6.7 C
New York
Thursday, December 2, 2021

Top Celebrities And Politicians Born on Nov 14 | Jawaharlal Nehru | N Lingusamy | Shri Tv Wishes

Top Celebrities And Politicians Born on Nov 14 | Jawaharlal Nehru | N Lingusamy | Shri Tv Wishes

నవంబర్ 14  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.      Jawaharlal Nehru : స్వతంత్ర భారత్ దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రు 1889 నవంబరు 14న సాంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించారు.  నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అప్పట్లో పేరు మోసిన లాయరు. మామూలుగా మనదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి, సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. కానీ నెహ్రూ మాత్రమే మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు. నెహ్రూ గారి బాల్యమంతా ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకు విద్యను నేర్పడానికి అప్పట్లోనే ప్రత్యేకంగా మస్టార్లు ఇంటికి వచ్చి చేప్పేవారు. ఆ తర్వాత ఈయన తన ఉన్నతాభ్యాసం కొరకు ఇంగ్లాండు వెళ్ళి అక్కడి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తన చదువు కొనసాగించారు. ఆ తరువాత నెహ్రూ గారు అనిబిసెంట్ గారి మాటల వలన ప్రభావితులై స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. జలియన్ వాలాబాగ్ లో డయ్యర్ జరిపిన హెచ్చరికలేని కాల్పుల వలన వేలాది మంది అమాయక ప్రజలు మరణించటం, గాయపడటం జరిగింది. ఈ సంఘటన తరువాత నెహ్రూ గారు, మహాత్మాగాంధీకి సన్నిహితంగా మెలగసాగారు. 1921వ సంవత్సరంలో నెహ్రూ సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. ఆ తరువాత 1936వ సంవత్సరంలో నెహ్రూజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. స్వతంత్ర్య భారతదేశానికి తొలి ప్రధానిగా 1947వ సంవత్సరం నుంచి తాను మరణించేదాకా సుమారు 17 సంవత్సరాలు ప్రధానిగా వ్యవహరించారీయన. చైనాతో కలసి “పంచశీల” సూత్రాలను ప్రతిపాదించారీయన. ఈయన ప్రధానిగా ఉన్న కాలంలోనే స్టీలు పరిశ్రమలు, పెద్ద పెద్ద కర్మాగారాలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన “ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) లు, పరిశోధన సంస్థలు” ఏర్పాటుకు ఆయన తీవ్ర కృషి చేశారు. పండిట్ నెహ్రూ మంచి రచయిత కూడా. ఈయన ‘ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్’, ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’, ‘గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’, వంటి సుప్రసిద్ధ రచనలు చేశారు.

  2.       Yandamuri Veerendranath  : యండమూరి వీరేంద్రనాథ్ అంతర్ముఖం నుంచి వెన్నెల్లో ఆడపిల్ల దాకా విజయానికి ఐదు మెట్ల నుంచి తప్పు చేద్దాం రండి వరకు ఆయన రాసిన నవలలంటే పడి చచ్చే వారు తెలుగులో అంత పెద్ద నవలా స్టార్ రైటర్ గా హోదా అనుభవించారు. ఆ తర్వాత ఆయన రాసిన నవలలు సినిమాలుగా వచ్చాయి రచయితగా ఆయన పలు సినిమాలకు కూడా పనిచేసారు వాటిలో మంచు పల్లకి, ఆఖరి పోరాటం, కాష్మోర, అభిలాష, ఛాలెంజ్, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలా ఎన్నో హిట్ సినిమాలి ఉన్నాయి. 1982లో ఆయనకు రాష్ట్ర సాహిత్య అకాడమి ఆవార్డ్, 1996లో వెన్నెల్లో ఆడపిల్ల టీవీ సీరియల్ కు నంది అవార్డు, 2002లో విజయం వైపు పయనం అనే ప్రోగ్రామ్కు నంది అవార్డ్స్ వచ్చాయి.

  3.       Mamtha Mohandas  :జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన యమదొంగ లో కాసేపు యముడిగా కనిపించి నవ్వించి తన అందంతో కవ్వించిన మమతా మోహన్ దాస్ గుర్తుందా నేడు ఆవిడ పుట్టిన రోజు. 2005లో వచ్చిన మలయాళం సినిమా మయూఖం తో హీరోయిన్ గా పరిచయమైంది ఆ తర్వాత బస్ కండక్టర్, అద్భుతం,లంక, బాబా కళ్యాణి లాంటి సినిమాలతో మలయాళం లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన యమ దొంగ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత తెలుగులో కృష్ణార్జున, విక్టరీ, హోమం, కింగ్ సినిమాల్లో నటించింది. మమతా తన కెరీర్లో తెలుగు, తమిళ్,మలయాళం,కన్నడ భాషల్లో కలిపి 52 సినిమాల్లో హీరోయిన్ గా నటించిoది, అలాగే దాదాపు 25 పాటలు పాడింది. ఈవిడకు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, ఒక కేరళ స్టేట్ అవార్డు కూడా వచ్చాయి.

