23.2 C
New York
Tuesday, September 21, 2021

వై.వీ. సుబ్బారెడ్డి మీద జగన్ కు ఎందుకు అంత నమ్మకం ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తను నమ్మిన వ్యక్తులను, తనను నమ్మిన వ్యక్తులను, ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారిని ప్రోత్సహిస్తాడు. జగన్మోహన్ నమ్మిన వ్యక్తుల్లో వైవి సుబ్బారెడ్డి ఒకరు. అప్పగించిన పని చేయడంలో సుబ్బారెడ్డి తరువాతే ఎవరైనా. ఈ కారణంతో జగన్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి ని నియమించారు. ఇక పదవిలో టీటీడీని అభివృద్ధి చేసి ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాడు. కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి దాకా పెద్ద ఎత్తున హిందూ ధ‌ర్మ ప్ర‌చారం చేసాడు సుబ్బారెడ్డి. గత జూన్ లో వైవి పదవి కాలం ముగిసింది, దీంతో ఆశావహులు తమకంటే తమకు పదవి వస్తుంది అనుకున్నారు కానీ ఎవ్వరు ఉంహించని విధంగా మరోసారి టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి ని నియమించాడు ముఖ్యమంత్రి జగన్. సుబ్బారెడ్డి హ‌యాంలో క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోవ‌డానికి స‌మ‌ర్థ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటూనే భ‌క్తుల‌కు ఉప‌యోగ‌ప‌డే అనేక అభివృద్ధి, హిందూ ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ముందుకు తీసుకు వెళ్లారు. సుబ్బారెడ్డి నాయ‌క‌త్వంలోని ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీసుకున్న కొన్ని నిర్ణ‌యాలే ఆయనకే మళ్ళీ పదవిని తెచ్చి పెట్టాయి. ఓ సారి సుబ్బారెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఏమిటో చూద్దాం..తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజి రిజర్వాయర్‌ నిర్మాణం చేపట్టడం, తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ కార్లు ప్రవేశపెట్టడం, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడానికి ఎల్‌1, ఎల్‌2 దర్శనాలు రద్దు, తిరుపతిలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి నగర శివార్ల నుండే గరుడ వారధి ప్రారంభమయ్యేలా డిజైన్‌లో మార్పునకు మార్పు, స్విమ్స్‌ను నిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేయడానికి టిటిడి ఆధీనంలోకి తీసుకునేందుకు ఆమోదం, టిటిడి రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రూ.6,850/- బ్రహ్మోత్సవ బహుమానం అందించడం, టిటిడిలో పదవీ విరమణ పొందిన అర్చకుల సేవలను తిరిగి వినియోగించుకునేలా నిర్ణయం తీసుకోవడం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్రాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్ల్లో శ్రీవాణి ట్రస్టు ద్వారా 500 ఆలయాల నిర్మాణానికి పట్టం కట్టడం, టిటిడి ఆధ్వర్యంలో చిన్నపిల్లల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢల్లీి రాష్ట్రాల్లో గుడికో గో మాత కార్యక్రమం తో పాటు ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చారు సుబ్బారెడ్డి. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోని వలస కూలీల ఆకలి తీర్చడం కోసం సుమారు 35.50 లక్షల అన్నప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేశారు, లాక్‌డౌన్‌ సమయంలో ఎస్వీ గోసంరక్షణశాల ద్వారా తిరుపతిలోని వీధి పశువుల ఆకలి తీర్చడానికి మేత అందించడం తిరుపతిలోని టిటిడి క్యాంటీన్‌ నుంచి వీధి కుక్కల ఆకలి తీర్చడానికి ఆహారం పంపిణీ, లాక్‌డౌన్‌ సమయంలో తిరుపతిలోని ఎస్వీ జూపార్క్‌లో వన్యప్రాణుల సంరక్షణ, వాటి ఆహారం కోసం రూ.50 లక్షలు ఆర్థికసాయం. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిని కోవిడ్‌ ఆసుపత్రిగా మార్చి సేవలు అందించడం, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, ఆసుపత్రుల్లోని రోగులకు భోజనం అందించడం వంటి ఎన్నో కార్యక్రమారు కోవిడ్ సమయంలో నిర్వహించి ప్రజలను ఆదుకున్నారు సుబ్బారెడ్డి. పని చేసే వారు పాడుకారు అనే సామెత సుబ్బారెడ్డికి సరిగ్గా సరి సమానంగా సెట్ అవుతుంది. ఇక సీఎం జగన్ సైతం పని చేసే వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. పాలన వ్యవహారాల్లో, పార్టీలో నమ్మకంగా, కీలకంగా పని చేయడంతో పాటు అప్పగించిన పనిని పూర్తి బాధ్యతతో నిర్వహించడంతో సుబ్బారెడ్డి అంటే జగన్ కి నమ్మకం. అంతే కాదు మొదటి సారి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడంతో ఆ బాధ్యతలకు ఎటువంటి మచ్చ లేకుండా పని చేయడంతో పాటు అందరిని కలుపుకుని నూతన కార్యక్రమాలు తీసుకురావడంతో మరోసారి భాద్యతలు అప్పగించారు.

Related Articles

Stay Connected

0FansLike
2,951FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!