-0.7 C
New York
Wednesday, January 26, 2022

Top Celebrities And Politicians Born on Jan 05 | Deepika Padukone | Uday Chopra | Shri Tv Wishes

Top Celebrities And Politicians Born on Jan 05 | Deepika Padukone | Uday Chopra | Shri Tv Wishes

జనవరి 5 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Deepika Padukone   : దీపికా పదుకుణే పరిచయం అవసరం లేని ప్రముఖ బాలీవుడ్ నటి ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. 1986, జనవరి 5న డెన్మార్క్‌ లోని కోపెన్‌హాగన్‌లోజన్మించింది. దీపిక తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రకాష్‌ పదుకొణే. సొంత రాష్ట్రం కర్ణాటక. తల్లి పేరు ఉజ్వల. ఆమె ఓ ట్రావెల్‌ ఏజెంట్‌. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ చిన్నప్పుడే రాకెట్‌ చేతపట్టింది. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణిగా గుర్తింపును తెచ్చుకొంది. ఆ తర్వాత మోడలింగ్‌లోకి ప్రవేశించిoది. మొదట ‘నామ్‌ హై తేరా’ అనే ఓ మ్యూజిక్‌ వీడియో ఆల్బమ్‌లో మెరిసింది. ఆమె నటించిన తొలి చిత్రం ‘ఐశ్వర్య’అనే కన్నడ సినిమా దీంట్లో హీరో ఉపేంద్ర. ఆ తర్వాత ‘ఓం శాంతి ఓం’ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌తోనే కలిసి నటించి బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో ఇక వేనుతిరిగి చూసుకోలేదు ‘కాక్‌టైల్‌’, ‘రేస్‌2’. ‘యే జవానీ హై దివానీ’ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’ ‘గోలియాన్‌ కి రాసలీల రామ్‌-లీల’ ‘కొచ్చాడయాన్‌’, ‘ఫైడింగ్‌ ఫన్నీ’, ‘హ్యాపీ నూయర్‌’, ‘పీకూ’, ‘తమాషా’, బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్‌’, ‘జీరో’, ‘చప్పాక సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్‌లో ‘ట్రిపుల్‌ ఎక్స్‌:ది రిటర్న్‌ ఆఫ్‌ జేండర్‌ కేజ్‌’లో నటించింది, బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ను  పెళ్లి చేసుకుంది. తన తొలిసినిమా ఓం శాంతి ఓం కు ఉత్తమ నూతన నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు,  ‘గోలియాన్‌ కి రాసలీల రామ్‌-లీల’, ‘పీకూ’ సినిమాలకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది.

  2.       Uday Chopra : ఉదయ చోప్రా… భారీ యాక్షన్ సినిమాలయిన ధూమ్ సిరీస్ చిత్రాల్లో నటించి తనదైన కామెడీ పండించిన బాలీవుడ్ యాక్టర్ ఈరోజు ఆయన పుట్టినరోజు. ఈయన జనవరి5, 1973లో మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఉదయ చోప్రా ప్రముఖ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన యష్ రాజ్ కొడుకు. సినిమాల్లో నటించడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, దిల్ తో పాగాల్ హై లాంటి సినిమాలకు పనిచేసారు. ఆ తర్వాత 2000లో వచ్చిన మోహబ్బతెయిన్ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత మేరె యార్ కి షాది హై, ముజ్ సే దోస్త్ కరేంగే, సుపారి, కల్ హో నా హో, ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3, హమ్ తుం లాంటి సినిమాల్లో నటించారు. ధూమ్ సిరీస్ చిత్రాల్లో ఉదయ్ చోప్రా నటనకు మంచి పేరు వచ్చింది. ఉదయ్ చోప్రా నిర్మాతగా కూడా గ్రేస్ ఆఫ్ మొనాకో, ద లాంగేస్ట్ వీక్ అనే హాలీవుడ్ సినిమాలు నిర్మించారు.   

