21.9 C
New York
Tuesday, September 28, 2021

పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించిన ఉండవల్లి ..పవన్ కళ్యాణ్ దమ్మున్న నాయకుడు

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆయన ముక్కు సూటిగా మాట్లాడుతారు అన్న విషయం అందరికి తెలిసిందే. రాష్ట్రంలో రాజకీయం అయిన ఏదైనా సమస్య అయిన కూడా అటు ఏ పార్టీకి, ఇటు ఏ వ్యక్తికి అనుకూలంగా కాకుండా తన వాదనని నిర్మొహమాటంగా ప్రజలకు వివరిస్తారు ఉండవల్లి అరుణ్ కుమార్. రాష్ట్ర రాజకీయలపై ఉండవల్లికి సమగ్ర అవగాహన ఉంటుంది. రాజకీయాల్లో ఆయన నిష్ణాతుడు. అంశం ఏదైనా పూర్తి వివరాలతో స్పందిస్తాడు. ఇప్పుడు ఆయన ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు. ప్రస్తుతం మళ్ళీ రాకీయాల్లోకి వచ్చి, పార్టీ చెప్పిన పనులు చేస్తూ జెండాలు కండువాలు మోసే ఇష్టం లేదని తప్పు ఒప్పులని చెప్పడం ప్రజల తరపున పోరాడటం ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. ఇక ఆయన ఏపీ రాజకీయాలను స్వార్థం కోసం కాకుండా తమను నమ్మని ప్రజలను కోసం పని చేయాలని ఉండవల్లి అంటారు. రాజకీయాల్లో చుక్క ముక్క లేకుండా గెలవాలని అరుణ్ కుమార్ అంటారు. ఒకరిని ఒకరు తిట్టుకునే బదులు అదే సమయం ఒకరినొకరు కూర్చుని సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించాలని సూచిస్తారు అరుణ్. ఇక ఏపీ రాజకీయాలు ఎలా ఉంటాయో మనకి తెలుసు. ఇష్టం వచ్చినట్టు తిట్టుకోవడం, సమస్యలపై కాకుండా వ్యక్తిగతంగా తిట్టుకోవడం చేస్తుంటారు. ఇక వీటి పై కూడా ఉండవల్లి స్పందించి.. రాజకీయాల్లో వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోవడం సరికాదని, అది మనల్ని మనం, మన క్యారెక్టర్ బ్యాడ్ చేస్కోవడం అని అంటారు ,ఇక ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలక నాయకుల గురించి ఉండవల్లి మాట్లాడుతారు. ఈ క్రమంలో జనసేన పార్టీ గురించి.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఆయన ఆకాశానికి ఎత్తుతారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు అని.. పవన్ కల్యాణ్ ఏదైనా సభ పెడితే ఎటువంటి డబ్బులు ఇవ్వనున్న కూడా ప్రజలు వస్తారని.. పవన్ మార్పు కోసం పని చేస్తున్నాడని అతను ప్రజల కోసం నాయకుడు అయ్యాడని ఉండవల్లి పవన్ పై ప్రశంసలు కురిపిస్తారు. పవన్ తో కలసి JAC ఏర్పాటు చేయడానికి ఉండవల్లి సిద్ధమయ్యారు. పవన్ తో కలిసి ప్రజా సమస్యలపై చర్చించారు. అయితే పవన్ ఓటమి, ఆ తరువాత మళ్ళీ పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పై టీడీపీ వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేసారు. దీనికి కూడా ఉండవల్లి విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. పవన్ సినిమా ల రీ ఎంట్రీ పై ఆయన స్పందిస్తూ, ఈ విషయం పవన్ కు ముందే చెప్పాను అని కానీ అప్పట్లో ఆయన అంగీకరించలేదు అని ఉండవల్లి అన్నారు.ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలను చేయను అని ప్రకటించారు.అయితే అప్పుడే ఆయనను కలిసినప్పుడు సినిమా అనేది మీ వృత్తి దానిని ఆపవద్దు అంటూ సూచించాను.అయితే అప్పుడు ఆయన రాజకీయాలు,సినిమాలు రెండూ కుదరవని అందుకే సినిమా లకు స్వస్తి చెబుతాను అని పవన్ అన్నారు అంటూ గుర్తు చేసుకున్నారు. అయితే అప్పట్లో ఆయన సీఎం అవుతారని అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటారు.అయితే ఇప్పుడు నాలుగేళ్ళ వరకు ఎన్నికలు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటేనే మంచిదని ఈ మేరకు నిర్ణయం తీసుకొని ఉంటారు అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.అంతేకాకుండా పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించడం కరెక్టేనని, అదే సరైన నిర్ణయంగా ఆయన భావిస్తున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా జనసేన, బీజేపీల మధ్య పొత్తు గురించి కూడా ఆయన స్పందిస్తూ, పవన్ ప్రసుతం అధికారంలో లేరు కాబట్టి ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఫర్వాలేదని, పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందంటూ ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఉండవల్లి పవన్ గురించి మాట్లాడటం పై వివిధ పార్టుల నేతలు ఉండవల్లి పవన్ పార్టీ కోసం పని చేస్తున్నాడని విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి ఉండవల్లి ఎవ్వరి కోసం పని చేయట్లేదు. పార్టీ తో నాయకులతో సంబంధం లేకుండా మంచి చేస్తే మంచి అని, చేడు అని చెప్తారు. మొత్తం మీద ఉండవల్లి తప్పును తప్పని.. ఒప్పును ఒప్పని మాత్రమే అంటారు. ఇక ఉండవల్లి మాటలతో పవన్ నాయకత్వం, ఆయన నిర్ణయాలు ప్రజలకు కావాల్సినవిగా ఉంటాయని అర్థం అవుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!