23.6 C
New York
Monday, September 20, 2021

హస్త ప్రయోగం చేసుకున్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసా??

హస్త ప్రయోగం ఈ ఒక్క పదం గురించి అబ్బాయిలకు ఎన్ని డౌట్స్ అంటే శృంగారం గురించి ఇండియన్ మెన్ కానీ అబ్బాయిలు కానీ తాము ఇప్పటి వరకు అడిగిన ప్రశ్నల్లో ఎక్కువసార్లు అడిగిన ప్రశ్నల్లో మొదటిది హస్త ప్రయోగం చేసు కోవడం మంచిదేనా?? అలా చేసుకుంటే ఏమైనా డేంజరా?? రోజుకు ఎన్నిసార్లు చేసుకోవచ్చు?? దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వుంటాయా?? ఇలా హస్త ప్రయోగం గురించి బాయ్స్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారట… వాళ్ళు ఎన్ని సార్లు డాక్టర్స్ సజెషన్ లో దాని వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేదని చెప్పినా లేకపోతే వాల్లెక్కడో న్యూస్ లో చదివినా చూసినా వారి మనసు లోపల హస్త ప్రయోగం మీద ఎప్పుడూ డౌట్స్ ఉంటాయట. జనరల్ గా అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా పెళ్లికి ముందు వరకు లేకపోతే వాళ్లకొక పార్టనర్ దొరికే వరకు స్వయం తృప్తి తోనే సాటిస్ ఫై అవుతారు. అయితే తమకొక పార్టనర్ దొరికిన తర్వాత కూడా కొంత మంది బాయ్స్ పోర్న్ వీడియోస్ కు అడిక్ట్ అయ్యి హస్త ప్రయోగం అనేది కంటిన్యూ చేస్తుంటారు. అయితే వాళ్ళకు అది మంచిదేనా? లేక చెడ్డదా? అనే అనుమానం ఎప్పుడూ వుంటుంది.

ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ యూత్ అందరిలో ఉన్న ఈ బిగ్గెస్ట్ టాపిక్ గురించి ఇండియాలో చాలా పెద్ద సర్వే ఒకటి చేశారట. దాంట్లో యూత్ అపోహలు, అనుమానాలు అన్నిటికీ సొల్యూషన్ లా సమాధానాలు దొరికాయట… ఇప్పుడు మీకోసం ఆ విశేషాలు…


1.హస్త ప్రయోగం చేసుకోవడం మంచిదే!!!!హస్త ప్రయోగం అనేది మంచిదేనట… అదొక సహజమైన విషయమే అని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని ఫేమస్ సెక్సాలజిస్ట్ లు చెప్పారట… అయితే అది కూడా కొంచం కంట్రోల్ లో వుండడం మంచిదని అతిగా చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు వున్నాయని చెప్పారట.

2. హస్త ప్రయోగం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది!!!
ఇది చాలా మంది అబ్బాయిలకు తెలియని విషయమే… ఎంత సేపు హస్త ప్రయోగం వల్ల డేంజరా దాని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని భయపడుతుంటారు కానీ కొంచెం కంట్రోల్ గా ఉండి రెగ్యులర్ గా హస్త ప్రయోగం చేసుకుంటే బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని వాళ్ళ సర్వేలో పాల్గొన్న డాక్టర్స్ చెప్పారట.

3. ఒత్తిడిని దూరం చేస్తుంది!!!
నిజం చెప్పాలంటే అబ్బాయిలు పోర్న్ వీడియోస్ చూసేప్పుడు హస్త ప్రయోగం చేసుకునే టైంలో చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతారు కానీ ఇక్కడ సర్ప్రైజ్ విషయం ఏంటంటే హస్త ప్రయోగం వల్ల ఒత్తిడి క్షణాల్లో దూరం అవుతుందని అంటున్నారు. పైగా బాడీ లో ఉత్తేజం కలుగుతుందట… హర్మోన్ల ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుందని హస్త ప్రయోగంతో మెదడు చురుగ్గా పనిచేస్తుందని వాళ్ళ సర్వేలో తేలిందట.

4. చిన్న చిన్న వ్యాధులు మీ దరిచేరవు!!!
హస్త ప్రయోగం వల్ల జలుబు, ఫ్లూ, మైగ్రేన్ వంటి వ్యాధులు తగ్గిపోతాయని అంటున్నారు. అలాగే హస్త ప్రయోగంతో తెల్లరక్తకణాల సంఖ్య కూడా పెరుగుతుందని తేలిందట.

5. వీర్య కణాలను ఎలాంటి ఇబ్బందులు ఉండవు!!!!
హస్త ప్రయోగం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని భవిష్యత్తులో పిల్లలు పుట్టే అవకాశాలు తక్కువ అవుతాయని అబ్బాయిల్లో ఎన్నో భయాలు వున్నాయట… అయితే ఆశ్చర్యకరంగా ఈ సర్వేలో ఇక హస్తప్రయోగం వలన వీర్యకణాలు తగ్గిపోతాయనే శుద్ధ అబద్ధమని సర్వేలో పాల్గొన్న డాక్టర్లు చెప్పారట. అలాగే పాత వీర్యకణాలు చనిపోయి కొత్త వీర్యకణాలు కూడా పుడుతూనే ఉంటాయి. ఇది శరీరంలో నిత్యం జరిగే పద్ధతి. కాబట్టి హస్తప్రయోగం వలన వీర్యకణాలు తగ్గిపోతుంది అనుకోవడం పెద్ద పొరపాటు బాయ్స్ ఎలాంటి టెన్షన్లు పెట్టుకోవద్దని చెప్పారట. నిజానికి హస్తప్రయోగం వలన టెస్ట్టోస్తీరోన్ హార్మోన్ బాగా ఉండి వీర్యకణాలు పడిపోకుండా ఉంటాయి ఇది మెడికల్ గా ప్రూవ్ అయిన విషయం కూడా దీని గురించి తెలియని బాయ్స్ అనవసరంగా టెన్షన్ పడుతున్నారట.

6. గ్లామర్ దెబ్బ తింటుంది… వయసయిన వాడిలా కనిపిస్తారు!!!
ఇవన్నీ కూడా అపోహాలే అంట… హస్త ప్రయోగం వల్ల గ్లామర్ దెబ్బ తినడం అనేది అసలు జరగదట… హస్త ప్రయోగం అనేది సహజమైన ప్రక్రియ కాబట్టి దాని వల్ల ఏజ్డ్ గా కనపడ్డం కూడా అబద్ధమని సర్వే లో తేలిందట. ఇకపోతే హస్త ప్రయోగం గురించి ఎక్కువ అపోహాలు, అనుమానాలు పెట్టు కోవడం వల్ల నే బాయ్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడి అనవసరమైన జబ్బులు, ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. 


సో బాయ్స్ జస్ట్ రిలాక్స్… ఇన్నాళ్ల నుండి హస్త ప్రయోగం వల్ల ఏవేవో ప్రాబ్లమ్స్ వస్తాయని హెల్త్ డేంజర్ లో పడుతుందని, స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని ఇలా ఎన్నో టెన్షన్లు పెట్టుకోవద్దని మీరు హ్యాపీగా హస్త ప్రయోగం చేసుకోవచ్చు అని సర్వేలో తేలిందట… అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు హస్త ప్రయోగం కూడా కంట్రోల్ లోనే ఉంటే మంచిదని డాక్టర్స్ చెపుతున్నారు. సో మీ కంట్రోల్ లో మీరు ఉంటేనే జస్ట్ ఎంజాయ్!!!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,948FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles