23.3 C
New York
Friday, September 17, 2021

అసలు RSS అంటే ఏమిటి.? RSS సిద్ధాంతాలు ఏమిటి.?

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS అంటే ఏంటి? కుల,జాతి,వర్గ,వైషమ్యాలు లేకుండా క్రమ శిక్షణ తో ఒకే భగవద్వజం నీడలో… దేశము పట్ల ప్రేరణ ఇస్తూ.. దేశభక్తులను తయారు చేసే సంస్థయే  RSS.. RSS నిత్యం సంఘ శాఖ ఆధారంగా వ్యక్తి నిర్మాణము చేస్తుంది. భారత దేశంలో ఇది ఒక హిందూ జాతీయ వాద సంస్థ. డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్ ఈ సంస్థను మహారాష్ట్ర లోని నాగపూర్లో 1925లో విజయదశమి నాడు మొదలు పెట్టారు. RSS అంటే చాలు బారతదేశంలో ఓ సంచలనం. రాజకీయ పార్టీలు ఎప్పుడూ మాట్లాడుకునే మాటల్లో RSS ఖచ్చితంగా ఉంటుంది. 1925 సెప్టెంబర్ 25న డాక్టర కేశవ్ బలిరామ్ హెగ్డేవర్ స్థాపించిన ఈ సంస్థ దినదిన ప్రవర్దమానంగా పెరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్గనైజేషన్ గా పేరుపొందింది. భారతమాత కోసం పని చెయ్యాలనుకొనే, దేశం అంటే అభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. అందరం కలిసి దేశం కోసం మనం అన్న కోణంలో పుట్టుకొచ్చిందే RSS.  దేశాభిమానం ఉన్న వాళ్లు ఎవరైనా కూడా ఇందులో చేరవచ్చు కానీ ప్రపంచానికి ఎంతో పరిచయమున్న RSS గురించి మీకు తెలియని కొన్ని  నిజాలు ఏమిటో ఈ షో లో తెలుసుకుందాం.. 

RSS కు మనదేశంలో అనునిత్యం జరిగేవి 65 వేలు  శాఖలు ఉన్నాయి . ఈ సంస్థను నడుపుతున్నవారు  కూడా అందులోని సభ్యులే. కాషాయం జెండా  RSS లో అధినాయకత్వం. ఇక్కడ వ్యక్తి పూజలుండవు . RSS లో ఉండే వాళ్లు కూడా ఈ జెండానే గౌరవిస్తారు. ప్రపంచంలోనే అతి పెద్ద సంఖ్యలో వాలంటీర్లు ఉన్న సంస్థ RSS. దాదాపు 60లక్షల మంది వాలంటీర్లతో ఎంతో మంది అభిమానులతో RSS ఘననీయమైన సేవలను అందిస్తోంది. RSS సభ్యత్వం తీసుకున్నా కానీ ఎవరికీ గుర్తింపు కార్డు కానీ బిజినెస్ కార్డ్ కానీ ఇవ్వరు. కేవలం భారతమాతకు సేవ చెయ్యాలని అనుకున్న వారు ఎవరైనా ఈ సంస్థలో చేరవచ్చు. మోదీ, వాజ్ పేయి, అడ్వానీ లాంటి బిజెపి నాయకులు మాత్రం RSS నుండి వచ్చినవాళ్లు. అయితే చాలా మంది బిజెపి పార్టీలో RSS భాగం అని అనుకుంటారు. ఒక్క బిజెపి పార్టీలోనే కాదు కాంగ్రెస్, ఆప్ పార్టీలలో కూడా RSS నేపథ్యం నుండి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు. RSS ధ్యేయం ఒక్కటే యువత వ్యక్తిత్వాన్ని మలిచడం ద్వారా దేశ నిర్మాణంలో పాలుపంచుకోవడం. ఇండో చైనా యుద్దం జరిగే సమయంలో దేశ భ్రదతకు అందరు సరిహద్దుల వద్ద యుద్దంలో ఉంటే అప్పుడు దేశ రక్షణకు RSS సంస్థ ముందుకు వచ్చింది. వేల మంది RSS సేవకులు యుద్ద సమయంలో సేవాకార్యక్రమంలో  పాల్గొన్నారు. ఎప్పుడు దేశంలో సంక్షోభం వచ్చిన RSS కార్యకర్తలు ముందుంటారు. RSS అనేది ముస్లింలకో లేదా క్రిస్టియన్ లకో వ్యతిరేకం కాదు. దేశమంటే గౌరవం అభిమానం ఉండి సేవ చెయ్యడానికి సిద్దంగా ఉన్నవాళ్లు ఎవరైనా RSS లో చేరవచ్చు. మన సంస్రృతి సంప్రదాయాలను కాపాడేందుకు, దేశ రక్షణకు RSS కట్టుబడి ఉంటుంది. RSS లో కేవలం మగవారికే కాదు మహిళలకు కూడా స్థానం ఉంది. “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్” అని పురుషుల కోసం విబాగం ఉంటే, మహిళల కోసం “రాష్ట్రీయ సేవికా సమితి ” అని ప్రత్యేక విభాగం ఉంది. కానీ రెండింటి లక్ష్యం మాత్రం ఒక్కటే… సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్నడూ కూడా RSS ను విభేదించలేదు. కానీ 1948లో మాత్రం రాజకీయ వత్తిడిల నేపథ్యంలో కొన్నాళ్లు RSS పై నిషేదం విధించారు. కానీ తర్వాత ఆ నిషేదాన్ని ఎత్తివేశారు. అయితే నిషేదం ఎత్తివేసిన తర్వాత సంతోషించే మొదటి వ్యక్తిని నేనే అంటూ RSS గురించి లేఖ రాశారు. అతి కొద్దిమంది  మంది మహాత్మా గాంధీని చంపించింది RSS అని భావిస్తూ ఉంటారు. కానీ నాధూరామ్ గాడ్సే RSS లో వాలంటీర్ గా కొనసాగి, 1930లోనే RSS నుండి బయటకు వెళ్లిపోయారు. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పుడు నాధూరామ్ గాడ్సే RSS లో లేరు, ఎవరి సొంత అభిప్రాయాలు వారికుంటాయి కొందరు అవలంబించే పద్ధతులు నచ్చక, వారి మనస్సు ఏది చెబితే దానికి తలవంచి విధి వంచితులవుతుంటారు. జాతీయ ఉదార భావాలున్న RSS ను మహాత్మాగాంధీ మరియు డాక్టర్ అంబెడ్కర్ గార్లు  ఎంతో అభిమానించే వారు. 1963 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో RSS పరేడ్ నిర్వహించారు.దాదాపు 3500 మంది RSS వాలంటీర్లు ఎర్రకోట సాక్షిగా రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు. ప్రస్తుతానికి RSS అంటే… 60 వేల శాఖలు, 60 లక్షల స్వయం సేవకులు, 30 వేల విద్యా మందిరాలు, 3 లక్షల మంది ఉపాధ్యాయిలు, 50 లక్షల మంది విద్యార్థులు, 90 లక్షల మంది BMS కార్మిక సభ్యులు, 50 లక్షల మంది ABVP కార్యకర్తలు, 10 కోట్ల మంది భాజాపా కార్యకర్తలు, 100 కోట్ల హిందువులు, 500 ల అనుబంధ సంస్థలు, 1 లక్ష మంది మాజీ సైనికుల సంఘం, 4 వేల మంది దుర్గావాహిణీలు, 70 లక్షల మంది విశ్వహిందూ పరిషత్ సభ్యులు, 3 లక్షల మంది భజరంగ్ దళ్ కార్యకర్తలు, 22 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, 283 మంది పార్లమెంట్ సభ్యులు, 1460 మంది MLA లు, 15 మంది ముఖ్యమంత్రులు, ఒక రాష్ట్రపతి, ఒక ఉపరాష్ట్రపతి, ఒక ప్రధాన మంత్రి 

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles