14.6 C
New York
Saturday, September 25, 2021

అసలు జనసేనాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి ?

కారొనాతో దేశం మొత్తం అల్లాడిపోతుంటే పవర్ స్టార్ ఏంచేస్తున్నాడు అని పలువురు ప్రశ్నిస్తున్నారు… వాళ్లందరికీ ఒక్కటే సమాధానం.. పవన్ ఇప్పుడున్న సమస్యలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు.. ఆయన చేసే సహాయాలు కనపడవు.. వాటికి పుబ్లిసిటీ ఇప్పించుకునే మెంటాలిటీ కూడా కాదు.. ఏదన్న పని చేస్తే హంగులు ఆర్భాటాలు ఇలాంటివి ఏవి ఇష్టముండదన్న సంగతి అందరికి తెలిసిందే.. సోషల్ మీడియాలో కూడా అనవసర ట్వీట్స్ చేసి సమయం వృధా చేసుకోరు.. పవర్ స్టార్ చేసేదంతా ఆ తరువాత వచ్చే ఫలితాల్లోనే కనపడుతుంది.. 

ప్రజలకి తన శక్తి మేర సేవ చేయడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.. సమాజంలోని ఏ సమస్య పరిష్కారానికైనా అది రాజకీయం.. అధికారంలో ఉన్న ప్రభుత్వాలతోనే సాధ్యం.. అందుకే పవన్ పాలిటిక్స్ లోకి వచ్చారు.. దేశంలో కొందరు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ కరోనా  సెకండ్ వేవ్ లో తమకు చేతనైనంత సహాయం చేస్తున్నారు.. పవన్ జనసేన స్థాపించక ముందే ఇలాంటి సహాయ కార్యక్రమాలు లెక్కలేనన్ని చేశారు.. సాయం పొందిన వారు తామంత తాముగా ముందుకు వచ్చి చెబితే తప్ప మీడియాకి ప్రజలకి తెలిసేది కాదు.. ఆయనకి ప్రత్యేక ఛానల్ గాని.. పత్రిక గాని లేదు.. పవన్ అభిమానులే మెగా మీడియాగా మారారు.. 

పవర్ స్టార్ మాటల మనిషి కాదు.. చేతల మనిషి.. సోషల్ మీడియాలో అనవసర ట్వీట్లు, కామెంట్లు చేసుకుంటూ సమయం వృధా చేయడం ఇష్టముండదాయనకి.. ఇప్పుడు కరోనా కారణంగా సోషల్ డిస్టెన్సిన్గ్ పాటించాలి గుంపులో తిరగ కూడదు కాబట్టి ఆయన గ్రౌండ్లో కొంచం అందుబాటులో లేక పోవచ్చు.. అంతే గాని పవన్ పట్టించుకోవడం లేదు అనే దానిలో నిజం లేదు.. 

సేవ చేయడానికే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.. రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన అధికారం రాదూ.. అప్పటివరకున్న సినీ చరిష్మా కూడా కొద్ధిగా దెబ్బతింటుంది.. ఇవన్నీ తెలిసే పవర్ స్టార్ జన సైనికుడిగా జనం మధ్యలోకి వచ్చారు.. ఆ దేవుడి దయ.. అభిమానుల ప్రార్థనల వాళ్ళ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి త్వరగా బయటపడ్డారు.. ప్రజలకి దక్కాల్సిన అన్ని హక్కుల లెక్కల్ని త్వరలోనే బయటకి తీస్తారు.. అవినీతిని కక్కిస్తారు వేచిచూద్దాం..

Related Articles

Stay Connected

0FansLike
2,959FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!