-1.1 C
New York
Monday, January 24, 2022

పెళ్లి చేసుకుంటే మీ జీవితంలో ఏం జరుగుతుందంటే? What Happens to You After Marriage? Sarayu Stories

పెళ్లి చేసుకుంటే మీ జీవితంలో ఏం జరుగుతుందంటే? What Happens to You After Marriage? Sarayu Stories

పెళ్లి అనే దానికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది… ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండడానికి పెళ్లి అనే ఒక పవిత్ర బంధం తో ఒకటిగా అవుతారు. తాము ఏడడుగులు నడిచిన వ్యక్తితో లైఫ్ లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు… అయితే ప్రస్తుతం ఉన్న యాంగర్ జనరేషన్ పెళ్లిని లైట్గా తీసుకుంటున్నారు… ముఖ్యంగా ఒక వ్యక్తిని నమ్మి వాళ్లతో జీవితాంతం కలిసి ఉండటం అన్నది పెద్దగా వర్కౌట్ కాదు అని వాళ్ళు ఫీలవుతున్నారు…. అందుకే కొత్తగా డేటింగ్ లు అంటూ లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ అంటూ తమకు ఇష్టం వచ్చినట్టుగా ఎదుటి వ్యక్తి తో కలిసి ఉంటున్నారు. ఒకవేళ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు పెళ్లి చేసుకున్న కూడా చాలా తొందరగానే వాళ్ళు మళ్ళీ విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు… చిన్న చిన్న విషయాలకు గొడవపడి హర్ట్ అయ్యి ఒకరిని ఒకరు పరస్పరం నిందించుకుంటూ తమ పెళ్లి అనే అందమైన జర్నీ నీ మధ్యలోనే ముగిస్తున్నారు… అయితే అసలు ఇలా ఎందుకు జరుగుతుంది ఎక్కడ తేడా వస్తుంది??? ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న పెళ్లి అనే బంధం నిలబడాలి అంటే ఏం చేయాలి??? ఇలాంటి విషయాల గురించి ఢిల్లీకి చెందిన రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ కొంతమంది కొన్ని సలహాలు సూచనలు చేశారు… వాటిని గనక మీరు మీ మ్యారేజ్ లైఫ్ లో పాటించినట్లయితే కచ్చితంగా మీ మ్యారేజ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది… సో మరి ఆ సలహాలు సూచనలు ఏంటొ మనం కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి…

1. మీకు తోడుగా మరొక వర్క్ పార్టనర్ ఉంటారు!!!!

పెళ్లి చేసుకోవడానికి ముందు మీ లైఫ్ మీ కెరీర్ మీ రోజువారీ పనులు లేదా మీ ప్రొఫెషనల్ వర్క్స్ ఇలా ప్రతి దాంట్లో బర్డెన్ అంతా మీ మీద పడుతుంది… కేవలం మీరు ఒక్కరే అయ్యేసరికి వాటీని మేనేజ్ చేసుకోలేక కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు… అదే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లో మీకంటూ ఒక తోడు దొరుకుతుంది దాంతో మీ బరువు బాధ్యతలు అన్నీ వాళ్లు కూడా పంచుకుంటారు… ఆఫీస్ వర్క్ లో మీరు బిజీగా ఉంటే వాళ్ళ ఇంటి పనులు చూసుకుంటారు… ఒకవేళ మీ పర్సనల్ వర్క్స్ ఏమైనా లేట్ అయితే అవి మీ లైఫ్ పార్టనర్ హ్యాపీ గా చేసి పెడతారు… మీ జీవితం లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే మీరు సఫర్ అవుతున్నా కూడా మిమ్మల్ని చీరప్ చేయడానికి వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు… లైఫ్ లో బతకడానికి మీకంటు మీ పార్టనర్ ఒక నమ్మకం ఇవ్వగలుగుతారు… అన్ని విషయాల్లోనూ మీకు అండగా నిలబడతారు… ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మీ కోసం ఒక మనిషి ఉన్నారు అన్న భావన మీకు చాలా గొప్ప ఫీలింగ్ కలిగిస్తుంది.

2. కొంచెం ప్లాన్ చేసుకుంటే లైఫ్ లో బాగా ఎంజాయ్ చేయవచ్చు!!!!

పెళ్లి చేసుకున్న తర్వాత మీకంటూ ఒక లైఫ్ పార్ట్నర్ ఉంటారు కాబట్టి జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు వాటి గురించి ఒక ఫ్యూచర్ ప్లాన్ వేసుకోవచ్చు ఆ ప్లాన్ లో మీరు వేసుకున్న గోల్స్ అన్నీ సాధించడానికి మీకు తోడుగా సపోర్ట్ గా ఒక పార్టనర్ దొరుకుతారు… వంతు ఎంతో పెద్ద గోల్స్ పెట్టుకున్నా కూడా వాళ్ల హెల్పు తో మీరు వాటిని అవలీలగా సాధించగలుగుతారు… ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన ఎంతోమంది చాంపియన్స్ తమ రియల్ లైఫ్ లో తమ లైఫ్ పార్ట్నర్ అందించిన సహాయంతో తాము అంత గొప్ప స్టేజ్ కు చేరుకున్నామని అందుకు తమ పార్టనర్ కి ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పారు. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన ఒక గొప్ప విషయం ఏమిటంటే జీవితంలో కేవలం మీరు మాత్రమే పోరాడితే సరిపోదు అదే మీకు ఇంకొక సపోర్టు దొరికితే గనక అప్పుడు మీకు లైఫ్ లో అన్ని చాలా ఈజీగా అయిపోతాయి.

3. ఇద్దరి గోల్ ఒకటే ఉంటుంది!!!!

మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ జీవిత భాగస్వామి పూర్తిగా మీకు మీ జీవితంలో అన్ని విధాల హెల్ప్ చేస్తారు… మీ లైఫ్ లో మీ గోల్ ఏదైతే వాళ్లకు కూడా అదే గోల్ గా ఉంటుంది… అంటే మీరు మీ లైఫ్ లో బాగుండాలని ఎప్పుడూ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ అవసరమయితే మీకోసం త్యాగాలు కూడా చేసే ఒక పార్టనర్ మీకు దొరుకుతారు… తమ జీవితంలో చాలా మందికి ఎన్నో సాధించాలని ఉన్నా కూడా వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ దొరకక వారి మనసును అర్థం చేసుకుని హెల్ప్ చేసే వారు లైఫ్ లో కనపడక తమ లక్ష్యాలు వదిలేసి కాంప్రమైజ్ అయ్యి ఏదో మొక్కుబడిగా బతికేస్తున్నారు… అలా కాకుండా మీకు మీ లైఫ్ ను హ్యాపీగా మీకు నచ్చినట్టుగా గడుపుతూ ఒక పార్టనర్ దొరికితే అప్పుడు మీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుంది??? సో పెళ్లితో మీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే ఆ పర్సన్ మీకు ఒక గొప్ప వరంగా ఆ దేవుడు పంపిన గిఫ్ట్ గా అనుకోండి.

సో ఫ్రెండ్స్ అవండి… పెళ్ళి తర్వాత మీ జీవితం ఎలా మారుతుంది??? మిమ్మల్ని ప్రేమించి జీవితాంతం మీకు తోడుగా నీడగా నిలబడుతు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ ఇచ్చే పార్టనర్ ఉండడం చాలా గొప్ప విషయం… సో అనవసరంగా పెళ్లి గురించి మీరు ఏవేవో ఊహించుకోకండి… మీ జీవితం మరొకరితో పంచుకోవడానికి ఉంది అన్న విషయాన్ని గమనించి ఒక మంచి లైఫ్ పార్టనర్ ను సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకోండి…. కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి… విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,134FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!