22.1 C
New York
Sunday, June 26, 2022

అమ్మాయిలు సంతృప్తి చెందాలి అంటే అబ్బాయిలు ఏం చేయాలి? | Sarayu Stories

అమ్మాయిలు సంతృప్తి చెందాలి అంటే అబ్బాయిలు ఏం చేయాలి? | Sarayu Stories

ఈ ప్రపంచంలో ఏ అబ్బాయి అయినా కూడా తను ప్రేమిస్తున్న అమ్మాయి మనసు తెలుసుకుని ఆమెను సంతృప్తి పరచాలి అనుకుంటే దానికి అతను ఎంతో కష్టపడాల్సి ఉంటుంది… ఎందుకంటే ఏ అమ్మాయి అయినా తన మనసులో ఉన్న విషయాన్ని అంత ఈజీగా అబ్బాయిలకి తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతుంది అక్కడ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే తమ మనసులో ఉన్న విషయాలను అబ్బాయిలు తెలుసుకొని దాన్ని చేయడం ద్వారా తనను సంతృప్తి పరచాలి అని వాళ్ళు కోరుకుంటారు… అయితే జనరల్ గా అబ్బాయిలకి ఏ విషయం కానీ అమ్మాయిలు చెప్పకపోతే అసలు అర్థం చేసుకుని పొజిషన్లో వాళ్ళు ఉండరు… చాలా వరకు అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఈ విషయంలోనే ఎక్కువగా గొడవలు మనస్పర్థలు వస్తూ ఉంటాయి… ఒక అమ్మాయి తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎలాంటి అబ్బాయి అయినా కూడా ఆమెను సంతృప్తి పరచడానికి తాను చేయవలసిన పనులన్నీ చేస్తాడు అయినా కూడా ఆమె సంతృప్తి చెందకపోతే అప్పుడు అబ్బాయి ఎంతో బాధపడతాడు… అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అసలు అమ్మాయిలు సంతృప్తి చెందాలి అంటే వాళ్లకు అబ్బాయిలు ఏం చేస్తే ఎక్కువగా నచ్చుతుంది అన్న విషయాల మీద అబ్బాయిలకి ఒక విధమైన క్లారిటీ లేకపోవడం చాలా సమస్యలను క్రియేట్ చేస్తుంది… అయితే ఇలాంటి విషయంలో అబ్బాయిలు తమ సమస్యలను అధిగమించి తాము ప్రేమించిన లేదా ఇష్టపడ్డ అమ్మాయి ని సంతృప్తి పరచడానికి చేయవలసిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ముంబైకి చెందిన కొంత మంది తమ వెబ్సైట్లో షేర్ చేసుకున్నారు.. మరి ఇప్పుడు అవి ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి…

  1. మాట ఇచ్చి నిలబడడం = కేవలం అబ్బాయిలు అని మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఉన్న ఎవరైనా కూడా ఎదుటి వ్యక్తికి ఒక మాట ఇచ్చినప్పుడు దాని మీద నిలబడే ప్రయత్నం చేస్తే కచ్చితంగా అది ఎదుటి వాళ్ల మనసును ఆకట్టుకుంటుంది… ఇప్పుడు అదే అమ్మాయిల విషయం దగ్గరికి వచ్చే సరికి కూడా తమను ప్రేమిస్తున్నా అబ్బాయిలు ఏదైనా మాట ఇచ్చినప్పుడు దానికి కట్టుబడి ఉండాలని తమ తోటి ఎలాంటి అబద్ధాలు చెప్పకుండా తమను మోసం చేయడానికి ప్రయత్నించకుండా వాళ్లు ఉండగలిగితే అప్పుడు అమ్మాయిలు ఎక్కువగా సంతృప్తి పడతారు అని చెబుతున్నారు. ఎందుకంటే తాము ప్రేమిస్తున్న అబ్బాయిల మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న విధంగా ప్రవర్తించాలి తప్ప తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి అమ్మాయిల మనసు గాయం చేసినట్లు అయితే ఇక వాళ్లు ఎప్పటికీ అబ్బాయిని నమ్మరు అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి అని చెబుతున్నారు. ఎందుకంటే ఎంత అల్లరిచిల్లరిగా ఆవారా గా తిరిగిన అబ్బాయి అయినా కూడా ఒకసారి తమతో ప్రేమలో పడ్డ తర్వాత తాము అతనితో కలిసి జీవించాలి అన్న నిర్ణయం తీసుకున్న తర్వాత అతను కచ్చితంగా జీవితాన్ని సీరియస్ గా తీసుకోవాలి అని అతనికి తమ గురించి కానీ జీవితం గురించి కానీ ఒక స్పష్టమైన అవగాహన ఉండాలని ముఖ్యంగా ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు కష్టపడే వ్యక్తిత్వం కావాలని ఆ ప్రాసెస్ లో భాగంగానే తనను బాగా చూసుకుంటాను అని మాట ఇచ్చినప్పుడు దాని మీద నిలబడడానికి ప్రయత్నం చేయాలి అని వాళ్లు కోరుకుంటారట.
  1. అమ్మాయి గురించి అన్నీ తెలుసుకోవడం = ఏ అమ్మాయి అయినా కూడా తను ప్రేమిస్తున్న అబ్బాయి ఆమె గురించి అన్ని విషయాలు తెలుసుకొని తనని సర్ప్రైజ్ చేస్తూ ఉంటే కచ్చితంగా తను ఒక యువరాణి లా ఫీల్ అవుతూ ఈ ప్రపంచంలో ఆమెను అబ్బాయి అందరికంటే ఎక్కువగా చాలా గొప్పగా ప్రేమిస్తున్నాడు అని సంతోషపడుతూ ఉందట… అమ్మ ఇష్టాలు కోరికలు ఆశలు ఆలోచనలు అభిప్రాయాలు తనకు ఇష్టం లేనివి ఏవి ఇలా ఆమె జీవితం లో ఉన్న ప్రతి ఒక్క విషయం గురించి అబ్బాయి అన్ని రకాలుగా తెలుసుకోవడం ద్వారా ఆమెను చాలా ఈజీగా సంతృప్తి పరచవచ్చని అన్నిటికంటే ముఖ్యంగా అబ్బాయి తన గురించి ఎక్కువగా తెలుసుకుని ఆమె విషయంలో ఎక్కువగా కేర్ తీసుకుంటే అప్పుడు అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి అబ్బాయిని వదులుకోవడానికి సిద్ధపడదని అని చెబుతున్నారు… ముఖ్యంగా అబ్బాయిలు తమని ప్రేమించినప్పుడు తన గురించి ఎంతగా ఆరాటపడతారో అలాగే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ల విషయంలో అంతే శ్రద్ధ చూపించడం వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం ఏమైనా చేయాలనుకోవడం వాళ్ళని ఎక్కువగా ఆకట్టుకుంటాయట.
  1. ఆ పనిలో సంతృప్తి పరచాలి = కార్యమనేది చాలా మంది అబ్బాయిలకు కేవలం ఒక్క శాతం సుఖంగానే కనిపిస్తూ ఉన్నా కూడా అదే అమ్మాయిల దగ్గరికి వచ్చేసరికి అది వాళ్ళకి సార్థకం తో పాటు మానసిక ఆనందాన్ని కూడా ఇచ్చే ఒక ముఖ్యమైన విషయం అన్న విషయాన్ని ఇక్కడ అబ్బాయిలు ఎక్కువ గా గుర్తించాలి… ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంతో నమ్మితే తప్ప అతన్ని ఎంతో ఇష్టపడితే తప్ప తనతో ఆ పని చేయాలి అన్న నిర్ణయం తీసుకోదు ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకొని ఆ పనిలో పాల్గొంటే కనుక ఖచ్చితంగా అబ్బాయి ఆమెను సంతృప్తి పరచడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలి… నిజం చెప్పాలంటే అబ్బాయిల కంటే ఎక్కువగా అమ్మాయిలకి లైంగిక పరమైన కోరికలు కలుగుతూ ఉంటాయి అయితే వాళ్లు వాటిని అంత ఈజీగా అబ్బాయిలతో షేర్ చేసుకోన్నప్పటికీ కూడా ఆ విషయంలో తాము ఇష్టపడ్డ వాడితోనే కలుస్తారు కాబట్టి అతనే తమ రొమాంటిక్ కోరికలు అన్ని విధాలుగా తెలుసుకుని తమను సంతృప్తిపరిచే విధంగా మసలుకోవాలి అని కోరుకుంటారు. ఒకవేళ అతను అలాంటి విషయంలో తమను అసంతృప్తికి గురి చేసినట్లు అయితే అది వాళ్ళ ఇద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ మీద కూడా పడి ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది… అమ్మాయి ఆ విషయంలో పెద్దగా సాటిస్ఫై అవ్వకపోతే అది ఆమె మానసిక ఆనందం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అందుకే ఒక అమ్మాయిని సంతృప్తి పరచాలి అనుకుంటే ఆవిషయంలో కూడా అబ్బాయి ఎక్కువ కేర్ తీసుకోవడం ఎంతో ముఖ్యం.
