-1.1 C
New York
Monday, January 24, 2022

బెడ్ రూమ్ లో ఆడవాళ్ళు… మగాళ్ళు ఏం చేయాలని కోరుకొంటారంటే…

బెడ్ రూమ్ లో ఆడవాళ్ళు… మగాళ్ళు ఏం చేయాలని కోరుకొంటారంటే…

ఒకసారి పడక గది తలుపులు మూసిన తరువాత లోపల ఏం జరుగుతుంది అన్న విషయంలో కేవలం లోపల ఉండే ఆడ మగ ఇద్దరికీ మాత్రం ఒక క్లారిటీ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఒకసారి బెడ్ రూమ్ తలుపు మూసిన తర్వాత తమని సంతృప్తిపరిచే మగాడు ఇతడే అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు… కానీ చాలాసార్లు చాలా మంది మగవాళ్ళు వాళ్ల ఆశలను అడియాశలు చేస్తుంటారు… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే దాదాపు నూటికి 95 మంది మగవాళ్ళు బెడ్ రూమ్ లో లేడీస్ ఫీలింగ్స్ గురించి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోరట… దాంతో ఎక్కువ మంది లేడీస్ తమ మగాళ్లతో శృంగారంలో పాల్గొన్నప్పటికీ కూడా లోపల కొంచెం అసంతృప్తితో బతుకుతూ ఉంటారు… అయితే ఇలాంటి విషయాలకు సంబంధించి ప్రముఖ సెక్సాలజిస్టులు పడకగదిలో మీరు ఆమె మనసును ఎలా గెలుచుకోవాలి అన్న విషయాల గురించి కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నారు… మీరు గనక వాటిని అమలులో పెట్టినట్లయితే పడక గదిలో వాళ్లు కోరుకునే సుఖాన్ని ఖచ్చితంగా అందించగలరు… మరి ఆ సలహాలు సూచనలు ఏంటో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం పదండి…


1. పర్మిషన్ అడగండి!!!!

చాలా మంది మగవాళ్ళు బెడ్ రూమ్ లో ఆడవాళ్ళ అ అభిప్రాయాలతో సంబంధం లేకుండా శృంగారం చేస్తూ ఉంటారు… కనీసం ఒక్కసారి కూడా తమ పార్టనర్ ఇష్టాలను, ఫీలింగ్స్ ని పట్టించుకోవాలి అని కూడా అనుకోరు… తమకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతారు… అంతే పడకగది సుఖం అన్నది కేవలం తన కోసమే అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు… వాళ్లకి భయపడో లేదా వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక లేకపోతే ఎంత చెప్పినా వాళ్ళు మారరు మూర్ఖంగా మొండిగా అలాగే ప్రవర్తిస్తారు అన్న నిరాశతో చాలా మంది లేడీస్ తాము పడుతున్న ఇబ్బందులను చెప్పరట… సో ఇక్కడ ఆ సెక్సాలజిస్టులు ఇస్తున్న ఒక ముఖ్యమైన సలహా ఏమిటంటే శృంగారం చేయడానికి ముందు ఖచ్చితంగా మీ పార్ట్నర్ ఏం కావాలి అని కోరుకుంటుంది తన మనసులో ఏముంది??? తను ఎలాంటి శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటుంది??? అన్న విషయాలను ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకోమని చెబుతున్నారు… అలా మగవాళ్ళు గనుక చేయగలిగితే కచ్చితంగా వాళ్లు తమ పార్టనర్ తో చేసే శృంగారం పద్ధతి అనేది మారుతుంది అలాగే లేడీస్ కూడా శృంగారాన్ని పరిపూర్ణం గా ఎంజాయ్ చేయగలుగుతారు.

2. ఓపిక చాలా అవసరం!!!!

ఒకసారి శృంగారం మొదలుపెట్టిన తర్వాత దానికి ఏదో హడావిడిగా ముగించే మగవాళ్లే ఎక్కువగా ఉంటారు… కానీ ఆడవాళ్ళకి అలా కాదు వాళ్ళకి శృంగారం చాలా ఎక్కువ సేపు చేయాలి అన్న కోరిక ఉంటుందట… కానీ పడక గదిలో మగవాళ్ళకి అంత ఓపిక లేకపోవడంతో వాళ్లకి నచ్చినట్టు గానే శృంగారం అనేది జరుగుతుంది…. ముఖ్యంగా శృంగారం లో పాటించవలసిన కనీసం నియమాలు పద్ధతులు కూడా మగవాళ్ళు అసలు పాటించరు అనే కంప్లైంట్ ఎక్కువగా ఉన్నాయట… ఫోర్ ప్లే చేయడం కానీ తమ పార్టనర్ ని పొగుడుతూ మాట్లాడటం కానీ ఏవైనా రొమాంటిక్ కబుర్లు చెప్పడం కానీ లేదా శృంగారం జరిగిన తర్వాత సైలెంట్ గా పడుకోకుండా ఏదైనా మాట్లాడటం లేదా తమని ముద్దులు పెట్టుకోవడం కానీ అస్సలు చేయరట… దాంతో తమకు తమ మగాళ్లతో శృంగారంలో పాల్గొనడం అంటేనే బాగా విరక్తి కలుగుతుందట… సో ఇక నుంచి శృంగారం అనగానే మీరు కొంచెం ఓపికతో ఉండటం అలాగే ఆడవాళ్లు కోరుకునే సుఖాన్ని వారికి నచ్చినట్టుగా అందించటం అన్న పనులు చేస్తే వాళ్ళు కూడా మీలా శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తారు.

3. కాన్ఫిడెంట్ గా ఉండాలి!!!!

శృంగారం అనేసరికి ఎక్కువగా టెన్షన్ పడే మగవాళ్లు చాలా మంది ఉంటారు… వారి లోపల ఎలాంటి లోపాలు లేనప్పటికీ వారికి ఉన్న అనవసరమైన అపోహాలు, టెన్షన్లు, సరిగ్గా శృంగారం చేయలేము అన్న అనుమానం ఇవన్నీ కలిసి వారి శృంగార సామర్థ్యం ను బాగా దెబ్బ తీస్తాయి దాంతో వాళ్ళు నిజంగానే తాము అనుకున్న విధంగా శృంగారం ఎంజాయ్ చేయలేక పోతారు… వాళ్ల పార్టనర్ కూడా సంతృప్తి చెందక వారి మీద ఒకరకమైన కోపం, చిరకుతో ఉంటుంది. అసలు మామూలుగా మనం జీవితంలో ఏ పని చేయాలన్నా మనలో కాన్ఫిడెన్స్ ఉండడం అన్నది చాలా తప్పనిసరి అవుతుంది… అదే శృంగారం విషయం దగ్గరికి వచ్చేసరికి మీ పార్టనర్ ను సంతృప్తి పరచాలి అంటే మీరు కూడా అంతే కాన్ఫిడెంట్ గా ఉండగలిగితే ఖచ్చితంగా పడక గదిలో జరిగే శృంగారం లో మీ పార్టనర్ కు మీరు మంచి సుఖాన్ని అందివ్వగలుగుతారు.

4. కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి!!!!

బెడ్ రూమ్ లో ఉన్నప్పుడు మీరు మీ పార్టనర్ తో ఎంతగా కమ్యూనికేట్ చేస్తున్నారో అన్నది చాలా ముఖ్యమైన విషయం… ఎందుకంటే శృంగారం అనేది ఇద్దరు మనుషులు కలిసి చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళ మూడ్ ను బట్టి కూడా శృంగారం చేసే పద్ధతి మారుతుంది… అందుకే ఆ టైమ్ లో మీ పార్టనర్ తో అన్ని విషయాలు మాట్లాడండి… ఒకవేళ తను మీతో ఇంకో విధంగా శృంగారం చేద్దాం అని చెప్పినప్పుడు మీరు తన ఛాయిస్ ను గౌరవించడం కూడా నేర్చుకోండి. మామూలుగా మనం మనుషుల తోటి మాట్లాడేటప్పుడు కమ్యునికేషన్ సరిగ్గా లేకపోతేనే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాo… మరి మామూలు విషయంలోనే అంత ఇబ్బంది ఉంటే శృంగారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది మీరే ఆలోచించుకోండి. మీ ఇద్దరి మధ్యా కమ్యునికేషన్ సరిగ్గా ఉంటే మీ పార్టనర్ కూడా తన ఆలోచనలను శృంగారం గురించి మరిన్ని విషయాలను మీతో షేర్ చేసుకోగలుగుతుంది.

