19.5 C
New York
Tuesday, September 28, 2021

మీరింకా ‘సింగిల్’ గా ఎందుకు ఉండిపోయారో తెలుసా??

ఐయామ్ సింగిల్ రెడీ టు మింగిల్ అని పాడుకుంటూ తిరిగే అమ్మాయిలు అబ్బాయిలు మన దేశంలో చాలామందే ఉంటారు తాము ఎప్పుడెప్పుడు లవ్ లో పడతామా ఎప్పుడూ ఆ లవ్ ఫీలింగ్ అనుభవిస్తామా అనుకుంటూ తమ లవర్ తో కలిసి సినిమాలు షికార్లు పార్క్ ల్లకు చేతిలో చెయ్యి వేసుకుని వెలతామా అనుకుంటూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుంటారు… అయితే ప్రేమ అనేది అందరిలో కలిగేది అయినా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషి ఖచ్చితంగా ప్రేమలో పడడం అనేది జరిగే పనైనా ఎందుకో కొంత మంది అస్సలు లవ్ లో పడరు… నిజం చెప్పాలంటే వారినేవరు లవ్ చేయరు… ఇలాంటి వారిలో ఎందుకు పనికి రాని బ్యాచ్ లతో పాటు అందంగా ఆకర్షణీయంగా ఉండే వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు… మరి అసలెందుకు ఇలా జరుగుతుంది అన్ని అర్హతలు ఉన్నా కూడా వాల్లెందుకు ఇంకా సింగిల్ గానే మిగిలిపోతున్నారు… ఎక్కడ తప్పు జరుగుతుంది… ఇలాంటి టాపిక్స్ మీదనే ముంబై కు చెందిన ఒక ప్రైవేట్ సంస్థ మన ఇండియాలో యూత్ మీద ఒక సర్వే చేసిందట దాంట్లో ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి కూడా మరి అవేంటో తెలుసుకుందాం పదండి…

అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రేమలో పడాలంటే ముఖ్యంగా వాళ్ళలో ఉండాల్సింది కాన్ఫిడెన్స్… నేను అందంగానే ఉంటాను నన్ను ఎవరైనా ఇష్టపడతారు అన్న ఫీలింగ్ వాళ్ళలో కచ్చితంగా నూటికి నూరుపాళ్ళు ఉండాలి… మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే ఇతర వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఎలా ప్రేమించగలరు??? ముంబై కి చెందిన కంపెనీ చేసిన సర్వేలో ఇలాంటి షాకింగ్ విషయాలు అనేకం బయటపడ్డాయి… అసలు ఎన్ని సంవత్సరాలైనా ప్రేమలో పడకుండా సింగిల్ గా ఉండే అమ్మాయి లేదా అబ్బాయిలో కచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది కనిపించలేదట… నన్ను ఎవరు ప్రేమిస్తారు? నాకు ఎవరు పడతారు?? అన్న నిరాశ దృక్పథం లోనే వారు జీవిస్తున్నారట… ఇక తాము అంత అందంగా లేకపోయినా తమ కంటే అందమైన, తెలివైన వాళ్లతో ప్రేమలో పడుతున్న అమ్మాయిలు లేదా అబ్బాయిల్లో ఆత్మవిశ్వాసం మెండుగా కనిపించిందట… ఒక గొప్ప ప్రేమకు నేను అర్హుడిని… నన్ను ప్రేమించడం… నాతో ప్రేమలో పడటం అంటే అది అవతల వ్యక్తి అదృష్టం అని వీళ్లలో తమ గురించి ఒక విధమైన గౌరవం, ఇష్టం కనిపించాయట.


ధైర్యం చేయలేక పోవడం… చొరవ తీసుకుని ఇతరులతో మాట్లాడ లేకపోవడం వల్ల కూడా వాళ్ళు సింగిల్ గా ఉంటున్నారట… అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరో ఒకరు ముందుగా ప్రయత్నిస్తేనే వాళ్లకి ప్రేమ లభించేది… తమ మీద తమకే సెల్ఫ్ డౌటు ఉండడం… నేను ప్రయత్నిస్తే ఏమవుతుందో అన్న భయం ఇవన్నీ కూడా వాళ్ళని సింగిల్గానే ఉంచడానికి ముఖ్యమైన కారణాలు అని ఆ సర్వేలో తేలిందట. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే ఆమెతో వెళ్లి మాట్లాడడానికి నూటికి 95 మంది అబ్బాయిలు ఆలోచిస్తారట ఇంకా పచ్చిగా చెప్పాలంటే భయపడతారట… అయితే ఎవరైతే ఆ మిగతా ఐదు మంది అబ్బాయిలు ధైర్యంగా వెళ్లి అమ్మాయితో మాట్లాడతారో వాళ్ళకి ఆ అమ్మాయి ఈజీగా పడిపోతుందట… నా కంటే ఆ అమ్మాయి బాగుంది లేదా నా కంటే ఆ అబ్బాయి బాగున్నాడు… నేను హైట్ తక్కువ… నా కలర్ అంత గొప్పదేమీ కాదు… నా దగ్గర బైక్ లేదు… ఒక అమ్మాయి ని మెయింటైన్ చేసే అంత మనీ కూడా నా దగ్గర లేవు… అబ్బాయి చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు… నేను తనకి కరెక్ట్ కాదేమో?? ఇలాంటివన్నీ ప్రేమలో పడకుండా సింగిల్ గా మిగిలిపోతున్న అబ్బాయిలు అమ్మాయిలు చేసే ఆలోచనలట… ఆదిలోనే హంసపాదు అన్నట్టు ఒక అమ్మాయిని లేదా అబ్బాయిని అప్రోచ్ అవడానికంటే ముందే తమని తాము డిసప్పాయింట్ చేసుకోవడం అసలు ప్రయత్నించకపోవడం వల్లే వాళ్లంతా ఎప్పటికీ సింగిల్ గానే మిగిలిపోతున్నారట.


