3 C
New York
Saturday, December 4, 2021

లవ్ లో ఈ టాప్ సీక్రెట్స్ తెలిస్తే..మిమ్మల్ని ఆపటం ఇక కష్టం !!!

ప్రేమ… లవ్… ప్యార్… టీనేజ్ లోకి రాగానే కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టి వాళ్ళను ఒక మైకంలోకి లాగి ఉక్కిరిబిక్కిరి చేసే మహమ్మారి!!! అవును వయసులోకి వచ్చిన ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా దానికి లోంగాల్సిందే… ఏ దేశంలో అయినా ఏ ఊరిలో అయినా ప్రేమ జెండా రెపరెపలాడాల్సిందే… మీకు తెలుసా ఈ ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని కోట్ల మంది కొత్తగా ప్రేమలో పడుతుంటారు అది అంతు లేనిది… మనిషి పుట్టినప్పుడు పుట్టినా ఇప్పటి వరకు పాతదవని సరికొత్త మ్యాజిక్ ప్రేమ… అయితే ఒక్కసారి అందులో దిగితే అదొక మహా సముద్రం ఎంతటి గజ ఈతగాళ్లు అయినా ఒక్కోసారి ప్రేమ సుడిగుండంలో చిక్కుకుపోయి చేతులు ఎత్తేసారు… ఇది ప్రతి ప్రేమ కథలో కామన్ గా జరిగేదే అయినా ఇంకా ప్రేమ రుచి చూడని వాళ్ళు… ప్రేమలో కొత్తగా పడ్డవాళ్లు… ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళు… లేకపోతే ప్రేమలో పి. యెచ్. డి. చేశాం అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రేమ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ప్రేమ రహస్యాలను గోవాకు చెందిన రీటా అనే ఒక అమ్మాయి చాలా రోజుల పాటు రీసెర్చ్ చేసి మరీ ఈ ప్రపంచానికి తెలియజేసింది అలా ప్రపంచ ప్రేమికులకు పెద్ద హెల్ప్ చేసింది మరి అవేంటో మనం కూడా తెలుసుకుందాం పదండి.

 రీటా గోవాకు చెందిన ఒక అమ్మాయి తన చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోయారు దాంతో తల్లితండ్రుల ప్రేమకు దూరం అయ్యింది… అప్పటి నుంచి తనకు ప్రేమ మీద చిన్నప్పుడే ఒక విధమైన ద్వేషం లాంటిది కలిగిందట అయితే పెద్దయ్యాక ఆ ప్రేమ విలువ తెలుసుకున్న రీటా లవ్ గురుగా మారి దాని గురించి కొన్నేళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని రహస్యాలు తెలుసుకుందట… వీటిని ముందే తెలుసుకోవడం ద్వారా చాలా మంది తమ లవ్ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వుంటారని బల్లగుద్ది మరీ చెపుతుంది. మరి  ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మీకోసం.

సీక్రెట్ నెంబర్ 1 : కేవలం ఒక్క లవ్ ఫెయిల్యూర్ తోనే మీ లవ్ స్టొరీ అయిపోయినట్టు కాదు!!!!

లవ్ ఆఫ్ మై లైఫ్, సోల్ మేట్ ఇలా ఎన్నో పేర్లు పెట్టుకుని జనాలు పిలుచుకుంటారు కానీ నిజంగా లైఫ్ లో ప్రేమ ఒక్కరి మీదే పుడుతుంది అన్నది నిజం కాదట… మన జీవితంలో ఎప్పుడు ఎవరి మీదైనా ప్రేమ పుట్టోచ్చంట… లవ్ అంటే అది ఒక్కరి మీదే అనేది ఒక అపోహా అని రీటా చెపుతుంది. చాల మంది లవ్ లో ఫెయిల్ అయితే ఇంక మళ్ళీ లైఫ్ లో ఎవరిని లవ్ చేయకూడదని అనుకుoటరట కానీ అది తప్పని అలా అనుకుని ఉండిపోతే మీరు లైఫ్ లాంగ్ సింగల్ గానే ఉండాల్సి వస్తుంది అనేది రీటా వాదన. అందుకే తను యూత్ కు ఇచ్చే సలహా ఏంటంటే మీకు అన్ని విధాల సరిపోయే లైఫ్ పార్టనర్ దొరికే వరకు మీ లవ్ జర్నీ ఆపకూడదు అనేది రీటా చెపుతున్న సీక్రెట్. రీటా లెక్కల ప్రకారం నిజానికి ఒక మనిషి దాదాపు 5284 మనుషుల్ని లవ్ చేయొచ్చని లేదా వాళ్ళతో లవ్ లో పడొచ్చని అంత మందిలో ఎవరితోనైనా మీరు హ్యాపీగా ఉండొచ్చని తన రీసెర్చ్ లో తేలిందట. ఇలాంటి లవ్ సీక్రెట్స్ తెలియకనే ఒకసారో రెండుసార్లో లవ్ లో ఫెయిల్ అయితే ఇక అంతా అయిపోయినదనుకుని టెన్షన్ పడే, బాధపడే వాళ్ళు అవన్నీ మరచిపోవాలని రీటా చెపుతుంది. సో ఈసారి మీ లవ్ ఫెయిల్ అయితే మీతో లవ్ లో పడడానికి ఇంకా 5284 మంది వెయిటింగ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

సీక్రెట్ నెంబర్ 2  : ప్రేమ పర్మినేంట్ కాదు!!!!

జన్మ జన్మలకు నేను నిన్నే ప్రేమిస్తా… చచ్చే వరకు నా ప్రేమ నీకే ఇలాంటి డైలాగ్స్ సినిమాల్లోనో లేక మీ నిజ జీవితంలోనో చాలా సార్లు వినే వుంటారు కానీ అదంతా వట్టి ట్రాష్ అదొక పెద్ద అబద్ధం అని రీటా చెపుతుంది. అవును తన రీసెర్చ్ లో తెలిసిన మరొక సీక్రెట్ ప్రేమ పర్మినెంట్ కాదనే విషయం. అదేంటి లవ్ పర్మినెంట్ కదా కాదని ఎలా అంటారు అనుకోకండి దీనికి తన రీసెర్చ్ లో ఒక మంచి పాయింట్ చెప్పింది రీటా మీరు ప్రేమించిన వాళ్ళతో ప్రతిరోజు ఆ ప్రేమ ఒకేలా వుండదట… వాళ్ళ మధ్య జరిగే విషయాలతో ఆ ప్రేమ మారుతూ వస్తుంది అని తన రీసెర్చ్ లో తేలిందట ఇంకా చెప్పాలంటే మొదట్లో ఏంతో ప్రేమను పెంచుకుంటారట ఆ తర్వాత అంతే ప్రేమ వాళ్ళలో ఉండదట… క్రమంగా ఆ ప్రేమ తగ్గుతుందట అందుకే ఎవరైనా లైఫ్ లాంగ్ లవ్ అంటే ఒక్కసారి ఆలోచించండి అని చెప్తుంది రీటా. అంటే ఇక్కడ అసలు ప్రేమనే ఉండదని తన ఉద్దేశం కాదట ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు అది మారుతూ ఉంటుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే మీరు ప్రేమ విషయంలో పెద్దగా హార్ట్ అయ్యే పరిస్థుతులు రావని రీటా చెప్తుంది.

సీక్రెట్ నెంబర్  3  :    ప్రేమ అనేది ఒక్కరోజే దొరికేది కాదు… అది ప్రతిరోజూ జరిగే ఒక ప్రక్రియ

లవ్ అనేది మీ లైఫ్ లో ప్రతి రోజు ఒక ప్రక్రియ అది కేవలం ఒక్క రోజుకే పరిమితమయ్యేదో లేకపోతే ఒకే రోజు మీకు మొత్తంగా దొరికేది కాదని రీటా తన రీసెర్చ్ లో తెలుసుకుందట… ఎన్నో రోజులు చాలా మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత తను ఎంతో నమ్మకంగా ఈ విషయం చెపుతుందంట… ఒక మనిషిని మీరు ప్రేమించాకా తనతో జరిగే లైఫ్ జర్నీలో వాళ్ళ నుంచి మీకు ప్రేమ ఇన్ స్టాల్ మెంట్స్ లాగా వస్తుంది తప్పా ఒకేసారి లాటరీ దొరికినట్టు రాదని అందుకే మీకు మీ పార్టనర్ కు మీ రిలేషన్ షిప్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఒకరోజు మీతో హ్యాపీ గా ఉండి మరొక రోజు మీతో మీ పార్టనర్ గొడవ పడితే అనవసరంగా హార్ట్ అవకండి ఆరోజు మీ పార్టనర్ ప్రేమ మీకు తక్కువగా దొరికింది అనుకోమని రీటా చెపుతుంది. అలా ప్రేమ గురించి మీకు సరైన అవగాహన ఉంటేనే మీ లవ్ లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మీ బంధం ఎప్పటికీ  చెక్కు చెదరదు లేకపోతే చిన్న చిన్న గొడవలకే మీరు విడిపోవాల్సి వస్తుంది  సో ఈ విషయంలో కొంచెం ఓపిక అవసరమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి.

సీక్రెట్ నెంబర్ 4 : ఒక ఒరలో ఇమడని రెండు కత్తులే లవ్ అండ్ మ్యారేజ్     

ప్రేమ, పెళ్లి ఒకదానితో మరొకటి అచ్చం లవర్స్ లానే పెనవేసుకుపోయే విషయాలు కానీ అవి రెండు ఒక దగ్గర ఉండలేవు అన్నది తన రీసెర్చ్ లో తేలిందని రీటా చెపుతుంది చాలా మందికి ఇది నమ్మశక్యంగా అనిపించనప్పటికి ఇదే నిజమనేది తన వాదన. అసలు ఏంతో డీప్ గా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న కపుల్స్ లో కూడా పెళ్లి తర్వాత ప్రేమ కరువవుతుందట అప్పుడు అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశా అని భార్య భర్తలు ఒకరినొకరు నిందించుకుని శత్రువులు అవుతారట. పెళ్లి తర్వాత ప్రేమ అనేది బ్యాక్ సీట్ తీసుకుంటుంది పెళ్ళికి ఉన్న ప్రేమలో ఎంతగా ఉత్సాహం, ఎనర్జీ ఉంటాయో పెళ్లి తర్వాత అవేవి వుండవట పైగా పెళ్లికి ముందు తన పార్టనర్ తో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సర్దుకుపోయే లవర్స్ పెళ్లి తర్వాత ఆ బంధాన్ని కంటిన్యూ చేయడమే పెద్ద పనిష్మెంట్ గా చూస్తారట. సో గుర్తుపెట్టుకోండి ప్రేమ, పెళ్లిని రెండింటిని సరిగ్గా బాలన్స్ చేసుకోగలిగితేనే వాటిలోకి ఎంటర్ అవమని రీటా సలహా ఇస్తుంది.

సో బాయ్స్ అండ్ గర్ల్స్ లవ్ గురించి ఎన్నో రోజులు రీసెర్చ్ చేసి రీటా చెప్పిన సీక్రెట్స్ ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని మీ లైఫ్ లో అప్లై చేస్తే మీరు డెఫినెట్ గా లవ్ లో సక్సెస్ అవుతారు… ఇక మీదే ఆలస్యం మరి ఆల్ ది బెస్ట్!!!! 

Related Articles

Stay Connected

0FansLike
3,045FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!