6.8 C
New York
Thursday, December 2, 2021

దాంట్లో ప్రస్టేషన్ ఎందుకొస్తుంది, పోగొట్టుకునే మార్గాలు | Why We Get Frustration During $EX

దాంట్లో ప్రస్టేషన్ ఎందుకొస్తుంది, పోగొట్టుకునే మార్గాలు | Why We Get Frustration During $EX

మనిషిగా పుట్టిన తర్వాత ఒకసారి వయసు లోకి వచ్చిన తర్వాత శృంగారాన్ని ఎంజాయ్ చేయాలి అనుకోని వారు ఎవరు ఉండరు… వయసు పరువం లో ఉన్నప్పుడు లోపల కోరికలు ఉరకలు వేస్తుంటే కచ్చితంగా ఏం చేసియినా సరే తన శృంగార కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు… అయితే ఒకవేళ అలాంటి వ్యక్తులకి మంచి పార్టనర్ దొరకకపోతే లేదా మరే ఇతర కారణాల వల్ల వాళ్లు శృంగారం చేయలేక పోతే మాత్రం ఇక జీవితమే అయిపోయినట్టుగా ఎంతో బాధపడుతూ ఉంటారు… అలాంటి ఆలోచన అన్నది చాలా తప్పు అనే విషయం గుర్తు పెట్టుకోవాలి… ఎందుకంటే మీకు కేవలం శృంగారం దొరికనంత మాత్రాన మీరు పోగొట్టుకుంది ఏమీ లేదు… నిజంగా మీరు ఒకసారి మనసుపెట్టి ఆలోచిస్తే మీరు అనుకున్నప్పుడు మీకు శృంగారం దొరకకపోయినా మీరు మీ జీవితంలో చాలా సంతోషంగా ఉండగలుగుతారు… అయితే అలా శృంగారం విషయంలో గనుక మీకు డిసప్పాయింట్ మెంట్లు ఎక్కువగా ఎదురైతే వాటిని ఎలా ఎదుర్కోవాలి??? మిమ్మల్ని మీరు ఎలా మోటివెట్ చేసుకోవాలి???  వివరాలు మీకోసం…

1. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి… అవకాశం వస్తే ఎంజాయ్ చేయండి!!!!

శృంగారం విషయంలో మీరు అనవసరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కచ్చితంగా నిరుత్సాహ పడాల్సివస్తుంది… ఎందుకంటే శృంగారం అనేది ఇద్దరు మనుషులు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేయాల్సిన శారీరక కలయిక… ఒక్కోసారి మీ ఎదుటి వ్యక్తి కి ఇష్టం లేకో లేదా వేరే పర్సనల్ రీజన్స్ వల్ల మీకు శృంగారం అన్నది దొరకక పోవచ్చు… అలాంటప్పుడు మీరు నిరాశ పడకుండా అవకాశం కోసం ఎదురు చూడండి… ఒకవేళ మీకు ఎదుటి వ్యక్తి తో శృంగారంలో పాల్గొనే అవకాశం వస్తే అప్పుడు దాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయండి… ఎందుకంటే మీలాగే శృంగారం గురించి ఎక్కువగా ఆలోచించి దాన్ని ఎక్కువగా కావాలని కోరుకునే వాళ్ళు మీ ప్రతిసారి దొరకక పోవచ్చు… అలాంటప్పుడు మీరు నిరాశకు గురి కావాల్సి వస్తుంది… అందుకే మీరు శృంగారం కావాలని మీ పార్టనర్ ని ఎప్పుడు అతిగా బలవంత పెట్టకూడదు… వాళ్ల ఇష్టంతో మీరు వారితో శృంగారం చేయాలే తప్ప ఎదుటి వారికి ఇష్టం లేకపోయినా కూడా చేస్తానంటే మాత్రం వాళ్లతో మీ సంబంధం దెబ్బతింటుంది అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

2. మీ పార్టనర్ తో ఒక అగ్రిమెంట్ చేసుకోండి!!!!

వినడానికి చాలా కొత్తగా అనిపిస్తున్నా నిజంగా ఇలాంటి పనులు కనుక మీరు చేయగలిగితే కచ్చితంగా మీ పార్టనర్ తో మీ శృంగార జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది… మీరు మీలో ఉన్న శృంగార కోరికలు గురించి ఒకసారి మీ పాఠాన్ని కూర్చోబెట్టి వారికి అన్ని వివరాలు చెప్పండి… వారంలో ఇన్ని రోజులు అనుకోండి నెలలో ఇన్ని రోజులు అనుకుని కేవలం ఆరోజుల్లోనే మీరు మీ పార్టనర్ తో కలిసి శృంగారంలో పాల్గొనండి… దాంతో మీరు కోరుకున్న శృంగారం అనేది మీకు తగ్గడమే కాకుండా మీరు మీ పార్టనర్ ని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా సంతోషంగా ఉండగలుగుతా రు… అసలు ఇలాంటి రూల్స్, అగ్రిమెంట్ లు అనేటివి ఇప్పటికే అమెరికా లాంటి వెస్ట్రన్ దేశాల్లో ఆల్రెడీ అమలులో ఉన్నాయి… ఒక రిలేషన్ షిప్ లో ఉన్న ఏ కపుల్ అయినా కూడా ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ప్రాబ్లంస్ లేకుండా తమ శృంగార జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. మీరు కూడా మీ పార్టనర్ తో ఒకసారి మాట్లాడి ఇలాంటి అగ్రిమెంట్ చేసుకోగలిగితే శృంగారం విషయంలో మీకు ఎలాంటి లోటు ఉండదు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలాంటి అగ్రిమెంట్ లేదా రూల్స్ కు మీ పార్ట్నర్ కూడా అన్ని విధాలుగా సంతృప్తి పడి ఓకే చెప్పినప్పుడు మాత్రమే ఇలాంటి అగ్రిమెంట్లు వర్కవుట్ అవుతాయి లేకపోతే అనవసరంగా వాళ్లు మిమ్మల్ని చెడు యాంగిల్ లో చూడడం జరుగుతుంది. సో మీకు ఇలాంటి టెక్నిక్స్ నచ్చినా కూడా మీ పార్ట్నర్ అంగీకారంతోనే దాన్ని అమలు చేయండి.