  1. నిజం చెప్పాలి = చాలామంది అబ్బాయిలు అమ్మాయిల ను మెప్పించాలి అంటే లేదా వాళ్ళను ప్రేమలో పడేయాలి అంటే వాళ్లకి చాలా ఈజీగా అన్నీ అబద్ధాలే చెప్పేస్తూ ఉంటారు… తాము చెప్పే అబద్ధాలను అమ్మాయిలు ఎప్పటికి తెలుసుకోలేరు అన్న ఒక మితిమీరిన నమ్మకం కూడా అబ్బాయిల్లో ఉంటుంది… అయితే ఇక్కడ అబ్బాయి లో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే తాము ఎన్ని అబద్ధాలు చెప్పి ఒక అమ్మాయిని పడేసినా కూడా ఏదో ఒకరోజు ఆమెకు నిజాలు తెలిసినప్పుడు కచ్చితంగా ఆ అమ్మాయి అబ్బాయిని అసహ్యించుకుంటుంది అతనికి దూరంగా వెళ్లి పోతుంది… అందుకే అమ్మాయి విషయంలో ఎలాంటి అబ్బాయి అయినా కూడా ముందు నుంచే చాలా నిజాయితీగా ఉండాలి ఆమెకు ఎప్పుడూ నిజాలే చెబుతూ తన దగ్గర ఎలాంటి అబద్ధాలు వాడకుండా ఉంటే ఒక్కోసారి ఆమె దగ్గర ఇబ్బంది పడిన కూడా మీలో ఉన్న నిజాయితీ మీరు ప్రతి సారి నిజం చెప్పే విధానం చూసిన అమ్మాయి కచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తుంది మీ పైన ఎక్కువగా నమ్మకం పెట్టుకుంటుంది.ఎందుకంటే ఏ అమ్మాయికి అయినా కూడా తను ప్రేమించిన అబ్బాయి గురించి చాలా ఇన్ సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది అలాంటప్పుడు అతను ఆమెతో అబద్ధాలు చెబుతూ నిజం చెప్పకపోతే అతని మీద ఆమెకు అనుమానం స్టార్ట్ అవుతుంది ఏ అమ్మాయికి అయినా కూడా తను ప్రేమించే అబ్బాయి మీద ఒకసారి అనుమానం స్టార్ట్ అయితే ఇక అది ఎప్పటికీ పోదు ఆ అనుమానం పెనుభూతం అయి చివరికి వాళ్ళిద్దరినీ విడదీసే దాకా వదిలిపెట్టదు. అందుకే మీరు ఒక అమ్మాయిని సంతృప్తి పరచాలి అంటే తన దగ్గర నీతిగా నిజాయితీగా ఉంటూ అబద్ధాలు చెప్పకుండా ఎప్పుడూ నిజమే మాట్లాడుతూ ఉండటం మంచిది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. సో అబ్బాయిలు మీరు గనక ఒక అమ్మాయిని ప్రేమించి తనని అన్ని విధాలుగా సంతృప్తి పరచాలి అనుకుంటే ఇక్కడ చెప్పినట్లుగా ఈ విషయాలన్నీ ఖచ్చితంగా తన దగ్గర పాటిస్తూ ఉంటే మీరు ఆ అమ్మాయిని కచ్చితంగా ఆకట్టుకోగలుగుతారు అలాగే తనతో జీవితాన్ని కూడా పంచుకొని ఎంజాయ్ చేస్తారు… విష్ యూ ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
3,367FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!