  4.       Bhamidipati Radhakrishna  : భమిడిపాటి రాధాకృష్ణ ప్రముఖ తెలుగు రచయిత ఈయన బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు ‘కీర్తిశేషులు’ లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూఅడుగుపెట్టాడు.నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కె.విశ్వనాథ్‌ తొలి చిత్రమైన ఆత్మగౌరవం కూడా ఉంది. బ్రహ్మచారి, కథానాయకుడు, కీర్తిశేషులు, మరపురాని కథ, విచిత్ర కుటుంబం, పల్లెటూరి బావ, ఎదురులేని మనిషి, గోవుల గోపన్న, సీతారామ కళ్యాణం, నారీనారీ నడుమ మురారి, కాలేజీ బుల్లోడు వంటివితో సహా తెలుగు చిత్రాలకు కథలు వ్రాశారు ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లకు ఆయన సన్నిహితుడు.తనకు ఎంతో ఇష్టమైన గణిత రంగంపై మక్కువ చూపారు. భమిడిపాటి రాధాకృష్ణ క్యాలెండర్‌ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది.

  5.       R.Vidyasagar Rao : ఆర్ విద్యాసాగర్ ‌రావు నీటిపారుద‌ల రంగ నిపుణుడు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుద‌ల స‌ల‌హాదారు. ఈయన 14 నవంబరు 1939లో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని జాజిరెడ్డిగూడెం జన్మించారు. ఆయ‌న తల్లి ల‌క్ష్మమ్మ‌, తండ్రి ఆర్ రాఘ‌వ‌రావు. వారిది విద్యావంతుల కుటుంబం‌. ఆయ‌న తండ్రి అప్పటికే టీచ‌రు అయినందువ‌ల్ల ఆ కుటుంబంలో అంద‌రూ చ‌దువుకున్నారు. విద్యాసాగ‌ర్‌రావు వాళ్ల ఊళ్లో మొట్టమొద‌టి ఇంజ‌నీరింగ్ ప‌ట్టభ‌ద్రుడు, ఆయన చాలా నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డిపారు. నీళ్లు నిజాలు ఆయన ఇంటిపేరుగా మారింది, వృత్తిరీత్యా ఇంజనీరు ఐన కొలువులో ఉన్నన్నాళ్లూ మంచి రచయితగా, నటుడిగా పేరొందారు.ఆయన 1960లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయమునుండి ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. 1979 లో రూర్కీ విశ్వవిద్యాలయం (ప్రస్తుతం ఐఐటి రూర్కీ) లో నీటి వనరుల అభివృద్ధి లో మాస్టర్స్ డిగ్రీని పొందారు.1983లో యు.ఎస్.ఎ లోని కొలోరాడో స్టేట్ విశ్వవిద్యాలయం నుండి నీటి వనరుల వ్యవస్థ ఇంజనీరింగులో డిప్లొమా పొందారు. 1990లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో పట్టాను కూడాపొందారు. బీటెక్ అయిన వెంట‌నే క్యాంప‌స్‌లోని మ‌హిళా కాలేజీ మెయింటెనెన్స్ ఇంజీనీరుగా ఉద్యోగంలో చేరారు. ఉద్యోగంలో చేరిన త‌ర్వాత కూడా రాయ‌టం, నాట‌కాలు వేయ‌డం వంటి హాబీల‌ను ఆయ‌న వ‌దులుకోలేదు. హైద‌రాబాద్‌లో ఉద్యోగం అనంత‌రం ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్‌, నీటిపారుద‌ల శాఖ‌లో ఇంజ‌నీరుగా ప‌నిచేశారు. ఢిల్లీలో ఉండ‌గానే నీళ్ల విషయంలో తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని తెలుసుకున్నారు. రిటైర్మెంట్ త‌రువాత తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చారు. అంత‌కు ముందు దాదాపు 34 సంవత్సరాల పాటు కేంద్ర జలసంఘంలోనే విధులు నిర్వహించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా జల వనరుల అంశంపై అపారమైన అనుభవం గ‌డించారు.తెలంగాణ ఉద్యమకారుడు, ఆయన జల సమస్యలపై ప్రజలతో తెలుగులో మాట్లాడేవారు. వార్త, ఆంధ్రజ్యోతి, ఈనాడు,, నమస్తే తెలంగాణ పత్రికలలో జల సంబంధిత సమస్యలపై సుమారు 100 వ్యాసాలు రాసారు. అంతే కాకుండా “నీరు-నిజాలు” అనే పేరుతో రెండు సంపుటాలను వెలువరించారు. నీటి వనరుల నిపుణునిగా ఆయన విద్యార్థులు, మేథావులు, సాధారన ప్రజలతో నీటి సమస్యలపై అవగాహన కల్పించుటకు సెమినార్లను నిర్వహించేవాడు. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ (భారతదేశం) ఆయనను “లీడింగ్ ఇంజనీరింగ్ పెర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా”గా పురస్కారాన్నందించింది.

  6.       N.Lingusamy  : కార్తి హీరోగా వచ్చిన అవారా సినిమా గుర్తుందా తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆ సినిమా మంచి హిట్ అయ్యింది ఆ సినిమా దర్శకుడే లింగు స్వామి నేడు ఆయన పుట్టినరోజు. 2001లో హీరో మమ్ముట్టి తో ఆనందం అనే సినిమాతో దర్శకుడిగా పరిచమయ్యారు. ఆ తర్వాత 2002లో మాధవన్ తో తీసిన రన్ అనే సినిమా దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది ఇక అక్కడి నుంచి ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన తమిళ్ లో హీరో విశాల్ తో తీసిన పందెం కోడి సినిమా తెలుగులోకూడపెద్దహిట్అయ్యింది.

 ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!