3. మీ శృంగార కోరికలను కొంచెం కంట్రోల్ చేయండి!!!!

మీకు లోపల ఎంతగా శృంగార కోరికలు ఉన్నా కూడా మీకు మీ పార్టనర్ నుంచి శృంగారం దొరక లేనప్పుడు అనవసరంగా కంగారు పడకుండా మీ కోరికలు కొంచెం అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి… ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు మీ శృంగార కోరికలు తీర్చుకోవడానికి పరిస్థితులు మీకు అనుకూలించక పోవచ్చు… అందుకే కొన్ని రోజులపాటు మీ శృంగార కోరికలు ను కంట్రోల్ లో పెట్టి మీ పార్టనర్ యొక్క ఆమోదం కోసం ఓపిగ్గా ఎదురు చూడండి… ఒకవేళ వారు గనక మీ శృంగార కోరికలు అర్థం చేసుకొని మీతో శృంగారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు మీ ఇద్దరి మధ్య ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లంస్ లేకుండా హ్యాపీగా శృంగారంలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఒక్కోసారి మీరు కోరుకున్నట్టు శృంగారం అనేది మీ జీవితంలో లేకపోయినా కూడా మీరు దాన్ని భరించాల్సి వస్తుంది… గుర్తుపెట్టుకోండి జీవితంలో మీరు కోరుకున్నవన్నీ ప్రతి సారి మీకు దక్కాలని రూలేం లేదు… అలాగే శృంగారం విషయంలో కూడా మీ పార్టనర్ కు కూడా మీకు కోరిక పుట్టిన ప్రతిసారి శృంగారం చేయాలి అనిపించకపోవచ్చు…. అందుకే మీ కోరికలను కంట్రోల్ లో ఉంచుకోగలిగితే అన్ని విధాలా మంచి జరుగుతుంది.

4. శృంగారమే జీవితం కాదు… కొంచెం రిలాక్స్ అవ్వండి!!!!

మీరు కోరుకున్న శృంగార జీవితం మీకు దక్కడం లేదని బాధపడుతున్నప్పుడు ఒక విషయం బాధ గుర్తుపెట్టుకోండి కేవలం శృంగారం ఒక్కటే జీవితం కాదు… మీ జీవితంలో మీరు తీర్చుకోవాల్సిన అనేక కోరికల్లో అది ఒకటి అంతే… మీ పార్టనర్ నుంచి మీరు కోరుకున్న శృంగారపరమైన అనుభవాలు మీకు ఎదురు కానప్పుడు కొన్ని రోజులు శృంగారానికి మీరు దూరంగా ఉండటమంలో తప్పులేదు… ఎందుకంటే మీరు కోరుకున్న శృంగారం అనేది అన్నివేళలా మీకు దొరకడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకే మీరు దానికి కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ గనక ఇచ్చినట్లయితే అది మీకు దొరికినప్పుడు దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. మీకు శృంగారం దొరకని సమయంలో జీవితంలో మీరు చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఏవైనా కొత్త అలవాటు నేర్చుకోండి ప్రయాణం చేయండి డిఫరెంట్ ప్రదేశాలు చూడండి… ఇలా ఇలా శృంగారం మీద నుంచి మీ దృష్టిని కొంచెం పక్కకు మరల చండి దాంతో ఆటోమేటిక్గా మీ శృంగార జీవితం అనేది బ్యాలెన్స్ అవుతుంది.

సో ఫ్రెండ్స్ కబడ్డీ మీకు మీ జీవితంలో శృంగారం అనేది ఎక్కువగా దొరకడం లేదు అని మీరు గనక నిజంగా అంత బాధపడుతున్నట్లయితే ఈ వీడియో చూసిన తర్వాత కచ్చితంగా మీలో మార్పు వస్తుంది… కేవలం శృంగారం ఒక్కటే జీవితం కానీ జీవితంలో అదొక పార్ట్ మాత్రమే అన్న సత్యాన్ని మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి… అవకాశం ఉంటే మీకు నచ్చిన వారితో శృంగారాన్ని ఎంజాయ్ చేయండి దాంట్లో తప్పు లేదు కానీ మీకు అలాంటి అవకాశాలు దొరకకపోతే ఎలాంటి నిరుత్సాహానికి గురి కాకుండా లైఫ్ లో హ్యాపీ గా ఉండటానికి ప్రయత్నించండి.

Related Articles

Stay Connected

0FansLike
3,041FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!