  3.        K. S. R. Das : సూపర్‌స్టార్ కృష్ణతో తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ తీసిన దర్శకుడు కేఎస్ఆర్ దాస్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన కేఎస్ఆర్ దాస్ అసలు పేరు కొండా సుబ్బరామదాసు ఆయన తల్లిదండ్రులు శేషమ్మ, చెంచురామయ్య తండ్రి వెంకటగిరి జమీందారీలో జమైదార్. దాస్ ఉద్యోగ జీవితం సినిమా హాల్లో బుకింగ్ క్లర్కుగా మొదలైంది. సినిమాల మీద మోజుతో చెన్నైకి చేరుకున్న దాస్ ‘బండ రాముడు’ సినిమాకు ఎడిటింగ్ అప్రెంటీస్‌గా పని చేశారు. ఆ శాఖలో శిక్షణ పొంది ‘రమా సుందరి’ సినిమాకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేశారు. అనంతరం ‘నువ్వా-నేనా’ సినిమాకు ఎడిటర్‌గా పని చేశారు. 1966లో వచ్చిన ‘లోగుట్టు పెరుమాళ్లకెరుక’ దర్శకుడిగా ఆయన మొదటి సినిమా. సూపర్‌స్టార్ కృష్ణతో తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ రూపొందించింది ఆయనే.దాస్ దర్శకత్వం వహించిన 102 సినిమాల్లో హీరో కృష్ణవే దాదాపు 40 చిత్రాలు ఉండటం విశేషం. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలిసినిమా.. ‘టక్కరి దొంగ-చక్కని చుక్క’. ఆ తరువాత.. మోసగాళ్లకు మోసగాడు, ఏజెంట్ గోపీ వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించారు. ‘అల్లూరి సీతారామరాజు’ దర్శకుడు మధ్యలో చనిపోతే, దాన్ని కేఎస్ఆర్ దాసే పూర్తి చేశారు. హీరోయిన్లలో జయప్రదతో ఎక్కువ సినిమాలు తీశారు. ఎన్టీఆర్‌తో దాస్ తీసిన ‘యుగంధర్’ సంచలన విజయం సాధించింది.

  4.       Paramahansa Yogananda  : పరమహంస యోగానంద ప్రముఖ ఆధ్యాత్మిక యోగి ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పుస్తాకాల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది ఈరోజు ఆయన పుట్టిన రోజు.జనవరి 5, 1893లో  గోరఖ్‌పూర్‌ లో జన్మించారు, అసలు పేరు ముకుందలాల్‌ ఘోష్‌. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్‌కతాలో ఓ సాధువును కలిశారు. వారే యుక్తేశ్వరగిరి. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామియోగానందగా గుర్తింపుపొందారు. క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు. అనంతరం పశ్చిమబెంగాల్‌లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. తన జీవిత చరిత్రను ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో రాసారు ఈ బుక్ 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచిoది.

  5.    George Reeves   : హాలీవుడ్ లో సూపర్‌మ్యాన్‌ సినిమాలు ఏంతో ఫేమస్ ఆ పాత్రలో తొలిసారిగా కనిపించిన నటుడే జార్జి రీవ్స్‌ ఈరోజు ఆయన పుట్టిన రోజు. అమెరికాలో 1914లో పుట్టిన ఇతడు మొదట  బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి ఆ తర్వాత ‘గాన్‌ విత్‌ ద విండ్‌’, ఫాదర్ ఇజ్ ఏ ప్రిన్స్, విర్జీనియా సిటీ,ఆల్ వేస్ ఏ బ్రైడ్,ద గ్రేట్ లవర్, లాంటి సినిమాల్లో నటించాడు. అయితే 1952లో వచ్చిన సూపర్ మాన్ అండ్ ద మోల్ మెన్ అనే టీవీ సిరీస్ తో మంచి గుర్తింపు వచ్చింది.

  6.    Jane Wyman      :   జానే వైమన్‌ ప్రముఖ హాలీవుడ్ నటి, గాయని ఈరోజు ఆవిడ పుట్టిన రోజు. నర్తకిగా 70 ఏళ్ల పాటు సినీ రంగంలో అలరించింది. మిస్సోరీలో 1917లో పుట్టిన జానే పదహారేళ్లకే సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘పబ్లిక్‌ వెడ్డింగ్‌’, ‘బ్రదర్‌ ర్యాట్‌’, ‘బ్యాడ్‌మెన్‌ ఆఫ్‌ మిస్సోరీ’, ‘స్టేజ్‌ఫైట్‌’, ‘ఆల్‌ దట్‌ హెవెన్‌ ఎలౌస్‌’ లాంటి చిత్రాల్లో మెప్పించింది. ‘జానీ బెలిండా’ సినిమాతో ఆస్కార్‌ అందుకున్న ఆమె, ఉత్తమ నటిగా మూడుసార్లు గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డులు సాధించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ను  పెళ్ళి చేసుకుంది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,139FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!