21.9 C
New York
Tuesday, September 28, 2021

వకీల్ సాబ్ పై కక్ష సాధిస్తున్న YCP

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ హిట్ వకీల్ సాబ్ పై పొలిటికల్ వార్ కొనసాగుతోంది. వకీల్ సాబ్ బెనిఫిట్ షోల రద్దు, టికెట్ రేట్ల పంపుకు అనుమతి నిరాకరణ మొదలైన వ్యవహారాలపై YSRCPకి జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అటు Bjp కూడా ఈ విషయంలో ప్రభుత్వంపై మండి పడుతోంది. తాజాగా నటుడు, జనసేన నేత నాగబాబు సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. Ycp నేతలు ముఖ్యంగా మంత్రి పేర్నినానిపై మండిపడ్డారు. వకీల్ సాబ్ పై విమర్శలు చేసిన మంత్రి పేర్ని నానిపై ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. “మీకేమైంది నాని గారు..? మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి. ఇట్స్ అర్జంట్. please సెండ్ రాబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని. స్టేట్ transposrt మినిస్టర్. వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పేరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ.” అంటూ నాగబాబు కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. దీనిపై ట్విట్టర్ ద్వారానే స్పందించిన మంత్రి పేర్ని నాని “పరోపకారి పాపన్న నాగబాబు గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి. ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది. అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు” అని కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారం కాస్తా జనసేన Vs YCPగా మారి పోయింది. ఇటు జనసేన, అటు Ycp కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రాజకీయాలను సినిమాతో ముడిపెట్టి కక్ష సాధిస్తున్నారని జనసేన ఆరోపిస్తుంటే.. ఒక్కరి కోసం రూల్స్ మార్చంటూ YCP కౌంటర్ ఇస్తోంది. దీంతో ఏపీలో ఎప్పుడూ లేని విధంగా ఓ సినిమా విషయంలో ఈ స్థాయిలో పొలిటికల్ రచ్చ జరగడం ఇదే మొదటిసారి. వకీల్ సాబ్ రిలీజ్ సందర్భంగా BJP రాష్ట్ర ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ తిరుపతిలోని ఓ సినిమా థియేటర్ కు వెళ్లగా.., అక్కడ షో రద్దుకావడంతో ఆయన ముఖ్యమంత్రి Y.S జగన్ పై మండి పడ్డారు. కుట్రపూరితంగానే వకీల్ సాబ్ షోలు రద్దు చేశారని మండిపడ్డారు. మరోవైపు మొదటి 3 రోజులు టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం బ్రేక్ వేసింది. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లగా.. ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పువచ్చింది. దీంతో YCP ప్రభుత్వం వకీల్ సాబ్ పై కక్ష సాధింపుకు పాల్పడుతుందని జనసేన, BJP కార్యకర్తలకు ఆరోపించారు. వీటిపై స్పందించిన మంత్రి పేర్ని నాని.. వకీల్ సాబ్ ఓ పాచిపోయిన సినిమా అంటూ తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు టికెట్ రేట్లు పెంచి జనాల్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నాగబాబు ట్వీట్ చేయగా.. దానికి పేర్ని నాని కౌంటర్ ట్విట్ చేశారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.!

Related Articles

Stay Connected

0FansLike
2,960FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!