5. ఆమె సంతృప్తి పడిందా లేదా తెలుసుకోండి!!!!

శృంగారంలో పాల్గొన్న తర్వాత కూడా చాలా రోజుల వరకు ఆ మాటకొస్తే అసలు ఎప్పటికీ ఆడవాళ్లు శృంగారంలో సంతృప్తి చేందారా లేదా అన్న విషయాన్ని అడగరట… శృంగారం అనేది ఇద్దరు మనుషులు కలిసి చేస్తున్నప్పుడు వారిలో కేవలం ఒక్కరు మాత్రమే సంతృప్తి పడితే ఒక్కరు మాత్రమే దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే అది మిగతా వారికి నిజంగా పడక సుఖం దక్కలేదని అనుకోవాలి… అందుకే మీరు ఎప్పుడు శృంగారం చేసినా కూడా మీ లేడీస్ దాంట్లో ఎంత వరకు సంతృప్తి చెందారు అన్న విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నించండి… మీరలా చేయలేకపోతే వాళ్ళకి లోపల ఉండే ఫీలింగ్స్ మీకు ఎప్పటికీ తెలిసే అవకాశం ఉండదు… శృంగారం లో అసంతృప్తి అన్నది మీ ఇద్దరి మధ్య ఎన్నో గొడవలకు కూడా ఎక్కువగా కారణం అవుతుంది.

6. మీలో ఎలాంటి కోరికలు ఉన్నాయో చెప్పాలి!!!!

బెడ్ రూమ్ లో శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ కూడా మీ పార్టనర్ కు మీ మనసులో ఉన్న ఆలోచనలు మీకు వాళ్ళ మీద ఉండే ఫీలింగ్స్ అలాగే శృంగారాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు అన్న విషయాలను గురించి ఖచ్చితంగా మీ మధ్య డిస్కషన్ జరగాలి… అలా అయితేనే మీరిద్దరూ శృంగారాన్ని ఈక్వల్ గా ఎంజాయ్ చేస్తున్నారు అని అర్థం… లేని పక్షంలో ఒకరు సరిగ్గా ఎంజాయ్ చేయడం లేదు అని గమనించాలి…బెడ్ రూమ్ లో నాలుగు గోడల మధ్య ఒకసారి మీరు మనసు విప్పి మాట్లాడగలిగితే మీ పార్టనర్ కూడా మీతో ఎన్నో విషయాలు షేర్ చేసుకోవడం మొదలు పెడతారు అలా అని అవి కేవలం శృంగారానికి సంబంధించిన విషయాలు మాత్రమే కావు మీ ఇద్దరి జీవితాల్లో జరుగుతున్న వేరే విషయాలు కూడా వాళ్ళు మీతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అప్పుడు మీ ఇద్దరి మధ్యా ఉన్న ఆ బంధం ఇంకా ఎక్కువగా స్ట్రాంగ్ అవుతుంది.

7. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండనివ్వాలి!!!!

ఒకసారి బెడ్ రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత పార్ట్నర్స్ ఇద్దరు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవిస్తూ ఎదుటి వారు పూర్తి స్వేచ్ఛగా శృంగారంలో పాల్గొనే విధంగా అవకాశం ఇవ్వగలిగితే అప్పుడు ఇద్దరూ సమానంగా ఎంజాయ్ చేయగలుగుతారు. అలాకాకుండా ఎదుటివారి దగ్గర ఫ్రీ గా ఉండలేకపోతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య జరిగే శృంగారం అనేది అంత గొప్పగా ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎదుటి వారు తమకు నచ్చినట్టుగా మీతో శృంగారం చేయగలుగుతున్నారు అంటే కచ్చితంగా మీరు కూడా సుఖపడతారు అని అర్థం చేసుకోండి అలాగే మీరు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వగలిగితే మీ మీద వాళ్ళకి ఉండే ప్రేమ కూడా రెట్టింపు అవుతుంది.

Related Articles

Stay Connected

0FansLike
3,134FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!