8.8 C
New York
Tuesday, December 7, 2021

Top Celebrities And Politicians Born on Nov 07 | Kamal Haasan | Trivikram Srinivas | Shri Tv Wishes

నవంబర్7 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Trivikram Srinivas  :మాటల మాంత్రికుడు పంచ్ డైలాగ్స్ కు కేరాఫ్ అడ్రస్ అంతే కాదు రచయితలకి మరింత గౌరవం తీసుకొచ్చిన దర్శకుడు త్రివిక్రమ్‌. రచయితగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆయన అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ భీమవరంలో జన్మించారు అక్కడే డిగ్రీ వరకు చదువుకొన్నారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో పీజీ పూర్తి చేశారు, గోల్డ్‌మెడల్‌ పొందారు. ఆయన మొదట సినిమా‘స్వయంవరం’తో కథా మాటలు రచయితగా పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ తరువాత ‘సముద్రం’, ‘నువ్వేకావాలి’, ‘నిన్నే ప్రేమిస్తా’ చిత్రాలకి మాటలు అందించి ప్రతిభని పదర్శించారు. ‘నువ్వు నాకు నచ్చావ్‌‍‘, ‘మన్మధుడు’, ‘మల్లీశ్వరి’, ‘జై చిరంజీవ’ వంటి చిత్రాలకు కథ, మాటలు, స్కీన్‌ప్ల్రే రచయితగా పనిచేసాడు. దీనితో పాటు ‘నిన్నే ప్రేమిస్తా’, ‘వాసు’, ‘తీన్‌మార్‌’ సినిమాలకు మాటలు రాసారు. ‘నువ్వే నువ్వే’తో మెగాఫోన్‌ చేతపట్టిన త్రివిక్రమ్‌ తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా కూడా సత్తా చాటాడు. ‘అతడు’ నుంచి ఆయన ఇక వెనుదిరిగి చూడలేదు. అగ్ర కథానాయకులతో సినిమాలు తీస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటున్నారు. ‘జల్సా’, ‘ఖలేజా’, ‘జులాయి’, ‘అత్తారింటికి దారేది’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, అల వైకుంట పురములో చిత్రాల్ని తెరకెక్కించారు.

  2.       Kamal Haasan  : నాలుగు జాతీయ అవార్డులు… 19 ఫిలింఫేర్‌ అవార్డులు… పద్మభూషణ్‌ పురస్కారం… ఫ్రాన్స్‌ అత్యున్నత గుర్తింపు… వీటన్నింటికీ మించి అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన వైవిధ్యభరిత, విలక్షణ పాత్రలు… అన్నీ కలిపితే కమల్‌హాసన్‌. నటుడు, నృత్య కళాకారుడు, దర్శకుడు, స్కీన్ర్‌ప్లే రచయిత, నిర్మాత, గాయకుడు, గీత రచయిత, ఇలా ఏం చేసినా తనదైన  శైలితో రాణించి, మెప్పించిన సృజనశీలి అతడు. ఒకే సినిమాలో రెండు పాత్రలు, నాలుగు పాత్రలు, పది పాత్రలు… ఇలా వైవిధ్యంతో వెండితెరపై ‘దశావతారా’లతో ‘విశ్వరూపం’ చూపించిన కళాకారుడు. ఓ బుద్ధిమాంద్యుడు, ఓ మరుగుజ్జు, అవినీతిని సహించలేని ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, ఓ దేశభక్తుడు, ప్రేమ కోసం ఆడవేషం వేసిన యువకుడు… ఇలా ఏ పాత్రలో అతడు నటించినా ప్రేక్షకులు మైమరచిపోయి అందలం ఎక్కించారతడిని. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ‘మూండ్రాంపిరై’ (వసంత కోకిల), ‘నాయగన్‌’ (నాయకుడు), ‘ఇండియన్‌’ (భారతీయుడు) సినిమాలో నటనకు మూడుసార్లు పురస్కారాలు అందుకున్నారు. ఫిలింఫేర్‌ బహుమతులను ఏకంగా పద్దెనిమిది సార్లు గెలుచుకున్న ఏకైక నటుడు కమల్‌ హాసన్‌. కమల్‌ నటించిన ఆరు సినిమాలు ఆస్కార్‌ బహుమతి కోసం ప్రభుత్వ పక్షాన ఎంపికై, పోటీల్లో పాల్గొన్నాయి. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్‌ను పద్మశ్రీ పురస్కారంతోను, 2014లో పద్మభూషణ్‌ పురస్కారంతోను సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’ బిరుదు ప్రదానం చేసింది. చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం కమల్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది.