మరి ఈ అడ్డంకులను అన్నిటినీ దాటుకుని అసలు ప్రేమలో పడాలంటే ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆ సంస్థ యూత్ కు కొన్ని ముఖ్యమైన సలహాలు, సూచనలు చేసింది అవేమిటంటే…

1. మీతో మీరు మాట్లాడుకునే విధానాన్ని మార్చండి.
2. మీరు అద్భుతమైన మనిషి చాలా అందంగా ఉన్నారు అని మీకు మీరు పదేపదే చెప్పుకోండి.
3. మీరు ప్రయత్నిస్తే మీకు ఏ అమ్మాయి లేదా అబ్బాయి అయినా ఇట్టే పడిపోతారు అన్న నమ్మకాన్ని పెంచుకోండి.
4. ఎవరైనా అందమైన అమ్మాయి లేదా అబ్బాయి కనిపిస్తే ఎక్కువ ఆలోచించకుండా ముందు వెళ్ళి వాళ్లతో మాట్లాడండి మంచి ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోండి.
5. మీరు ప్రేమించిన మొదటి అమ్మాయినే లేదా అబ్బాయినే మీరు పెళ్లి చేసుకోరు… ప్రేమలో మీకు ఖచ్చితంగా వైఫల్యాలు ఎదురవుతాయి… తట్టుకుని నిలబడండి.
6. మీ ఫస్ట్ డేట్ తోనే అన్నీ సెట్ అవ్వవు కానీ ఓపిగ్గా ఎదురు చూడండి.
7. ఎదుటి వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా వాళ్ళలో చెడు లక్షణాలు ఉన్నా కూడా పెద్ద మనసుతో వారిని క్షమించడానికి ప్రయత్నించండి.
8. డ్రీమ్ గర్ల్… డ్రీం బాయ్ అంటూ ఎవరూ ఉండరు… కొంచెం రియాలిటీలో బతకండి… మీకు దొరికిన వారిని మనస్ఫూర్తిగా ప్రేమించడం నేర్చుకోండి.
9. నాకు సిక్స్ ఫీట్ ఉన్న అబ్బాయి కావాలి లేకపోతే నాకు మంచి ఫిగర్ ఉన్న అమ్మాయి కావాలి అంటూ మరీ మొండిగా ఉండకండి.
10. ఎవరికైనా సరే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి… ఈ ప్రపంచంలో ఏదైనా మొదటి సారి కే వర్కవుట్ అవదు… ట్రై చేస్తూనే ఉండాలి.


సో అవండి ఆ సర్వేలో చాలామంది యూత్ సింగిల్గానే ఎందుకు ఉండిపోతున్నారు అన్నదానికి దొరికిన సమాధానాలు… మీరు కూడా ఇప్పటికీ ఇంకా సింగిల్గానే ఉంటే ఒకసారి వాళ్ళు చెప్పిన పాయింట్స్ గురించి ఆలోచించండి… మిమ్మల్ని మీరు మార్చుకోండి… మిమ్మల్ని మీరు నమ్మండి… మళ్లీ మళ్లీ ప్రయత్నించండి వెంటనే కాకపోయినా కాస్త నెమ్మదిగా అయినా మీరు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి మీకు కచ్చితంగా దొరుకుతారు… అప్పుడు ప్రతి సంవత్సరం వచ్చే వాలెంటైన్స్ డే రోజు నేను ఇంకా సింగిల్ గా ఉన్నాను అని బాధపడుతూ కూర్చున్న మీరు… ఆరోజు మీరు ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి మీకు ఇచ్చే గిఫ్ట్ తీసుకుని వాళ్లతో కలిసి మంచి రొమాన్స్ లో మునిగి తేలుతుంటారు… విష్ యు ఆల్ ది బెస్ట్!!!!

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!