొందిన మహేష్  ‘1- నేనొక్కడినేతో క్లాస్ వర్గానికి చేరువయ్యారు.  యాక్టింగ్‌ స్కిల్స్‌ బాగా ఉన్న మహేష్‌ వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ‘వంశీ’, ‘మురారి’, ‘టక్కరి దొంగ’, ‘బాబీ’, ‘ఒక్కడు’, ‘నిజం’, ‘నాని’, ‘అర్జున్‌’, ‘అతడు’, ‘పోకిరి’, ‘సైనికుడు’, ‘అతిథి’, ‘ఖలేజా’, ‘దూకుడు’, ‘బిజినెస్‌ మేన్‌’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘వన్‌ నేనొక్కడినే’, ‘ఆగడు’, ‘శ్రీమంతుడు’, ‘బ్రహ్మోత్సవం’, ‘స్పైడర్‌’, ‘భరత్‌ అనే నేను’, ‘మహర్షి’, సరిలేరు నీకెవ్వరూ, సర్కారు వారి పాట  ఇలా డిఫరెంట్ సినిమాలతో,పాత్రలతో ప్రేక్షకులను అలరించారు స్టార్‌ హీరో

చెన్నైలో చదువు సాగడం వలన మహేష్‌కు తెలుగు చదవడం, రాయడం తెలియక మొదట్లో చాలా ఇబ్బంది పడేవారట. తన సినిమాల డైలాగ్స్‌ను బాగా గుర్తుపెట్టుకొని చెప్పేవారట.   తర్వాత సమస్యను అతి కొద్ది కాలంలోనే అధిగమించేసారు. ఇక మహేష్ క్రేజ్ స్దాయిలో ఉందంటేమహేష్‌ పాపులారిటీ   నేపథ్యంతోఅష్టాచెమ్మ’, ‘కిరాక్‌’, ‘సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌వంటి సినిమాలు తెరకెక్కాయి.  అలాగే మహేష్‌ సినిమాలతోనే కాదు వాణిజ్య ప్రకటనలతోనూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. మహేష్‌ ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు. వ్యవహరిస్తున్నారు కూడా. హిందీ స్టార్ హీరోలు ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న బ్రాండ్లు కూడా మహేష్‌ ఖాతాలో పడ్డాయంటే స్టార్‌ రేంజ్‌ ఏమిటో సులభంగా అర్ధం చేసుకోవచ్చు. బెస్ట్‌ యాక్టర్‌గా ఎన్నో దక్షిణ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్స్, సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డులు, సినిమాఅవార్డ్స్, సంతోషం ఫిల్మ్‌ అవార్డులు, హైదరాబాద్‌ టైమ్స్‌ ఫిల్మ్‌ అవార్డ్స్, ఇంకా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు మహేష్‌ బాబు.

2. హన్సిక
  రోజు స్టార్ హీరోయిన్ హన్సిక పుట్టిన రోజు. చిన్నప్పుడే బాలనటిగా వెండితెరతో అనుబంధం పెంచుకొన్న హన్సిక అనేక సీరియల్స్ ల్లోనూ, సినిమాల్లోనూ అభినయించింది. ‘హవా’, ‘కోయి మిల్‌ గయా’, ‘అబ్రక దబ్రా’, ‘జాగోవంటి చిత్రాల్లో బాలనటిగా మెరిసింది. తర్వాత కొంతకాలానికి అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది పాల బుగ్గల పిల్ల హన్సిక. తర్వాత ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘Mappillai’   చిత్రంతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి అక్కడ అనేక కమర్షియల్ హిట్స్ తన ఖాతాలో వేసుకొంది. పాల బుగ్గల హన్సిక మనసు కూడా వెన్నలాంటిదే. ప్రతి పుట్టినరోజుకి ఒక అనాథపిల్లలని దత్తత తీసుకొని వారి సంరక్షణ బాధ్యతని తీసుకుంటుంది. ముద్దుగా బొద్దుగా ఉండే హన్సిక తమిళ తంభీలని తెగ ఎంటర్ టైన్ చేసేస్తోంది. తెలుగు అడపా దడపా సినిమాలు చేస్తున్న హన్సిక.. కోలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్. అక్కడ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో వెలుగు వెలిగి స్టార్ హీరోయిన్ గా కీర్తించ బడిన హన్సిక మధ్య కాస్త జోరు తగ్గించింది. వరుస సినిమాలకు కమిట్ కాకుండా కేవలం కథా బలమున్న సినిమాలనే ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఏది ఎలా ఉన్నా హన్సిక కెరిర్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.

