23.2 C
New York
Sunday, September 19, 2021

వంగవీటికి రాధాకు జనసేన పార్టీలో కీలక పదవి

రాజకీయాలలో అందరూ చెప్పుకునే మాట మా పార్టీ కులాలకు అతీతం. కానీ అది సాధ్యం కాదు అనేది అందరికీ తెలిసిన విషయమే.. ఇప్పుడు ఆ చర్చ ఎందుకంటే రాష్ట్రంలోనే బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఈ వర్గం ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉంది అనేది కాదనలేని సత్యం… అయితే ఒకప్పుడు ఇదే సామాజిక వర్గానికి నాయకుడిగా ఉన్న వంగవీటి రంగా రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అప్పట్లో NTR కు ఉన్న హవాను తట్టుకొని నిలబడగలిగిన ఏకైక నాయకుడు వంగవీటి రంగా. ఆయన మరణం తర్వాత జరిగిన సంఘటనలు, అల్లకల్లోలాలు అందరికీ తెలిసినవే.. అయితే తర్వాత ఆయన తనయుడు రాధా ఆ వర్గానికి దండుగా నిలిచారు. కాకపోతే ఆ వర్గాన్ని పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు అనేది నానుడి. ఆ తర్వాత వచ్చిన అదే సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ కొణిదెల చిరంజీవి పార్టీ పెట్టడంతో ఆ వర్గం ఆ వైపు చూసింది. అప్పుడు వంగవీటి రాధా కూడా అదే పార్టీలో చేరారు. అయితే అప్పుడు పూర్తిగా కాపులు చిరంజీవి ని నమ్మలేదు. ఎందుకంటే అప్పటికి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి హవా నడుస్తుండడంతో ఆ వర్గం లో కొంతమంది నేతలు కాంగ్రెస్ కే మగ్గు చూపారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం అందరికీ తెలిసిన విషయమే.! అయితే అది సహించలేని వంగవీటి రాధా వైసీపీలో చేరారు. ఆయనకి ఆ పార్టీలో తగిన ప్రాధాన్యమే ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ అదే సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా వెళ్ళబోతోంది. అప్పట్లో వంగవీటి రాధా కూడా జనసేనలో చేరుతారు అనే ఊహాగానాలు వచ్చాయి. వాటిని వంగవీటి కొట్టిపారేశారు. ఇప్పుడు మళ్ళీ రాధా పార్టీ మారతారు అనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.  ఈ సమయంలో రాధా పార్టీ మారి జనసేనలోకి వెళ్తే ఆ వర్గం చూపు మొత్తం జనసేనపైనే ఉంటుంది. కాబట్టి తాజాగా జనసేన పార్టీకి కొత్త జోష్ వచ్చేలా ఉంది. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే జనసేన మీద కాపు పార్టీ అనే ముద్ర ఉంది. ఇప్పుడు వంగవీటి రాధా కూడా చేరితే ఆ ముద్ర మరింత బలపడిపోయే అవకాశం ఉంది. వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగా కాంగ్రెస్ పార్టీలో ఉండగా, టీడీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురయ్యారు. కాపు నేతగా వంగవీటి రంగాకు రాష్ట్రంలో పేరుంది. ఆ తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని అందుకున్న రాధా.. తన తండ్రిలా కాపు సామాజికవర్గానికి దగ్గర కాలేకపోయారనే వాదన ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజికవర్గం నిర్ణయాత్మకమైన ఓట్ బ్యాంక్ ఉంది. 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేన కలసి పోటీ చేయడంతో కాపులు పెద్ద ఎత్తున ఆ కూటమికి అండగా నిలిచారు. 2019 ఎన్నికల్లో ఎవరిదారి వారు చూసుకోవడంతో కాపుల్లోనూ చీలిక వచ్చింది. వైసీపీకి లాభించింది. అయితే, ఇప్పుడు రాధా చేరితే, జనసేన మీద కాపు పార్టీ ముద్ర మరింత బలంగా పడే అవకాశం ఉంది. ఈమధ్యనే జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్‌తో సమావేశమైన వంగవీటి రాధా… పార్టీలోకి తనకు ఇవ్వబోయే బాధ్యతలు, పదవులపై ఆయనతో చర్చించినట్టు సమాచారం. జనసేనలో తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారనే అంశంపై ముందుగానే ఆ పార్టీ ముఖ్యనేత నుంచి రాధా క్లారిటీ తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా జనసేన అధ్యక్ష బాధ్యతలు లేదా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఏదో ఒక పదవిని వంగవీటి రాధాకు పార్టీ ఆఫర్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. రాధా పార్టీలో చేరిన రోజే దీనిపై పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారని సమాచారం. మొత్తానికి జనసేనలో చేరనున్న వంగవీటికి రాధాకు… పార్టీలో కీలక బాధ్యతలు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles