8.6 C
New York
Friday, December 3, 2021

Top Celebrities And Politicians Born on Nov 20 | Shalini | Babita Kumari Phogat | Shri Tv Wishes

Top Celebrities And Politicians Born on Nov 20 | Shalini | Babita Kumari Phogat | Shri Tv Wishes

నవంబర్20  మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 

హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Tusshar Kapoor  : తుషార్‌ కపూర్‌.. హుషారైన పాత్రలకు పెట్టింది పేరు. తెలుగు రీమేక్‌లతో బాలీవుడ్‌ బాక్సీఫీస్‌ వద్ద జోరు చూపించాడు. కొంటెదనం నిండిన పాత్రలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అడల్ట్‌ కామెడీ చిత్రాలతో యువతరాన్ని ఆకర్షించాడు. వైవిధ్యమైన పాత్రలతో సినీ ప్రయాణాన్ని సాగిస్తూ మీడియం రేంజు హీరోగా బాలీవుడ్‌లో కొనసాగుతున్నాడు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జితేంద్ర నట వారసత్వంతో వెండితెరపై మెరిశాడు తుషార్‌ కపూర్‌. యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తుషార్‌.. నటుడిగా మారడానికి ముందు కొన్నాళ్ల పాటు డేవిడ్‌ ధావన్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశాడు. తొలిచిత్రం ‘ముఝే కుచ్‌ కెహనా’ (2001)తోనే బాక్సాఫీస వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇది పవన్‌కల్యాణ్‌ నటించిన హిట్‌ మూవీ ‘తొలిప్రేమ’కు హిందీ రీమేక్‌. ఇందులో కరణ్‌గా తుషార్‌ కనబర్చిన నటనకు.. ఉత్తమ నటుడిగా (డెబ్యూ) తొలి ఫిలింఫేర్‌ పురస్కారం లభించింది. ఈ చిత్ర విజయమిచ్చిన స్ఫూర్తితో.. ఆ తరువాత కూడా వరుసగా తెలుగు రీమేక్‌లతోనే ప్రేక్షకుల్ని అలరించాడు. ఈ క్రమంలో ‘క్యా దిల్‌ నే కహ’ (స్వయంవరం), ‘జీనా సిర్ఫ్‌ మేరే లియే’ (మనసంతా నువ్వే), ‘యే దిల్‌’ (నువ్వు – నేను) వంటి చిత్రాలతో బాలీవుడ్‌ సినీప్రియులకు దగ్గరయ్యాడు. తుషార్‌ కపూర్‌కు అడల్డ్‌ కామెడీ, రొమాంటిక్‌ చిత్రాల కథానాయకుడిగా యువతరంలో మంచి క్రేజ్‌ ఉంది. ఈ జోనర్లలో అతను చేసిన ‘గోల్‌మాల్‌’, ‘గోల్‌మాల్‌ ఎగైన్‌’, ‘మస్తీ జాదే’, ‘డర్టీ పిక్చర్స్‌’, ‘గోల్‌మాల్‌ 3’ వంటి చిత్రాలన్నీ బాక్సీఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ‘మస్తీ జాదే’ చిత్రంతో బాలీవుడ్‌లో అడల్ట్‌ కామెడీ చిత్రాలకు మంచి ఊపు తెచ్చాడు. కేవలం నటుడిగానే కాక వ్యక్తిగత జీవితంతోనూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు తుషార్‌ కపూర్‌. ఐవీఎఫ్, సరోగసి విధానంతో పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు తండ్రిగా మారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇలా పెళ్లి కాకుండానే తండ్రైన తొలి భారతీయ నటుడు తుషారే. తన కొడుకుకు లక్ష్య అని పేరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం నటుడిగా రాణిస్తూనే తన సోదరి ఏక్తా కపూర్‌తో కలిసి బాలాజీ టెలీ ఫిలింస్, బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

  2.       Shalini : షాలినీ ప్రముఖ తమిళ్ హీరో అజిత్ కుమార్ భార్య మనిరతనం తీసిన సఖి సినిమా హీరోయిన్. షాలినీ నవంబర్ 20, 1979లో జన్మించారు.  బాల నటిగా చాలా సినిమాల్లో నటించారు తనకు 3 ఏళ్ళ వయసులోనే మలయాళం సినిమా  ఎంటె మమట్టిక్కుట్టియమ్మక్కుతో తెరంగేట్రం చేశారు షాలినీ. తెలుగు  సినిమా జగదేకవీరుడు అతిలోకసుందరి (1990) లో తన చెల్లెలు శామిలితో కలసి చిరంజీవి చేరదీసే అనాధ అమ్మాయి పాత్రలో నటించారు  షాలినీ. షాలినీ ప్రధాన పాత్రలో ఆమె నటించిన మొట్టమొదటి సినిమా అనియతి ప్రవు అతి పెద్దహిట్ గా నిలిచింది. ఆ తరువాత ఆమె మలయాళం, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన కాదలుక్కు మరియధై (1997), నీరం (1999), అమర్ కలం (1999), అలైపాయుదే (2000), పిరియదా వరం వెండుం (2001) వంటి సినిమాలు ఆమె కెరీర్ లో  భారీ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత హీరో అజిత్ ను పెళ్ళి చేసుకున్నారు.

  3.       Babita Kumari Phogat : అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన దంగల్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో ఉన్న బబితనే ఈ రియల్ బబిత. తండ్రి మహావీర్ సింగ్ పోఘాట్ కూడా రెజ్లర్ కావడంతో ఆయనే చిన్నప్పటి నుంచి బబితకు రెజ్లింగ్ లో ట్రైనింగ్ ఇచ్చారు. బబిత తండ్రి నమ్మకాన్ని నిజం చేస్తూ 2010 కామన్ వెల్త్ క్రీడల్లో రజత పతకం గెలుచుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2012 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని  కాంస్య పతకం గెలుచుకుంది. 2014లో జరిగిన  కామన్ వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించారు బబిత. ఆ తర్వాత 2018 లో కామన్ వెల్త్ గేమ్స్ లో సిల్వర్ పతకం సాధించారు. 2019లో భారతీయ జనత పార్టీలోకి ప్రవేశించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

  4.    Vamsy : వంశీ తెలుగు సినిమా దర్శకుడు, రచయిత అసలు పేరు నల్లమిల్లి భామిరెడ్డి ఈయన సినిమాల కథలు సహజంగా ఉంటూ పల్లె అందాలను ఆవిష్కరిస్తుంటాయి. వంశీ తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం దగ్గరలో ఉన్న పసలపూడి అనే గ్రామంలో 1956, నవంబరు 20 న పుట్టి అక్కడే పెరిగాడు.తెలుగు సినీ చరిత్రలో ఆణిముత్యమైన శంకరాభరణం సినిమాకు వంశీ సహాయ దర్శకుడిగా వ్యవహరించాడు. దర్శకుడిగా ఆయన మొదటి సినిమా 1982లో చిరంజీవి, సుహాసిని, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా నటించిన మంచు పల్లకి. ఈ సినిమాకు యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. యండమూరి, చిరంజీవి కలయికలోవచ్చినతొలిచిత్రంఇదేకావడంవిశేషం. ఆ తర్వాత వంశీ ఆలాపన, అన్వేషణ, సితార, లేడీస్ టైలర్, ప్రేమించు పెళ్ళాడు, డిటెక్టివ్ నారద, మహర్షి, చెట్టు కింద ప్లీడర్, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, దొంగ రాముడు అండ్ పార్టి, కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను, గోపి గోపిక గోదావరి, ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్ లాంటి సినిమాలు చేసారు.   ఆయన రూపొందించిన చాలా వరకు సినిమాలకు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించాడు. రచయితగా కూడా వంశీ చాలా బుక్స్ రాసారు వాటిలో మా పసలపూడి కథలు, మా దిగువ గోదావరి కథలు, ఆకుపచ్చని జ్ఞాపకం, గోకులంలో రాధ
  మంచు పల్లకి లాంటి ఎన్నో బుక్స్ ఉన్నాయి.

  5.       Chukka Ramaiah  : చుక్కా రామయ్య తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు. జనగామ జిల్లా, గూడూరు గ్రామంలో జన్మించిన ఇతను ఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాదుకు వచ్చాడు. ఐఐటీ శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాదులోని నల్లకుంటలో ఈ శిక్షణా కేంద్రం ఉంది.ఈయన జనగాంలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేసాడు. 1983 లో నాగార్జున సాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేసాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు. ఆ తర్వాత అతని కుమార్తె ఐఐటికి ఎంపికైంది. అడ్మిషన్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఎంపికైన వారిలో తెలుగువారు చాలా తక్కువగా ఉంటున్నారని గ్రహించిన రామయ్య తనే తెలుగు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాదు, నల్లకుంటలో స్థిరపడి, ఐ.ఐ.టి జె.ఇ.ఇ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణితం బోధించడం మొదలుపెట్టాడు. ఆయన కోచింగ్ ఇచ్చిన విద్యార్థులు ప్రవేశపరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో చాలా ప్రఖ్యాతి పొందాడు. ఆరకంగా చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్థులు ఐ.ఐ.టిలలో ప్రవేశించారు. రామయ్య ఇన్స్టిట్యూట్ లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శికణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపింబడ్డాయి. ఐఐటి ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య, ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందాడు.

  6.       V. N. Reddy  : వి.ఎన్.రెడ్డి గా ప్రసిద్ధి చెందిన కసిరెడ్డి వెంకటనరసింహారెడ్డి ప్రముఖ హిందీ చలనచిత్ర ఛాయగ్రాహకుడు. వి.ఎన్.రెడ్డి 1907లో వైఎస్ఆర్ జిల్లా సిద్ధవటంలో జన్మించాడు. 20 ఏళ్ల వయసులోనే 1937లో ఛాయగ్రహణంలో తన ఆసక్తిని అభివృద్ధి చేసుకొని ఆ రంగంలో స్థిరపడటానికి బొంబాయి చేరాడు. మూడు సంవత్సరాల పాటు ఎస్.హర్‌దీప్ వద్ద సహాయకునిగా మడ్, చరణోంకీ దాసి, వసంతసేన సినిమాలలో పనిచేశాడు. ఐదేళ్లు కృషిచేసిన తర్వాత 1952లో ఛాయగ్రాహకునిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆయన  ఆగ్, బైజూ భవరా, కాలిఘటా, జాన్వర్, చోరీ చోరీ, హల్‌చల్, ఉప్‌కార్ వంటి సినిమాలకు ఛాయగ్రహణం అందించాడు. ఈయన కొన్ని తెలుగు సినిమాలకు కూడా ఛాయాగ్రాహకుడిగా పనిచేశాడు.
  ఆ తర్వాత దర్శకుడిగా మారి గంగా గౌరీ సంవాదం, సెంగొత్తయ్ సింగంమ్, ఇంటికి దీపం ఇల్లాలు, ఆనంద జ్యోతి , జహ్రీలీ లాంటి  సినిమాలు తీశాడు.

 ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!