  3.       Anushka Shetty :   ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ…’ అంటూ హుషారుగా నటించిన అనుష్క సినీ రంగంలో తారా పథానికి ఎగిరింది! అందాన్ని, అభినయాన్ని సమతూకం వేస్తే అది అనుష్కేనని చెప్పవచ్చు. ‘అరుంధతి’లో గంభీరంగా నటించినా, ‘బాహుబలి’లో దేవసేనగా మురిపించినా, ‘విక్రమార్కుడు’లో జింతాత జితజిత అంటూ చలాకీగా మెప్పించినా, ‘రుద్రమదేవి’గా రాజసం చూపించినా, ‘ఓం నమో వెంకటేశాయ’లో కృష్ణమ్మగా ఒప్పించినా, ‘భాగమతి’లో అడ్డా నాదన్నా, ‘సైజ్‌జీరో’ కోసం బరువు పెరిగినా… అవన్నీ నటన పట్ల ఆమెకున్న కమిట్మెంట్ అది. సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అనుష్క ఆ తర్వాత ‘డాన్‌’, ‘రగడ’, ‘ఢమరుకం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘నమో వెంకటేశాయ’ తదితర చిత్రాల్లో నాగ్‌తో కలిసి నటించింది. నాగార్జున మేనల్లుడు సుమంత్‌ సరసన కూడా ‘మహానంది’ చిత్రంలో నటించింది. సినిమా సినిమాకు ప్రతిభావంతమైన నటన ప్రదర్శించడంతో అనుష్క బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారిపోయారు. ‘స్టాలిన్‌’ సినిమాలో చిరంజీవి సరసన ఒక పాటలో నర్తించిన స్వీటీ, డైరక్టర్‌ రాజమౌళి ‘విక్రమార్కుడు’ చిత్రం నుంచి ‘బాహుబలి-కంక్లూజన్‌’ వరకూ ‘సూపర్‌’ జర్నీ చేసారు. మంచు విష్ణుతో ‘అస్ర్తం’, గోపీచంద్‌తో ‘లక్ష్యం’, ‘శౌర్యం’, బాలకృష్ణతో ‘ఒక్కమగాడు’, జగపతిబాబుతో ‘స్వాగతం’, వెంకటేశ్‌తో ‘చింతకాయల రవి’, ‘నాగవల్లి’, అల్లు అర్జున్, మంచు మనోజ్‌తో ‘వేదం’, రవితేజతో ‘బలాదూర్‌’ మహేష్‌బాబుతో ‘ఖలేజా’, ప్రభాస్‌తో ‘బిల్లా’,’అరుంధతి’,‘మిర్చి’తోపాటు ‘బాహుబలి’ రెండు భాగాల్లోనూ నటించి అంతర్జాతీయ ఖ్యాతిని సాధించారు. తన కెరీర్లో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న అనుష్క జేజమ్మగా చిరకాలం గుర్తుండిపోతుంది.

