22.1 C
New York
Sunday, June 26, 2022

నగ్నంగా పడుకొంటే మనిషికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి | SARAYU

నగ్నంగా పడుకొంటే మనిషికి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి | SARAYU

ఏ మనిషి అయినా కూడా నిద్ర అన్నది చాలా అవసరం… సైన్స్ పరంగా కొన్ని లెక్కల ప్రకారం మనిషి తన జీవితంలో మీరు ఆహారం లేకున్నా కూడా కొన్ని రోజుల పాటు బ్రతకగలడు కానీ అదే అతనికి నిద్ర లేకపోతే సరిగ్గా 11 రోజుల కంటే ఎక్కువ అతను బతకలేడు. అంత ముఖ్యమైనది నిద్ర ఎందుకంటే మనిషి శరీర నిర్మాణం లో ఉన్న అవయవాలు అన్ని రోజంతా అతను పని చేస్తున్నప్పుడు అవి కూడా పని చేయడం ఆ తర్వాత రాత్రి అతను పడుకున్నప్పుడు అవన్నీ రెస్ట్ తీసుకొని మళ్లీ తమను తాము రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది… అలా కాకుండా మనిషికి నిద్ర కరువై అతని అవయవాల మీద ఎక్కువగా ఒత్తిడి పడ్డప్పుడు కచ్చితంగా వాటి సామర్థ్యంలో తేడా వచ్చి అవి ఎక్కువగా పని చేయక అతని ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే నిద్ర విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్స్ కూడా చెబుతుంటారు… నిద్రపోయే పద్ధతుల గురించి చాలా మందిలో చాలా రకాలైన నమ్మకాలు అపోహలు కూడా ఉన్నాయి… అయితే అసలు బట్టలు లేకుండా పడుకోవడం గురించి కూడా ఎన్నో నమ్మకాలు ఉన్నాయి… ప్రపంచ వ్యాప్తంగా చాలామంది డాక్టర్స్ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు… అసలు నగ్నంగా పడుకున్నప్పుడు మనిషికి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అన్న విషయం గురించి కొంతమంది సెక్సాలజిస్టులు కొన్ని ముఖ్యమైన విషయాలను తమ వెబ్సైట్లో షేర్ చేసుకున్నారు ఇప్పుడు మనం అవేంటో ఒకసారి తెలుసుకుందాం పదండి.

  1. తొందరగా నిద్రలోకి జారుకుంటారు = అసలు బట్టలు ఏమీ లేకుండా పడుకున్న వాళ్ళు త్వరగా నిద్రలోకి జారుకుంటారు అని అది వాళ్ళకి ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అని అలా త్వరగా నిద్ర పోయిన వాళ్ళు మళ్లీ లేచే వరకు ఎక్కువగా డీప్ స్లీప్ లో ఉండగలుగుతారు అని చెబుతున్నారు… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అలా బట్టలు లేకుండా పడుకోవడం ఉన్నది చాలా మందికి అంత కంఫర్టబుల్ గా అనిపించినప్పటికీ కూడా అలాంటి ప్రయత్నం చేస్తే గనుక కచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే అమెరికా రష్యా ఫ్రాన్స్ జర్మనీ లాంటి కొన్ని దేశాల్లో చాలా మందికి ఇలాంటి అలవాటు ఉందని అలా పడుకోవడం ద్వారా తమ జీవితంలో చాలా మంచి మార్పులు జరిగాయని ముఖ్యంగా ఆరోగ్యం బాగా ఉంటుంది అని తన మైండ్ బాడీ అన్నీ కూడా సరైన పద్ధతిలో పనిచేస్తూ రోజంతా ఎక్కువ సంతోషంగా ఉత్సాహంగా ఉండగలుగుతున్నామని వాళ్లు చెబుతున్నారట.
  1. రోగాలు రాకుండా ఉంటాయి = రాత్రి పూట మీరు నిద్రపోయే ముందు బట్టలు అన్నీ విప్పేసి పడుకోవడం అన్నది మీకు అంతగా అలవాటు లేకపోయినప్పటికీ కూడా అలా చేయడం ద్వారా మీకు ఎలాంటి రోగాలు రావు అని మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు అని వైద్యులుచెబుతున్నారు… అయితే దీనికి సైంటిఫిక్ కారణాలు అంతగా ఏవి తెలియనప్పటికీ కూడా మైండ్ బాడీ అన్నవి ఎక్కువగా రిలాక్స్ అవుతూ మళ్లీ ఆ నెక్స్ట్ డే కి ఎక్కువగా రీఛార్జ్ చెయ్యి మిమ్మల్ని ఎక్కువ సంతోషంగా ఉత్సాహంగా ఉంచగలుగుతాయని దాని ద్వారా మీరు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటూ ఎలాంటి రోగాలు రాకుండా సంతోషంగా జీవితాన్ని గడుపుతారని వాళ్ళు చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి అలవాటు ఉన్న చాలామంది తాము ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం ద్వారా తమ ఆరోగ్యం చాలా మెరుగైనది అని ఇలాంటి ప్రయోగాలు చేయడం అన్నది జీవితంలో చాలా మంచి అలవాటు చేసుకోవాలి అని చెబుతున్నారు.
  1. మీ అందం కూడా రెట్టింపవుతుంది = మీరు ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం ద్వారా మీ జీవితంలో ఎన్నో ప్రయోజనాలు లభించడమే కాకుండా మీ అందం కూడా ఇంకా ఎక్కువ అవుతుంది అని ప్రముఖ వైద్యులు లు చెబుతున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఒంటి మీద బట్టల్లేకుండా పడుకున్నప్పుడు మీకు సంబంధించిన ఆలోచనలు కానీ మీ లోపల ఉన్న బాధలు భయాలు కానీ ఎక్కువగా నీ మైండ్ లో ఉండకుండా మీకు మంచి నిద్ర పట్టడానికి హెల్ప్ అవుతాయి దాంతో నిద్ర పోయిన తర్వాత చాలా తొందరగానే మీరు డీప్ స్లీప్ లో కి వెళ్లి పోవడం జరుగుతుంది సో మీకు ప్రతిరోజూ మంచి నిద్ర దొరకడంతో పాటు అది మీ అందాన్ని ఎక్కువ చేసే ఈ విధంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సగటు మనిషి ఎక్కువగా స్ట్రెస్ టెన్షన్లు తట్టుకోలేక చాలా సఫర్ అవుతున్నారు దాంతో అతనికి నిద్ర కూడా ఎక్కువగా పట్టకుండా అతని ఆరోగ్యం మీద అందం మీద ప్రభావం చూపిస్తుంది ఇలా మీరు గనుక నగ్నంగా పడుకున్నట్లు అయితే దానివల్ల మీకు మంచి నిద్ర దొరుకుతుంది దాంతో మీ ఆరోగ్యం మెరుగవడమే కాకుండా మీ అందం కూడా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
  1. సంతానోత్పత్తి పెంచుతుంది = మీరు ప్రతిరోజు రాత్రి ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం ద్వారా మగవాళ్ళలో ఎక్కువగా సంతానోత్పత్తి పెరుగుతుందని కూడా ప్రముఖ వైద్యులు చెపుతున్నారు… అయితే దీనికి ప్రధాన కారణాలు ఏవి తెలియనప్పటికీ మనిషికి అత్యంత ముఖ్యమైన అవసరమైన నిద్ర ఒంటి మీద బట్టల్లేకుండా నిద్ర పోవడం ద్వారా ఎక్కువగా లభిస్తుంది దాంతో అతని మెంటల్ హెల్త్ శారీరక ఆరోగ్యం కూడా బాగుంటాయి అలాంటప్పుడు కచ్చితంగా అతనిలో స్పెర్ము కౌంట్ ఎక్కువగా పెరిగే అదిఆ పనిలో పాల్గొన్నప్పుడు సంతానోత్పత్తి పెంచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న మన సమాజంలో చాలా మంది తమకు పిల్లలు లేక ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళు గనక ఇలా ప్రతి రోజూ ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం వల్ల వారిలో సంతానోత్పత్తి పెరిగి పిల్లలు కలిగే అవకాశం ఎక్కువ అవుతుంది అని చెపుతున్నారు.
  1. ఎక్కువగా ఆ పనిలో పాల్గొనే అవకాశం ఉంటుంది = ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు మీ పార్టనర్ మీ బట్టలు అన్నీ విప్పేసి పడుకోవడం ద్వారా మీ ఇద్దరిలో రొమాంటిక్ కోరికలు ఎక్కువ కలిగి మీరు ఇద్దరూ ఆ పనిలో ఎక్కువ సార్లు పాల్గొనే అవకాశం ఉంటుంది. దానివల్ల మీ ఇద్దరికీ శారీరక మానసిక సుఖము లభించడంతోపాటు మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది… ఒక సర్వే ప్రకారం మనదేశంలో చాలామంది కనీసం వారానికి ఒకసారి కూడా ఆ పనిలో పాల్గొనడం లేదు అని తెలిసింది అలాంటి వాళ్లు అందరూ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు బట్టలు విప్పేసి పడుకోవడం అలవాటు చేసుకుంటే కనుక వారి రహస్యపు జీవితం చాలా ఇంప్రూవ్ అవడమే కాకుండా ఎక్కువ సార్లు ఆ పనిలో పాల్గొనే అవకాశం దొరికినట్లు అవుతుంది. దాంతో తమ జీవితంలో తమకు ఉన్న సమస్యల నుంచి కూడా వాళ్లకి తాత్కాలికంగా ఉపశమనం లభించినట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్ ఒంటి మీద బట్టల్లేకుండా పడుకోవడం ద్వారా మీకు మీ జీవితంలో లభించే కొన్ని ఉపయోగాలు… నిజానికి ఇలాంటి అలవాట్లు చాలా మందికి ఉండవు కానీ చేసుకుంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు కాబట్టి ప్రయత్నించడంలో తప్పు లేదు… ఒకవేళ మీకు ఇలాంటి పద్ధతులు కనక నచ్చకపోతే మీరు ఎప్పుడూ ఉండే విధంగానే మీ జీవితంలో ఉండడం మంచిది.

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!