-1.1 C
New York
Monday, January 24, 2022

Top Celebrities Birthdays on Jan 14 || Shobhan Babu || Rao Gopala Rao || Shri Tv Wishes

Top Celebrities Birthdays on Jan 14 || Shobhan Babu || Rao Gopala Rao || Shri Tv Wishes

జనవరి 14 మీ పుట్టిన రోజా?: ఈ రోజు ఈ ప్రముఖులు కూడా జన్మించారు
 
 హాయ్…ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మీకు ముందుగా మా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు మీకు ఎంతో ఆనందకరమైన రోజు అని, ప్రత్యేకంగా గడుపుతారని మాకు తెలుసు. అదే సమయంలో ఈ ప్రపంచంలో ఇదే రోజున చాలా మంది మీతో పాటే పుట్టిన రోజులు జరుపుకుంటున్నారు. ఎందుకంటే..పుట్టిన రోజు అనేది మనందరి జీవితంలో ఓ గొప్ప తీపి గురుతు. మనమంతా పుట్టిన రోజులను ఓ ముఖ్యమైన రోజుగా భావిస్తాము. అలాగే మన అమ్మా,నాన్నా  సైతం ఈ రోజును మనతో పాటు సెలబ్రేట్ చేస్తూంటారు.  ఈ భూ ప్రపంచంలో మానవజన్మకున్న సార్థకత  అలాంటిది. దానిని పొందడం కూడా ఒక అదృష్టమే. అందుకే మనం ఈ లోకంలోకి వచ్చిన ఈ రోజుని.. మనకి ఇష్టమైన వారితో గడపాలని భావిస్తాం. అందులో భాగంగానే మన బంధువులు, స్నేహితుల పుట్టినరోజు వేడుకలలో .. మనం కూడా పాల్గొంటాం. వారికి శుభాకాంక్షలు  తెలియజేస్తాం. అంతేనా…  ఈ రోజు మీతో పాటు ఇంకెవరు పుట్టారు అనే ఇంట్రస్ట్ ఖచ్చితంగా మీకు ఉంటుంది. అయితే చిత్రం ఏమిటంటే.. మీతో పాటు ఈ రోజున చాలా మంది ప్రముఖులు పుట్టారు. వాళ్లెవరో తెలుసుకుంటే వాళ్లతో పాటు మీరు కూడా పుట్టిన రోజు చేసుకుంటున్నందుకు మీరు గర్వపడతారు. ఈ రోజు పుట్టిన వారి  గొప్పతనం తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా మీతో మీరు మరింతగా ప్రేమలో పడతారు.

 1.     Sobhan Babu  :  ఉప్పు శోభనాచలపతి అంటే అందరికీ తెలియకపోవచ్చు కానీ అందాల నటుడు శోభన్ బాబు అంటే యిట్టె గుర్తుకు వస్తారు. జనవరి 14, 1937న శోభన్ బాబు కృష్ణా జిల్లా కుంటముక్కల గ్రామంలో ఉప్పు రామతులశమ్మ, సూర్యనారాయణరావు దంపతులకు జన్మించారు. 1959లో ‘దైవబలం’ సినిమాలో చిన్న పాత్రతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ‘భక్త శబరి’,  ‘సీతారామ కల్యాణం, ‘మహామంత్రి తిమ్మరుసు‘లవకుశ’, ‘చదువుకున్న అమ్మాయిలు’, ‘నర్తనశాల’, ‘సుమంగళి’ సినిమాల్లో సహాయ నటుడిగా చేసారు. 1965లో వచ్చిన వీరాభిమన్యు సినిమాతో హీరో అయ్యారు లోగుట్టు పెరుమాళ్ళకెరుక’పొట్టిప్లీడరు’, ‘రక్తసిందూరం’, కాంభోజరాజు కథ’, ‘బంగారు పంజరం’, ‘మనుషులు మారాలి’,  ‘తాసిల్దారు గారి అమ్మాయి’, చెల్లెలి కాపురం, ‘సంపూర్ణ రామాయణం’, ‘కాలం మారింది’, ‘జీవనతరంగాలు’, ‘శారద’, ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’, ‘డాక్టరు బాబు’, ‘కన్నవారి కలలు’, ‘గంగ-మంగ’, ‘జీవితం’, ‘ఖైదీ బాబాయి’, ‘దేవాలయం’, ‘దేవత’, ‘కార్తిక దీపం’, ‘మల్లెపూవు’.. ‘డాక్టర్ బాబు’లాంటి సినిమాలతో అందాల నటుడిగా సోగ్గాడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసారు. శోభన్ బాబు తన కెరీర్లో నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్, ఐదు నంది అవార్డ్స్ గెలుచుకున్నారు.   

  2.    Jandhyala        :   హాస్య బ్రహ్మ జంధ్యాల గారి పుట్టిన రోజు నేడు. జనవరి 14, 1951న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు. స్కూలులోను, కాలేజీలోను నాటకాల్లో ప్రదర్శనకు ఉత్తమ నటుడిగా చాలా బహుమానాలు అందుకున్నాడు. ఆ తర్వాత 1976లో ‘దేవుడు చేసిన బొమ్మలు’ చిత్రానికి మాటల రచయితగా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత  ‘పెళ్లి కాని పెళ్లి’, ‘సిరిసిరిమువ్వ’ ‘అడవిరాముడు’, బుర్రిపాలెం బుల్లోడు’, ‘తాయారమ్మ బంగారయ్య ‘శంకరాభరణం’,  ‘సప్తపది’, ‘వేటగాడు’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘రౌడీరాముడు-కొంటెకృష్ణుడు’, ‘అమరదీపం’, ‘భలేకృష్ణుడు’, ‘ఆఖరిపోరాటం’ ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’, ‘శుభోదయం’, ‘సీతామాలక్ష్మి’, ‘సాగరసంగమం’ ‘ఆపద్బాంధవుడు’, ‘స్వాతికిరణం’; సొమ్మొకడిది-సోకొకడిది’, ‘ఆదిత్య369’, ‘పసివాడి ప్రాణం’, ‘విజేత’ వంటి విజయవంతమైన చిత్రాలకు మాటలు సమకూర్చారు. సినీ రచయితగా 1977-86 మధ్యకాలంలో జంధ్యాల అలా క్లాస్‌ని, మాస్‌ని అలరిస్తూ సుమారు రెండు వందల సినిమాలకు పైగా పనిచేశారు. ‘ముద్దమందారం’సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ‘మల్లెపందిరి’ ‘తూర్పువెళ్లేరైలు’‘నాలుగు స్తంబాలాట’, ‘నెలవంక’, ‘రెండుజెళ్ళ సీత’, ‘అమరజీవి’, ‘మూడుముళ్ళు’, శ్రీవారికి ప్రేమలేఖ, ‘ఆనందభైరవి’, ‘రావూగోపాల్రావూ’, ‘పుత్తడిబొమ్మ‘శ్రీవారి శోభనం’, మొగుడూ-పెళ్ళాలూ’, ‘బామ్మగారి మనవరాలు’, రెండురెళ్ళు ఆరు, ‘చంటబ్బాయ్‌’, పడమటి సంధ్యారాగం’, ‘అహ నా పెళ్ళంట’, చిన్నికృష్ణుడు, ‘వివాహ భోజనంబు’,‘నీకు నాకు పెళ్ళంట’, ‘చూపులు కలిసిన శుభవేళ’, ‘హై హై నాయకా’, ’జయమ్ము నిశ్చయమ్మురా’, ‘లేడీస్‌ స్పెషల్‌’, ‘బావా బావా పన్నీరు’, ‘బాబాయ్‌ హోటల్‌’, ‘ప్రేమా జిందాబాద్‌’ సినిమాలు చేసి కామెడీ ఫిలిమ్స్ కు బ్రాండ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. మొత్తంమీద జంధ్యాల తన కెరీర్లో  350 సినిమాలకు రచన చేసి 44 సినిమాలకు దర్శకత్వం వహించారు.   