  4.       Nandita Das : భారతీయ చిత్రసీమలో నందితా దాస్‌కు విలక్షణ నటి, వైవిధ్యమైన దర్శకురాలిగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన చిత్రాల్లో కమర్షియల్‌ హంగుల కన్నా సామాజిక, నైతిక విలువలే ప్రధానంగా దర్శనమిస్తుంటాయి. తెలుగు, తమిళ, మలయాళం, బెంగాలీ, ఉర్దూ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్‌ ఇలా అనేక భాషల్లో 40కి పైగా చిత్రాల్లో నటించిoది. 1947 ఎర్త్‌ చిత్రంతో ఉత్తమ నటి (డెబ్యూ)గా తొలి ఫిలింఫేర్‌ అవార్డును దక్కించుకుంది. కెరీర్‌ తొలినాళ్ల నుంచీ సీరియస్‌ పాత్రలకు చిరునామాగా నిలిచిన నందిత భవాండర్, ఎర్త్, ఫైర్, హజార్‌ చౌరసీ కి మా, దేవేరీ వంటి వైవిధ్యభరిత హిట్‌ చిత్రాలతో నటిగా గొప్ప పేరును సంపాదించుకుంది. భారతీయ చిత్రసీమలో ప్రఖ్యాతి గాంచిన దర్శకులు మృణాల్‌ సేన్, ఆదూర్‌ గోపాలకృష్ణన్, శ్యాంబెనగల్, దీప్‌ మెహతా, మణిరత్నం వంటి వారి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. 2006లో వచ్చిన ‘కమ్లీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరిచింది నందిత. ఈ సినిమాలో లంబాడీ యువతిగా ఆమె కనబర్చిన నటనకు.. విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కడంతో పాటు ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకుంది. ‘ఫిరాఖ్‌’ (2008) చిత్రంతో దర్శకురాలిగా మారిన నందితా దాస్‌ తన తొలి చిత్రంతోనే అంతర్జాతీయ స్థాయిలో మెరుపులు మెరిపించింది. ఈ సినిమా ప్రఖ్యాత టోరెంటో ఫిలిం ఫెస్టివల్‌తో పాటు 50 అంతార్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ప్రదర్శితమైంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 20 అవార్డులు దక్కించుకుంది. కేవలం నటిగా, దర్శకురాలిగానే కాక వివిధ దేశాల్లో చలన చిత్ర అభివృద్ధికీ ఎంతో కృషి చేసింది. కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ జ్యూరీ సభ్యురాలిగా రెండు సార్లు వ్యవహరించడంతో పాటు వాషింగ్టన్‌ డీసిలోని ఇంటర్నేషనల్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్లోకి (ఇంటర్నేషనల్‌ ఉమెన్స్‌ ఫోరమ్‌) ప్రవేశించిన తొలి భారతీయురాలిగా గుర్తింపు దక్కించుకుంది. 2011లో ఫ్రాన్స్‌ నుంచి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్ట్స్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ లేటర్స్‌ ఆర్డర్‌ ఆఫ్‌ నైట్‌’ను అందుకుంది.

  5.       Karthik : నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలేరా అని కుర్ర కారులో జోష్ ను పెంచే పాట అయినా, అరరే అరరే మనసే జారే అని ప్రేమలో తియ్యదనాన్ని తన గొంతులో పలికించినా, ఎదుటు నిలిచింది చూడు అంటూ భగ్న ప్రేమికుడిగా విరహ గీతం పాడినా అదంతా సింగర్ కార్తీక్ వాయిస్ మహిమే.
  బ్యాకింగ్ వోకలిస్ట్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి అతి తక్కువ కాలంలోనే ప్రముఖ గాయకుడిగా ఎదిగాడు. ఇప్పటికి దాదాపు 1,000 పైగా పాటలను తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో పాడారు. కార్తీక్ చిన్ననాటి నుంచే సంగీతం అంటే మక్కువ పెంచుకున్నాడు. స్కూల్ కి వెళ్ళే రోజుల్లో కర్ణాటక సంగీతం కొంత కాలం నేర్చుకున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు AR రెహమాన్ ఓకే క్రొత్త గాత్రం కోసం ఎదురు చూస్తున్నపుడు కార్తీక్ లో టాలెంట్ గుర్తించి అతనికి “ ప్రకార్” అనే హిందీ సినిమాలో అవకాశం కల్పించాడు. దాదాపు ఒక సంవత్సరం తరువాత అతనికి సోలోగా పాడే అవకాశం వచ్చింది. “ఓన్ 2 కా 4” సినమాలో పాడే అవకాశం వచ్చింది. ఇక ఇక్కడి నుంచి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తన కెరీర్లో కార్తీక్ అన్ని భాషల్లో కలిపి మొత్తం ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు.

  6.       N. G. Ranga  : ఆచార్య ఎన్.జి.రంగా గా ప్రసిద్ధుడైన గోగినేని రంగనాయకులు భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు. నవంబరు 7, 1900న గుంటూరు జిల్లా నిడుబ్రోలులో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది భారతదేశానికి తిరిగివచ్చిన తర్వాత మద్రాసు లోని పచ్చయప్ప కళాశాలలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని మహాత్మాగాంధీ ప్రారంభించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు , కొణిజేటి రోశయ్య కూడా రంగా శిష్యులే. 1930లో మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి, రంగా భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,050FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!