10.4 C
New York
Saturday, October 23, 2021

Top Celebrities And Politicians Born On Sep 23 || Ambati Rayudu || Shalini Pandey || Shri Tv wishes

సెప్టెంబర్ 23 మీ పుట్టిన రోజా?: రోజు ప్రముఖులు కూడా జన్మించారు
 
హాయ్ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.   భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం లోకంలోకి వచ్చిన రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…   రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

  1.  Ambati Rayudu : 

ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు జన్మదినం రోజు.  రాయుడుకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే ఇష్టం ఉండేది అది గుర్తించిన ఆయన తండ్రి రాయుడుకు మాజీ క్రికెటర్ విజయ్ పాల్ క్రికెట్ అకాడమీ లో చేర్పించి శిక్షణ ఇప్పించారు. తండ్రి సాంబ శివ రావు కొడుకును స్కూటర్ మీద కూర్చో బెట్టుకుని  అనేక మ్యాచ్ లకు టోర్నమెంట్ లకు తీసుకెళ్ళే వారు. 16 ఏళ్ళకే రాయుడు ఫస్ట్ క్లాసు క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. 2002 లో హైదరాబాద్ టీం కు ఆడాడు 2002-03 రంజీ ట్రోఫీలో 693 పరుగులు సాధించి టోర్నిలో అత్యదిక పరుగులు సాధించిన మూడో వ్యక్తిగా నిలిచాడు. ట్రోఫీలో ఒక మ్యాచ్ లో డబల్ సెంచరీ చేసి ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రేఅతే చేసాడు.  ఇండియా టీం లో సీనియర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో 2014లో జింబాంబే తో జరిగిన మ్యాచ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో తన తోలి సెంచరీ చేసాడు. 2015 వరల్డ్ కప్ కు ఎంపికయిన రాయుడు తుది జట్టులో ఆడలేకపోయాడు. కేవలం కొన్ని సిరీస్ లలో మాత్రమే రాణిస్తూ వచ్చిన రాయుడు ఫాం కొనసాగించలేక తన కెరీర్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఇంటర్నేషనల్ కెరీర్లో మొత్తం 55 వన్ డే లు ఆడిన రాయుడు 47 సగటుతో 1694 పరుగులు చేసాడు, 6 టి20లు ఆడి 42 పరుగులు చేసాడు. ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. గాయాలతో, సరైన ప్రదర్శనలేక రాయుడు టీం ఇండియా లో ఎక్కువ రోజులు ఆడలేకపోయాడు ఆశిచినప్పుడు టీం లో చోటు కూడా దొరకకపోవడంతో చివరకు జూలై 2, 2019లో తన రిటైర్ మెంట్ ప్రకటించాడు కానీ మళ్ళీ ఆగష్టు 29 టీం ఇండియాలో అవకాశం ఇస్తే మళ్ళీ ఆడేందుకు సిద్ధంగా వున్నానని ప్రకటించాడు.

2.        Sthanam Narasimha Rao :

 స్థానం నరసింహారావు ప్రసిద్ధ రంగస్థల, తెలుగు సినిమా నటుడు నేడు ఆయన పుట్టిన రోజు. హనుమంతరావు, ఆదెమ్మ దంపతులకు గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు.  సత్యభామ, చిత్రాంగి మొదలైన అనేక స్త్రీ పాత్రలను సుమారు 40 సంవత్సరాలకు పైగా ధరించి ప్రేక్షకాభిమానంతో సహా పద్మశ్రీ పురస్కారం పొందాడు.1920 సంవత్సరంలో ఒకనాడు బాపట్లలో ప్రదర్శించే హరిశ్చంద్రలో చంద్రమతి పాత్రధారి రానందున తనే పాత్రను ధరించి తన నట జీవితాన్ని ప్రారంభించాడు. తెనాలిలోని శ్రీరామ విలాససభ ద్వారా గొప్ప పాత్రలు ధరించి దేశమంతటా పర్యటించి ప్రదర్శనలిచ్చాడు.

ఆంధ్రదేశంలో దాదాపు 3,000 సార్లు రంగస్థలం మీద పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో స్త్రీ పాత్రలను చేసి ప్రజాభిమానాన్ని చూరగొన్నాడు. శృంగార రసాన్ని ప్రతిబింబించే రీతిలో సత్యభామ పాత్ర, ప్రణయానికి చిత్రాంగిగా, వీరరసాన్ని చిత్రించడంలో రోషనార నాటకంలో రోషనారగా, వలపుల చింతామణిగా, ప్రణయదేవతగా, భక్తురాలిగా, దేవదేవిగా, మధురాతి మధురమైన మధురవాణిగా నవరసాలు కలిగిన పాత్రలను అవలీలగా పోషించాడు, వేషధారణ, వస్త్రాలంకరణలో ప్రత్యేకత చూపిస్తూ రకరకాల చీరకట్టు సొగసులతో స్టేజి మీదకు ప్రవేశించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశేవాడు.  రాధాకృష్ణ (1939), సత్యభామ (1942) వంటి కొన్ని సినిమాలలో నటించాడు. తన నటనానుభవాలను చేర్చినటస్థానంఅనే గ్రంథాన్ని కూడా రాసాడు. 1956లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. వీరి నటనకు ముగ్ధులైన రంగూన్ ప్రజలు 1938లో బంగారు కిరీటాన్ని బహూకరించారు.
వీరి షష్టిపూర్తి మహోత్సవాన్ని 1962 సంవత్సరంలో ఘనంగా హైదరాబాదులో నిర్వహించారు.

3.       Shalini Pandey : 

శాలిని పాండే ప్రముఖ తెలుగు సినిమా నటి నేడు ఆవిడ పుట్టిన రోజు. శాలిని మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది ఈమె ఫాదర్ ఒక గవర్నమేంట్ ఉద్యోగి. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి సినిమాల్లోకి వేల్లాలనుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడంతో అయిష్టంగానే ఇంజనీరింగ్ చదివింది. తర్వాత యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది ఆమెలో ఎంతో ప్రతిభ ఇంట్లో వాళ్ళ నుంచే ప్రోత్సాహం దొరకలేదు దాంట్లో ఇంట్లోంచి పారిపోయి వచ్చి సొంత తల్లితండ్రుల మీదనే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. తర్వాత ఎన్నో కష్టాలు పడింది చివరకు అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావడంతో ఆమె దశ తిరిగింది. సినిమా తెలుగులో సంచలన విజయం సాధించడంతో తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి హీరో కళ్యాణ్ రామ్ తో 118 అనే సినిమాలో నటించింది. తెలుగులో మహానటి, ఇద్దరి లోకం ఒకటే, నిశబ్దం తమిళ్ లో 100% కాదల్, గొరిల్లా అనే సినిమాల్లో నటించింది. షాలినికి ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ సినిమా జయేష్ భాయ్ జోర్దార్ అనే సినిమాలో అవకాశం వచ్చింది.

4.    Kumar Sanu :  

కుమార్ సాను ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఈరోజు ఆయన జన్మదినం. ఈయన అసలు పేరు కేదార్ నాథ్ భట్టాచార్జీ‘ 1957 సెప్టెంబరు 23 కలకత్తాలో జన్మించారు. ఈయన తండ్రి పసుపతి భట్టాచార్య గాత్ర సంగీత విద్వాంసుడు, సంగీతకర్త. ఈయన చిన్నప్పటి నుండే సంగీతంలో, తబలాలో శిక్షణ ఇచ్చాడు. కుమార్ 1979లోనే రెస్టారెంట్ లలో, మ్యూజిక్ షో లలో  అనేక ప్రదర్శనలు ఇచ్చేవాడు. 1986 లో తన సింగింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన కుమార్ కు 1990లో వచ్చిన ఆశికి అనే చిత్రం బ్రేక్ ఇచ్చింది చిత్రంలోని పాటలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. తన కెరీర్ తోలి రోజుల్లో కుమార్ ప్రముఖ బాలీవుడ్ సింగర్ కిషోర్ కుమార్ ను అనుకరించే ప్రయత్నం చేసినా తర్వాత తన సొంత శైలిని ఏర్పరుచుకున్నాడు. 1991 లో వచ్చిన సాజన్, 1992 లో వచ్చిన దీవానా, 1993లో వచ్చిన బాజిగర్, 1994లో వచ్చిన 1942 లవ్ స్టొరీ అనే సినిమాలలో పాడిన పాటలతో దేశమంతా కుమార్ సాను పేరు మారుమోగిపోయింది. సినిమాలకు గాను కుమార్ ఏకంగా ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నాడు. బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం నదీంశ్రావణ్ సినిమాలలో కుమార్ సాను ఎక్కువ పాటలు పాడాడు పాటలన్నీ కుమార్ కు ఎంతో గుర్తింపు తీసుకొచ్చాయి. తన కెరీర్లో కొన్ని వేల పాటలు పాడారు. 2009లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించింది.

5.    Bhaskar :  

బొమ్మరిల్లు భాస్కర్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈరోజు ఆయన పుట్టిన రోజు. భాస్కర్ తమిళనాడులోని వెల్లూరులో జన్మించారు. సినిమాల మీద ఇష్టంతో తమిళనాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయి కోచింగ్ తీసుకున్నారు. తెలుగులో ముందు భద్ర, ఆర్య సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసారు. 2006లో సిద్ధార్థ్, జెనిలియా హీరో హీరోయిన్ లుగా వచ్చిన బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. తర్వత అల్లు అర్జున్ తో పరుగు అనే సినిమా తీసారు. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరంజ్ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వత హీరో రామ్ తో చేసిన ఒంగోలు గిత్త సినిమా ఫ్లాప్ అయ్యింది. తన కెరీర్ లో మొదటి సినిమా బొమ్మరిల్లుకు భాస్కర్ ఉత్తమ నూతన దర్శకుడిగా, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా రెండు నంది అవార్డులు అందుకున్నారు ప్రస్తుతం అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అనే సినిమా చేస్తున్నారు.

6.    Emani Sankara Sastry : 

ఈమని శంకరశాస్త్రి ప్రముఖ వీణ విద్వాంసుడు. ఈయన ద్రాక్షారామంలో జన్మించాడు. ఆయన తాతగారైన సుబ్బరాయశాస్త్రిగారూ, తండ్రి అచ్యుతరామశాస్త్రిగారూ కూడా గొప్ప వీణ విద్వాంసులు. అచ్యుతరామశాస్త్రిగారు పాత పద్ధతిలో వీణను సితార్ లాగా నిలువుగా పట్టుకుని వాయించేవాడు. శంకరశాస్త్రి తండ్రి వద్దనే వీణ నేర్చుకున్నాడు. తన మూడో ఏటనే సంగీతంలో ప్రతిభ కనబరిచిన శంకరశాస్త్రి కాకినాడ పిఠాపురం రాజా కాలేజీలో డిగ్రీ పూర్తీ చేసారు. 1940లో తిరుచ్చి రేడియో కేంద్రంలో మొదటగా వీణ కచేరీ చేశాక ఆయనకు పేరు లభించసాగింది.
విమానం ఎక్కడమంటే ఆయనకు శంకర శాస్త్రి గారికి చాలా భయము. అందువల్ల ఆయన ఎన్నిసార్లు విదేశాల నుంచి ఆహ్వానం వచ్చినా తిరస్కరించారు. చివరికి 1970 దశకంలో ఫ్రాన్స్ వెళ్లి కచేరీలు చేశారు. దానినికాన్సర్ట్ ఆఫ్ ది సెంచురీఅని పత్రికలు ప్రశంసించాయి.
ఆకాశవాణి డైరక్టరేట్ లో సంగీత విభాగంలో చీఫ్ ప్రొడ్యూశర్ గా పని చేసారు.     

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు

Related Articles

Stay Connected

0FansLike
2,992FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!