  3.    Rao Gopal Rao  :  పైనేదో మర్డరు జరిగినట్టులేదూ ఆకాశంలో. సూరీడు నెత్తురు గడ్డలా లేడూ. ఆ… మడిసన్నాక కాసింత కలాపోసనుండాలయ్యా ఈ డైలాగ్ వినగానే తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన రావు గోపాల రావు గుర్తొస్తారు ఈరోజు ఆయన పుట్టిన రోజు. జనవరి 14, 1937 న కాకినాడ కు దగ్గరలో వున్న గంగనపల్లి గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలు వేసేవారు, “ధన్యజీవులు” అనే నాటకం గోపాలరావుకు మంచి పేరుతెచ్చి పెట్టడంతో ఆయన నాటకాల వైపు మొగ్గు చూపారు. దాంతో “అసోసియేటెడ్ అమెచూర్ డ్రామా కంపెనీ” అనే సంస్థను నెలకొల్పి ఎన్నో సాంఘిక నాటకాలను అనేకచోట్ల ప్రదర్శించారు. 1966లో భక్త పోతన సినిమాతో తెలుగు తెరకు నటుడిగా పరిచయమయ్యారు ఆ తర్వాత “బంగారు సంకెళ్ళు”(1968), “మూగప్రేమ”(1971) సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేసారు.  “జగత్ కిలాడీలు”సినిమాలో విలన్ గా నటించిన తర్వాత ఇక ఆయన వెనుతిరిగి చూసుకోలేదు “గండర గండడు”, ముత్యాలముగ్గు, వేటగాడు, మనవూరి పాండవులు,  గోపాలరావు గారి అమ్మాయి, భక్తకన్నప్ప, గోరంతదీపం, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, బులెట్, జాకీ, కొండవీటి సింహం, మగధీరుడు, కిరాయిరౌడీలు, జస్టిస్ చౌదరి, కటకటాల రుద్రయ్య, కొండవీటి రాజా, మగధీరుడు, ఘరానా మొగుడు, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, యమగోల, అభిలాష, దేవాలయం, అనుగ్రహం, అల్లరిప్రియుడు, ఖైదీ సినిమాల్లో విలన్ గా అద్భుతంగా నటించి  తెలుగు తెరపై తనదైన ముద్ర వేసారు ఆయన కేవలం విలన్ గా సీరియస్ పాత్రలే కాకుండా “రావు గోపాలరావు” సినిమాలో నత్తి ప్రొఫెసర్ గా, “పట్నం వచ్చిన పతివ్రతలు”, “మల్లెపువ్వు” సినిమాల్లో మాలిష్ మారాజుగా, “మావూర్లో మహా శివుడు” సినిమాలో శివుడుగా, “స్టేషన్ మాస్టర్” సినిమాలో స్టేషన్ మాస్టర్ గా కామెడీ పాత్రలు కూడా చేసి మెప్పించారు. నిర్మాతగా గోపాలరావు “స్టేషన్ మాస్టర్”, “లారీ డ్రైవర్”, “భార్గవరాముడు”, “వింతదొంగలు” వంటి చిత్రాలు నిర్మించి విజయం సాధించారు. ఈయన 1990లో కళాప్రపూర్ణ “నటవిరాట్” అనే బిరుదులు వచ్చాయి.

  4.    K. B. Tilak     : ప్రముఖ స్వాతంత్ర్య సమరమ యోధుడు సమాజ సేవకుడు,  సినిమా నిర్మాత కె.బి. తిలక్ ఈరోజు ఆయన పుట్టిన రోజు. జనవరి 14, 1926లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గరున్న దెందులూరు గ్రామంలో జన్మించారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొని జైలుకు కూడా వెళ్ళారు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ‘అంతా మనవాళ్ళే’, ‘రోజులు మారాయి’ సినిమాలకు ఎడిటర్ గా పని చేసారు తనే నిర్మాత, దర్శకుడిగా తొలిప్రయత్నంగా ‘ముద్దుబిడ్డ’ చిత్రాన్ని నిర్మించారు.  తిలక్ కేవలం  వ్యాపార దృష్టితో సినిమాలు తీయకుండా 23 ఏళ్ళలో అత్తా ఒకింటి కోడలే, చిట్టితమ్ముడు, ఈడూ జోడూ, ఉయ్యాల-జంపాల, పంతాలు పట్టింపులు, భూమికోసం, కొల్లేటి కాపురం (1976) వంటి చిత్రాలు తీసారు. తిలక్ నిర్మించిన చివరి చిత్రం త్రిపురనేని గోపీచంద్ కథ ఆధారంగా నిర్మించిన ‘ధర్మవడ్డి’ (1982). ‘ముద్దుబిడ్డ’ సినిమాని హిందీలో ‘చోటి బహు’ (1971) పేరుతో, ‘ఈడూ జోడూ’ సినిమాని ‘కంగన్’ (1972) పేరుతో, ‘అత్తా ఒకింటి కోడలే’ సినిమాను తమిళంలో ‘మామియారుమ్ ఒరు వీటు మరుమగలే’ (1961)  తనే రీమేక్ చేసి విజయం సాధించారు. చలనచిత్ర పరిశ్రమకి తిలక్ చేసిన సేవలను గుర్తిస్తూ ఆయనకు భారత ప్రభుత్వం ‘బి.ఎన్. రెడ్డి జాతీయ అవార్డు’ ను ప్రదానం చేసింది

  5.    Durga Khote   :  తొలితరం హిందీ, మరాఠి చలనచిత్ర కథానాయిక, క్యారక్టర్‌ నటి, రంగస్థల నాయిక దుర్గా ఖోటే ఈరోజు ఆవిడ పుట్టిన రోజుజనవరి 14, 1905న సంపన్న మహారాష్టియ్రన్‌ కుటుంబంలో దుర్గాఖోటే గోవాలో జన్మించిచారు. 1932లో వచ్చిన  ‘మాయా మశ్చీంద్ర’ అనే సినిమాలో తోలిసారి నటించింది ఆ తర్వాత తొలి మరాఠీ టాకీ చిత్రం ‘అయోధ్యేచ రాజా’సినిమాలో నటించారు వి శాంతారాం సినిమా ‘అమర్‌ జ్యోతి’లో కూడా నటించిన తర్వాత 1937లో దుర్గాఖోటే సొంతంగా ‘సాథి’ అనే చిత్రాన్ని నిర్మించింది. ఆ సినిమాకు నిర్మాతగానే కాకుండా దర్శకత్వ బాధ్యతలు కూడా ఆమె నిర్వహించి, తొలి భారతీయ మహిళా దర్శకురాలిగా చరిత్రలో నిలిచింది.  తరువాత  ‘అధూరి కహాని’, ‘గీత’, నరసి భగత్‌’‘చరణోం కి దాసీ’, ‘భారత్‌ మిలాప్‌’, ‘మహాసతి అనసూయ’, ‘మహాత్మా విదుర్‌’,  ‘పృథ్వి వల్లభ’, ‘మహారథి కర్ణ’, ‘ఫూల్‌’, ‘వీర్‌ కుణాల్‌’, ‘మహారాణి మినాల్‌ దేవి’, ‘రుక్మిణి స్వయంవర్‌’‘మొఘల్‌-ఎ-ఆజంది హౌస్‌ హోల్డర్‌’, ‘బాబీ’, అభిమాన్‌, ‘బిదాయి’ ‘కర్జ్‌’ సినిమాల్లో నటించింది. తన కెరీర్లో హిందీ, మరాఠి భాషల్లో కలిపి  దుర్గాఖోటే దాదాపు రెండువందల సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించిoది. ‘బిదాయి’ సినిమాలో ఉత్తమ నటనకు ఫిలింఫేర్‌ బహుమతి, ‘చరణోం కి దాసీ’, ‘భారత్‌ మిలాప్‌’ సినిమాల్లో నటనకు తీనీరితి అవార్డులు ఆమెకు లభించాయి. 1980 తరువాత ‘ఫ్యాక్ట్‌ ఫ్గిలిమ్స్‌’ సంస్థను నెలకొల్పి లఘుచిత్రాల మీద, డాక్యుమెంటరీల నిర్మాణం మీద ఎక్కువగా దృష్టి సారించింది. ‘దుర్గాఖోటే ప్రొడక్షన్స్‌’ బ్యానర్‌ మీద ‘వాగ్లె కి దునియా’ అనే టెలివిజన్‌ సీరియల్‌ నిర్మించి దూరదర్శన్‌ ద్వారా ప్రసారం చేయించింది. 1968లో దుర్గాఖోటేకు భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు ప్రదానం చేసింది. 1983లో ఆమెకు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు లభించింది. 2013 మే 3న భారత ప్రభుత్వం దుర్గాఖోటే పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.

  6.    Steven Soderbergh : ఇరవై ఆరేళ్ల వయసులో ఎవరైనా చిత్రసీమలో తొలి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ యువకుడు మాత్రం ఆ వయసుకల్లా ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన కేన్స్‌ చిత్రోత్సవంలో అత్యున్నతమైన ‘పామే డిఓర్‌’ పురస్కారాన్ని అందుకున్న యువ దర్శకుడిగా సంచలనం సృష్టించాడు అతడే స్టీవెన్‌ సోడర్‌బెర్గ్‌ ఈరోజు ఆయన పుట్టిన రోజు.  అమెరికాలో 1963 జనవరి 14న పుట్టిన ఇతగాడు చిన్నవయసులోనే 16 ఎమ్‌ఎమ్‌ కెమేరాతో షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ఎడిటర్‌గా చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. నటుడిగా, నిర్మాతగా, స్క్రీన్‌ రైటర్‌గా, దర్శకుడిగా కూడా గుర్తుంచుకోదగ్గ ముద్ర వేశాడు. ఇతడి సినిమాల గురించి చెప్పాలంటే ‘సెక్స్, లైస్‌ అండ్‌ వీడియోటేప్‌’ ఒక్కటి గుర్తు చేస్తే చాలు. ఈ సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు సాధించాడు. అనేక అవార్డులు కూడా అందుకున్నాడు. ‘ట్రాఫిక్‌’ చిత్రంతో ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ కైవశం చేసుకున్నాడు. ఇతడి దర్శకత్వం వహించిన ‘ఔటాఫ్‌ సైట్‌’, ‘ఎరిన్‌ బ్రొకోవిచ్‌’, ‘ఓషన్స్‌ ట్రయాలజీ’, ‘కాంటాజియాన్‌’, ‘మ్యాజిక్‌ మైక్‌’, ‘సైడ్‌ ఎఫెక్ట్స్‌’, ‘లోగన్‌ లక్కీ’, ‘అన్‌సేన్‌’ చిత్రాలు వేర్వేరు జోనర్లతో ఉండి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఇతడి సినిమాలన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా 2.2 బిలియన్‌ డాలర్లును, ఏడు ఆస్కార్‌ అవార్డులను పొందడం విశేషం. 

ఇంత గొప్ప ప్రముఖులు జన్మించిన రోజున పుట్టిన మీరు కూడా వాళ్ల స్దాయికి వెళ్తారని మా నమ్మకం..మీకు మరోమారు బర్తడే విషెష్ చెప్తున్నాం. వాళ్లందిరి స్పూర్తితో ముందుకు వెళ్లాలని కోరుకుంటు 

Related Articles

Stay Connected

0FansLike
3,134FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!