19.5 C
New York
Tuesday, September 28, 2021

అసలు జనసేనాని ఉద్దేశ్యం ఏమిటి.?

పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమా హీరో మాత్రమే కాదు.. రాజకీయ నాయకుడు కూడా. అందుకే ఈయన ఏ ఇంటర్వ్యూలోనైనా చాలా ఆచితూచి మాట్లాడుతుంటాడు.  మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. నువ్వు సినిమాలు ఎందుకు చేస్తున్నావు అని చాలామంది నన్ను అడుగుతున్నారు.. మీరు అయితే సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు.. పైరవీలు చేసుకోవచ్చు.. అలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండొచ్చు.. నేను మాత్రం సినిమాలు చేయకూడదా అని వాళ్లకు సమాధానం చెప్తున్నాను అంటూ ఫైర్ అయ్యాడు పవన్ కళ్యాణ్. తాను అవినీతి చేయకుండా ఉండటానికి సినిమాలు చేస్తున్నానని చెప్పాడు. దాంతో పాటు కేవలం లక్షలోపు జీతం ఉండే ఎమ్మెల్యే పదవి కోసం ఎందుకు అంత ఆరాటపడుతున్నారు.. నాకు ఎప్పుడు పదవి మీద కోరిక లేదు.. ఏదో అయిపోవాలంటే ఆశ అంతకంటే లేదు.. నాకు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్థానం దొరికింది. దాన్ని మించిన పదవి నాకు అవసరం లేదు.. అన్నీ బాగుండి అది కూడా వస్తే అప్పుడు చూద్దాం అంటూ తనకు ముఖ్యమంత్రి పీఠంపై మోజు లేదని.. అలాంటి పదవీ కాంక్షతో రాజకీయాల్లోకి రాలేదని, తాను ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే.. వాళ్ల‌తోనే.. వాళ్ల కోస‌మే ఉంటాన‌ని.. వాళ్ల సమ‌స్య‌ల కోసం పోరాడ‌ట‌మే ప‌నిగా పెట్టుకునే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని కుండబద్దలు కొట్టాడు పవర్ స్టార్. మీ అభిమానంతో పోలిస్తే ముఖ్యమంత్రి పీఠం కూడా తనకు చిన్నగా కనిపిస్తుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. గతంలో కూడా ఓ సినిమా వేడుకలోనే రాజకీయ వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించాడు జనసేనాని. తనపై నోరు పారేసుకునే ప్రత్యర్థి రాజకీయ పార్టీలను కూడా ఒక ఆట ఆడుకున్నాడు. మర్యాదగా బతికేవాణ్ని గెలికితే దాని పొగరు అంటారు.. అంతేకానీ తనలా తల దించుకొని వెళ్లిపోయే వాడిని పొగరు అంటే ఎవరూ ఏమీ చేయలేరు అంటూ చెప్పుకొచ్చాడు పవర్ స్టార్. ఇలా ఇంటర్వ్యూ మొత్తం పవన్ అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఉత్సాహంగా కనిపించాడు. ఇప్ప‌ట్నుంచి రాబోయే ఐదేళ్లు పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని.. ఆ ప‌నుల‌తోనే తాను బిజీగా ఉంటాన‌ని చెప్పాడు ఈయ‌న‌. పార్టీని పూర్తిగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే ఇప్పుడు త‌న ప‌ని అంటున్నాడు ఈయ‌న‌. సంస్థాగ‌త మార్పులు చేస్తే త‌ప్ప జ‌న‌సేనను జ‌నం న‌మ్మ‌ర‌ని ఫిక్సైపోయాడు ప‌వ‌ర్ స్టార్. ఐదేళ్ల పాటు పార్టీని న‌డ‌ప‌గ‌లిగితే క‌చ్చితంగా 2024 ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన శ‌క్తిగా జ‌న‌సేన మారుతుంద‌నే న‌మ్మ‌కం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లో బ‌లంగా క‌నిపిస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎలాగూ ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోనే వాళ్ల స‌మ‌స్య‌ల కోసం ప‌వ‌న్ పోరాడుతూనే ఉంటాడు. కాబ‌ట్టి క‌చ్చితంగా కాస్త న‌మ్మ‌కం అయినా ప్ర‌జ‌ల నుంచి పొంద‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ప‌వ‌న్‌కు ఇప్పుడున్న బ‌లం బ‌ల‌గం అంతా అభిమానులే. అయితే వాళ్లే కాకుండా ప్ర‌జ‌లు కూడా ఆయ‌న్ని న‌మ్మితేనే ప‌వ‌న్ కోరుకున్న మార్పు వ‌స్తుంది. ఏదేమైనా రాబోయే ఐదేళ్లు జ‌న‌సేన పార్టీకి పెద్ద‌గా ప‌నులుండ‌క‌పోవ‌చ్చు.. కానీ ప‌వ‌న్ మాత్రం ప్ర‌జ‌లే త‌న శ్వాస ఆశ అంటున్నాడు. మ‌రి ఈయ‌న ప్లానింగ్ ఎలా ఉందో.. !

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!