6.7 C
New York
Thursday, December 2, 2021

వాళ్ళు అది కావాలని అస్సలు ఎందుకు అడగరంటే | Why Do They Never Ask For It? Why Always Us? Sarayu

ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఒక రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు లేదా లవ్ లో ఉన్నప్పుడు ఒకవేళ వారి లవ్ స్టోరీ సక్సెస్ అయ్యి పెళ్లి చేసుకొని గనుక ఉంటే వారి మధ్య శృంగార సంబంధం కూడా మొదలవుతుంది… అయితే అమ్మాయి ల దగ్గరికి వచ్చేసరికి వాళ్లకి లోపల ఎంతగా కోరికలు ఉన్నా కూడా శృంగారం కావాలి అని అబ్బాయిలను ఎప్పటికీ అడగరు… అసలు వాళ్ళు అలా ఎందుకు అడగరు అన్న విషయం చాలామంది అబ్బాయిలకు కూడా తెలియదు… ఎందుకంటే ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ మిస్టరీ అయింది అమ్మాయి మనసు మాత్రమే… తమకు లోపల విపరీతమైన శృంగార వాంఛలు కలుగుతున్న కూడా అబ్బాయిల దగ్గర తమ మనసును బయట పెట్టకుండా జాగ్రత్త పడతారు… లోపల వచ్చే కోరికలు తమను ఎంత రెచ్చగొట్టినా కూడా ఒక్కసారి కూడా నోరు తెరిచి శృంగారం కావాలని అడగరు… అయితే అసలు వాళ్ల మెంటాలిటీ ఇలా ఎందుకు ఉంటుంది??? శృంగారం కావాలని అనిపించినా కూడా వాళ్లు ఎందుకు అబ్బాయిలను అడగరు??? అనే విషయాలను గురించి సెక్సాలజిస్ట్ లు కొందరు రీసెర్చ్ లాంటిది చేసారు… దాంట్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి… ఇప్పుడు మనం కూడా ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందాం పదండి…

1. నో అంటారేమో అన్న భయం!!!!

ఇది చాలామంది అబ్బాయిలను ఆశ్చర్యపరిచే విషయం… ఎందుకంటే ఏ అమ్మాయి అయినా సరే కోరి ఒక అబ్బాయి దగ్గరికి వచ్చి శృంగారం కావాలి అని అడిగినప్పుడు ఈ రోజుల్లో దాదాపు ఏ మగాడు కూడా యస్ చెప్పకుండా ఉండడు… అయితే ఇక్కడ అమ్మాయిలు మాత్రం ఒకవేళ తామే కోరి శృంగారం కావాలి అని అడిగితే అబ్బాయిలు ఎక్కడ నో చెబుతారో అని చాలా భయపడతారట… అయితే వాళ్ల భయానికి ఇక్కడ చాలా కారణాలే ఉన్నాయి… తాము ప్రేమిస్తున్న అబ్బాయిల దగ్గర ఇలా పచ్చిగా తమ కోరికలని చెబితే వాళ్ల దృష్టిలో చాలా చులకన అయిపోతారు అన్న భయం కూడా ఉంటుందట… అలాగే మామూలుగా ఈ అబ్బాయి అయినా అమ్మాయికి శృంగారపరమైన ఎక్కువ కోరికలు ఉంటే తన క్యారెక్టర్ గురించి కూడా చెడుగా ఊహించుకుంటాడు అని వాళ్లు అనుకుంటారట… ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఒక వేళ తమకు శృంగారం కావాలని అమ్మాయిలు అబ్బాయిలను అడుగుతే తాము వారి చేతికి చిక్కినట్టే అని తమ కోరికలు తీర్చుకునేందుకు వాళ్లు తమను పావులుగా వాడుకుంటారు అని కూడా భయపడతారట…

2. ఎదుటివారు నచ్చక, ఇష్టం లేక!!!!

మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు అమ్మాయి మనసు అంటేనే ప్రపంచంలో అతి పెద్ద మిస్టరీ… ఆమె తను నిజంగా ఇష్టపడి ప్రేమించిన అబ్బాయితో కూడా ఒక్కొక్కసారి శృంగారంలో పాల్గొనాలని అనుకోదు… ఎందుకంటే తనకు ఎదుటి వ్యక్తి నచ్చకపోతే అమ్మాయి లోపల ఎంత కోరికలు విలయతాండవం చేస్తున్న కూడా తనకు శృంగారం కావాలన్న ఆలోచన అణిచి పెట్టుకుంటుంది తప్ప అబ్బాయి తో తనకు శృంగారం కావాలి అని అడగలేదు… ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే సహజంగానే అమ్మాయిలకి ఆత్మ గౌరవం ఎక్కువ తాము అంత ఈజీగా మగవారి ముందు చీప్ అవ్వకూడదు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు… అందుకే వాళ్లు ఎంతో ప్రేమించి తన మనసును ఇస్తే తప్పా నోరు తెరిచి అబ్బాయిలను శృంగారం కావాలి అని అడగరట.