3 Whitney Houston

హాలీవుడ్ చిత్రం  ‘ బాడీ గార్డ్‌చూసిన వారు అందులో నటించిన విట్నీ ఎలిజబెత్‌ హౌస్టన్‌ ని మర్చిపోవటం కష్టం. తొలి సినిమాతోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన నటి రోజే జన్మించింది. సింగర్ గా, నటిగా తన కెరీర్ లో పీక్స్ చూసిన ఆమె తన తోటి వారికన్నా ఎక్కువ అవార్డ్ లు సాధించింది. అంతేకాదు అత్యధిక అవార్డులు గెలుచుకున్న కళాకారిణిగాగిన్నిస్‌ ప్రపంచ రికార్డుసాధించినది. అలాంటి రికార్డ్ సొంతం చేసుకున్నది  విట్నీ ఎలిజబెత్‌ హౌస్టన్‌ ఒక్కరే. న్యూజెర్సీలో  పుట్టిన విట్నీ, చిన్నతనంలోనే పాటలు బాగా పాడేది. గాయనిగా ఆమె ఆల్బమ్‌లు ఏకంగా 20 కోట్ల కాపీలు అమ్ముడయ్యాయి. ‘ బాడీ గార్డ్‌’ (1992)తో వెండితెరకు పరిచయమైవెయిటింగ్‌ టు ఎక్స్‌హేల్‌’, ‘ ప్రీచర్స్‌ వైఫ్‌లాంటి సినిమాలతో నటిగా కూడా ఆకట్టుకుంది. విట్నీ సాధించిన అవార్డులకు లెక్కే లేదు. ఎమ్మీ, గ్రామీ, బిల్‌బోర్డ్, అమెరికన్‌ మ్యూజిక్‌ అవార్డులు సహా మొతం 415 అవార్డులు అందుకుని ప్రపంచరికార్డు సాధించింది.

4 కస్తూరి రాజా
ప్రముఖ తమిళ నటుడు ధనుష్ తండ్రి కస్తూరి రాజా. ఈయన దర్శకుడు, రచయిత, నిర్మాతగా అనేక సినిమాలు రూపొందించారు. అలాగే ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ కూడా ఈయన కుమారుడే. తమిళనాడు లోని మారు మూల ప్రాంతం నుంచి సినిమాలపై పిచ్చితో చెన్నై పారిపోయి వచ్చారు. అలా వచ్చిన కస్తూరి రాజాగ్రామీణ నేపధ్యం ఉన్న సినిమాలు ఎక్కువ చేసిన డైరక్టర్ K.S.G. దగ్గర పని చేసారు. తర్వాత ప్రముఖ దర్శకుడు విసు దగ్గర పదహారు సినిమాలకు అశోశియోట్ గా చేసారు. తర్వాత డైరక్టర్ గా మారి ఆయన చేసిన సినిమాలు పెద్ద హిట్స్ అయితే కొట్టలేదు కానీ కమర్షియల్ గా వర్కవుట్ అయ్యాయి. దాంతో ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టు చేతిలో ఉండేది. ఇక కొడుకులు పెద్దవాళ్లైక వాళ్లను సినిమా పీల్డ్ లో నిలదొక్కుకునేందుకు సాయిం చేసాడు. అందుకోసం తన కెరీర్ ని ప్రక్కన పెట్టాడు. వాళ్లు సెటిల్ అయ్యాక నిర్మాతగా మారి ధూళ్ పేట, త్రి వంటి సినిమాలుచేసారు

5 judo ratnam
తెలుగు,తమిళ,మలయాళ,, కన్నడ ,హిందీ భాషల్లో ఒక టైమ్ లో జూడో రత్నం లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఆయన ఫైట్ మాస్టర్ గా, యాక్షన్ కొరియోగ్రాఫర్ గా రికార్డ్ లు క్రియేట్ చేసారు. ఆయన పుట్టిన రోజు రోజు. నటుడుగా సినీ పరిశ్రమలో ప్రవేశించిన ఆయన తదుపరి కాలంలో స్టంట్ మాస్టర్ సెటిల్ అయ్యారు. 1966 నుంచి 2006 దాకా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. రోజు ఫామ్ లో ఉన్న విక్రమ్ ధర్మా, సూపర్ సుబ్రమణ్యం, తళపతి దినేష్, జాగర్ తంగమ్, రాంబో రాజకుమార్, విజయన్ మాస్టర్, పొన్నాంబళం వంటి ఎంతో మంది స్టంట్ మాస్టర్స్ ఆయన గురువు. ఆయన రోజు స్టార్స్ గా ఉన్న హీరోలందిరితో స్టంట్స్ చేయించారు. అలాగే ఆయన కుమారుడు జూడో రామ్ కూడా స్టంట్ మాస్టర్. ఆయన మనవడు  జూడో లెనిన్, జూడో ప్రిన్స్ కూడా స్టంట్ ఆర్టిస్ట్ లుగా చేస్తున్నారు.

6 బెనర్జీ 

తెలుగు సినీ పరిశ్రమలోని సీనియర్ నటుల్లో బెనర్జీ ఒకరు. నాలుగు తరాల సినీ నటులను చూసిన అనుభవం ఉంది. మొత్తం 35 ఏళ్లుగా టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఎన్ని చిత్రాల్లో నటించామన్న దృష్టితో కాకుండా ఎన్ని మంచి పాత్రల్లో నటించామన్న ఆలోచనతోనే బెనర్జీ సినిమాలను ఎంపిక చేసుకోవడం ఆయన ప్రత్యేకత. ఆయన పుట్టిన రోజు రోజు. తెలుగు సినిమాలు చూసేవాళ్లకు బెనర్జీ పరిచయం అక్కర్లేని పేరు. ఈయన అసలు  పేరు మాగంటి వేణు బెనర్జీ . ఎక్కువగా సహాయ పాత్రలలో, విలన్ గా నటించాడు. సినీ పరిశ్రమలో ఆయన 30 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. సహాయ దర్శకుడిగా తన ప్రస్థానం ప్రారంభించి నటుడిగా మారాడు.విజయవాడ లోని గవర్నరుపేటలో జన్మించిన  బెనర్జీ తండ్రి రాఘవయ్య కూడా నటుడు. వీరాంజనేయ, కథానాయకుడు, యమగోల తదితర చిత్రాల్లో నటించాడు.  రాఘవయ్య చివరిగా కొర‌టాల శివ తెర‌కెక్కిన ర‌త్ అనే నేను సినిమాలో న‌టించారు.  బెనర్జీ  మద్రాసులో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు, బి. చదివాడు. విజయనగరంలో కంపెనీకి బ్రాంచి మేనేజరుగా పనిచేశాడు. 1980లో నేను సినీ పరిశ్రమకు వెళ్లారు. డైరెక్టర్ కావాలనే కోరికతో నేను చెన్నైకి వెళ్లిహరిశ్చంద సినిమాకు అసిస్టెంట్‌గా చేరారు. యూఎస్ రావు దగ్గరనే అసోసియేట్‌గా పనిచేశారు. దర్శకత్వశాఖలో అన్ని మెలుకువలు ఆయనే నేర్పారు.కానీ చిత్రంగా నటుడయ్యారు. దాదాపు 360కి పైగా చిత్రాల్లో నటించారు.

ఇప్పటిదాకా చెప్పుకున్న ఇంతటి గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!