23.2 C
New York
Tuesday, September 21, 2021

గుండె ధైర్యం ఉన్నచోట విజయం ఉండి తీరుతుంది -పవన్ కళ్యాణ్

ఓటు అనే రెండక్షరాలకు ప్రపంచ గతిని మార్చే శక్తి ఉంది. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. కానీ ఓటు విలువ చాలా తక్కువ మందికి తెలుసు. ఓటు యొక్క  అవసరం, ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటుకున్న పాత్ర గురించి, అలాగే రాజకీయాలలో యువత పాత్ర గురించి పవన్ కళ్యాణ్ మీడియాతో ముచ్చటించారు. 

నాకోసం నేనెప్పుడూ కళలు కనలేదు. వేలకోట్లు సంపాదించాలన్న ఆశలు నాకు లేవు. కానీ.. దేశమంతా నాకు పేరొచ్చేయాలని నేను అనుకోలేదు.. ఈరోజు రబ్బరు చెప్పులు వేసుకున్న కుర్రోడు దగ్గరనుండి నిండు గర్భిణీ వరకు పంచాయితీ ఎన్నికలలో పోటీ చెయ్యడం చూస్తుంటే.. సగటు మనిషి చాలా ధైర్యంగా నిలబడగలదనే నమ్మకం వచ్చింది. ఏ సమస్యనైనా ఎదుర్కొనే సమాజం ఉండాలి. అనేది నా సిద్ధాంతం. ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగా నా వంతు కృషి నేను చేస్తున్నాను. పుట్టుకతోనే ఎవరూ గొప్పవాళ్ళు కాదు. అలాగే పుట్టుకతోనే ఎవరూ అధికారంతో పుట్టారు. అధికారమనేది కిందా మీదా పది నలుగుతూ దెబ్బలు తింటూ పైకి ఎదిగేది అలాంటి అధికారంతో పాలిటిక్స్ లో ఉండాలంటే ధైర్యం కావాలి. నేను జనసేన స్థాపించకముందు పెట్టిన కామన్ మ్యాన్ ఫోర్స్ ప్రొటెక్షన్ లో చాలామంది ధైర్యవంతులుండేవారు. వాళ్ళు ఇప్పటికీ నాకు కనిపిస్తుంటారు. అలాంటివాళ్లే రాజకీయాల్లోకి రావాలనుకునేవాడిని.. ఈమధ్య జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కూడా జనసేన నాయకులు బలంగా లేకపోయినప్పటికీ జనసేన వీర మహిళలు.. కార్యకర్తలు ఎన్నో ఒత్తిళ్లకు గురైనా సరే పోరాడి పార్టీకి మంచి ఫలితాలను తీసుకొచ్చారు. ఒక మంచి జరగాలంటే దాని ఆపే వ్యక్తులే ఎక్కువుంటారు. వీటన్నిటిని తట్టుకుని నిలబడ్డారంటే వీళ్లెవరి దగ్గరా డబ్బులు లేవు.. కానీ టన్నులకొద్దీ గుండె ధర్యం ఉంది. అంటే గుండె ధైర్యం ఉన్నచోట విజయం ఉండి తీరుతుంది. నాదగ్గర పెద్ద పెద్ద రాజకీయ నేతలు లేరు.. ధనవంతులు లేరు.. రానీటి కోవిదులు లేరు. నాదగ్గరున్నదల్లా ఉన్నదున్నట్లుగా మాట్లాడి అన్యాయాలను ఎదిరించే గుండె  సామాన్యులే.. ఒక ఆవేశానికి.. ఒక భావానికి కట్టుబడి ఉండే బలమైన వీర మహిళల సైన్యం ఉంది నా దగ్గర. కానీ కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 కల్పిస్తున్నది. 125 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సుమారు 100 కోట్ల ఓటర్లు ఉన్నారు. ఇందులో కేవలం 50 కోట్ల లోపు ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు!  నేటి యువతరం ఓటు విలువను తప్పకుండా తెలుసుకోవాలి.  భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంతో గొప్పదని, బాద్యతతో కూడుకున్న జవాబుదారీ తనం రాజకీయ వ్యవస్థ ఆవిష్కృతమైనప్పుడే దాని గొప్పదనం తెలుస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. అనుకోని విపత్తు నెలకొన్న ప్రస్తుత తరుణంలో ప్రజల పట్ల బాధ్యత, జవాబుదారీతనం ఉండే వ్యవస్థ రూపుదిద్దుకోవాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ రావాల్సిన తరుణం కూడా ఇదే అని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలను విస్మరిస్తున్న ప్రజా ప్రతినిధులను బలంగా ప్రశ్నించాలని పవన్ పిలుపునిచ్చారు. మూకుమ్మడిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న నాయకులందరిని తరిమి కొట్టాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడేది జనసేన పార్టీ అని, బహుజన విధానంతో ముందుకెళ్తూ… సర్వజనుల అభ్యున్నతిని కాంక్షిస్తూ జనసేన ప్రస్థానం ముందుకు సాగుతుందని  పవన్ కళ్యాణ్ తెలిపారు.  అగ్రవర్ణ పేదలకు అండగా ఉంటూనే… బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం జనసేన పాటుపడుతుందన్నారు. సమాజంలో మార్పు రావాలి, సమతుల్యతతో కూడిన సర్వేజనా సుఖినోభవంతు విధానం రావాలని ఆకాంక్షించారు.  2014లో పార్టీ ప్రారంభించాను. ఇప్పటికి 7 ఏళ్లు పూర్తయ్యింది. పార్టీ ముఖ్య ఉద్దేశాలు, జనసేన ప్రస్థానం, బీజేపీతో పొత్తు, ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అండగా నిలబడిన విధానాలపై పెద్ద సభ పెట్టి మాట్లాడాలి అనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. సామాజిక స్పృహ, దేశభక్తి జనసేన పార్టీని స్థాపించేలా చేశాయి. 2008లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు బడుగు, బలహీన వర్గాల కష్టాలను చూశాను. అగ్రవర్ణాల్లో పేదల కష్టాలను అర్థం చేసుకున్నాను. కులాలను వాడుకొని అధిపత్యం చెలాయించే కుటుంబాలు, వారి దగ్గర నలిగిపోయే ప్రజల బాధలు మనస్తాపం కలిగించాయి. బడుగు, బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పరితపించే నాయకులు, ప్రజా సంఘాలు, దళిత, బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, అగ్రవర్ణాల్లో పేదల అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా వర్ణాల నాయకులు వీళ్లందరిని కలిపే సమగ్ర ఆలోచన విధానం లేకుండాపోవడం గమనించాను. కొన్ని సమూహాలే రాజ్యాధికారానికి దగ్గరై మిగతా వారందరిని యాచించే స్థాయిలో పెట్టడం లాంటివి చాలా బాధ కలిగించాయి.  వీటిపై మాట్లాడి వదిలేయకుండా నా వంతు బాధ్యతగా ఏదైనా చేయాలని… దెబ్బ తిని… ఓటములు, వంచనలు, వెన్నుపోట్లు ఉంటాయని తెలిసి కూడా జనసేన పార్టీ పెట్టాను.  అని వివరించారు. 

Related Articles

Stay Connected

0FansLike
2,952FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!