24.7 C
New York
Sunday, September 19, 2021

ఎప్పుడూ అదే యావ,తెలియక పెళ్లి చేసుకున్నా,ఏం చేసానంటే…

శృంగారం… మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం… ఎవరైనా సరే ఒక్కసారి టీనేజ్ లోకి అడుగు పెట్టారంటే శృంగారం కోరికలు కలుగుతాయి కిస్ అని హగ్ అని మొదలు పెట్టీ మెల్లగా శృంగారం వరకూ వస్తుంటారు. అయితే వయసులో వున్నప్పుడు శృంగారం కోరికలు ఎవరికైనా కొంచం ఎక్కువగానే ఉంటాయి అయితే ఆ టైంలో కెరీర్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది సో దాదాపు చాలా మంది తమ కోరికలను అదుపులో పెట్టుకుంటారు. కానీ కొందరు మాత్రం అలా తమను తాము కంట్రోల్ చేసుకోలేక శృంగారం కు బానిసలుగా మారుతుంటారు. అయితే ఈ శృంగారం అడిక్ట్ లను గుర్తించడం కొంచెం కష్టమే ఎందుకంటే వాళ్ళు అందరిలా మామూలుగానే ఉంటారు కానీ శృంగారం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది

అయితే ముంబైకి చెందిన అనుపమ ఒక లేడీ రిపోర్టర్ కు ఇలాంటి కేసుకు సంబంధించిన ఒక మెయిల్ వచ్చిందట… మహారాష్ట్రలోని ఒక చిన్న టౌన్ కు చెందిన తార …శివాజీ అనే అతన్ని పెళ్లి చేసుకుని ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంది అనేది ఆ మెయిల్ లో వివరంగా రాసిందట… ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతాయి అలా జరిగినప్పుడు ఏం చేయాలి అన్నదాని గురించి అనుపమ తన పర్సనల్ బ్లాగ్ లో అన్ని విషయాలు షేర్ చేసుకుంది.

ఐదు సంవత్సరాల క్రితం తారా శివాజీని పెళ్లి చేసుకుంది. పెళ్లయిన తొలిరాత్రి అందరి మగాళ్ళ లాగే భర్త శృంగారం లో తారతో కొంచెం వాయోలెంట్ గానే బిహేవ్ చేసాడట. అది మొదలు ఇక ప్రతిరోజూ చాలా సార్లు శృంగారం అంటూ తారకు నరకం చూపించే వాడట… చాలా రోజుల వరకు శివాజీ శృంగారం అంటే ఎక్కువ ఇష్టమేమో అనుకుందట కానీ ఆ తర్వాత తన ఫ్రెండ్ ద్వారా  అడిక్ట్ ల గురించి తెలుసుకుందట… తమ భర్తను మార్చడానికి తార ఎన్ని విధాలుగా ట్రై చేసినప్పటికీ అతను మారలేదంట… అయితే తార కేసును బాగా అర్థం చేసుకున్న అనుపమ ఆమె సమస్యకు పరిష్కారం కోసం  అడిక్ట్ ల గురించి తను పర్సనల్ గా కొంత రీసెర్చ్ చేసింది. ఆవిడ రీసెర్చ్ లో తెలిసిన కొన్ని విషయాలు ఇప్పుడు మీకోసం… 


1. అసలు శృంగారం అడిక్ట్ లాగా ఎందుకు అవుతారంటే వారి దాన్నొక అవసరంగా భావించకుండా దానికి బానిసలు అయిపోతారు… ఇక అక్కడి నుంచి ఎప్పుడూ అదే ధ్యాసలో ఉంటారు… ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా రోజులో ఎక్కువ టైమ్ పోర్న్ వీడియోస్ చూస్తారట… ఇక వాళ్ళ దృష్టిలో ఆడదంటే కేవలం శృంగారం కు మాత్రమే అన్న ఫీలింగ్ కూడా వుంటుందట. జీవితంలో ఎలాంటి గొప్ప లక్ష్యాలు లేకపోవడం ఎక్కువగా మెచ్యరిటీ కూడా వీళ్లలో ఉండదట… 24 గంటలు శృంగారం గురించిన ఆలోచనలు చేస్తారట.

2. లైఫ్ లో సక్సెస్ అవకపోవడం… వారు చేస్తున్న జాబ్ లో షాటీ స్ ఫక్షన్ లేకపోవడం లేకపోతే జాబ్ పోవడం, ఆర్థికంగా సెట్ అవకపోడం… అప్పులు ఇవన్నీ కలిపి వారిని ఒక విధమైన నిరాశ నిస్పృహల లోకి నెడుతుంటే అప్పుడు శృంగారం వైపుగా అట్రాక్ట్ అవుతారట అలా తమ ప్రాబ్లమ్స్ ను మర్చిపోడానికి ట్రై చేస్తారట. 

3. ఇలాంటి వారు పెళ్లంటే ఇలా శృంగారం మాత్రమే అనే ఫీలింగ్స్ లో ఉంటారట… ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు పెళ్ళి చేసుకునేది కూడా కేవలం శృంగారం గురించే అందుకే తొలిరాత్రి నుంచే తమ భార్యలను శృంగారం కోసం వేధిస్తుంటారు. తమ భార్య ఇష్టాలతో సంబంధం లేకుండా శృంగారం చేయాలనుకుంటారు… 

4. ప్రేమ అనే ఒక అందమైన ముసుగులో వాళ్ళు శృంగారం కావాలని తమ పార్టనర్స్ ను బలవంత పెడుతుంటారు. పచ్చిగా చెప్పాలంటే తమ లైఫ్ పార్టనర్ లతో పిచ్చి ప్రేమ అంటూ వాళ్ళను శృంగారం కోసం బలవంత పెడుతూ తమ కోరికలను తీర్చుకుంటారు. అందుకే మిమ్మల్ని ప్రేమిస్తున్న అంటూ అవతలి వ్యక్తి మీ దగ్గర ఎలా బిహేవ్ చేసినా దానిని భరించకూడదట… 

5. ఇలాంటి వారు మారే అవకాశాలు తక్కువ వారిని అలా వదిలేయడం మంచిది అని లేదంటే అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అని సైకాలజిస్ట్ లు చెపుతున్నారట.

6. ఒకవేళ వ్యక్తిగతంగా శృంగారం అడిక్ట్ అయిన వారు అయ్యి వాళ్ళ గురించి మీరు కేర్ తీసుకోవాలి అనుకుంటే వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం మంచిదని అలా అయితే వారు మారి మళ్లీ మామూలు మనిషి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

అయితే ఇక్కడ అనుపమ తనకు ఈ మెయిల్ పంపించిన తారకు కూడా నిజంగా ఆవిడ భర్త మంచి వాడయి అతనితో తను జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే శివాజీని ఎవరైనా సైకాలజిస్ట్ లకు చూపించమని లేదంటే తొందరగా అతని దగ్గరి నుంచి వచ్చేయమని చెప్పింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇలాంటి శృంగారం అడిక్ట్ లో ఎంతో మంది ఉన్నారని వీళ్లలో డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో టాప్ పొజిషన్ లో ఉండే మగాళ్ళు కూడా ఉన్నారని చాలా మంది లేడీస్ అలాంటి వారికి బలవుతు మానసికంగా శారీరకంగా ఎన్నో బాధలు అనుభవిస్తున్నారని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఎదురు తిరగాలని అవసరం అనుకుంటే మీ పార్టనర్ ను వదిలేయడానికి కూడా వెనుకాడోద్దు అంటుంది. 

సో ఫ్రెండ్స్ చూశారుగా ఒక శృంగారం అడిక్ట్ ను పెళ్ళి చేసుకుని తార ఎలాంటి కష్టాలు అనుభవించింది అనేది మీరు కూడా మీ పార్టనర్ విషయంలో అలర్ట్ గా ఉం డండి. ఇలాంటి వారిని అసలు ఎంకరేజ్ చేయకండి.

Related Articles

Stay Connected

0FansLike
2,945FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles