2.7 C
New York
Saturday, December 4, 2021

Top Celebrities And Politicians Born on Oct 29 | Kriti Kharbanda | Reema Sen | Shri Tv Wishes

అక్టోబర్ 29 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 
 హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.       Nagendra Babu : ETVలో వచ్చే జబర్దస్ట్ ప్రోగ్రాంలో ఆయన నవ్వులు బాగా ఫేమస్…
  ‘నాకూ… అభిమానులకీ మధ్య వారధి నాగబాబు’ అంటుంటారు చిరంజీవి ఈ మాటలన్నీ  మెగా బ్రదర్ నాగబాబు గురించే… అన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట సహాయ నటుడిగా, ఆ తర్వాత ప్రధాన పాత్రధారిగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు. వందలాది చిత్రాల్లో నటించారు. తన  తల్లి పేరుపై అంజనా ప్రొడక్షన్స్‌ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించి ‘రుద్రవీణ’, ‘త్రినేత్రుడు’, ‘ముగ్గురు మొనగాళ్లు’, ‘బావగారూ బాగున్నారా?’, ‘గుడుంబా శంకర్‌’, ‘రాధాగోపాలం’, ‘స్టాలిన్‌’, ‘ఆరెంజ్‌’ తదితర చిత్రాలు నిర్మించారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఆరెంజ్‌’తో నష్టాలు రావడంతో కొన్నాళ్లపాటు నిర్మాణ రంగానికి   దూరమయ్యారు. తరువాత  ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’తో కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. బుల్లితెరతోనూ నాగబాబుకి మంచి అనుబంధం ఉంది శిఖరం, అపరంజి, సీతామాలక్ష్మి తదితర ధారావాహికల్లో నటించి ఇంటింటికీ చేరువయ్యారు నాగబాబు. వీర, జబర్దస్త్‌ వంటి షోలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. జబర్దస్త్‌ తో నాగబాబుకి మంచి గుర్తింపు వచ్చింది. కొడుకు వరుణ్ తేజ్ తెలుగులో సక్సెస్ ఫుల్ హీరో, కూతురు నీహారిక కూడా మంచి నటి.

  2.       Richard Stephen Dreyfuss: రిచర్డ్‌ స్టిఫెన్‌ డ్రిఫస్‌ అంటే గుర్తు పట్టక పోవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించిన ‘జాస్‌’, ‘క్లోజ్‌ ఎన్‌కౌంటర్స్‌ ఆఫ్‌ ద థర్డ్‌ కైండ్‌’, ‘అమెరికన్‌ గ్రాఫిటి’ లాంటి చిత్రాలను తల్చుకుంటే వెంటనే కళ్ల ముందు కదులుతాడు. ‘ద గుడ్‌బై గర్ల్‌ (1977) సినిమాతో ఉత్తమ నటుడిగా ఆస్కార్‌ అందుకున్న ఇతడు గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, స్కీన్ర్‌ యాక్టర్స్‌గిల్డ్‌ లాంటి అవార్డులు కూడా ఎన్నో పొందాడు. ‘స్టాండ్‌ బైమి’, ‘డౌన్‌ అండ్‌ ఔట్‌ ఇన్‌ బెవర్లీ హిల్స్‌’, ‘ఆల్వేజ్‌’, ‘వాట్‌ ఎబౌట్‌ బాబ్‌’, ‘మిస్టర్‌ హోలాండ్స్‌ ఓపస్‌’లాంటి  చిత్రాలతో ఇతడు మంచి నటుడిగా దేశదేశాల్లో గుర్తింపు పొందాడు.

  3.       Reema Sen : తెలుగులో చిత్రం, మనసంతా నువ్వే సినిమాలతో ఎంతో మంది యువకుల మనసును దోచుకున్న నటే  రీమా సేన్. ఈవిడ 1981 అక్టోబరు 29న కోల్‌కతాలో జన్మించింది మోడలింగ్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది.  తరువాత  సినిమా చిత్రంలో ఉదయ్ కిరణ్ తో కలసి తన మొదటి సినిమాలో నటించింది.  తరువాత ఆ జంట మనసంతా నువ్వే సినిమాలో నటించారు. తమిళ్ లో గౌతం మీనన్ మొదటి సినిమా మిన్నలే లో మాధవన్ తో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకుంది. రీమా సేన్ హిందీలో గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సినిమాలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రీమా సేన్ తన మొత్తం సినిమాల్లో తెలుగు, తమిళ్,కన్నడ,హిందీ,కన్నడలో కలిపి మొత్తం 35 సినిమాలు చేసింది.

  4.       Winona Ryder  : అందాల నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ ఓ చిన్న పొరపాటు పని వల్ల అంతే చెడ్డపేరు కూడా తెచ్చుకుంది. తరచు మీడియాలో సంచలన కథనాలకు కేంద్రబిందువైన ఆమే వినోనా రైడర్‌. ఆస్కార్, గోల్డెన్‌గ్లోబ్, బాఫ్తా, స్క్రీన్‌ యాక్టర్స్‌ గిల్డ్‌లాంటి అవార్డులకు నామినేషన్లు పొందడం కూడా గొప్పే. అలాంటిది ఆమె ఎన్నో నామినేషన్లు పొంది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమా ‘లూకాస్‌’ నుంచి ‘బీటిల్‌ జ్యూస్‌’, ‘హీదర్స్‌’, ‘మెర్‌మైడ్స్‌’, ‘ఎడ్వర్డ్‌ సిజర్‌హ్యాండ్స్‌’, ‘బ్రామ్‌ స్టోకర్స్‌ డ్రాక్యులా’, ‘ద ఏజ్‌ ఆఫ్‌ ఇన్నోసెన్స్‌’, ‘లిటిల్‌ ఉమెన్‌’, ‘రియల్లీ బైట్స్‌’, ‘హౌ టు మేక్‌ యాన్‌ అమెరికన్‌ క్విట్‌’, ‘ఎలియన్‌ రిసరక్షన్‌’, ‘గర్ల్‌ ఇంటరప్టెడ్‌’, ‘మిస్టర్‌ డీడ్స్‌’, ‘స్టార్‌ ట్రెక్‌’, ‘వెన్‌ లవ్‌ ఈజ్‌ నాట్‌ ఇనఫ్‌’, ‘బ్లాక్‌ స్వాన్‌’ లాంటి సినిమాల్లో మరిచిపోలేని నటిగా మెప్పించింది. ప్రముఖ నటుడు జానీ డెప్‌తో సాన్నిహిత్యం ఆమెను తరచు వార్తా కథనాల్లోకి ఎక్కేలా చేసింది. ఇంత ప్రాచుర్యం ఉన్నా, ఓసారి అనూహ్యంగా ఆమె ఓ దుకాణంలో దొంగతనం చేస్తూ దొరికిపోయింది. ఆ పని ఆమెకెంతో అపకీర్తిని తెచ్చిపెట్టింది. దీనికి తోడు వ్యక్తిగత సమస్యలు, కుంగుబాటుకు గురవడం లాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఏమైనా ఓ మంచి నటిగా హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫ్రేమ్‌లో స్థానం పొందింది.

  5.       Hariprriya : హరిప్రియ తెలుగు, కన్నడ సినిమాల్లో సినిమాలు చేసింది. కర్ణాటకలోని చిక్కబళ్ళపురలో అక్టోబర్ 29, 1991లో జన్మించింది. అసలు పేరు శృతి  భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. ఆ తరువాత మోడల్ గా తన కెరీర్ మొదలు పెట్టి  పలు యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత 2008లో మనసుగుల మత్తు మదుర అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తెలుగులో తకిట తకిట, పిల్ల జమీందార్, జై సింహ లాంటి సినిమాల్లో నటించింది, కన్నడలో యష్ తో చేసిన ఉగ్రం సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది దాంతో వరసగా కన్నడ సినిమాలు చేసి  కన్నడలో స్టార్ హీరోయిన్ అయ్యింది.

  6.       Kriti Kharbanda  : పవన్ కళ్యాణ్ తో తీన్ మార్ సినిమాలో చేసిన కృతి గుర్తుందా? అదేనండి మన సుమంత్ తో బోని అనే సినీమా చేసి తెలుగులో బోణి కొట్టిన చిన్నది ఆమె కృతి ఖర్బండా. మోడల్ గా తన కెరీర్ మొదలు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్,కానంద,హిందీ లో కలిపి తన కెరీర్లో మొత్తం 26 సినిమాల్లో నటించింది. తెలుగులో రామ్ చరణ్ హీరోగా వచ్చిన బ్రూస్ లీ లో చరణ్ అక్కగా కూడా నటించంది.

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!