3. తమకు చెడ్డ పేరు వస్తుందన్న భయం!!!!

ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్ షిప్ లో తమ ఇద్దరి మధ్య ఏం జరిగింది అన్న విషయాలను వాళ్ళు చాలా అలా కామన్ గా తన ఫ్రెండ్స్ తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటారు… ముఖ్యంగా ఎప్పుడు ఈ మోడరన్ వరల్డ్ లో ఉన్న యూత్ లో ఇలాంటి అలవాట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి… తాను మొదటిసారి ఎవరైనా అమ్మాయి తో శృంగారం చేసిన లేదా పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ నైట్ ఎలా అయింది అన్న విషయం లో కూడా యూత్ అన్ని విషయాలను తమ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నారు… అలాంటప్పుడు ఒక అమ్మాయి తనకు శృంగారం కావాలి అని అబ్బాయి ని అడిగితే ఆ విషయం తమ ఇద్దరి మధ్య నే రహస్యంగా ఉండదని ఖచ్చితంగా తను వాళ్ళ అడిగినట్లు అబ్బాయి అతని ఫ్రెండ్స్ కు చెబుతాడు అన్న భయం కూడా అమ్మాయిలకి ఉంటుందట… సో అలా అడగడం ద్వారా పదిమంది ముందు తన క్యారెక్టర్ దెబ్బ తినకూడదు అని వాళ్ళు కోరికలను అణిచి పెట్టుకుని జాగ్రత్త పడుతున్నారట.

4. తాము అడిగితే అబ్బాయిలు ఎక్కువగా కోరుకుంటారు!!!!

ఒకవేళ అమ్మాయిలు గనుక అబ్బాయిలని తమకు శృంగారం చేయాలని ఉంది అని అడిగితే దాన్ని అవకాశంగా తీసుకుని అబ్బాయిలు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ శృంగారం కావాలని డిమాండ్ చేస్తారు అని భయం ఉంటుందట… ఎందుకంటే అమ్మాయి తనంతట తానే శృంగారం కావాలని అబ్బాయిని అడిగినప్పుడు ఆమె కోరిక తీర్చిన అబ్బాయి మళ్లీ తనకు శృంగారం కావాలని అనిపించినప్పుడు అమ్మాయి కనుక నో చెబితే… అతను ఆమెను నిందించడం మొదలు పెడతాడట… అమ్మాయికి అవసరమైనప్పుడు తను ఆమె కోరికలు తీర్చే వాడు కానీ ఇప్పుడు తన కోరికను ఆమె తీర్చాలంటే ఎందుకు ఒప్పు కోవడం లేదు అని ఎదురు ప్రశ్నిస్తాడట… అలా వారిద్దరి మధ్య గొడవలు మొదలై అది రిలేషన్షిప్ ఎండ్ అవడానికి కూడా దారితీస్తుందట… ఇలాంటి భయాలు అనుమానాలు తమలో ఎన్నో ఉంటాయి కాబట్టి తమకు ఎంతగా శృంగారం కావాలని అనిపించినా కూడా ఏ అమ్మాయి అబ్బాయిని తనకు శృంగారం కావాలని అడగదట.

సో అబ్బాయిలు అవ్వండి… మీరు రిలేషన్ షిప్ లో ఉన్న లేదా ప్రేమిస్తున్న లేదా పెళ్లి చేసుకున్న మీ పార్టనర్ తనంతట తానుగానే శృంగారం కావాలి అని మిమ్మల్ని ఎందుకు అడగదు అన్న మీ సందేహాలకి సమాధానాలు… ఈ అమ్మాయి అయినా ఒక అబ్బాయి దగ్గర ఎట్టిపరిస్థితుల్లోనూ చులకన అవ్వకూడదు అని అనుకుంటుంది… ఎందుకంటే మనం బతుకుతుంది మేల్ డామినేషన్ సొసైటీలో అందులోనూ శృంగారం అనేది చాలా సెన్సిటివ్ విషయం… అలాంటి వాటిలో గనక తమ జుట్టు మగవాళ్ళకి అందితే ఇక తమను ఎవరూ కాపాడలేరు అన్న భయం వారిలో ఉంది… అందుకే వారి దగ్గర్నుంచి మీరు ఎప్పుడూ అలాంటి కోరికలను వినరు… సో ఇప్పటికైనా మిమ్మల్ని మీరు మార్చుకోండి మీ పార్టనర్ కు రిలేషన్ షిప్ లో పూర్తి స్వేచ్ఛ ఇవ్వండి… అప్పుడు తనే మిమ్మల్ని శృంగారం కావాలని అడిగే రోజు వస్తుంది.

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!